Followers

గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు.

గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు.

సంతబొమ్మాలి, పెన్ పవర్

మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. మర్రిపాడు పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, యువకులు, వీధుల్లో , మురికి కాలువలలో బ్లీచింగ్ వెదజల్లారు. పరిసరాల పరిశుభ్రత తో ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించారు. సంతబొమ్మాలి లో  సర్పంచ్ కళింగపట్నం లక్ష్మి ప్రతినిధి కళింగపట్నం అప్పారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.వీరితో పాటుగా అంగన్వాడి ఆశా కార్యకర్తలు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే దండుగోపాలపురం పంచాయతీలో సర్పంచ్ మార్పు అశోక చక్రవర్తి, పంచాయతీ కార్యదర్శులు పీ రామకృష్ణ , సిద్ధార్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది అన్ని వీధుల్లోను బ్లీచింగ్ పౌడర్ చల్లారు. కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ మార్పు నాగభూషణ్,  గ్రామస్తులు పాల్గొన్నారు.

మే 15 తర్వాత మొదటి డోస్ టీకా

 మే 15 తర్వాత మొదటి డోస్ టీకా 

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శృతి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మే 15  తేదీ వరకు మొదటి డోస్ టీకా ను నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి డోసు టీకా వేసుకున్న వారు చాలామంది ఉన్నారని వారికి  మే 15వ తేదీ లోపు రెండో డోసు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతము మొదటి డోస్ టీకా ను నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.  కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రెండవ డోసు పూర్తి చేసిన తరువాత మే15 తరువాత మరల మొదటి డోసు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడతామని ఆమె తెలిపారు.ఈవిషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రస్తుతము మొదటి డోసు టీకా  వేసుకున్న వారిని గుర్తిస్తున్నాం అని అన్నారు. వారికి పూర్తి కాగానే మొదటి డోసు టీకా మళ్లీ వేస్తామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ వి పద్మలత, సూపర్వైజర్  వెంకటాద్రి, హెల్త్ అసిస్టెంట్ రవి, ఏఎన్ఎంలు జయశీల, లతా, పార్వతి, ఆశా కార్యకర్తలు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అర్హులైన అందరికీ వ్యాక్సిన్.

 అర్హులైన అందరికీ వ్యాక్సిన్.

సంతబొమ్మాళి, పెన్ పవర్. 

కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు దాటిన అర్హులందరికీ కరోనా మొదటి మరియు రెండో డోస్ వ్యాక్సిన్ వేస్తున్నామని సంతబొమ్మాళి మండలం నౌపడ ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ కోదండ రావు తెలియజేశారు. గురువారం 176 మందికి మరియు  శుక్రవారం 69 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. గురువారం మొదటి డోస్ వేయించుకోవడానికి వచ్చిన వై ఎస్ ఆర్ సి పి జెడ్పిటిసి అభ్యర్థి పాల వసంత రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం రెండో విడత కరోనా వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన విలేఖర్ల బృందానికి వేశారు. ఈ సందర్భంగా వైద్యులు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 1800 వ్యాక్సిన్ కేంద్రానికి రాగా వచ్చిన వ్యాక్సిన్ పూర్తిగా వెయడం జరిగిందని ఆయన తెలిపారు. ఫీవర్ సర్వే విస్తృతస్థాయిలో డోర్ టు డోర్ చేయిస్తున్నామని  ఇప్పటి వరకు జరిగిన కరోనా టెస్టుల్లో 51 మంది హాంఐసోలేషన్ లో ఉండగా 36 మంది పూర్తిగా కోలుకున్నారని తెలుపుతూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలు భయపడకుండా ముందుకు వస్తున్నారని వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ పూర్తిచేసి వ్యాక్సినేషన్ వేస్తున్నామని  ఆరోగ్య కేంద్రం పరిధిలో వ్యాక్సినేషన్ కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపిన వరకు టీకా వేస్తున్నామని, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటట్లు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి శానిటేషన్ వినియోగిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఇంటి వద్ద ఉండి భద్రతా చర్యలు చేపట్టినట్లు అయితే కరోనాను  పూర్తిగా జయించొచ్చు అని, బలమైన ఆహారం తీసుకొని, అవసరం ఉన్నంత వరకు విశ్రాంతి తీసుకుంటూ, పలు ఆరోగ్య సూత్రాలను పాటించటం వలన కరోనా దరిచేరదని ప్రజలు భయపడవద్దని ఆయన తెలిపారు.

గొడ్డిపుట్టు ఉపాధి కూలీలకు మాస్క్ లు పంచిన వి.ఆర్పీ

 గొడ్డిపుట్టు ఉపాధి కూలీలకు మాస్క్ లు పంచిన వి.ఆర్పీ

ముంచంగిపుట్టు ,పెన్ పవర్

కరోనా  బారిన పడకుండా ఉపాధి కూలీలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని  భౌతిక దూరం పాటించాలని  ఎన్ఆర్ఈజీఎస్  వి ఆర్ పి వెంగడ  చంద్ర  అన్నారు.శుక్రవారం సుజన కోట పంచాయితీ గొడ్డి పుట్టు గ్రామంలో ఉపాధి కూలీలకు మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రెండవ దశ కరోనా విలయ తాండవం ఆడుతుందని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. మొదటి విడత కరోనా మాదిరి నిర్లక్ష్యం చేయవద్దని  ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. ఉపాధి కూలీలు పనులు చేసే సమయంలో  మాస్కులు  ధరించాలి అని  గుంపులు గుంపులుగా  ఉండకుండా  భౌతిక దూరం పాటించక తప్పదు అన్నారు. పనులు పూర్తి అయ్యాక కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలన్మారు. గ్రామం విడిచి వెళ్లవద్దని ఇల్ల కే పరిమితం కావాలని అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఆశ కార్యకర్త ఏఎన్ఎం లను సంప్రదించాలని సూచించారు. నిత్యం ఉపాధి పనులు చేసే కూలీలు  మాస్కులు భౌతిక దూరం  తప్పనిసరిగా ఆచరించాలని వీ ఆర్ పి చంద్ర కోరారు. అతని వెంట టి ఏ కూడా పాల్గొన్నారు.

కె.జి.హెచ్ కోవిడ్ ప్రత్యేక అధికారిగా ఐటిడిఏ పిఓ నియామకం రద్దు చేయాలి.

కె.జి.హెచ్ కోవిడ్ ప్రత్యేక అధికారిగా ఐటిడిఏ పిఓ నియామకం రద్దు చేయాలి.

చింతపల్లి, ముంచింగ్ పుట్ లో కోవిడ్ సెంటర్ ప్రారంభించాలి

గిరిజన సంఘం డిమాండ్‌

పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం

గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తో రోగులు పెరుగుతుంటే సమర్థవంతంగా వైద్యం అందించేందుకు సమన్వయం చేసే ఐ. టి.డి.ఏ పిఓ ను కె.జి.హెచ్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా ప్రభుత్వం జారీ చేసిన నియామక ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స శుక్రవారం  డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పాడేరు ఐ.టి.డి.ఏ పరిధిలో సుమారు ఆరున్నర లక్షల మంది ప్రజలు ఉన్నారని, గిరిజన ప్రాంతాల్లో  రోజు రోజుకు కోవిడ్ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందిందని,భౌగోళికంగా విస్తారంగా ఎక్కువ గ్రామాలు, రహదారి నిర్మాణం కూడ సక్రమంగా లేని,అంబులెన్స్ వేళ్ళని గ్రామాలు ఉన్నాయన్నారు.సీజనల్ జ్వరాలకే మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు.పాడేరు జిల్లా ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసిన నేటికి మెరుగైన వైద్యం కోసం రోగులను విశాఖపట్నం తరలిస్తున్నరన్నారు.కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రోగులకు వైద్యం కోసం పాడేరు జిల్లా ఆసుపత్రి లో వెంటిలేటర్ ఆపరేటర్ లేక రోజులు తరబడి నిరుపయోగంగా ఉందన్నారు.అధికారుల అసమర్థత వల్ల10 వెంటిలేటర్ ను విశాఖపట్నం తరలించారన్నారు. పాడేరు,అరకులోయ కోవిడ్ క్వారెంట్ సెంటర్ల ఏర్పాటు చేసిన మౌలిక వసతులు సమకూర్చాలని వారు డిమాండ్ చేశారు. చింతపల్లి, ముంచంగిపుట్టు ఏరియాల్లో కోవిడ్ విస్తరించిన నేటికి కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు చేయలేదన్నారు.అరకొరగా ఉన్న వైద్య సేవలు, ఆసుపత్రిలో,క్వారంటైన్ సెంటర్ల కొరవాడిన మౌలిక వసతులు, విస్తరిస్తున్న కోవిడ్ నుండి గిరిజనుల ప్రాణాలు కాపడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ మరణాల పెరుగుతుంన్నా కోవిడ్ టెస్టు రిపోర్ట్ రాక రోగులు అయోమయంలో  ఉన్నారన్నారు.పాడేరు కేంద్రగా ల్యాబ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇన్ని సమస్యలు ఉంటే గిరిజన ప్రాంతాల  కోసం ప్రత్యేకంగా నియమించిన అధికారి పిఓను కె.జి.హెచ్  కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించి  గిరిజన ప్రాంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.గిరిజన ప్రాంతాల్లో ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత, నిర్లక్ష్యం తగదన్నారు.

గడువు దాటినా అందని వ్యాక్సిన్,,,, అందేనా !?

గడువు దాటినా అందని వ్యాక్సిన్,,,, అందేనా !?

ఆరిలోవ, పెన్ పవర్

కో వ్యాక్సిన్. టీకాల పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు. తొలివిడత వ్యాక్సిన్ దేవుడెరుగు రెండోవిడత వ్యాక్సిన్ పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వార్డు కార్పొరేటర్, సచివాలయం సిబ్బంది గాని పి హెచ్ సి సిబ్బంది ఈ విషయంపై ఎటువంటి సమాధానం ఇవ్వలేకపోతున్నారు ప్రజలు అడిగిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. తొలి విడత  వ్యాక్సిన్ వేయించుకున్న ప్రజలు రెండో దఫా వ్యాక్సిన్ వేయించుకోవడం లో ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  విమ్స్ ఆసుపత్రి పూర్తిగా కోవిద్ ఆసుపత్రి గా ఉంచడం వలన  వ్యాక్సిన్ విషయంలో ఆరిలోవ హెల్త్ సెంటర్ పై భారం పడింది   హాస్పిటల్ లో సిబ్బంది కొరత,  వేతనాలు జాప్యం వెరసి ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పని భారం పెరగడంతో వ్యాక్సిన్ కోసం వచ్చేవారిని నియంత్రించడం పై పూర్తిగా చేతులెత్తేసారు. సిబ్బంది వారి ప్రయత్నాలు ఎంత చేసినా ప్రజలు సహకరించకపోవడంతో  చేతులెత్తేసారు.

నగరంలో పలు ప్రాంతాల నుండి కరోనా వ్యాక్సిన్ కొరకు ఆరిలోవ హెల్త్ సెంటర్ కు రావడంతో స్థానికులకు వ్యాక్సిన్ దొరకటం లేదని మరియు అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి హాస్పిటల్ కి తరలిరావడంతో వారిద్వారా కరోనా మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని స్థానికప్రజలు భయపడుతున్నారు. వార్డు కార్పొరేటర్ ఆధ్వర్యనా  సచివాలయంలో వాక్సీన్ అందజేసే చర్యలు చేపట్టక పోవడం వలన ప్రజలు  ఇబ్బందులు  పడుచున్నారు. ఆరిలోవ హెల్త్ సెంటర్ లో కొంతమంది చోటా నాయకులు తమవారికి వ్యాక్సిన్ అందజేసే విషయంలో తమ హవా కొనసాగిస్తూన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన వ్యాక్సిన్ విషయంలో సచివాలయాల ద్వారా స్థానిక ప్రజలకు వ్యాక్సిన్అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఫార్మా కంపెనీలు పరవాడలో ఆక్సిజన్ తో కూడిన కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయండి

 ఫార్మా కంపెనీలు పరవాడలో ఆక్సిజన్ తో కూడిన కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయండి

 

పరవాడ, పెన్ పవర్

ప్రస్తుత పరిసితుల్లో మడలంలో కరోనా విలయ తాండవం చేస్తున్న కారణంగా    జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ(జె.ఎన్.పి.సి) లో గల ఫార్మా కంపెనీ యాజమాన్యాలను పరవాడ మండల ప్రజల ప్రాణ రక్షణ కొరకు కనీసం 50 ఆక్సిజన్ సదుపాయం కలిగి బెడ్ల తో కూడిన కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి అని వైసీపీ జెడ్పిటిసి అభ్యర్థి పి ఎస్. రాజు  విన్నపం చేశారు. గత సంవత్సరం కరోనా కాలంలో ఫార్మా కంపెనీలు రాస్ట్ర ప్రజలకు,సమీప నిర్వాసిత గ్రామ ప్రజలకు మీరు చేసిన సహాయములు,సేవలు,మరువలేనివి అని యాజమాన్యాలకు ధన్యవాదములు తెలియ జేశారు.ఇప్పుడున్న పరిస్తితులలో ఘతం లో కంటే అధిక జనాభా కరోనా తో ప్రతిఘటిస్తున్నారు అని కొందరు ఆక్సిజన్ అందక మృత్యు వాత పడుతున్న కారణంగా ప్రజల ప్రాణాలు కాపాడటానికి సహృదంతో సత్వరమే కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని యజమాన్యాను శుక్రవారంనాడు పత్రికా ముఖంగా వినయపూర్వక అభ్యర్దన చేస్తున్నాను అని రాజు తెలియజేసారు.మీరు చేసే ఈ సేవ ద్వారా సమీప నిర్వాసిత గ్రామ ప్రజలకు మాత్రమే కాకుండా,కంపెనీలలో పనిచేసే కార్మికులకు,మీరు చాలా మేలు చేసిన వారు కాగలరని పి ఎస్.రాజు ఫార్మా యజమాన్యాను అభ్యర్ధించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...