సి.ఎమ్, రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖ దక్షిణ నియోజకవర్గం,33వ వార్డు, అమ్మవారివీధి, అల్లిపురం, బొర్రా వేలంకిణి కి స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు వి.ఎమ్.ఆర్.డి.ఏ, ఛైర్మన్గా ఉన్న సమయంలో చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన తదనంతరం వారి కుమారుడు వైఎస్సార్సీపీ యువనాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్ ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులతో మాట్లాడి తనవంతు కృషి చేసి దక్షిణ నియోజకవర్గం లో కొన్ని సి.ఎమ్, రిలీఫ్ ఫండ్ చెక్కులను విడుదల చేయించగా ఇందులో భాగంగా ముఖ్యమంత్రివర్యులు వై.యెస్ జగన్మోహనరెడ్డి తన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి(సి.ఎమ్.ఆర్.ఎఫ్) రూ 60,000/-(అరవై వేల రూపాయలు) మంజూరు చేసిన సి.ఎం,రిలీఫ్ ఫండ్ చెక్కును ద్రోణంరాజు శ్రీనివాసరావు తనయుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్ చేతుల మీదుగా వేలంకిని కి అందచేయడం జరిగింది.చెక్కును అందుకున్న వారు ఇలాంటి కష్ట కాలంలో డబ్బులు అందించడం అనేది చాలా సంతోషంగా ఉందని తండ్రి లాగానే మీరు కూడా అతి తక్కువ సమయంలోనే ప్రజలందరికి సూపరిచితులు ఐయ్యారని తండ్రి ద్రోణంరాజు శ్రీనివాసరావు లాగనే ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సుశీల, పచ్చరపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.