Followers

ప్ర‌తీఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాలి

 ప్ర‌తీఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాలి

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్

హోం ఐసోలేష‌న్లో ఉన్న‌వారికి కోవిడ్ కిట్లు పంపిణీ

విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్

కోవిడ్ వ‌చ్చిన‌వారితోపాటు, వ్యాధి రాని వారు కూడా వ‌చ్చిన‌ట్టుగానే భావించి, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ .లాల్ కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌తీఒక్క‌రూ ఎంతో అప్రమ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం ఇద‌ని అన్నారు. ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌న‌స‌రిగా మాస్కును ధ‌రించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాల‌ని సూచించారు.  కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ప్ర‌భుత్వం అంద‌జేసిన మెడిక‌ల్ కిట్ల‌ను స్థానిక జిల్లా వైద్యారోగ్య‌శాఖ కార్యాల‌యం వ‌ద్ద బుధ‌వారం ఎఎన్ఎంల‌కు అంద‌జేశారు.ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు విధాలుగా కోవిడ్ చికిత్స‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. వివిధ ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉండీ కోవిడ్ సోకిన‌వారికి, ఆక్సీజ‌న్ ప‌రిమాణం త‌క్కువ‌గా ఉన్న‌వారికి, ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌వారికి ఆసుప‌త్రుల్లో ఉంచి చికిత్స చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. దీనికోసం 14 ప్ర‌భుత్వ‌, 16 ప్ర‌యివేటు ఆసుప్ర‌తుల‌ను సిద్దం చేశామ‌ని, ప్ర‌స్తుతం 997 మంది వ‌ర‌కూ కోవిడ్ పేషెంట్లు ఆసుప‌త్రుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నార‌ని తెలిపారు.వ్యాధి ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌వారినీ, ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికీ, హోం ఐసోలేష‌న్‌లో ఉండ‌టానికి అవ‌కాశం లేనివారినీ ఉంచేందుకు జిల్లాలో ఏడు కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. వీటిలో మొత్తం 3,600 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, 24 గంట‌లూ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోపాటు, అవ‌స‌ర‌మైతే వినియోగించేందుకు ఆక్సీజ‌న్‌, మందులు, అంబులెన్సుల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. బ‌ల‌వ‌ర్థ‌క‌మైన ఆహారాన్ని అందించ‌డంతోపాటు, పారిశుధ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌న్నారు. ప్ర‌స్తుతం 100 మంది వ‌ర‌కూ కేర్ సెంట‌ర్ల‌లో ఉన్నార‌ని క‌లెక్ట‌ర్‌ చెప్పారు.

 హోం ఐసోలేష‌న్‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నామ‌ని, వ్యాధి ల‌క్ష‌ణాలు తీవ్రంగా లేనివారికి ఇళ్ల‌లోనే ఉంచి చికిత్స‌ను అందించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఇలా ప్ర‌స్తుతం సుమారు 5వేల మంది వ‌ర‌కూ హోం ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. వీరంద‌రికీ కోవిడ్ కిట్ల‌ను అంద‌జేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఎఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌ల ద్వారా వీరికి కోవిడ్ కిట్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. దీనికోసం జిల్లాకు సుమారు 75 వేల కోవిడ్ కిట్లు వ‌చ్చాయ‌ని, వీటిలో 45 వేల కిట్ల‌ను ఇప్ప‌టికే పిహెచ్‌సిల‌కు పంపించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఇవి కాకుండా స‌బ్ సెంట‌ర్ల ప‌రిధిలోని ఎఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌ల ద్వారా నేరుగా పంపిణీ చేసేందుకు, వారికి సుమారు 22వేల‌ కిట్ల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఎంత త్వ‌ర‌గా కిట్ల‌ను పంపిణీ చేస్తే, రోగులు అంత త్వ‌ర‌గా వ్యాధి నుంచి కోలుకుంటార‌ని అన్నారు. అందువ‌ల్ల‌, ఈ కిట్లు పంపిణీని కంట్రోల్ రూముద్వారా ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌న్నారు. జింకు, విట‌మిన్లు, సిట్రిజ‌న్‌, యాంటీ బ‌యాటిక్ టేబ్‌లెట్లు, వాటిని వాడే విధానాన్ని కూడా కిట్ల‌లో పొందుప‌ర్చ‌డం జ‌రిగింద‌న్నారు. వ్యాధి సోకిన‌ప్ప‌టికీ, అధైర్య ప‌డ‌కుండా ధైర్యంగా ఎదుర్కోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.ఈ కార్య‌క్ర‌మంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ చామంతి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.


ఉదయం 7.30 నుంచి 11.30 గంట‌ల‌ వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు

 ఉదయం 7.30 నుంచి 11.30 గంట‌ల‌ వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు

జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న ప్ర‌క‌ట‌న‌


విజ‌య‌న‌గ‌రం,  పెన్ పవర్

కోవిడ్ నియంత్ర‌ణంలో భాగంగా విధించిన క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అనుస‌రించి జిల్లాలో భూ క్ర‌య‌, విక్ర‌య రిజిస్ట్రేష‌న్ స‌మ‌యాల్లో మార్పు చేసిన‌ట్లు జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన క‌ర్ఫ్యూలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 7.30 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు పని చేస్తాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నుంచి త‌దుప‌రి ఆదేశాల వ‌చ్చే వ‌ర‌కు జిల్లాలోని రిజిస్ట్రార్‌, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.


జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ

 జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ     

   

విజయనగరం, పెన్ పవర్


స్థానిక 42వ డివిజన్ పరిధిలో  ఉన్న అయ్యన్నపేట జంక్షన్ మరియు జంక్షన్ వద్దనున్న ఎస్సి కొలనీలో  జనసేన పార్టీ సీనియర్ నాయకులు,జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణరావు(బాలు) ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఇంటిఇంటికీ మాస్కులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్యవేదిక అధ్యక్షులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ రెండో వేవ్ కరోనా తీవ్రతదృష్ట్యా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని బాలు చేపట్టారని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు డబుల్ మాస్కులు ధరించాలని, ఇటువంటి తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని,ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సమయాల్లోనే బయటకు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లోపింటి కళ్యాణ్, చిన్న,కృష్ణ, పాల్గొన్నారు.   


కర్ఫ్యూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

 కర్ఫ్యూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

ఎస్.ఐ.ఫకృద్ధీన్,

సాలూరు, పెన్ పవర్

ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్ణయించిన కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని సాలూరు పట్టణ ఎస్.ఐ.ఫకృద్ధీన్ సూచించారు. పట్టణంలో గురువారం పట్టణ ఎస్.ఐ కర్ఫ్యూ నిబంధనలు తెలియజేస్తూ దగ్గర ఉండి షాపులను మూయించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ఫ్యూని పాటిద్దాం కరోనాని తరిమిద్దాం, మాస్కు ధరించు భౌతిక దూరం పాటించు శుభ్రత వహించు, నిర్లక్ష్యంగా ఉండకు కరోన బారిన పడకు, అనవసరంగా బయటకు రాకు కరోనాని ఆహ్వానించకు, మీ రక్షణ కోసం మేము రోడ్లుపై ఉన్నాము, మనందరి కోసం బయటకు రావాద్దు అంటూ పట్టణంలో మెయిన్ రోడ్డు గుండా ప్లేకార్డులుతో తమ సిబ్బందితో కలసి ప్రదర్శన చేశారు. సాలూరు సి.ఐ.అప్పలనాయుడు మరియు మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ లో కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ 12 గంటలకే షాపులన్నింటిని మూసివేయించడం జరిగింది అని ఎస్.ఐ ఫకృద్దీన్ తెలిపారు. అలాగే స్థానిక స్టేట్ బ్యాంకు లో భౌతిక దూరం పాటించాలని అక్కడ ఉన్న బ్యాంకు వినియోగదారులకు సూచించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కోవాక్సిన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఎం.రవీంద్ర

 తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కోవాక్సిన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఎం.రవీంద్ర

విశాఖపట్నం, పెన్ పవర్

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాక్సినేషన్ లో భాగంగా ఇచ్చే రెండవ డోసు కు  కోవాక్సిన్ డోసులు తగినన్ని అందుబాటులో లేక కోవాక్సిన్ మొదటి డోసు వేసుకొని రెండవ డోసు కొరకు చాలామంది నిరీక్షిస్తున్న పరిస్థితి నెలకొందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కోవాక్సిన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా వాక్సినేషన్ ప్రక్రియను కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలోనే చేపట్టడంతో అధిక శాతం ప్రజలు వ్యాక్సిన్ కోసం క్యూ లైన్ లలో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, కావున ప్రైవేటు ఆసుపత్రులలో కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచితే డబ్బులు వెచ్చించి వ్యాక్సిన్ వేయించుకునేవారైనా కొవిడ్ బారినుండి రక్షింపబడతారని,కరోనా బారిన పడి ఆక్సిజెన్ అందక ఇబ్బంది పడుతున్న రోగులకు సరిపడా ఆక్సిజెన్ సరఫరా చేయకపోవడంతో, ఆక్సిజెన్ అందక చాలామంది కరోనా రోగులు ఆసుపత్రుల బయటనే చనిపోతున్నారని, ఆక్సిజెన్ సరఫరాను కూడా పెంచాలని, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకూ కరోనా సోకినట్లైతే వారు ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారని,వారికి సరైన అవగాహన కల్పించి తగిన చికిత్సను అందజేయాలని, కరోనా టెస్టులు చేయించుకున్న తరువాత ఐదు రోజుల నుండి వారం రోజుల వరకు గానీ ఆ టెస్టు రిపోర్టులు రానటువంటి పరిస్థితి ఏర్పడటం వలన,ఈలోపు టెస్టు చేయించుకున్న వ్యక్తికీ గానీ కరోనా ఉన్నట్లయితే మరికొంతమందికి వ్యాపించే అవకాశం ఉన్నదనిి, కరోనా టెస్టుల ఫలితాలు వీలైనంత త్వరగా వెల్లడించి రోగులు తగు జాగ్రత్తలు తీసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే టెస్టు రిపోర్టులు వచ్చేవరకు ఆగకుండా వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టి కరోనా బారిన పడిన వారి ప్రాణాలను కాపాడాలని  భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అగనంపూడి సి.హెచ్.సి.సెంటర్ ను సందర్శించిన తిప్పల

అగనంపూడి సి.హెచ్.సి.సెంటర్ ను  సందర్శించిన తిప్పల 

గాజువాక, పెన్ పవర్

విశాఖపట్నం అగనంపూడి సి.హెచ్.సి.సెంటర్ సందర్శించిన గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అక్కడ ఉన్న సమస్యల్ని వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో పర్యవేక్షించి మరియు అక్కడున్న పరిసర ప్రాంతాన్ని తరచుగా శానిటైజర్ చేయమని ఆదేశించారు. హాస్పిటల్ లో ఉన్నటువంటి ఇబ్బందులను సమస్యలను సూపరిండెంట్ ద్వారా తెలుసుకుని మరియు ఈ హాస్పిటల్ కోవిడ్ సెంటర్ గా మారిస్తే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ప్రెగ్నెంట్ లేడీస్ తరచుగా డాక్టర్ చెకప్ వస్తూ ఉంటారు. 

 చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మరి దీన్ని కోవిడ్ హాస్పిటల్ గా మారిస్తే వాళ్లందరికీ కూడా ఇబ్బందులు ఉంటాయని దేవన్ రెడ్డి  సూపర్డెంట్ తెలియపరిచారు. మరి దీనికి స్పందిస్తూ దేవన్ రెడ్డి ఈ విషయాన్ని పై స్థాయి అధికారులకు తెలియపరుస్తాను అని హామీ ఇచ్చారు అలాగే కరోనా టెస్ట్స్ కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు.రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ ని వంద పడకల హాస్పిటల్ గా 16 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సి.ఏం,జగన్ కు మనం ఎప్పుడూ కూడా విధేయులుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 66 వార్డ్ కార్పొరేటర్ ఇమ్రాన్  తదితరులు పాల్గొన్నారు.

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం

మహారాణి పేట, పెన్ పవర్

అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి  గౌరవ చైర్మన్ ఆదేశాల మేరకు కరోనాతో చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చెకూరాలని గురువారం 6 మే ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మన జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వైపు 50 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షురాలైన షేక్  మున్ని  సహయ సహకారాలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నేషనల్ జనరల్ సెక్రటరీ కేశవరావు  స్టేట్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షురాలు పిల్ల సత్యవతి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి.హెచ్. ఆదిలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లాయువజన విభాగం వైస్  ప్రెసిడెంట్ షేక్ గౌస్ లజం  తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...