Followers

శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

 శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

  నిరంతరం ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నేత,యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోరెడ్ల శేషగిరి కరోనా తో అకాల మరణం చెందడం విద్యారంగానికి తీరని లోటని, ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శేషగిరి సామాజిక స్పృహ కలిగిన నాయకుడని, ఉపాధ్యాయుల సంక్షేమం  కోసం, కార్మిక వర్గాల హక్కుల కోసం,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారన్నారు. గురజాడ అధ్యయన వేదిక పక్షాన పలు సామాజిక అంశాలపై చర్చా వేదికలు నిర్వహిస్తూ చైతన్యం కోసం కృషి చేశారన్నారు. ఇటీవల విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యోగ,కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. అంతే కాకుండా శేషగిరి విద్యారంగ విశ్లేషకునిగా నూతన జాతీయ విద్యా విధానం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఏ విధంగా నష్టపోతారనే వ్యాసం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. గతంలో యూటీఎఫ్ లో శేషగిరితో ఉద్యమ సహచరునిగా కలిసి పని చేసామని,అదేవిధంగా గత రెండున్నర దశాబ్దాలుగా  ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై జరిగిన అనేక ఐక్య పోరాటాల్లో కలిసి పాల్గొన్నామని సామల తన జ్ఞాపకాలను గుర్తు చేసారు. కామ్రేడ్ కోరెడ్ల శేషగిరి  మరణం  తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం రాష్ట్ర  విద్యారంగానికి, ఉపాధ్యాయ , ఉద్యోగ , కార్మిక ఉద్యమాలకు తీరని లోటని అభివర్ణించారు  ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సామల పేర్కొన్నారు.

హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

 హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ మండలం లోని పలు గ్రామాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉందని పలువురు మండల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయితీ సర్పంచులు ముందు జాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య పనుల చేపట్టారు. ఇందులో భాగంగా పిట్టా డ గ్రామ సర్పంచ్ కాపరపు నాయుడు బాబు ఆధ్వర్యంలో వాణిజ గిరిజన గ్రామంలో  క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గ్రామంలో అన్ని వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలను చేపడుతున్నారు. సర్పంచ్ నాయుడు బాబు  మాట్లాడుతూ ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశలో ఉందని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇంట్లో ఉన్న, అత్యవసర సమయాల్లో బయటికి వెళ్ళిన మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని ఆయన వివరించారు. ప్రస్తుతం మెంటాడ, చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టీకాలు, టెస్టుల్లో చేస్తున్నారని 45 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులకు టీకాలు వేయించుకోవాలని ఆయన తెలిపారు. గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


వేసవి తాపం తీర్చే తాటి ముంజులు వచ్చేశాయ్

 వేసవి తాపం తీర్చే తాటి ముంజులు వచ్చేశాయ్

అంతరిస్తున్న తాటి వనాలు తగ్గిన ముంజుల దిగుబడి

పెన్ పవర్,  విశాఖపట్నం

వేసవి కాలం వచ్చిందంటే ముంజు లేయ్- తాటి ముంజులు అన్న కేక వీధుల్లో వినిపిస్తుంటుంది. తాటి ముంజులు తట్టను మహిళలు నెత్తిన పెట్టుకొని  ఎండను సైతం లెక్కచేయకుండా తిరుగుతుంటారు. మంజులేయ్  అన్న కేక వినగానే ఏయ్- ముంజులు ఇలారా  అని పలిచి బేరమాడి మరి కొనుక్కొంటాం. వేడికి ఉపశమనం కలిగించే తాటి ముంజులు సేకరణ లో ఎంతో శ్రమ దాగి ఉంది. తాటి చెట్ల నుంచి లేత కాయలు  దించి కత్తితో వలుస్తారు.ముంజులు తీయడం లో జాగ్రత్త వహించాలి. లేకుంటే ముంజులు పగిలి నీరు పోతుంది. చెట్టు గీత  గాళ్లు నేర్పరి గా ముంజులు తీస్తారు. గ్రామీణ ప్రాంతాలకు పరిమితం అయిన తాటి ముంజులు ఇప్పుడు పట్టణాలకు పాకింది. చేరువలో  ఉన్న  గ్రామాల నుంచి  తాటి ముంజల ను  పట్టణాలకు తరలించి విక్రయిస్తున్నారు. మారికవలస  పిన గాడి   సబ్బవరం ప్రాంతాల చెట్ల కింద తాటి కాయలు రాశులు  ముంజులు తీసి విక్రయిస్తున్నారు. డిమాండ్ బట్టి  ముంజుల ధరలు పెరుగుతున్నాయి  గ్రామీణ ప్రాంతాల్లో డజను పాతిక రూపాయలు ఉంటే నగరంలో 50 రూపాయలకు పైనే. వేసవిలో చెట్టు గీత గార్లకు తాటి ముంజలు కాసులు  పండిస్తున్నాయి.  తాటి చెట్లు  అంతరించిపోతుం డంతో తాటి ముంజల  కొరత  వస్తుంది. తాటి ముంజులు కు పట్టణాల్లో గిరాకీ ఉండడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి తాటి కాయలు సేకరిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు పరిమితమైన తాటి ముంజులు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. మాడుగుల ప్రాంతం నుంచి పాడేరు కు. నర్సీపట్నం ప్రాంతం నుండి చింతపల్లి కి ఎస్. కోట నుండి అరకు కి తాటి ముంజులు సరపరా అవుతున్నాయి. దూరం పెరిగే కొద్దీ ముంజుల ధరలు చుక్కల నంటుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని తెలంగాణ జిల్లా ల్లొ తాటి కలఫకు మంచి గిరాకి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో తాటి చెట్లును వ్యాపార్లు రవాణా చేస్తున్నారు. మరి కొంత కాలానికి తాటి చెట్లు కనుమరుగై పోయే అవకాశం ఉంది.


కరోనా నిర్మూలనకు ఆటో ద్వారా ప్రసారం

 కరోనా నిర్మూలనకు ఆటో ద్వారా ప్రసారం

మెంటాడ, పెన్ పవర్ 

మండల కేంద్రం మెంటాడ అక్కడ అక్కడ కరోనా కేసులు నమోదు కావడంతో సర్పంచ్ రేగిడి రాంబాబు వినూత్న ప్రసారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కరోనా పట్ల అవగాహన కల్పించడం కష్టతరం అని గ్రామములో ఆటో ఏర్పాటు చేసి ప్రసారానికి శ్రీకారం చుట్టారు. సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ కరోనా మహమ్మారి తీవ్రంగా ఉందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, బహుదూరం పాటించాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వము లాక్ డౌన్, 144 సెక్షన్ అమలు చేసిందని, ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కిరానా, టిఫిన్, పాన్ షాపులు తెరిచి ఉంటాయని ప్రతి ఒక్కరూ తమకు కు కావలసిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని, స్వచ్ఛందంగా ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా ప్రబంధములు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.


కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న సర్పంచ్

కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ 

మెంటాడ, పెన్ పవర్

మెంటాడ మండలం, చింతలవలస గ్రామపంచాయతీ సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ, వైద్య ఆరోగ్య సిబ్బంది,  గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి గురువారం కరోనా పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి పరిసరాల, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వారు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని,    ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరిస్తే మంచిదని వారు గ్రామస్తులకు సూచించారు. బహుదూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండాలని, అవసరమైతే మాస్కులు ధరించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి మనపై దాడి చేస్తుందని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

 పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

 పాడేరు,  పెన్ పవర్

 పాడేరు ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు అపరేటర్లు సిబ్బందిని తక్షణమే నియమించాలని, ఆదివాసి జేఏసి జిల్లా కన్వీనర్ రామారావు దొర , కో-కన్వీనర్: కూడ రాధాకృష్ణ బూడిద సుమన్ ,ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ ఏజెన్సీ 11 మండలాలకు ఏకైక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి పాడేరు లోనే ఉంది. నిత్యం వందలాది మంది వైద్యం పొందుటకు పాడేరు జిల్లా ఆస్పత్రికి వస్తూ ఉంటారు. అలాంటి ఆసుపత్రిలో పాడేరులో వైద్యం చేయవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ, ఇక్కడ సరైన సిబ్బంది లేక కెజిహెచ్ కు రిఫరల్ చేస్తూ ఉంటారు. దానివల్ల మార్గమధ్యంలోనే అనేక మంది చనిపోతున్నా ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆక్సిజన్ వెంటిలేటర్ అందక ఒక వ్యక్తి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో గంట వ్యవధిలోనే మరణించిన పరిస్థితి ఉందని, తక్షణమే ఆదివాసీల ప్రాణాలు కాపాడుటకు ఆక్సిజన్ వెంటిలేటర్ సిబ్బందిని నియమించాలని, ఆదివాసి జేఏసి జిల్లా నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.


గజ గజ లాడిస్తున్న గజ రాజులు

 గజ గజ లాడిస్తున్న గజ రాజులు 

కూరగాయలు కోత కు వెళ్లిన మహిళ మృతి
పొలాల్లో కి వెళ్ళడానికి భయపడుతున్న రైతులు
నేటి కి ఆరుగురు మృతి 
ప్రభుత్వం రెండు కోట్లు కు పైగా నష్టపరిహారం చెల్లింపు
పదుల సంఖ్యలో ఫారెస్ట్ సిబ్బంది కి గాయాలు, వాహనాలు ధ్వంసం
మూడు ఏళ్లుగా ఇదే తంతు దొరకని  శాశ్విత పరిష్కారం

కురుపాం, పెన్ పవర్

కురుపాం నియోజకవర్గంలో లో ఏనుగులు ప్రవేశించి మూడు ఏళ్ళు పైగా అవుతుంది,కానీ నేటికీ శాశ్విత పరిష్కారం దొరకలేదు,గురువారం తెల్లవారుజామున కోమరడా మండలం పాత కల్లికోట గ్రామానికి చెందిన అల్లాడా అప్పమ్మా అనే మహిళ కూరగాయలు కోయడానికి వెళ్ళేరు,ఇమే పై ఒక ఏనుగు దాడి చేయడం తో ఆమె అక్కడ కు అక్కడే మృతి చెందింది, ఇమే మృతి తో మృతుల సంఖ్య ఆరు కు చేరింది,ఒక వైపు కరోనో మరో వైపు ఏనుగుల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,నాగావళి నది తీరం ఉండటం తో  పుష్కలంగా నీరు,జియ్యమ్మవలస కోమరడా మండలలో అరటి , చెరకు ,లాంటి పంటలు ఉండటం తో వాటికి ఆహారం కూడా ఇబ్బంది లేకుండా ఉండటం తో ఈ ప్రాంతం విడి పోవటం లేదు,గతం లో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పుడుకు అది కార్యరూపం దాల్చలేదు,ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు,గాయాలు పాల అయిన వారికి,ప్రాణ నష్టం జరిగిన వారికి కలిపి సుమారు రెండు కోట్ల రూపాయలు వరకు నష్ట పరిహారం చెల్లించింది, ఒక వైపు ఫారెస్ట్ అధికారులు కష్టం మరో వైపు ప్రభుత్వం నష్ట పరిహారం రూపం లో చెల్లిస్తున్న కోట్ల రూపాయలు  వృధా అవుతున్నా శాశ్విత పరిష్కారం చుపలేకపోతున్నారు.

కురుపాం, పార్వతీపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అధికారులు కు నిరంతరం ఏనుగులు ను ట్రాక్ చేస్తున్న ఎలిఫెంట్ ట్రాకర్ లు కు కూడా చేతిలో బాంబులు పేలి గాయాలు పాల అయ్యారు,ఎవరో చనిపోతే ఆస్తి నష్టం జరిగి రైతులు రోడ్ ఎక్కితేనే ఈ విషయం పై ఒకరోజు చర్చ జరిగి తరవుతా వదిలేయడం కారణంగా ఇన్ని ఏళ్లుగా ఈ సమస్య కు పరిష్కారం కాలేదు,ఇప్పటికి అయిన ఫారెస్ట్ అధికారులు ,నాయకులు,శాశ్విత పరిష్కారం చూపాలని ప్రజలు,రైతులు కోటుతున్నారు.

 మూడు ఏనుగులు మృతి..

మనుషులు ప్రాణాలు, ఆస్తి నష్టం ఎంత ముఖ్యమో ముగ జీవులు ప్రాణాలు కాపాడటం కూడా మనకు అంతే ముఖ్యం,గతం లో ఒక ఏనుగు విద్యుత్ షాక్ తో మరో ఏనుగు నాగావళి నదిలో చిక్కుకొని మృతి ఛేధింది.మూడవ ఏనుగు అనారోగ్యంతో మృతి చెందింది.. దీనితో జంతు ప్రేమికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు,ముగ జీవులు కు ప్రజలు కు ఇరువులు కు ఇబ్బంది లేని ప్రదేశానికి వాటిని తరలించాలని కోరుతున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...