Followers

కరోన బారినుండి ప్రజలు బయటపడాలని ప్రార్థనలు

కరోన బారినుండి ప్రజలు బయటపడాలని ప్రార్థనలు

తాళ్లపూడి, పెన్ పవర్

పవిత్రమైన రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమం బుధవారం వేగేశ్వరపురం గ్రామంలో జరిగింది.  వేగేశ్వరపురం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ జిలాని  సచివాలయ సిబ్బంది సహాయంతో కోవిడ్ ఆంక్షల నియమావళి మరియు కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు పాటించి  గ్రామంలో ఉన్న 25 కుటుంబాల వారి ఇంటికి వెళ్లి ఇఫ్తార్ విందు అందజేయడం జరిగింది. వేగేశ్వరపురం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కోవిడ్ బారినుండి బయటపడాలని ప్రార్ధన చేశారు.


ఉపాధి కూలీలు కోవిడ్ నిబంధనలు పాటించాలి

 ఉపాధి కూలీలు కోవిడ్ నిబంధనలు పాటించాలి

పెన్ పవర్ , రావులపాలెం

కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఉపాధి హామీ పథకం కూలీలు, సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు చేయాలని ఏపిఓ సత్యవతి సూచించారు. రావులపాలెం మండలం లక్ష్మీపోలవరం, పొడగట్లపల్లి గ్రామాల్లో జరుగుతున్న కాలువ పనులను గురువారం ఆమె పరిశీలించారు. కోవిడ్ నేపథ్యంలో ఉపాధి కూలీలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఫీల్డ్ అసిస్టెంట్లు విజయకుమార్, వెంకటనాగేంద్ర పాల్గొన్నారు.


గిరిజన ‌ బంధువులను దూరం చేస్తున్న కరోనా

గిరిజన ‌ బంధువులను  దూరం చేస్తున్న కరోనా

చింతూరు,  పెన్ పవర్

గిరిజనుల్లో లో శుభకార్యాలు జరిగినా, అశుభ కార్యాలు జరిగినా ఒక పండుగ జరిగినా బంధువులందరూ పెద్ద ఎత్తున వేడుకకు రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కరోనా కు గురై మృతి చెందిన గిరిజనుల కుటుంబాల వద్దకు బంధువులు ఎవరూ రాకపోవడం హృదయవిదారకమైన విషయం. చింతూరు మండలంలో ఇంచుమించు ప్రతి గ్రామానికి కరోనా సోకింది. ప్రతి గ్రామంలోనూ లాక్ డౌన్ విధించటం గ్రామంలో శానిటేషన్ చేయించటం సెక్రటరీల పని వంతు అయింది. 12:00 తర్వాత లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఆజ్ఞలు జారీ చేసింది. గత రాత్రి  మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోడి కాంతమ్మ (50) కరోనాతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందింది. కాంతమ్మ మృతదేహానికి  సంస్కారాలు చేయడానికి బంధువులు ఎవరూ రాలేదు. కాంతమ్మ మరిది కొడుకులు మరో వ్యక్తి అంతిమ సంస్కారాలు చేశారు. కరొన తీవ్రతరం కావడంతో ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. అంతిమ సంస్కారాలు చేయడానికి తన సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది హృదయ విదారక దృశ్యం.


చారిటీ సోసైటీ ఆధ్వర్యంలో 20 కుర్చీలు బహుకరణ

 చారిటీ సోసైటీ ఆధ్వర్యంలో  20 కుర్చీలు బహుకరణ

బిక్కవోలు, పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామం బిక్కవోలు చారిటీ సొసైటీ మరియు గ్లోబల్ విజన్ హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్ కరస్పాండెంట్ ఎం.జాన్ డీన్ మరియు ప్రధానోపాధ్యాయులు సత్యవాణి రంగంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంగళవారం 15 కుర్చీలు పి.హెచ్.సి డాక్టర్ ఎం.కృష్ణ చైతన్య మరియు డాక్టర్ ఎం.పద్మ వీరికి అందించారు. అలాగే సింగంపల్లి ఉప కేంద్రం ఆరోగ్య కేంద్రానికి 5 కుర్చీలు బహుకరిందం జరిగింది అని డాక్టర్లు తెలిపారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కీర్తిశేషులు ఎం.శామ్యూల్ రాజు పేదలకు ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తు చేసుకుంటాము అని,మా వెన్నంటే ఉంటూ,  ప్రోత్సహించే వారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం కుర్చీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

 శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

  నిరంతరం ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నేత,యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోరెడ్ల శేషగిరి కరోనా తో అకాల మరణం చెందడం విద్యారంగానికి తీరని లోటని, ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శేషగిరి సామాజిక స్పృహ కలిగిన నాయకుడని, ఉపాధ్యాయుల సంక్షేమం  కోసం, కార్మిక వర్గాల హక్కుల కోసం,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారన్నారు. గురజాడ అధ్యయన వేదిక పక్షాన పలు సామాజిక అంశాలపై చర్చా వేదికలు నిర్వహిస్తూ చైతన్యం కోసం కృషి చేశారన్నారు. ఇటీవల విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యోగ,కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. అంతే కాకుండా శేషగిరి విద్యారంగ విశ్లేషకునిగా నూతన జాతీయ విద్యా విధానం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఏ విధంగా నష్టపోతారనే వ్యాసం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. గతంలో యూటీఎఫ్ లో శేషగిరితో ఉద్యమ సహచరునిగా కలిసి పని చేసామని,అదేవిధంగా గత రెండున్నర దశాబ్దాలుగా  ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై జరిగిన అనేక ఐక్య పోరాటాల్లో కలిసి పాల్గొన్నామని సామల తన జ్ఞాపకాలను గుర్తు చేసారు. కామ్రేడ్ కోరెడ్ల శేషగిరి  మరణం  తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం రాష్ట్ర  విద్యారంగానికి, ఉపాధ్యాయ , ఉద్యోగ , కార్మిక ఉద్యమాలకు తీరని లోటని అభివర్ణించారు  ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సామల పేర్కొన్నారు.

హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

 హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ మండలం లోని పలు గ్రామాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉందని పలువురు మండల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయితీ సర్పంచులు ముందు జాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య పనుల చేపట్టారు. ఇందులో భాగంగా పిట్టా డ గ్రామ సర్పంచ్ కాపరపు నాయుడు బాబు ఆధ్వర్యంలో వాణిజ గిరిజన గ్రామంలో  క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గ్రామంలో అన్ని వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలను చేపడుతున్నారు. సర్పంచ్ నాయుడు బాబు  మాట్లాడుతూ ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశలో ఉందని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇంట్లో ఉన్న, అత్యవసర సమయాల్లో బయటికి వెళ్ళిన మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని ఆయన వివరించారు. ప్రస్తుతం మెంటాడ, చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టీకాలు, టెస్టుల్లో చేస్తున్నారని 45 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులకు టీకాలు వేయించుకోవాలని ఆయన తెలిపారు. గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


వేసవి తాపం తీర్చే తాటి ముంజులు వచ్చేశాయ్

 వేసవి తాపం తీర్చే తాటి ముంజులు వచ్చేశాయ్

అంతరిస్తున్న తాటి వనాలు తగ్గిన ముంజుల దిగుబడి

పెన్ పవర్,  విశాఖపట్నం

వేసవి కాలం వచ్చిందంటే ముంజు లేయ్- తాటి ముంజులు అన్న కేక వీధుల్లో వినిపిస్తుంటుంది. తాటి ముంజులు తట్టను మహిళలు నెత్తిన పెట్టుకొని  ఎండను సైతం లెక్కచేయకుండా తిరుగుతుంటారు. మంజులేయ్  అన్న కేక వినగానే ఏయ్- ముంజులు ఇలారా  అని పలిచి బేరమాడి మరి కొనుక్కొంటాం. వేడికి ఉపశమనం కలిగించే తాటి ముంజులు సేకరణ లో ఎంతో శ్రమ దాగి ఉంది. తాటి చెట్ల నుంచి లేత కాయలు  దించి కత్తితో వలుస్తారు.ముంజులు తీయడం లో జాగ్రత్త వహించాలి. లేకుంటే ముంజులు పగిలి నీరు పోతుంది. చెట్టు గీత  గాళ్లు నేర్పరి గా ముంజులు తీస్తారు. గ్రామీణ ప్రాంతాలకు పరిమితం అయిన తాటి ముంజులు ఇప్పుడు పట్టణాలకు పాకింది. చేరువలో  ఉన్న  గ్రామాల నుంచి  తాటి ముంజల ను  పట్టణాలకు తరలించి విక్రయిస్తున్నారు. మారికవలస  పిన గాడి   సబ్బవరం ప్రాంతాల చెట్ల కింద తాటి కాయలు రాశులు  ముంజులు తీసి విక్రయిస్తున్నారు. డిమాండ్ బట్టి  ముంజుల ధరలు పెరుగుతున్నాయి  గ్రామీణ ప్రాంతాల్లో డజను పాతిక రూపాయలు ఉంటే నగరంలో 50 రూపాయలకు పైనే. వేసవిలో చెట్టు గీత గార్లకు తాటి ముంజలు కాసులు  పండిస్తున్నాయి.  తాటి చెట్లు  అంతరించిపోతుం డంతో తాటి ముంజల  కొరత  వస్తుంది. తాటి ముంజులు కు పట్టణాల్లో గిరాకీ ఉండడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి తాటి కాయలు సేకరిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు పరిమితమైన తాటి ముంజులు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. మాడుగుల ప్రాంతం నుంచి పాడేరు కు. నర్సీపట్నం ప్రాంతం నుండి చింతపల్లి కి ఎస్. కోట నుండి అరకు కి తాటి ముంజులు సరపరా అవుతున్నాయి. దూరం పెరిగే కొద్దీ ముంజుల ధరలు చుక్కల నంటుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని తెలంగాణ జిల్లా ల్లొ తాటి కలఫకు మంచి గిరాకి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో తాటి చెట్లును వ్యాపార్లు రవాణా చేస్తున్నారు. మరి కొంత కాలానికి తాటి చెట్లు కనుమరుగై పోయే అవకాశం ఉంది.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...