Followers

విశాఖ కెజిహెచ్ క్యాంటీన్ వద్ద కానరాని కోవిడ్ నిబంధనలు.

 విశాఖ కెజిహెచ్ క్యాంటీన్ వద్ద కానరాని కోవిడ్ నిబంధనలు.

                                                                                      నగరంలో పిట్టల్లా రాలిపోతున్న కరోనా రోగులు

 పట్టించుకోని కేజిహెచ్ యాజమాన్యం.

విశాఖపట్నం,పెన్ పవర్,

విశాఖ నగరంలో పెద్దాస్పత్రి కేజీహెచ్ క్యాంటీన్ వద్ద కరోనా నిబంధనలు పాటించడంలేదు. క్యాంటీన్లో  భోజనం టీ టిఫిన్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ ప్రాణాలను హరించి వేస్తుంటే  ప్రజలకు చీమ కుట్టినట్లయినా లేదని    ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే బుధవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత క్యాంటీన్ వద్ద జనం రద్దీ ఎక్కువయింది. తోపులాటలు ఒకరిపై ఒకరు ఢీ కొంటూ  ఆహార పదార్థాలకు ఎగబడ్డారు. జనం గుంపుగా  కుమ్ము లాడు  కుంటున్న   క్యాంటీన్ నిర్వాహకులు గాని  ఆస్పత్రి యాజమాన్యం గానీ  పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. నగరంలో కరోనా కేసులు గంట గంటకు పెరిగిపోతున్నాయి మరోపక్క మరణాల సంఖ్య విస్మయాన్ని కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా  జనంలో మాత్రం చలనం లేదు. భయం కనిపించలేదు. కాంటీన్ లో  ఆసుపత్రికి వచ్చిన జనం కిక్కిరిసి పోవడం చూస్తుంటే  కరోనా మహమ్మారి  కోరలు చాస్తుందని  అంటున్నారు.


కేసులు పెరుగుతున్న దృష్ట్యా  ప్రభుత్వం మధ్యాహ్నం పన్నెండు తర్వాత  తెల్లవారు 6  వరకు  బుధవారం నుంచి కర్ఫ్యూ విధించినా విషయం తెలిసిందే. ఒకపక్క కర్ఫ్యూ అమలులో ఉన్నా కేజీహెచ్ ఆస్పత్రి వద్ద  మరియు క్యాంటీన్ లో  జనాలు నిబంధనలకు విరుద్ధంగా ఎగబడటం పై  ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో  క్యాంటీన్ వద్ద జనం తోపులాటలు  అవసరమా అని ప్రత్యక్షంగా  సాక్షి అరకు వైయస్సార్ సిపి నాయకుడు   జీవన్ కుమార్   ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేజీహెచ్ అధికారులు పోలీసులు చొరవ తీసుకోవాలని లేనిపక్షంలో భోజనం క్యాంటీన్   కరోనా క్యాంటీన్ గా  పోతుందని జీవన్ కుమార్ అన్నారు.

మేయర్ కు వినతి పత్రం సమర్పించిన విశాఖ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్

 మేయర్ కు వినతి పత్రం సమర్పించిన విశాఖ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్

మహారాణి పేట, పెన్ పవర్

గ్రేటర్ విశాఖపట్నం మహానగర కార్పొరేషన్ కి మేయర్ గా ఎన్నికైన సందర్భంగా ముందుగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న సచివాలయం సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, హెల్త్ వర్కర్లు, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ లు సిబ్బంది సి.ఎం జగన్ మోహన్ రెడ్డి  ఆశయ సాధన కోసం ఈ కరోనా సమయంలో ఎవరికి వాళ్ళు వారి శక్తి కొలది,అహర్నిశలు ప్రజా సంక్షేమము కోసం విధులు నిర్వహిస్తున్నారు.ఈ సమయంలో కరోనా నుండి రక్షణకు సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ కు సేఫ్టీ కిట్స్ అవసరం ఎంతైనా వుంది కనుక తమ పై దయవుంచి ఉద్యోగులు, కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కు మాస్క్ లు,గౌజులు,శానిటైజర్ లు, అందజేయవలసిందిగా కోరుతూ బుధవారం వినతి పత్రాన్ని సమర్పించారు విశాఖపట్నం సచివాలయం ఎంప్లాయిస్ ఫెడరేషన్. ఈ సందర్భంగా మేయర్ , కమిషనర్ తో మాట్లాడి  అందరికి వీలైనంత తొందరగా హెల్త్ కిట్లు అందించటం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ జిల్లా  ప్రెసిడెంట్ గణేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పి.వి.కిరణ్ కుమార్,జిల్లా కో ఆర్డినేటర్ ఈ.పవన్ కుమార్,షాహిద్, వెంకట్,అశోక్  వాలంటీర్ లు  నవీన్,కుశవంత్  తదితరులు పాల్గొన్నారు.

సింహాచల ఉద్యోగులకు వ్యాక్సినేషన్

 సింహాచల ఉద్యోగులకు వ్యాక్సినేషన్

విశాఖపట్నం సింహాచలం 


శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి సహా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్. ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి సలహామేరకు ఈ ఓ సూర్యకళ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని ఆదేశించారు. దీంతో తొలిరోజు 150 మందికి వ్యాక్సినేషన్ వేయించారు ఆలయ ఉద్యోగులందర్నీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు.

మే 6 సమ్మె వాయిదా

 మే 6 సమ్మె వాయిదా 


విశాఖపట్నం, పెన్ పవర్

స్టీల్ కార్మికులకు వేతన ఒప్పందం కోసం మే 6 న తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నామని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాలు తెలియజేశాయి ఈరోజు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ పర్సనల్ కె.సి.దాస్ కలిసి ఆయన కార్యాలయంలో సమ్మె వాయిదా వేస్తున్న వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలకు ఆక్సిజన్ అందిస్తున్న మహోన్నత కార్యక్రమాల్లో స్టీల్ కార్మికవర్గం ఉందని వారన్నారు. నూతన వేతన ఒప్పందం కోసం సమ్మె చేయవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ  ప్రజలను కాపాడాలన్న ఆశయానికి కట్టుబడి సమ్మెను వాయిదా వేస్తున్నామని వారు వివరించారు. ఇప్పటికైనా స్టీల్ యాజమాన్యం కార్మికులకు న్యాయంగా సంక్రమించాల్సిన వేతన ఒప్పందాన్ని చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్టీల్ గుర్తింపు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,అయోధ్య రామ్,వైటి దాస్, స్టీల్ ఎన్.జె.సి.ఏస్,సభ్యులు డి.ఆదినారాయణ,నాయకులు కె.సత్యనారాయణ, దొమ్మేటి అప్పారావు,పిట్ట రెడ్డి,కె.సత్య రావు,డి.సురేష్ బాబు,వి.రామ్ మోహన్ కుమార్,ఎన్.కృష్ణా రావు, వి.శ్రీనివాస్,వి.రామ్ కుమార్, మహాలక్ష్మి నాయుడు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

నిరసన వ్యక్తం చేసిన బి.జె.పి, ఓ.బి.సి, మోర్చా

 నిరసన వ్యక్తం చేసిన బి.జె.పి, ఓ.బి.సి, మోర్చా


                                                                   మహారాణి పేట ,పెన్ పవర్


పశ్చిమ బెంగాల్ లో తృనమూలు కాంగ్రెస్ బీజేపీ పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ ల పైన జరుపుతున్న దాడులు, మహిళలపైన చేస్తున్న  అరాచకాలను ప్రజాస్వామ్య వాదులు ముక్త కంఠంతో ఖండించాలని, ఇదే విధంగా మేము కూడా దాడులకు తెగబడితే మమతా బెనర్జీ పార్టీ ఈ రోజు విజయం సాధించి ఉండేదా అని బీజేపీ జాతీయ అధ్యక్షులు ఏ.పి.నడ్డా అన్నారు. ఈ అరాచకాలను ప్రజాస్వామ్య వాదులంతా వ్యతిరేకించాలని, దీనిలో భాగంగా బీజేపీ కార్యకర్తలంతా తమ ఇండ్లలోనే కోవిడ్ కారణంగా ఈ రోజు ఉదయం 11గంటల నుండి 12 గంటల వరకు నిరసన కార్యక్రమం చేయాలనీ జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు, రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మమతా బెనర్జీ ఇది వరకు కమ్యూనిస్ట్ పార్టీ లను భయ, భ్రాంతులకు గురి చేసి నిర్ములించారని, బీజేపీ ని కూడా అదేవిదంగా చేద్దామనుకోవడం అవివేకం అని అన్నారు. బీజేపీ కార్యకర్తలు దేశభక్తి తో కూడిన త్యాగమయులని ఎట్టి పరిస్థితులు లోను తృణముల్ ఆటలు సాగవని అన్నారు. ఇటువంటి దురాగతాలను ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. దేశావ్యాప్తంగా ఈ రోజు ఉదయం 11 గంటలనుండి 12 గంటలవరకు ఈ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదములు, అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తమ ఇంటి వద్దనే ఓబీసీ మోర్చా పార్లమెంట్ అధ్యక్షులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఆయన మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్ లో బిజెపి కార్యకర్తలకు బిజెపి నాయకులకు కేంద్ర ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలి అని కోరుతూ  తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు నాయకులు చేసిన దుశ్చర్యలను బిజెపి ఓబీసీ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి ఓబీసీ  రాష్ట్ర కోశాధికారి శ్రీకంఠ భక్త శ్రీనివాస్ రావు, బిజెపి ఓబిసి సెక్రెటరీస్ ఎడ్ల రమణ రాజు,  ఎల్లాజీ యాదవ్, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇట్లు బేసి బిజెపి విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు  పల్లి శ్రీనివాసులు నాయుడు అన్నారు

వాలంటీర్లకు వందనం

  వాలంటీర్లకు వందనం


కరోనా సేవలలో మేము సైతం అంటున్న వాలంటీర్లు

కోవిడ్ సేవలలో మహిళా వాలంటీర్లు ముందంజ

మగవారికి దీటుగా సేవలకు సిద్ధం

ప్రజల మన్ననలు పొందుతున్న గ్రామ వాలంటీర్లు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్,


గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో గ్రామ వాలంటీర్లు కోవిడ్ సేవల్లో నిమగ్నమయ్యారు. కోవిడ్ రెండవ దశ ప్రజల జీవితంపై తన పంజా విసురుతున్నప్పటికి వాలంటీర్లు మాత్రం కోవిడ్ కు భయపడకుండా వారి సేవలను ముమ్మరం చేసారు.గుమ్మలక్ష్మీపురం పంచాయతీ లోని పలువీధుల్లో కోవిడ్ బారిన పడిన బాధితులకు మేమున్నమే భరోసా కల్పిస్తూ ఆ బాధితుల నుండి వైరస్ వ్యాప్తి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు పాటిస్తు పారిశుద్యం పై దృష్టి సారిస్తున్నారు. కోవిడ్ బాధితుల పరిసర ప్రాంతాల్లో హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేయడంతో పాటు డిస్ ఇన్ఫెక్షన్ పౌడర్లను జల్లుతున్నారు. గుమ్మలక్ష్మీపురం సచివాలయంలో  గ్రామ వాలంటీర్లు 25మంది తో పాటుగా 10మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ 35మందిలో 19మంది మహిళలు 16మంది పురుషులు కోవిడ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఈ పంచాయతీలోని మగవారితో సమానంగా మహిళ వాలంటీర్లు,ఉద్యోగులు కోవిడ్ సేవల్లో ఎండనక వాననక ముందంజలో ఉంటూ గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు.గ్రామంలో ఎక్కడ పాజిటివ్ కేసులు నమోదైన తక్షణమే అక్కడకు చేరుకుని పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతూ హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలను చేపడుతున్నారు.గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాలయంలో వాలంటీర్లతో పాటుగా సచివాలయ సిబ్బంది కూడా వారి విధులను ముగించుకుని వాలంటీర్లతో పాటుగా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొవడంతో గ్రామ ప్రజలు వారి యొక్క విధినిర్వహనలను కొనియాడుతున్నారు.గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ. గౌరీశంకర్ సూచనల మేరకు మేమందరం మా విధులను నిర్వహించడానికి  సిద్ధంగా ఉన్నామని కరోనా కష్టకాలంలో మేము ఎంత సేవచేయడానికైన వెనుకాడమని కానీ గ్రామంలో ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు.

సర్పంచులు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

 సర్పంచులు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

మెంటాడ, పెన్ పవర్,

 మెంటాడ మండలం లోని మీసాల పేట, కుంతిని వలస గ్రామంలో సర్పంచులు మహంతి రామునాయుడు, పెద్ది రెడ్ల రమేష్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారము పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సీసీ కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి గ్రామాలను శుభ్రం చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా రెండవ దశలో ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతము చిన్న చిన్న వర్షాలు కురవడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి మనపై దాడి చేస్తుందని తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...