Followers

సర్పంచ్ ఆహ్వానించకుండా నే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ కిషన్ రా

సర్పంచ్ ఆహ్వానించకుండానే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ కిషన్ రావు

బెల్లంపల్లి, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లింగాల గ్రామపంచాయతీ లో ఈరోజు వడ్ల కొనుగోలు  కేంద్రంను చైర్మన్ కిషన్ రావు మాజీ సర్పంచ్ సత్తయ్య సీ.ఈ.వో మధుకర్ సెంటర్ ఇన్ ఛార్జ్ ఓడల హనుమంతు కలసి గ్రామ అ శివార్లలో అనగా రైతులకు అనుకూలంగా కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో  వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు మంగళవారం రోజున సిపల్లి లక్ష్మి పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా లింగాల గ్రామ సర్పంచ్ మాట్లాడుతు నన్ను పిలువకుండా ప్రోటోకాల్ పాటించ కుండా నే వడ్ల కొనుగోలు కేంద్రమును  ప్రారంభించారు లింగాల సర్పంచ్ దళిత మహిళా కావడంతో నే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించలేదని . ఈ పరిణామం మనోభావనీ కించపరిచే చేశారని వాపోయారు ఈ కార్యక్రమం దళితుల ను  కించపరిచే విధంగా ఉందని వారి మనోభావాలు దెబ్బతినేలా నడుచుకునేల  ఉన్నాయని వారు వాపోయారు. వారిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు .అలాగే వారిపై ఎస్సీ. ఎస్టీ. అట్రాసిటీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని. రేపు అధికారుల కు కు వినతి పత్రం అందజేస్తారని ని అధికారులకు కలెక్టర్ కి ఎమ్మార్వో కు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని . ఫిర్యాదు చేస్తానని.లింగాల సర్పంచ్ లక్ష్మి కోరారు.

మాస్క్ ధరించని వారిపై కొరడా

 మాస్క్ ధరించని వారిపై కొరడా

చట్ట ప్రకారం 46 కేసులు నమోదు

పెన్ పవర్, మల్కాజిగిరి

నేరేడ్మట్ పోలీస్ స్టేషన్ సిఐ నర్సింహ్మ స్వామి ఆద్వర్యంలో రచకొండ సిపి మహేష్ భగవత్ ఆదేశల మేరకు మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా రోడ్డు పై తిరుగుతున్న వారిపై కేసు నమోదు చేసి రూ1000 జరిమానా విధించారు. నేరేడ్మట్, వినాయక్ నగర్ ప్రాంతల్లో 46 కేసులు నమోదు చేశామని సిఐ తెలిపారు. ఈ సందర్బంగా సిఐ నర్సింహ్మ స్వామి మాట్లాడుతూ కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ, మాస్కులు, బౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని నేరెడ్ మెట్ సిఐ నరసింహ స్వామి అన్నారు. కరోనా నిబంధనలు నిర్లక్ష్యం వ్యహిస్తే వారిపై నేరేడ్మెట్ పోలీసులు కొరడా చూపిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశల మేరకు ప్రతిరోజు ప్రధాన చౌరస్తాలో, వినాయక్ నగర్ లో మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వ్యహిస్తు నిబంధనలను పాటించని వారికి అవగాహన కల్పిస్తూ పెట్టి కేసు నమోదు చేస్తున్నామని సిఐ నరసింహ స్వామి తెలిపారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న 46 కేసులు నమోదు చేశామని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కోవిడ్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మానవత్వం చాటుకున్న తొర్రూరు పోలీసులు

 మానవత్వం చాటుకున్న తొర్రూరు పోలీసులు.

తొర్రూరు, పెన్ పవర్

తేదీ 21.04.2021న మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని శ్రీకృష్ణ హాస్పిటల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన గుర్తుతెలియని వృద్ధురాలు చికిత్స పొందుతూ... మంగళవారం మృతి చెందింది.గుర్తుతెలియని వృద్ధురాలికి చెందిన వారు ఎవరూ రాకపోవడంతో మానవతా దృక్పథంతో  తొర్రూరు పోలీసులు,మున్సిపల్ సిబ్బంది సహాయ సహకారాలతో అనాధ వృద్ధురాలికి అంత్య క్రియలు నిర్వహించినట్లు తొర్రూరు ఎస్ఐ సిహెచ్ నగేష్ తెలిపారు. ఎవరూ లేని అనాధ వృద్ధురాలికి రెండవ ఎస్ఐ మునిరుల్లా, కానిస్టేబుల్ సర్వార్ పాషా, హోంగార్డ్ రఫీయా లతో కలిసి పూలమాలవేసి, అంత్యక్రియలు నిర్వహించారు.

తెలంగాణ ద్రోహి కేసిఆర్

 తెలంగాణ ద్రోహి కేసిఆర్

 పీసీసీ సభ్యులు దసురు నాయక్

కేసముద్రం, పెన్ పవర్ 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసి అనేక విధాలుగా నష్ట పోయిన వారికి ద్రోహం చేస్తూవారిని పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులైన సమైక్యవాదులను తన చుట్టూ పెట్టుకొని బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయుటకు ప్రయత్నం చేస్తున్నాడు అని టిపిసిసి సభ్యులు దసురునాయక్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ ను భూకబ్జా పేరుతో మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేశాడని కావాలనే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిని ఒక తెలంగాణ ఉద్యమ కారుడిని ఇలా చేయడం చాలా బాధాకరమని మాట్లాడారు. కానీ అవినీతి భూ కబ్జాలు చేసిన వారిపై చర్యలలో భాగంగా ఈటెల పై చర్యలు తీసుకున్నారనుకుంటే  మరి సీఎం కేసీఆర్ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది భూకబ్జాలు అవినీతి చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరివారి మీద ఎందుకు తీసుకోవడం లేదు అంతేగాక ఇలాంటి ఆరోపణలు తన కొడుకు కేటీఆర్ పై కూడా ఉన్నవి కెసిఆర్  కి నీతి నిజాయితీ పై నమ్మకం ఉంటే వారు అందరిపై కూడా ఉన్నత అధికారులతో కమిటీలు వేసి వెంటనే మంత్రి పదవి నుండి తొలగించి విచారణ చేయించినట్లయితే పారదర్శకతను పాటించినట్లు అవుతుంది. లేనిచో  కేవలం 24 గంటలలోపే విచారణ పూర్తి కావాలని ప్రభుత్వం కుట్రపూరితంగా నే ఈటెల పై కెసిఆర్ దాడి చేసినట్లే అవుతుంది అని అన్నారు. అంతేగాని ఈటల రాజేందర్ పైనే కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.

బెల్లంపల్లి స్వచ్ఛంద లాక్ డౌన్ ప్రారంభం

 బెల్లంపల్లి స్వచ్ఛంద లాక్ డౌన్ ప్రారంభం

బెల్లంపల్లి, పెన్ పవర్

బెల్లంపల్లి లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో  బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు చైర్పర్సన్ శ్రీత. శ్రీధర్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ కరోనా కట్టడి కోసం వ్యాపార యజమానులతో మాట్లాడి అన్ని రకాల వ్యాపార సంస్థలు  స్వచ్ఛందం గా  లాక్ డౌన్ లో పాల్గొనాలని అన్నారు ఇందులో భాగంగా మంగళవారం 3. గంటల నుంచి  మొదటిరోజు బజార్ ఏరియా లోని దుకాణ యజమానులు తమ దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు ...

పండుగలు పెళ్ళిళ్ళు వాయిదా వేయాల్సిందే

 పండుగలు పెళ్ళిళ్ళు వాయిదా వేయాల్సిందే…

 నిబంధనలు ఉల్లంఘిస్తే కోవిడ్ చట్ట ప్రకారం చర్యలు.

నెల్లికుదురు తహసిల్దార్. అనంతుల రమేష్ కుమార్

నెల్లికుదురు,పెన్ పవర్

 కరోణ సెకండ్  వేవ్ వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా మండలంలోని ప్రజలు ఎవరు కూడా  మాస్కులు లేకుండా బయట సంచరించ కూడదని,  ఒకవేళ అత్యవసర పని ఉన్నట్లయితే మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ బయటకి రావాలని మహబూబాద్ జిల్లా నెల్లి కుదురు మండలం తాసిల్దార్ అనంతుల రమేష్ కుమార్ ప్రజలను హెచ్చరించారు మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ గ్రామాలలో ఫంక్షన్లు,  పెళ్లిళ్లు,  ఎలాంటి పండుగలైన జరుపుకునేవారు వాయిదా వేసుకోవాలని,  పెళ్లిళ్లు తప్పనిసరి చేయాలి అనుకునేవారు అధికారుల అనుమతి పొంది కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహించు కోవాలని లేనిపక్షంలో కోవిడ్ చట్ట ప్రకారము ఎంతటివారి పైన గాని చర్యలు  తీసుకోబడుతుంది అని తెలియజేశారు.

ఆందోళన వద్దు

 ఆందోళన వద్దు...

సెంటర్ల సంఖ్య పెంచుతాం - ఎమ్మెల్యే మైనంపల్లి

పెన్ పవర్, మల్కాజిగిరి

వ్యాక్సినేషన్, కరోనా టెస్ట్ ల గురించి నగర ప్రజలు ఆందోళన చెందవద్దు, ఇప్పటికే ఉన్న సెంటర్లకు అదనంగా నేరేడ్మట్ డివిజన్ లో రెండు, ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ లో రెండు, గౌతం నగర్ డివిజన్లో మూడు, మల్కాజిగిరి డివిజన్ లో మూడు, వినాయక్ నగర్ డివిజన్ లో ఒకటి వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించాం. వ్యాక్సినేషన్ సెంటర్లే కాకుండా టెస్టింగ్ సెంటర్ల సంఖ్యను పెంచుతాం అన్ని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...