మాస్క్ ధరించకుంటే జరిమానా, లేదంటే జైలుకే
పెద్దగూడూరు, పెన్ పవర్కొత్తగూడ ఎస్సై సురేష్ కొవిడ్ పాజిటివ్ కేసులు పెరగడంతో రెండు రోజులుగా మహబూబబాద్ జిల్లా కొత్తగూడ లో మాస్కులు ధరించకుండా కరోనా నిబంధనలు అతిక్రమించిన వారికి ఫైన్ లు పోలీసులు వసూలు చేస్తున్నారు. మాస్కులు ధరించని వాహనదారుపైన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒక్కొక్కరికి 1000/- జరిమానాను కొత్తగూడ ఎస్సై సురేష్ విధిస్తున్నారు. ఇప్పటికే పదూల సంఖ్యలో ఈ చలాన్ల రూపంలో జరిమానాలను పంపించారు. ఇక పై బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా కనబడినట్లయితే వారి పై కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. వ్యాపారస్తులు కూడా మాస్క్ ఉంటేనే కస్టమర్లను షాపుల్లోకి అనుమతించాలని, దీన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. కోవిడ్ ని అరికట్టడంలో ప్రజలందరూ సహకరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించని వారిపైన క్రిమినల్ కేసులు కూడా తప్పవని ఆయన హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కోర్టులో హాజరుపరుచుతామని తెలిపారు. పదుల సంఖ్యలో ఈ-చలానాలు పంపామన్నారు. ఇక జరిమానా సొమ్ము చెల్లించని వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతామంటున్నారు పోలీసులు. మాస్క్ అనేది మీ రక్షణ కోసమేనని ధరించాలనీ, దయచేసి పోలీసులు ఫెనాల్టీ లు విధిస్తారని మాత్రం ధరాంచకండి అని ఎస్సై సురేష్ విజ్ఞప్తి చేశాడు.