వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనాను తరిమికొట్టాలి...
డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్
బేల, పెన్ పవర్ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు.బేలా మండలం లోని మాంగ్రూడ్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరన్ని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ పరిశీలించారు. గ్రామంలోని 73 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య శాఖ అధికారి క్రాంతికుమార్, ఎంపీడీవో రవీందర్ భగత్, ఎస్ఐ సాయన్న, ఎంపీటీసీ ఠాక్రె మంగేష్, కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.