Followers

అను అక్షయ కార్యక్రమాన్ని స్థాపించి నేటి రెండు సంవత్సరాలు

 అను అక్షయ కార్యక్రమాన్ని స్థాపించి నేటి రెండు సంవత్సరాలు

పెన్ పవర్, ఆత్రేయపురం 

 ర్యాలీ  గ్రామంలో  అనుష్  స్వచ్ఛంద  సంస్థ ఆధ్వర్యంలో పేదవారి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో       అను అక్షయ కార్యక్రమాన్ని  ప్రారంభించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు మోహిత్ మాట్లాడుతూ  కరోనా అరికట్టాలంటే అందరూ దూరం పాటించాలని ఇది సులువుగా పాటించాలంటే గొడుగులు ఉపయోగించడం ద్వారా  సాధ్యమవుతుందని కాబట్టి హరీష్ జీవన్ లక్ష్మి ల  సమకూర్చిన గొడుగులు చాపలు పేదలకు పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశామని అలాగే అరుణ్ కుమార్ సమకూర్చిన భోజనం పొట్లాలు ఎనర్జీ డ్రింకులను కరోనా ప్రజలకు సోకాకుండా నిత్యం పోరాడుతున్న ర్యాలీ  16 మంది పారిశుద్ధ్య కార్మికులకు 30మంది పేద ప్రజలకు ప్రభుత్వ ఆదేశాలను కరోనా  నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేశారు.

సెక్రెటరీ రఫీ ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం

 సెక్రెటరీ రఫీ ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం పోచవరం పంచాయతీ పరిధిలో జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల సన్నాహక కార్యక్రమాలలో భాగంగా సచివాలయ కార్యదర్శి ఎస్. ఎం.రఫీ వూల్లా ఆధ్వర్యంలో మే 1 నుండి 14 వరకు గ్రామంలో పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. దానితోపాటు కోవిడ్ 19 భద్రత, నివారణ అవగాహనా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోచవరం పంచాయతీ కార్యదర్శి రఫీ కోవిడ్ నియంత్రణ నిబంధనలు అన్ని విధాలుగా అమలు చేయడం జరుగుతుంది.

తాడిపూడిలో కోవిడ్ దృష్ట్యా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం

 తాడిపూడిలో కోవిడ్ దృష్ట్యా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో సర్పంచ్ నామా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోవిడ్  దృష్ట్యా గత నెల రోజుల నుండి గ్రామంలో అనేక పనులు చేపట్టారు. గ్రామములో బ్లీచింగ్ చల్లించడం, ఇంటింటికి హైపో క్లోరైడ్ స్ప్రే చేయించడం జరిగింది. మంగళవారం నాడు గ్రామమంతా మరోసారి హైపో క్లోరైడ్ స్ప్రే చేయించారు. మరియు మంచినీటి ట్యాoకులను శుభ్రం చేయించడం, డ్రైనేజీల్లో పూడికతీత  వంటి పనులు ముమ్మరం చేశారు. ఎప్పటికప్పుడు కోవిడ్ పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  పంచాయతీ సెక్రెటరీలు దగ్గు చంద్రశేఖర్, బదిరెడ్డి భీమేశ్వరరావు, విఆర్వో ఎం.ప్రకాష్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

సర్పంచ్ గారికి గ్రామ ప్రజల మనవి..

 సర్పంచ్ గారికి గ్రామ ప్రజల మనవి..

గతం లో మాజీ సర్పంచ్ లు చేసిన పొరపాట్లు మీరు చెయ్యద్దు
మీ పై పెట్టుకున్న ఆశలు నిజం చేయండి,
పంచాయితి ని అబివృద్ది పదం లో నడిపించండి
కురుపాం,  పెన్ పవర్ 

మండలం లోని అన్ని పంచాయితి లలో పెద్ద పంచాయితి కురుపాం పేరుకే మేజర్ పంచాయితి అబివృద్ది లో మాత్రం చిన్న పంచాయితి,అయితే  జరిగిన పంచాయితి ఎన్నికల్లో సర్పంచ్ గా డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి బలపరిచిన అబ్యర్ది గార్ల సుజాత గెలుపొందారు, ఆమె చదువుకున్న వ్యక్తి యువ వయస్సు కలవారు కావడం తో పంచాయితి ప్రజలు ఆమె పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు, కాగా గతం లో కురుపాం మేజర్ పంచాయితి మాజీ సర్పంచ్ లు తీవ్ర నిరాశ కు గురిచేశారు,దీనితో అభిమానులు కార్యకర్తలు ఇమే పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు,గెలిచిన తరవాత ఇమే ఇంత వరుకు ప్రజల్లోకి కానీ కోవిడ్ కష్టకాలం లో పంచాయితి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షన గాని , లాక్ డౌన్ లాంటి నిర్ణయాల్లో భాగస్వామ్యం కానీ లేదు,ఎలాంటి కారణాలతో ఆమె చురుగ్గా లేరో తెలియదు కాని ఇక ముందు చురుగ్గా ఉండాలని ఆమె పంచాయితి కి ఫలానా సమస్య లేదా ఫలానా నిధులు కావాలి అంటే క్షణాల్లో తగిన చర్యలు తీసుకునే డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఉన్నారు కావున, వినియోగించుకోవాలని పంచాయితి అబివృద్ది తమతోనే సాధ్యం అయ్యేలా చూడాలని పంచాయితి ప్రజలు కోరుతున్నారు,గ్రామానికి ప్రధమ  పౌరరాలు కావున కోవిడ్ కష్ట కాలం లో పక్కా ప్రణాళిక ఏర్పరచుకొని అధికారులు తో కలిసి చురుగ్గా పంచాయితి లో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు ప్రారంభించాలని ,హైపోక్లోరైట్  లాంటివి గ్రామంలో పిచికారీ చేయించి పారాశుద్య పనులు చురుగ్గా సాగెలా ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.

డుంబ్రిగుడ మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఆకస్మిక మృతి

 డుంబ్రిగుడ మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఆకస్మిక మృతి 

అరకు, పెన్ పవర్

అరకు వేలి నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్.పి.టి.సి,అభ్యర్థి కొర్ర రుక్మిణి గుండెపోటు తో మంగళవారం అకస్మాత్తుగ మృతి చెందారు ఆమె భౌతిక కాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పాచిపెంట శాంతకుమారి సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పార్టీ నుండి వారికి ఎటువంటి సాయం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని తెలియజేశారు.అరకు వేలి మండలం ప్రెసిడెంట్ సోమెలి సన్యాసిరావు మండల నాయకుడు పాచిపెంట చిన్నస్వామి హుకుంపేట జెడ్పిటిసి అభ్యర్థి,గలుగు బోయిన కోటేశ్వరరావు, డుంబ్రిగుడ మండల కార్యదర్శి బిమరావు,కె హరిష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఆమెతో ఉన్నారు.

మంత్రి వనిత కు కృతజ్ఞతలు తెలిపిన వైసిపి పెద్దేవం

 మంత్రి వనిత కు కృతజ్ఞతలు తెలిపిన వైసిపి పెద్దేవం 

తాళ్లపూడి, పెన్ పవర్

వైయస్సార్సీపీ పెద్దేవం బూత్ కన్వీనర్ వేము రామారావు కరోనా తో బాధపడుతున్నప్పుడు విషయం తెలుసుకున్న  వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ   రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కు ఈ విషయం తెలియజేశారు. వెంటనే మంత్రి వనిత  స్పందించి రాజమండ్రి గవర్నమెంట్  హాస్పిటల్ లో బెడ్ ఇప్పించి సకాలంలో వైద్యం అందేలా  చూసారు. వేము రామారావు మాట్లాడుతూ మంత్రి వనిత ఆదేశాలమేరకు హాస్పిటల్ సూపరింటెండెంట్ తో అనుక్షణం ఫోన్ మాట్లాడుతూ, నాకు ఇంజెక్షన్లు కోర్స్ పూర్తి అయ్యేలాగా డాక్టర్ల తో మంత్రి వారి అడిషనల్ పియస్ మహాలక్ష్మి కుమార్   మాట్లాడారు. అలాగే మన ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోన పట్ల చేస్తున్న కృషి గవర్నమెంట్ హాస్పిటల్ లో చాలా బాగుంది అని అన్నారు. ఎవరు అపోహలు నమ్మవద్దు అని,హాస్పిటల్ లో ఇంజక్షన్ ల కొరత లేదు అని, అన్ని సదుపాయాలు చాలా బాగున్నాయి అని, అందుకు గాను నేను  సోమవారం నాడు కరోనా నుంచి కోలుకుని  ఇంటికి చేరుకున్నాను అని అన్నారు. నా వైద్యానికి సహాయం అందించిన  మంత్రి తానేటి వనిత కి, మంత్రి వారి అడిషనల్ పియస్ మహాలక్ష్మి కుమార్ కి,  వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి  తోట రామకృష్ణ కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని తెలియజేశారు. అలాగే గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,14 రోజులు నా దగ్గర కి రావద్దు అని, నా  ఆరోగ్యం బాగుంది అని తెలియచేశారు.

కరోనా రోగుల పట్ల అమానుషం

 కరోనా రోగుల పట్ల అమానుషం

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో, ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా మృతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న వారిపై తక్షణం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటనలో కరోనా రోగుల పట్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని,కనీసం ప్రజలకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేయించ లేకపోవడం విచారకరమని, కరోనా రెండవ దశలో కరోనా సోకిన వారికి సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని, కరోనా మెడిసిన్ కిట్లు కూడా ఎక్కడా ఎవరికీ ఇవ్వడం లేదన్నారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థల ఉనికి కూడా ప్రస్తుతం కనబడటం లేదన్నారు.ఆశా వర్కర్లు, ప్రభుత్వ వ్యవస్థను, యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించి ప్రజలకు సేవలు సకాలంలో అందేలా చూడాలని, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదని, అందుకే రోగులను అరబయటే వదిలేస్తున్నారని, అదేవిధంగా మృత దేహాలను సైతం ఎటువంటి ప్రోటోకాల్ అనుసరించకూడా ఎక్కడ పడితే అక్కడ ఉంచేయడం సమంజసం కాదన్నారు. డాక్టర్లు కొరత ఉన్నందున తక్షణం యుద్ధ ప్రాతిపదికన డాక్టర్లను, సిబ్బందిని నియమించాలని, అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా వైద్యానికి చార్జీలను నిర్ణయించి వాటిని అమలయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...