Followers

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించాలి

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించాలి 

శ్రీకాకుళం, పెన్ పవర్

 కరోనా సెకండ్ వేవ్ కు జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారని ఐజేయూ జాతీయ కార్యవర్గం ప్రత్యేక ఆహ్వానితులు నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు.మంగళ వారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో,ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ ,పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు తాజాగా ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేశారు.ఒడిశా ప్రభుత్వం తొలి వేవ్ లోనే మరణించిన జర్నలిస్టు కుటుంబానికి 2.50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిందని,రెండో వేవ్ మృతులకు రూ.10 లక్షలు ప్రకటించిందని తెలిపారు.తొలి వేవ్ లోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ఉప ముఖ్య మంత్రులకు ,మంత్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడం విచారకరమన్నారు.తమ జాతీయ నాయకులు శ్రీనివాసరెడ్డి,దేవులపల్లి అమర్ స్వయంగా ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డితో మాటాడిన తరువాత ,చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చినా,అది ఇంతవరకు అమలు కాలేదని ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు.హెల్తు కార్డులు కూడా ,నూతన ప్రభుత్వం ఇంతవరకు మంజూరు చేయలేదన్నారు.రెండో వేవ్ లో జర్నలిస్టుల మరణాల సంఖ్య ఎక్కువగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకూ ఆరుగురు  రెండో వేవ్ కు బలయినట్టు ధర్మారావు తెలిపారు.సోమవారం జరిగిన ,రాష్ట్ర యూనియన్ కార్యవర్గ సమావేశం ( జూమ్ ) ఇంతవరకూ చనిపోయిన వారి వివరాలతో ,రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇటీవల ఒకే రోజు ,ఇద్దరు ' సాక్షి ' కరోనాకు బలైన తరువాత ,రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులకు ప్రత్యేక బెడ్లను కేటాయిస్తూ,జిల్లాలకు సమాచార శాఖ అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్టు తెలిపారు.

శ్రీకాకుళం ' జెమ్స్ ' లో 15 బెడ్స్ 

శ్రీకాకుళం జిల్లా జర్నలిస్టుల కోసం జెమ్స్ లో 15 బెడ్స్ ను కేటాయిస్తూ కలెక్టరు నివాస్ ఆదేశాలు జారీ చేశారని ధర్మారావు వెల్లడించారు.కరోనా బాధితులైన జర్నలిస్టులు డీపీఆర్వో రమేష్ ను సంప్రదించాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టరు నివాస్ కు ధర్మారావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ ను కోవిడ్ సెంటర్ గా వినియోగించండి. గత మూడేళ్ల నుంచి మూతపడిన గరిమెళ్ల ప్రెస్ క్లబ్ ను కోవిడ్ సెంటర్ గా వినియోగించుకునే విషయం ,కలెక్టరు పరిశీలించాలని ధర్మారావు కోరారు.విలువైన భవనాన్ని మూసేసి,టిడిపి ప్రభుత్వం అన్యాయం చేసిందని,కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించడం మరింత అన్యామన్నారు.కరోనా బారినపడిన జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ను కోవిడ్ కేంద్రంగా మార్చాలని కోరారు.ఈ ప్రతిపాదన శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావుకు కూడా తెలిపామన్నారు.

ప్రజలంతా సిరక్షితంగా ఉండండి...

ప్రజలంతా సిరక్షితంగా ఉండండి...

 

అనకాపల్లి, పెన్ పవర్

కరోనా  రెండవ దశ ప్రభావం ప్రమాదకరంగా ఉన్నందున ప్రజలంతా భయపడకుండా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు సురక్షితంగా ఉండాలి అని  విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర పిలుపునిచ్చారు.ఉదయం లేస్తే ఏం వినాల్సి వస్తుందో ఏ ఆత్మీయుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుందో అనే బాధ,ఆవేదనలతో ప్రజలు,నాయకులు,ప్రతి వక్కరు ఆందోళన చెందున్నారు అని ఆయన అన్నారు.కరోనా ముందు డబ్బు ,పలుకుబడి ఏవి కూడా పని చేసే పరిస్థితి లేదు అని కోవిడ్ బారినపడి ఎవరిని కోల్పోవాల్సి వస్తుందోనని మనసు కలిచివేస్తోంది అని ఆవేదనతో ఆయన అన్నారు.దయచేసి ప్రతి వక్కరు స్వచ్ఛందంగా స్వీయ లాక్ డవున్ విధించుకొని మీ ఇళ్లల్లో కొంతకాలం వుండక పోతే ఈ కరోనా ప్రభలడాన్ని అరికట్టలేము అని ప్రజలను కోరారు.అత్యవసరం వస్తేనే రోడ్డు మీదకు రావాలి అని అదికూడా కరోనా నుండి రక్షణ కొరకు మీకు మీరుగా భౌతిక దూరం పాటిస్తూ,ప్రత్యేక రక్షణ కొరకు రెండు మాస్కు లు ధరించి,ఎక్కువగా  శానిటేషన్ చేసుకోనుచు పని చూసుకొని ఇంటికి త్వరగా సురక్షితంగా చేరుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని సురేంద్ర తెలియజేసారు. దయచేసి మీకు  మీరు  గా ఇంటిలో ఉండండి మీ ప్రాణాలే కాకుండా ఇంటిలో వారిని మీ ఇంటి చుట్టు ప్రక్కల వారిని కూడా రక్షించండి అని ఆయన కోరారు.ప్రతి వక్కరు గుర్తువుంచుకోవల్సిన  విషం ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు ఈ ప్రపంచంలో మీ అందరిని చేతులెత్తి ప్రార్ధిస్తున్న ఇంటిలో ఉండండి సురక్షితంగా ఉండండి అని చేతులు జోడించి అందరిని ప్రార్ధించారు.

కోవిడ్ కష్ట కాలలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్నాం

 కోవిడ్ కష్ట కాలలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్నాం

మెంటాడ, పెన్ పవర్ 

ప్రాణాలకు తెగించి రేయింబవళ్ళు వైద్య సేవలు అందిస్తున్నామని, మాపై లేనిపోని ఆరోపణలు చేయడం విశాఖ ఎక్స్ప్రెస్ పత్రికల్లో డబ్బులు తీసుకున్నట్లు, కోవిడ్ టీకా డోసు తక్కువ చేసి ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు వచ్చిన అవాస్త వార్తకు ఆమె స్పందించారు.   స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర లో కరోనా కష్ట కాలం లో అనేక సేవలు తనతో పాటు సిబ్బంది ఒకవైపు కోవిడ్ పరీక్షలు వాటి ఫలితాలు అందించడం,మరో వైపు వ్యాక్సినేషన్ చేయడం, అంతే కాకుండా ముఖ్యంగా అనేక సమస్యలు తో వచ్చే రోగులకు సేవలు అందించడం ,గర్భిణీ స్త్రీలు కు ప్రసవాలు జరపడం,కోవిడ్ లక్షణాలు ల తో టెస్ట్ లు చేసుకోకుండా వచ్చిన వారికి కూడా ప్రధమ చికిత్స అందించడం అనంతరం టెస్ట్ లు జరిపి పాజిటివ్  వస్తే రిఫర్ చేయడం లాంటి సేవలు అందిస్తున్నామని మాపై లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెడ్డ పేరు రావడంతో పాటు రోగులకు నమ్మకం పోతుందని ఆమె పేర్కొన్నారు. మాకు కుటుంబాలు ఉన్నాయి వారిని పక్కనబెట్టి ప్రజలకు సేవ చేయడానికి వైద్య వృత్తిని చేపట్టామని తెలిపారు. మీరు సహకరించక పోయినా పర్వాలేదు కానీ ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తుందని ఆమె విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు గుర్తించి జిల్లా కలెక్టర్ చేతుల మీదగా ప్రశంస పత్రాలు, అవార్డులను అందుకున్న ఘనత మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉందని ఆమె పేర్కొన్నారు.  తప్పు చేస్తే నిలదీయండి, అలాగే మేము తప్పు చేసినట్లు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో చూపించాలని ఆమె పేర్కొన్నారు. విశాఖ ఎక్స్ప్రెస్ పత్రిక రిపోర్టర్ ఎవరో కూడా నాకు గాని, మా సిబ్బందికి గాని తెలియదని అటువంటి వ్యక్తి ఏ ఆధారాలతో వార్త రాశారు అని ఆమె ప్రశ్నించారు.

నిజంగా తప్పు చేస్తే ఎవరైనా వార్త రాయవచ్చని ఆమె పేర్కొన్నారు. మాతోపాటు మీడియా మిత్రులు సహాయం కూడా అవసరం ఎంతో ఉందని వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తే కరోనా ను విజయవంతం ఎదుర్కోగల మని ఆమె పేర్కొన్నారు. అనుమానితులు, పాజిటివ్ కేసులు మధ్య లో ఉండి సేవలు అందిస్తున్న సిబ్బంది సేవలు మరిచిపోలేం అని గ్రామస్తులు, పలువురు రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకారం అందిస్తే ఇంకా ఉత్తమ సేవలు అందిస్తాం అని తెలియచేశారు.  ఎవరికి వారే స్వచ్చంద లాక్ డౌన్ ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రజలు తీసుకున్న జాగ్రత్త లే వారి  కుటుంబాలకు శ్రీ రామ రక్ష అని అన్నారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎక్కువ శాతం బయటకు రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి అన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది, గ్రామ ,మండల , జిల్లా అధికారులు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లి కుటుంబాలు తో ఆనందంగా గడుపుతున్నారని అనుకుంటున్నా రేమో కానే కాదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరు తమ ఇంటికి చేరి వేరేగానే ఉంటారు ఎందుకు అంటే తమకు కోవిడ్ సోకె ప్రమాదం ఎక్కువ కావున ఇంటికి వెళ్లి తమ బిడ్డలను కూడా ఎత్తుకునే పరిస్థితి లేదు అని ఆమె పేర్కొన్నారు. పక్క ఇంటిలో కోవిడ్ పేషంట్ ఉంటేనే మనం తట్టుకోలేని పరిస్థితి లో ఉన్నాం అని అన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న మా మీద లేనిపోని ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. కరోనా రెండో దశలో ఉన్నందున ప్రజలు అందరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకారం అందిస్తారని ఆమె విజ్ఞప్తి చేశారు.

అనాధల పాలిట ఆత్మీయుడు....

అనాధల పాలిట ఆత్మీయుడు...

మహారాణి పేట, పెన్ పవర్

అనాధ వృద్ధులు కరోనా బారిన  పడకుండా ఉండేందుకు మాస్కులు, పండ్లు పంపిణీ మధ్యాహ్నం అన్నదానం ఏసీబీ డీఎస్పీ రంగరాజు అనాధల పాలిట ఆత్మీయుడిగా నిలిచారు. అనాధల కోసం తరచూ అన్నదానం, వస్త్ర దానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.విశాఖ వన్టౌన్లో ఉన్న వివేకానంద అనాధ ఆశ్రమంలో ప్రముఖ సంఘ సేవకులు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రంగరాజు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు కరోనా బారిన పడకుండా  ఉండేందుకు పండ్లు,మాస్కులు అందజేశారు..మధ్యాహ్నం అన్నదానం చేశారు.అనాధ ఆశ్రయంలో ఆశ్రయం పొందుతున్న అనాధల కోసం ఆయన తరచూ ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.అనాధలను తన కుటుంబ సభ్యులుగానే భావిస్తూ కాసేపు వారితో సంతోషంగా గడుపుతారు అనాధలంతా ఆయనను  ఆత్మీయుడుగా భావిస్తూ ఆయన రాకకోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని,భౌతిక దూరం పాటించాలని పలు సూచనలు తెలిపారు.

నూతన రామాలయం లో విగ్రహ పునఃప్రతిష్ట చేసిన బీజేపి నేత కరణంరెడ్డి దంపతులు

 నూతన రామాలయం లో  విగ్రహ పునఃప్రతిష్ట చేసిన బీజేపి నేత కరణంరెడ్డి దంపతులు 

గాజువాక, పెన్ పవర్

గాజువాక పాత కర్నవానిపాలెం లో శ్రీ సీతారామాలయ సమేత శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కళ్యాణ సుబ్రమణ్యేశ్వర దేవాలయం విగ్రహ పుణః ప్రతిష్ట చివరి రోజు పూజలో బీజేపి గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి. నరసింగరావు జ్యోతి దంపతులు పాల్గొని పూర్ణాహుతి హోమం మరియు నూతన యంత్ర చక్రం పూజలు అనంతరం వేదపండితులు ఉదయ బాస్కర్ శర్మ,రవిరుమార్ శర్మ ఆద్వర్యంలో యంత్ర మూర్తి శిఖర నాగబంధ ధ్వజ స్థంబ నూతన విగ్రహ పునఃప్రతిష్ట నిరాడంబరముగా జరుగాయని తొలి పూజలో కే.ఎన్.ఆర్  జ్యోతి దంపతులు పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు గొంతిన.దేముడు, కార్యదర్శి మడగల.కన్నయ్య,సంయుక్త కార్యదర్శి జనపరెడ్డి .మణి,దుర్గానగర్ శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల.అప్పలసూరి ,జనపరెడ్డి. సురేష్,సాలాపు.నూకరాజు,సాలాపు.గోవింద, కోశాదికారి కరణం.రామకృష్ణ,సిరసపల్లి ఈశ్వరరావు, గంతకోరు.నారాయణ, ఇందల.వెంకటేష్ , సుదమల్ల. కిరణ్,కరణం.ప్రసాద్,జనపరెడ్డి రామకృష్ణ , వరహాలరావు, గొంతిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కరోనా రోగులకు నాణ్యమైన వైద్యం అందించుటలో విఫలమైన అధికార యంత్రాంగం

 కరోనా రోగులకు నాణ్యమైన వైద్యం అందించుటలో విఫలమైన అధికార యంత్రాంగం

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖలో క్షణక్షణానికి పెరుగుతున్న కరోనా రోగులకు కనీసము ఆక్సిజన్ కూడా అందించలేని దురదృష్టకర పరిస్థితుల్లో ప్రభుత్వ ,కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి.ఆక్సిజన్ అందక పిట్టలు లాగా రాలిపోతున్న  ప్రజలు.పారిశుధ్యం లోపించి దుర్గంధ భరితమైన ఐ.సి.యు, మరియు వార్డులు.చనిపోయిన రోగి దగ్గర మాయమవుతున్న విలువైన బంగారు ఆభరణాలు సెల్ ఫోన్లు,పార్ధివ దేహం అప్పగింత ఆలస్యం అవుతుందని అంటున్నబాధిత బంధువులు మూగబోయిన 104 మరియు నోడల్ అధికారుల సెల్ ఫోనులు,వార్డులలో లోపించిన వైద్యుల ఉన్నతఅధికారుల,పర్యవేక్షణ, అంకిత భావము లేని యంత్రాంగం.జిల్లా కలెక్టర్ కు సహకరించని సహూద్యోగులు.ప్రభుత్వాలు ప్రజా ఆకర్షణ పథకాలకు ఖర్చుపెడుతున్న డబ్బుతో 18 సంవత్సరాల పైబడిన వారికి  వ్యాక్సిన్ వేయించాలి. కేంద్ర ప్రభుత్వము ఎనిమిది వేల కోట్లకు పైగా నిధులు వ్యాక్సిన్ కోసం అందజేశారని అన్నారు.పెరుగుతున్న కరోనా రోగులను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక  ఆక్సిజన్ పడకలను వెంటనే ఏర్పాటు చేయాలి.బయట ఎండవేడికి ఇమ్యూనిటీ లోపించి  ఆక్సిజన్ లెవల్స్ తగ్గి ప్రతి వారు ఆక్సిజన్ కోసం ఇబ్బందులు పడుతున్నారని ఇంటి వద్దనే ఉండాలి అని ప్రజల సహకారంతోనే  కరోనా ను కట్టడి చేయవచ్చునని  రూపాకుల రవి కుమార్ బి.జె.పి, మెడికల్ కన్వీనర్ సూచించారు.

దివీస్ ల్యాబ్ నుండిఆక్సిజన్ సిలిండర్లు సహాయం

 దివీస్ ల్యాబ్ నుండి ఆక్సిజన్ సిలిండర్లు సహాయం

విశాఖపట్నం, పెన్ పవర్

జిల్లాలో కోవిడ్ ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపడుతున్న వివిధ జాగ్రత్తలలో భాగంగా దివీస్ ల్యాబ్ నుండి వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కు,దివీస్ ల్యాబ్, జనరల్ మేనేజర్ కోటీశ్వరరావు సుమారు 80 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.సోమవారం కలెక్టరేట్ లోని ఆయన చాంబర్ లో అందించి,విశాఖ ఇండస్టియల్ గ్యాసెస్ నుండి వివిధ ఆసుపత్రులకు ఇప్పటికే 350 సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలిపారు.  కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బలిటీ కింద ఈ ఆక్సిజన్ సిలిండర్లు ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు.దివీస్ ల్యాబ్ లేటరీ నుండి సి.ఎస్.ఆర్. మేనేజర్ డి. సురేష్ కుమార్, పి.అశోక్ మరియు సీనియర్ లైజన్ కన్సల్టెంట్  వరహాలరెడ్డి పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...