Followers

గాడిగూడా లో రక్త పరీక్ష శిభిరం

 గాడిగూడా లో రక్త పరీక్ష శిభిరం...

 నార్నూర్, పెన్ పవర్ 

గాడిగూడా మండల పి హెచ్ సి ఆధ్వర్యంలో కోవిడ్19 మహమ్మారి విపరీతంగా  పెరగడం తో మరో వైపు ఏజెన్సీ ప్రాంతంలో  జ్వరాలు ఏకువగా పెరిగి ఉనందున ప్రభుత్వ ఆసుపత్రి లో మంగళవారం  రక్త పరీక్ష శిభిరం నిర్వహించారు.రక్త పరీక్ష కు ప్రజలు ముందుకు రావాలని  హెచ్ ఇ ఓ పవర్ రవీందర్ అన్నారు.వారి వెంట ఏ ఎన్ ఎం ఊర్మిళ, హెచ్ ఏ సురేష్,సి హెచ్ డబ్ల్యూ కుంతబాయి, ఉన్నారు.

12వ వార్డులో బొర్వెల్ కు మరమ్మత్తుల నిర్వహణ

 12వ వార్డులో బొర్వెల్ కు  మరమ్మత్తుల నిర్వహణ

బెల్లంపల్లి, పెన్ పవర్..

పట్టణ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కాల్ టెక్స్ లో రామకృష్ణ థియేటర్ వెనుకాల గల మినీవాటర్ సప్లై బోర్ పాడయ్యి ఎండాకాలం వలన పంపులలో నీరు సరిగ్గా రాక బస్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,వార్డు కౌన్సిలర్ నెల్లిశ్రీలతరమేష్  దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి,వార్డు తెరాస నాయకులు రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ ఇంజనీర్లతో మాట్లాడి, వారి సహాయంతో  దగ్గరుండి బోర్ వెల్ లో పైపుల మరమ్మత్తులు నిర్వహించారు. పైపులమరమ్మత్తు ద్వారా బస్తి మొత్తానికి నీటికొరత లేకుండా చేసారని,బస్తి ప్రజలు కౌన్సిలర్ కు కృతజ్ఞతలు తెలిపారు

ప్రమాదాలు జరగకుండా మెష్ ఏర్పాటు

 ప్రమాదాలు జరగకుండా మెష్ ఏర్పాటు

నాలాలో ఉన్న చెత్త తొలగింపు

పెన్ పవర్, మల్కాజిగిరి

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు గౌతంనగర్ డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ నాలా క్లీనింగ్ పనులను, మెష్ ఏర్పాట్ల  పనులను కార్పొరేటర్  సునీత రాముయదవ్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ సునీత రాము యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరేడ్మట్ దీన్ దయళ్ నగర్ లో ఎడాది క్రితం నాలాలో పడి చిన్నారి చనిపోయిన ఘటన జరిగిందని, ఇందుకు ఒపెన్ నాలా వద్ద సరియైన మెష్ రక్షణ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని గుర్తుచేశారు. రాబోయే వర్షకాలం ను దృష్టిలో ఉంచుకుని ప్రజలకోసం నాలాలా పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాముయదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

విలేఖరికి అండగా నిలిచిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు

 విలేఖరికి అండగా నిలిచిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు...

పెన్ పవర్, మల్కాజిగిరి

మల్కాజిగిరి నియోజకవర్గం లో గౌతమ్ నగర్ డివిజన్ సాక్షి దినపత్రిక విలేకరి మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గతనెల ప్రమాదవశాత్తు వాహనం పై నుంచి పడి తీవ్రంగా గాయపడి ఇంట్లో చికిత్స పొందుతున్నాడు,వెంటనే అబ్దుల్ రెహమాన్ సతీమణి ఆరోగ్యం క్షీణించి లోతుకుంట ఆస్పత్రిలో లో చేర్చి వైద్యం చేయిస్తున్నాడు, కరోనా వల్ల అబ్దుల్ రెహమాన్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని మానవ సేవే మాధవ సేవ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు తమ గ్రూప్ లో ఈ విషయాన్ని  సభ్యులతో చర్చించడం జరిగింది. గ్రూప్ సభ్యులు 28 మంది కలిసి రూ16,800 నగదును సహాయంగా అందించారు. అబ్దుల్ రెహమాన్ వారి కుటుంబ సభ్యులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నందున మంగళవారం గ్రూప్ సభ్యులు నమస్తే తెలంగాణ విలేకరి వెంకటేష్ ద్వారా రెహమాన్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్ రెహమాన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మానవ సేవే మాధవ సేవ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు,ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, రషీద్, లయన్ హనుమంతరావు ముదిరాజ్, సక్కురీ భాస్కరరావు, హోటల్ శేఖర్, మనీ, తదితరులు పాల్గొన్నారు.

మంత్రిని భర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ నిరసన దీక్ష

 మంత్రిని భర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ  నిరసన దీక్ష

బీసీల ఓట్లతో గెలిచి బీసీలనే బర్తరఫ్ చేస్తారా?

ఈటెలను బర్తరఫ్ చేయడం బీసీలను దగా చేయడమే

 జాజుల లింగంగౌడ్

తార్నాక, పెన్ పవర్ 

పంచాయితీ, పార్లమెంటు, మున్సిపల్, అసెంబ్లీ అన్ని ఎన్నికల్లో బీసీల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా మంత్రి వర్గం నుండి బీసీలను బర్తరఫ్ చేసి అవమానిస్తున్నారని, ఈ వైఖరి మానుకోకపోతే టిఆర్ఎస్ పార్టీకి బీసీలు శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. బీసీ బిడ్డ ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి భర్తరప్ చేయడాన్ని నిరసిస్తూ ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర శాతం లేనివాళ్లు, ఐదు శాతం లేని వాళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించవచ్చు, వందల ఎకరాలు అడ్డగోలుగా పొందవచ్చు,  ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా తరతరాలుగా పాలించవచ్చు గాని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లు మాత్రం ఆస్తులుండి పదవులు పొందితే, అవినీతిపరులుగా,  కబ్జాకోరులుగా ముద్ర వేస్తుండడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.  బీసీ ఎస్సీ ఎస్టీలు అవినీతి పరులైతే మీరు సుద్దపూసలా అంటూ ప్రశ్నించారూ.ఈరోజు అధికారం ఉందని బీసీ మంత్రి అయిన ఈటల రాజేందర్ ను, గతంలో దళిత వర్గానికి చెందిన రాజయ్యను కేసీఆర్ ప్రభుత్వం మెడలు పట్టి బహుజనుల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా క్యాబినెట్ నుండి గెంటివేశారని, ఇది వ్యక్తులను అవమానించడం కాదని ఇది యావత్ 90 శాతం ఉన్న బడుగుల, బహుజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమే అవుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి అగ్రకులాలకు చెందిన ఒక్క మంత్రిని, ఒక్క ప్రజాప్రతినిధిని భర్తరఫ్, సస్పెండ్ లు చేసే దమ్ము లేదని, కేవలం బడుగులను మాత్రమే బలి తీసుకుంటున్నార ని ఇందుకు ఈటల రాజేందర్, రాజయ్యలే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మాదేశి రాజేందర్,బండిగారి రాజు తదితరులు పాల్గొన్నారు

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి

 ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి

జర్నలిస్టుల మరణాలను ఆపండి - టీయూడబ్ల్యూజే


 
పెన్ పవర్, మల్కాజిగిరి

జర్నలిస్టులను కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటించి జర్నలిస్టులకు మనోధైర్యం, ఆర్థిక చేయూత అందించాల ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ లు ఒక ప్రకటనలో కోరారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో విధి నిర్వహణలో జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి, రెండో దఫాల్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 55 మంది జర్నలిస్టులు కరోనాతో నేలకొరిగినట్లు వారు విచారం వ్యక్తం చేశారు. ఒక్క ఏప్రిల్ మాసంలోనే రాష్ట్రంలో వరుసగా 29 మంది జర్నలిస్టులు అకాల మరణం చెందినట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా ప్రారంభం నుండి నేటివరకు 3,800 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడినట్లు ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు వివరించారు. అయితే ఐసోలేషన్ లో ఉంటున్న కొందరికి మాత్రమే మీడియా అకాడమీ నుండి ఆర్థిక సహాయం అందుతున్నదని, ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకుంటున్న పలువురు బాధిత జర్నలిస్టులకు సహాయం అందించడంలో జాప్యం చేయడం సరైంది కాదన్నారు. అలాగే కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు అందిస్తున్న 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఆసుపత్రుల్లో ఖర్చు చేసిన అప్పులకు కూడా సరిపోవడం లేదని శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శేఖర్, విరాహత్, శ్రీకాంత్ లు ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబాలకు ఇతర రాష్ట్రాల మాదిరిగా కనీసం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు. అలాగే పంజాబ్, పశ్చిమ బెంగాల్,  బీహార్, ఒరిస్సా తదితర రాష్ట్రాల మాదిరిగా వెంటనే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని, కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలందించడానికి ప్రత్యేక సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.

పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మిత్రబృందం

పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మిత్రబృందం

పెన్ పవర్,  శ్రీకాకుళం

మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ వైసీపీ  విద్యార్థి యువజన విభాగం నాయకులు మెంటాడ స్వరూప్ జన్మదినం సందర్భంగా పలు  సేవా కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం స్థానిక ఆదిత్యనగర్ కాలనీలో స్వరూప్ మిత్రమండలి ఆధ్వర్యం లో ఇంటింటికీ కూరగాయలు నిత్యావసరాలు అంద చేశారు. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు లక్ష్మణ అప్పు యాదవ్, అశోక్, సోను,శ్రీను,తదితరులు ఉన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...