Followers

కరోనా తో వార్డు కౌన్సిలర్ మృతి

 కరోనా తో  వార్డు కౌన్సిలర్ మృతి

పెన్ పవర్, కొవ్వూరు

కొవ్వూరు మున్సిపల్ కార్పొరేషన్ 23 వ వార్డు కౌన్సిలర్  మురికొండ రమేష్ కరోనాతో మృతిచెందారు. రమేష్ మృతికి మన గౌరవ మంత్రివర్యులు తానేటి వనిత తన ప్రగాఢ సంతాపం తెలియచేసారు. కొవ్వూరు మున్సిపాలిటీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  ఏర్పరచుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ తనదైన శైలిలో సేవ చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ వార్డు కౌన్సిలర్ మృతికి చైర్మన్ భావనా రత్నకుమారి తో పాటు కౌన్సిలర్లు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

పోచవరంలో సేంద్రియ ఎరువుల తయారీ

పోచవరంలో సేంద్రియ ఎరువుల తయారీ

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం పోచవరం పంచాయతీ పరిధిలో యస్డబ్ల్యుపిసి నందు సచివాలయ కార్యదర్శి యస్.ఎం.రఫీ వూల్లా ఆధ్వర్యంలో పేడ నుంచి వానపాములనుపయోగించి సేంద్రియ ఎరువుల తయారీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విఏఏ భార్గవ్ సాయి, ఏహెచ్ఏ వి.సాయిరామ్ పాల్గొన్నారు.

శివ సాయి నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించండి

 శివ సాయి నగర్ లో  మౌలిక సదుపాయాలు కల్పించండి.

పెన్ పవర్, కాప్రా 

 చర్లపల్లి డివిజన్ లోని శివ సాయి నగర్ ఫేస్ 3 సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసులు  మంగళవారం  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ని కలిసి కాలనీ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గత అక్టోబర్ లో కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి స్థానంలో శాశ్వత బ్రిడ్జి నిర్మాణం జరిగేలా అదేవిధంగా త్రాగునీరు  లేక అల్లాడుతున్న కాలనీ వాసుల దాహార్తిని తీర్చేందుకు వెంటనే నీటి వసతి కల్పించాలని సంబంధిత ఇంజనీరింగ్, జలమండలి అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలం నాటికి బ్రిడ్జి నిర్మాణం పనులు  చేపట్టేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ ఈ ఈ కోటేశ్వరరావు తో సుభాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు . అసలే కరోనా కష్టకాలం పక్క కాలని వాళ్ళు తాగునీరు ఇవ్వడానికి నిరాకరిస్తూ కాదు పొమ్మంటున్నారు తాగేందుకు చుక్క నీరు లేక పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ అధ్యక్షురాలు విజయ, కార్యదర్శి  మాధవి, ఎమ్మెల్యేకు చెప్పడంతో వెంటనే   స్పందించిన ఎమ్మెల్యే జలమండలి డీజీఎం కృష్ణ తో మాట్లాడి  తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి తాగునీరు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, శివ సాయి నగర్ ఫేస్ 3 సంక్షేమ సంఘం  ప్రతినిధులు సత్యం, పురుషోత్తం రెడ్డి, అంజలి తదితరులు పాల్గొన్నారు.

కరోనా తో పోరాడి ఓడిన మీ సేవ సత్యనారాయణ

 కరోనా తో పోరాడి ఓడిన మీ సేవ సత్యనారాయణ

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ఆత్రేయపురం గ్రామంలో కరోనా  మహమ్మారి మరణ మృదంగం గంటలు మోగుతున్నాయి  ఒకపక్క కరోనాబారిన పడిన వారు కోరుకుంటుంటే మరోపక్క కరోనా బారిన పడిన  తట్టుకోలేక మృతి చెందుతున్నారు ఈరోజు ఆత్రేయపురం మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న కాజులూరు రమా సత్యనారాయణ (42)  కరోనా పాజిటివ్ వచ్చినది ఆయన కొద్ది రోజులుగా రాజమహేంద్రవరం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు  ఆయన మృతి పట్ల ఆత్రేయపురం మండలం మీ సేవ కేంద్రాల నిర్వాహకులు సంతాపం వ్యక్తం చేశారు.

ఘనంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి14వ వార్షికోత్సవం

 ఘనంగా  శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి14వ వార్షికోత్సవం..

పెన్ పవర్, కాప్రా

కాప్రా డివిజన్ లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవం సందర్భంగా హోమము ధ్వజారోహణం నిర్వహించారు. అభిరాం శర్మ  రుత్వికులు. అర్చకులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఈ సంవత్సరం కోవిడ్  నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమం చేసామని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కరోన మహమ్మారి దేశం నుండి తరిమి కొట్టే విధంగా అందరూ జాగ్రత్తలు పాటించాలని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దయా భక్తులపై ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో  రవి మూర్తి శర్మ ,కే కిరణ్ చార్యులు.పీ హరినాథ్ శర్మ , ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఎర్ర అశోక్ కుమార్ గౌడ్ చైర్మన్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి జె కృష్ణమాచార్యులు, ధర్మకర్త లు చిన్నమ్మ రాజు వెంకటరమణ, మండల , నవీన్ కుమార్ గౌడ్ శ్రీమతి  బచ్చు అరుణ జ్యోతి, కొప్పుల కుమార్ , గోగికర్ నవీన్ కుమార్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

అక్రమంగా మద్యం అమ్మినా, తయారుచేసిన కఠిన చర్యలు

అక్రమంగా మద్యం అమ్మినా, తయారుచేసిన కఠిన చర్యలు

పోలవరం, పెన్ పవర్

పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మరియు తమ సిబ్బంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు వారి అదేశాలమేరకు తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎర్లీ మార్నింగ్ గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో 35 లీటర్ల నాటుసారా పట్టుకోవడం జరిగింది. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ రైడింగ్ లో భాగంగా ఒక గ్లామర్ బైక్ పట్టుబడినట్లు, మరియు ఒక వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇతను దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించడం జరిగిందని అన్నారు. మరియు కృష్ణంపాలెం నుండి వెంకటాయపాలెం కు నాటుసారా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలియజేశారు.

రంజాన్ తోఫా అందజేసిన మంత్రి

 రంజాన్ తోఫా అందజేసిన మంత్రి

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో రంజాన్ తోఫా (కిట్టు) మంత్రి నిరంజన్ రెడ్డి ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి  తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రంజాన్ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి కోరారు. పేద ప్రజలముఖంలో చిరునవ్వులు ఇవ్వడానికి కెసిఆర్  రంజాన్ తోఫా  రంజాన్ పండుగను అత్యంత ప్రతిష్టాత్మక జరుపుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని  మంత్రి  చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని రంజాన్ పండుగను అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి  కోరారు. దాదాపు అక్కడికి వచ్చిన 120 మంది లబ్ధిదారులకు  మంత్రి తన చేతుల మీదుగా అందజేశారు. ఈ వివరాలు టిఆర్ఎస్ నేత షేక్ జహంగీర్ విలేకరులకు తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...