కోవిడ్ నిబంధనలు పాటించకపోతే జరిమానా చెల్లించాలి
కోవిడ్ నిబంధనలు పాటించకుండా బహిరంగంగా తిరిగితే జరిమానా విధించాలని మండల ఈఓపీఆర్డీ సీహెచ్ బాలాజీవెంకటరమణ కార్యదర్శులను ఆదేశించారు. కరప పేపకాయల పాలెం, ఆరట్లకట్ట, గొడ్డటిపాలెం, కొరుపల్లి తదితర గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించి, గ్రామకార్యదర్శులు, సచివాలయం సిబ్బందితో కల్సి ఇంటింటికీ తిరిగి కోవిడ్ నిబంధనలను, అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నకారణంగా బయట తిరగరాదని బయటకు వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అన్ని శుభకార్యాలపై నిషేధం విధించిందని, గ్రామాల్లో ఎవరికీ టెంట్ హౌస్ సామాన్లు అద్దెకు ఇవ్వరాదని, అలాచేస్తే ఎపిడమిక్ ఏర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని సప్లయి కంపెనీ నిర్వాహకులకు నోటీసులు జారీచేయాలని గ్రామకార్యదర్శులను ఈఓపీ ఆర్డీ బాలాజీ వెంకటరమణ ఆదేశించారు. నిర్దేశించిన సమయాల్లోనే దుకాణాలు తీయాలని, షాపులవద్ద భౌతిక దూరం పాటించేలా మార్క్ చేయాలని వ్యాపారస్తులకు ఆయన సూచనలు చేశారు. కరప శివారు రామకంచి రాజునగర్ కాలనీలో టెంట్వేసి శుభకార్యం నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని ఈఓపీఆర్ట్ వాలాజీ, కార్యదర్శి జి.త్రినాద్ అక్కడకు వెళ్లి కరోనా కేసులు పెరుగుతుంటే. చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల దృష్టికి తీసుకురావడంలో విఫలమైన గ్రామవలంటీర్, ఆశావర్కర్లపై చర్యలు తీసుకోవాలని పైఅధికారులకు సిఫార్సు చేసినట్లు ఈ వీడి తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, గ్రామాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, పలు సూచనలు చేశారు. గురంణాపల్లిలో సాయంత్రం ఆరుగంటలు దాటినా మాంసం అమ్మకాలు సాగిస్తుండటంతో సదరు చికెన్ షాపులోని కాటాను స్వాధీనం చేసుకున్నట్టు కార్యదర్శి కె.నాగేంద్రకుమార్ తెలిపారు.