Followers

కరోనా పై గిరిజనులకు కళజాత మైకుల ద్వారా అవగాహన

 కరోనా పై గిరిజనులకు కళజాత మైకుల ద్వారా అవగాహన

పెన్ పవర్, విశాఖపట్నం

 విశాఖ ఏజెన్సీలో విజృంభిస్తున్న రెండో విడత  కరోనా  తీవ్రతపై  గిరిజనులకు కళాజాత  మైకుల ద్వారా అవగాహన  కల్పిస్తామని  పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ( ఐ టి డి ఎ) ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ సలిజామల  అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సెకెండ్ వేవ్  కరోనా మహమ్మారి గిరిజన ప్రాంతంలో  విలయ తాండవం ఆడుతుందని  దీనిని నియంత్రించేందుకు ప్రజా సహకారం అవసరం అన్నారు. ప్రజలు అధికారులు సమిష్టిగా కరోనా వైరస్ ని ఎదుర్కోవలసి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో కరోనా మహమ్మారి పై అవగాహన కల్పించేందుకు 11 మండలాల్లో కళాజాత లు  మైకులు ద్వారా ప్రచారం చేస్తామని గిరిజనులు  అవగాహనతో ఉండాలన్నారు. మాస్కులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. మండల కేంద్రాలకు శివారు గ్రామాలు మైళ్ల దూరంలో ఉండటం వల్ల వైద్య సేవలు సకాలంలో అందుకో లేరని గిరిజనులు కారోనా ఆ నిబంధనలు  తప్పక పాటించాలన్నారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆశ కార్యకర్త ఏఎన్ఎం లకు సమాచారం ఇవ్వాలని కోరారు.  ఏజెన్సీలో కొన్ని మండలాలు కర్ఫ్యూ అమలు చేస్తున్నారని  రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5వ తేదీ నుండి రెండు వారాల పాటు అమలు  చేయమన్నా  లాక్ డౌన్ ను  పాటించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు  మాత్రమే దుకాణాలు తెరుచుకుంటాయి అని  ఆ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు లాక్ డౌన్ కర్ఫ్యూ అమలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలని ఎవరు ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని  పీవో హెచ్చరించారు. వ్యాపారులు వర్తక సంఘాలు నిబంధనలకు సహకరించాలని వెంకటేశ్వర్ అన్నారు.

ఏజెన్సీలో 15 లోగా ఉచిత బియ్యం పంపిణీ చేయాలి

 ఏజెన్సీలో 15 లోగా ఉచిత బియ్యం పంపిణీ చేయాలి

పెన్ పవర్, విశాఖపట్నం

  విశాఖ ఏజెన్సీలో ఈనెల 15లోగా ఉచిత బియ్యం పంపిణీ పూర్తిచేయాలని పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారిణి  లక్ష్మీ శివ జ్యోతి అన్నారు. సోమవారం పాడేరు ఆర్డిఓ కార్యాలయం నుంచి  పాడేరు జి.మాడుగుల  పెదబయలు   ముంచంగిపుట్టు  హుకుంపేట  డుంబ్రిగూడ  అనంతగిరి  అరకు  జీకే వీధి  చింతపల్లి మండలాల తహసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  రెండవ విడత కరోనా మహమ్మారి ఉధృతమవుతున్న దృశ్య ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేపట్టిందన్నారు. గిరిజనులకు 15వ తేదీలోగా ఉచిత బియ్యం అందించాలని కోరారు. క్షేత్ర స్థాయిలో కి బియ్యం వాహనాలు వెళ్లి గ్రామాల్లో గిరిజనులకు ఉచిత బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ లో ఎటువంటి అవకతవకలు జరిగిన  సహించేది లేదని ఆమె హెచ్చరించారు.  ఆయా మండలాల తహసీల్దార్లు  శివారు గ్రామాలకు సైతం ఉచిత బియ్యం అందాలని దీనికోసం  తహసీల్దార్లు తగిన చర్యలు తీసుకోవాలని  ఆర్ డి ఓ లక్ష్మీ శివ జ్యోతి కోరారు.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవా శుభాకాంక్షలు

 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవా శుభాకాంక్షలు

పెన్ పవర్,విశాఖపట్నం

పత్రికా స్వేచ్ఛ పట్ల ప్రభుత్వాల నిబద్ధతను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ప్రతి సంవత్సరం మే 3 న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటారు  అని తెలంగాణ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సేల్స్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెస్. రవి కుమార్ గుర్తు్చేశారు. పత్రికా స్వేచ్ఛను నిగ్రహించడం లేదా రద్దు చేయడం లక్ష్యంగా ఉన్న మీడియాకు మద్దతు చూపించడానికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటారు. కలం కత్తి కన్నాశక్తివంతమైనది అన్యన వాపోయారు. సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా బిగ్గరగా మాట్లాడండి కలిసి నిలబడండి సాధ్యమైతే వ్యతిరేకించండి పిలుపునిచ్చారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఏజెన్సీలో కరోనా నియంత్రణకు వర్తక వ్యాపార సంఘాలు సహకరించాలి

 ఏజెన్సీలో కరోనా నియంత్రణకు వర్తక వ్యాపార సంఘాలు సహకరించాలి

పెన్ పవర్, విశాఖపట్నం

 విశాఖ ఏజెన్సీలో విలయ తాండవం చేస్తున్న రెండో దశ కరోనా నియంత్రణకు వర్తక వ్యాపార సంఘాలు సహక రించాలని మానవ హక్కుల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుభా(చిన్ని) అన్నారు. సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా వ్యాపారులు వర్తక సంఘాలు నిర్లక్ష్యం వహిస్తే గిరిజనులు ప్రాణాలు కోల్పోతారని కరోనా ఉధృతి ఉన్న ప్రాంతాల్లో దుకాణాలు మూసివేసి కర్ఫ్యూ పాటించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారులు  లాభాపేక్షతో  కరోనా ఉన్న  దుకాణాలు యధావిధిగా  తెరుస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. పాడేరు గోల్డ్ షాపుల పరిధిలో   నూకరాజు  కరోనాతో మృతి చెందారు. అదే లైన్ లో మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా గోల్డ్ షాపులు యధావిధిగా తేరి చేస్తున్నారని  ఆమె విచారం వ్యక్తం చేశారు. ఏజెన్సీ డివిజన్  కేంద్రం సెక్స్ కావడంతో ఇతర మండలాల గిరిజనులు ఏ అవసరానికి అయినా పాడేరు వచ్చి తీరాల్సిందే.  గిరిజన ప్రాంతంలో పెళ్లిళ్లు శుభకార్యాల సీజన్ కావడంతో గిరిజనులు బంగారం బట్టలు కిరాణా సామాన్లు కొనుక్కునేందుకు మండల కేంద్రాలకు వచ్చేస్తున్నారు. కరోనా కేసులు మరణాలు ఉన్న వ్యాపారులు  నిబంధనలకు విరుద్ధంగా  వ్యాపారాలు సాగిస్తున్నారని   అందువల్ల గిరిజనులు కరోనా కి గురికాక తప్పడంలేదు అన్నారు. బంగారం షాపులు 20 రోజులు స్వచ్ఛందంగా మూసివేయాలని  లేనిపక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకువెళతామని ఆమె హెచ్చరించారు.  షాపులు వద్ద కోవిడ్ 19 నిబంధనలు పాటించడం లేదని గిరిజనులు అవగాహన లేక షాపులో దుకాణాల్లో కలియతిరుగుతూ సరుకులు కొనుగోలు చేస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. అరకు పాడేరు చింతపల్లి ప్రధాన కేంద్రాల్లో వ్యాపారులు దుకాణాలు మూసివేయాలని చిన్ని  కోరుతున్నారు.

సబ్బం హరి మృతికి సంతాపాన్ని ప్రకటించిన గవర్నర్ బండారు

 సబ్బం హరి మృతికి సంతాపాన్ని ప్రకటించిన  గవర్నర్ బండారు 

విశాఖపట్నం, పెన్ పవర్

అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరణించారనే వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. సబ్బం హరి మరణం చాలా బాధాకరం అని, విశాఖపట్నం అభివృద్ధికి అతను ఎంతగానో కృషి సల్పారని, నాకు సబ్బం హరి అత్యంత ఆత్మీయ పరిచయస్తులని అన్నారు. నేను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పలు సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కరింపచేసేవారని, రాజకీయ పరిజ్ఞానం మెండుగా గల సబ్బం హరి అనేక విషయాలను లోతుగా అధ్యయనం చేసేవారని గుర్తుచేసుకున్నారు.అలాంటి వ్యక్తి ప్రస్తుతం మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని, ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ దివంగత సబ్బం హరి  ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు కావలసిన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

కోవిడ్ నిబంధనల నడుమ విగ్రహ ప్రతిష్ఠ

కోవిడ్ నిబంధనల నడుమ విగ్రహ ప్రతిష్ఠ

గుమ్మలక్ష్మీపురం,  పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట రామాలయం ఆలయ ప్రాంగణంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కోవిడ్ నిబంధనల నడుమ జరిగింది. గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన  విశ్రాంత ఉపాధ్యాయుడు మద్ది. ఢిల్లీశ్వరరావు,కుసుమా దంపతులు సుమారు లక్షా తొంభై వేల రూపాయలు సొంత నిధులను వెచ్చించి ప్రతిష్ట కార్యక్రమాన్ని శాస్ర్తోత్తమంగా నిర్వహించారు  ఈ కార్యక్రమంతో పాటుగా కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

గాంధీ వచ్చిన వేళ...

 గాంధీ వచ్చిన వేళ...

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ర్యాలీ స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద అనుష్ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న గాంధీ ర్యాలీ  వచ్చిన వేళ  అనే  వేషధారణలతో ఆన్లైన్లో వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నారు  ఈ పోటీలో పాల్గొని చిన్నారులను గాంధీ వేషధారణతో మాస్కు ధరించి పోటీలో పాల్గొనాలని సూచించారు అలాగే కరోనా సెకండ్ వే విజృంభన భారతదేశంలో   అత్యధిక వ్యాధి బారిన పడడంతో  ప్రజలందరికీ ఓ సందేశం ఇవ్వాలని ఈ ఆన్లైన్ పోటీలు నిర్వహించామని  ఆ సంస్థ అధ్యక్షుడు మోహిత్  అన్నారు. ఈ పొటీ కి సంబంధించిన వీడియోలన్నీ  మంగళవారం సాయంత్రం  లోపు మాకు పంపించవలసిందిగా కోరుచున్నాము. అలాగే వీటిలో ఉత్తమమైన వీడియోస్ 10 వీడియోస్  విజేతగా ప్రకటించి వారికి బహుమతులు అందచేయడం జరుగుతుంది.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...