Followers

కోవిడ్ నిబంధనలు పాటించకపోతే జరిమానా చెల్లించాలి

కోవిడ్ నిబంధనలు పాటించకపోతే జరిమానా చెల్లించాలి

పెన్ పవర్, కరప

కోవిడ్ నిబంధనలు పాటించకుండా బహిరంగంగా తిరిగితే జరిమానా విధించాలని మండల ఈఓపీఆర్డీ సీహెచ్ బాలాజీవెంకటరమణ కార్యదర్శులను ఆదేశించారు. కరప పేపకాయల పాలెం, ఆరట్లకట్ట, గొడ్డటిపాలెం, కొరుపల్లి తదితర గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించి, గ్రామకార్యదర్శులు, సచివాలయం సిబ్బందితో కల్సి ఇంటింటికీ తిరిగి కోవిడ్ నిబంధనలను, అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నకారణంగా బయట తిరగరాదని బయటకు వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అన్ని శుభకార్యాలపై నిషేధం విధించిందని, గ్రామాల్లో ఎవరికీ టెంట్ హౌస్ సామాన్లు అద్దెకు ఇవ్వరాదని, అలాచేస్తే ఎపిడమిక్ ఏర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని సప్లయి కంపెనీ నిర్వాహకులకు నోటీసులు జారీచేయాలని గ్రామకార్యదర్శులను ఈఓపీ ఆర్డీ బాలాజీ వెంకటరమణ ఆదేశించారు. నిర్దేశించిన సమయాల్లోనే దుకాణాలు తీయాలని, షాపులవద్ద భౌతిక దూరం పాటించేలా మార్క్ చేయాలని వ్యాపారస్తులకు ఆయన సూచనలు చేశారు. కరప శివారు రామకంచి రాజునగర్ కాలనీలో టెంట్వేసి శుభకార్యం నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని ఈఓపీఆర్ట్ వాలాజీ, కార్యదర్శి జి.త్రినాద్ అక్కడకు వెళ్లి కరోనా కేసులు పెరుగుతుంటే. చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల దృష్టికి తీసుకురావడంలో విఫలమైన గ్రామవలంటీర్, ఆశావర్కర్లపై చర్యలు తీసుకోవాలని పైఅధికారులకు సిఫార్సు చేసినట్లు ఈ వీడి తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, గ్రామాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, పలు సూచనలు చేశారు. గురంణాపల్లిలో సాయంత్రం ఆరుగంటలు దాటినా మాంసం అమ్మకాలు సాగిస్తుండటంతో సదరు చికెన్ షాపులోని కాటాను స్వాధీనం చేసుకున్నట్టు కార్యదర్శి కె.నాగేంద్రకుమార్ తెలిపారు.

వ్యవసాయ కూలీలకు మాస్కులు పై అవగాహన

 వ్యవసాయ కూలీలకు మాస్కులు పై అవగాహన

 వి.ఆర్.పురం, పెన్ పవర్

వి.ఆర్.పురం మండలం చింత రేవు పల్లి గ్రామం చుట్టుప్రక్కల పొలాల్లో రైతులు మిర్చి తోటలు  వేసినారు. పెద్ద మట్టపల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలు వ్యవసాయ మిర్చికూలి పనులు చేసుకొనుటకు  వస్తూ ఉంటారు. ఇది గమనించిన చిన్న మట్టపల్లి పంచాయతీ సర్పంచ్ పిట్టా రామారావు మిర్చి పనికి వచ్చిన కూలీలకు  కోవిడ్  పై అవగాహన  తెలియజేస్తున్నారు. మిర్చి పనికి వచ్చే కూలీలకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి.  మనిషి మనిషికి దూరం పాటించాలి. డెటాల్ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లో నుంచి బయటికి రావాలనుకుంటే పని ఉంటేనే బయటకు రావాలి. కొంతమంది మా స్కూలు ధరించకుండా పనిలోకి వస్తున్నారు. అలా రాకూడదని గ్రామ ప్రజలకు పిట్ట రామారావు తెలియజేసినారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు సర్పంచ్ పాల్గొన్నారు.

కరోనా నిర్మూలనకు కమిటీ

 కరోనా నిర్మూలనకు కమిటీ 


మోతుగూడెం, పెన్ పవర్

పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా శరవేగంగా కరోనా వ్యాప్తి చెందుతుంది. ఈ కరోనా వ్యాప్తి నిర్మూలనకు జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం మోతుగూడెం పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి జ్యోతి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో కమిటీ ఏర్పాటు చేశారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోతుగూడెం ఎసై వి సత్తిబాబు హాజరయ్యారు, దినిలో భాగంగా గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని, గుంపులు గుంపులుగా తిరుగుతున్న ప్రజలను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు, ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, గ్రామ వాలెంటీర్లు, ఆరోగ్య శాఖ కార్యకర్తలు , ఆశా వర్కర్స్ మరియు అంగనవాడీ సిబ్బందితో కరోనా నిర్మూలనకు పాటుపడలని ప్రతిజ్ఞ చేయించారు.

బి.జె.పి యువమోర్చా ఆధ్వర్యంలో ఆహారం వితరణ

 బి.జె.పి యువమోర్చా  ఆధ్వర్యంలో  ఆహారం వితరణ

రాజమహేంద్రవరం, పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఈ కరోనా విపత్కర సమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు మేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ మరియు బి.జె.వై.యం రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ పార్టీ శ్రేణులకు,యువతకు సూచనలు అందించారు.బిజెవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందికొండ రమేష్ మాట్లాడుతూ ఈరోజు నుండి వారం రోజుల పాటు రోగుల సహాయకులకు ప్రతీ రోజు 200మందికి ఉదయం అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.అదేవిధంగా బిజెవైయం జిల్లా అధ్యక్షులు కందుకూరి మనోజ్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ సెంటర్లు పరిశీలన జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కండవల్లి సాయి,డి. సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అర్హులకు పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన ఎన్ని రామచంద్రరావు

 అర్హులకు పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన ఎన్ని రామచంద్రరావు

ఆమదాలవలస రూరల్, పెన్ పవర్

పేదలను ఆదుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సర్పంచ్ ఎన్ని రామచంద్రరావు అన్నారు. మండలంలోని కట్యాచార్యుల పేట గ్రామ సచివాలయంలో అర్హులకు పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరూ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా కరోనా విషయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.


సువ్వాడ మరణం తీరని లోటు

సువ్వాడ మరణం తీరని లోటు


మెంటాడ, పెన్ పవర్ 

సాలూరు మండలం వైసీపీ కన్వీనర్ దువ్వాడ రమణ అకాల మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి, ఆయన కుటుంబ సభ్యులకు తీరనిలోటని సాలూరు ఎమ్మెల్యే పీడి క రాజన్న దొర అన్నారు.  చివరి చూపులు చూడలేకపోయానని ఎమ్మెల్యే రాజన్నదొర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో    సహనం, ఓపిక,సత్త సహకారం అనే నాలుగు నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు సువ్వాడ.రమణ  అని రాజన్నదొర కొనియాడారు.  2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సాలూరు మండలంలోని సువ్వాడ. రమణ నాయకత్వంలో వైస్సార్సీపీ బ్రహ్మాండమైన మెజారిటీ రావడానికి రమణ  కృషి చేశారని రాజన్న దొర గుర్తు చేసుకున్నారు.  పెద్ద వయస్సు అయినందున,వేసవికాలం అయినందున గడపగడపకు కార్యక్రమం, పాదయాత్ర కార్యక్రమంనకు రావొద్దున్నా ఎమ్మెల్యే రాజన్నదొర గారి కంటే ముందే ఉండేవారు. 2018 సంవత్సరం జనవరి నెలలో ఎమ్మెల్యే గారు కొఠియా నడిచి రావద్దు అని చెప్పినా ఎమ్మెల్యే రాజన్నదొర గారితో,మాజీ జడ్పీటిసి రెడ్డి.పద్మావతి గారితో మరియు ఇతర వైసీపీ నాయకులతో పోటీగా ఏజెన్సీ ప్రాంతంలో నడిచారు. బహుశా సాలూరు మండలంలోని ఎమ్మెల్యే రాజన్నదొర గారి వెంట లేకుండా ఎమ్మెల్యే గారి ఏ కార్యక్రమమైనా సరే అది రాజకీయమైన,వివాహామైన, చావైన,పండగైనా,పలకరింపైనా సరే నాకు తెలిసి వెళ్లలేదేమో. సాలూరు మండలంలోని మామిడిపల్లిలో చివరగా ఎమ్మెల్యే రాజన్నదొర గారు ప్రచారం చేసిన ఎంపీటీసీ ఎన్నిక కూడా సువ్వాడ.రమణ గారిదే.  నునిత్యం ఎమ్మెల్యే రాజన్నదొర గారి వెంట ఉండి ఇప్పుడు రాజన్నదొర గారికి,ఆయన కుటుంబానికి, వైస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు కనిపించకుండా, అగుపించకుండా హఠాత్తుగా మాయమై అందనంత దూరానికి వెళ్లిపోయారని, సువ్వాడ రమణ గారిని చివరి సారిగా చూసే అవకాశం కూడా కలుగలేదు అని ఈ బాధను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని సువ్వాడ.రమణ గారి జ్ఞాపకాలు,సేవలు స్మరిస్తూ ఆయన నాయకత్వం,అంకిత భావం ఎల్లవేళలా మాతో ఉంటాయని ఆయన స్పూర్తితో నేను,మా నాయకులు మరియు కార్యకర్తలు ముందుకు నడుస్తాం అని  ఎమ్మెల్యే రాజన్నదొరగారు  దిగ్బ్ర్హాంతి వ్యక్తం చేశారు.                                                                                                            

మేమూ మనుషులమే...

 మేమూ మనుషులమే...

విరామం లేకుండా విధులేలా....
రిమ్స్ స్టాఫ్ నర్సుల ఆందోళన...

పెన్ పవర్, శ్రీకాకుళం

విరామం లేకుండా త‌మ‌తో రిమ్స్ న‌ర్సింగ్ సూప‌రెండింట్  విధులు నిర్వ‌హించేలా త‌మ పై ఒత్తిడి తెస్తున్నార‌ని ఆరోపిస్తూ  ఆదివారం స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని స్టాప్ నర్సులు ఐక్యంగా నిర్వ‌హించారు.తామంతా కోవిడ్ విధులు నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే త‌మ‌లో కొంత‌మంది కోవిడ్ బారిన ప‌డి ఇబ్బందులు ప‌డుతున్నార‌ని స్టాప్ న‌ర్సులు వాపోయారు. త‌మ‌కు శెలవులు ఇవ్వ‌కుండా న‌ర్సింగ్ సూప‌రెండెంట్ ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు విమ‌ర్శించారు.ఈ నేప‌ధ్యంలో తామంతా నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టాల్సి వ‌చ్చిందని వారంతా పేర్కొన్నారు.స్టాప్ న‌ర్సుల నిర‌స‌న కార్య‌క్ర‌మం ద‌గ్గ‌ర‌కు విచ్చేసిన జేసి సుమిత్ కుమార్‌కు త‌మ స‌మ‌స్య‌ల‌ను స్టాప్ న‌ర్సులు విన్న‌వించారు. సీనియ‌ర్ ఉద్యోగుల‌కు అయితే శెల‌వులు ఇస్తున్నార‌ని, కొత్త‌గా చేరిన త‌మ‌కు నిబంద‌న‌లు ప్ర‌కారం ఇవ్వాల్సిన శెలువులు కూడా ఇవ్వ‌డం లేద‌ని జేసి కి వివ‌రించారు. శెలవులు లేకుండా తామెలా ప‌నిచేయ‌గ‌ల‌మ‌ని, ఒత్తిడితో తీవ్రంగా బాద‌ప‌డుతున్న‌ట్లు చెప్పారు. స్పందించిన జేసి  స్టాప్ న‌ర్సుల‌తో మాట్లాడుతూ  శెలవులు లేకుండా ప‌నిచేయ‌డం ఏంట‌ని, డ్యూటీ దిగాక 5 రోజులు పాటు శెలవులు ఉండేలా  చేయాల‌ని, ఆ విధంగా విధులు నిర్వ‌హించాల‌ని,ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు చేయాల‌ని కోరారు. సెకెండ్ వేవ్ దృష్ట్యా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జేసి సుమిత్ సూచించారు.రు. జేసి హామితో స్టాప్ న‌ర్సులు శాంతించి నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని విడిచి జేసికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...