Followers

మానుకోట జిల్లాను రామరాజ్యంగా మార్చిన ఎస్పి కోటిరెడ్డి

మానుకోట జిల్లాను రామరాజ్యంగా మార్చిన ఎస్పి కోటిరెడ్డి

మహుబూబాబాద్ జిల్లాకు వచ్చి నేటితో నాలుగు వసంతాలు పూర్తి.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినా జిల్లా పోలీస్ బాస్.




నెల్లికుదురు, పెన్ పవర్

 నాలుగు సంవత్సరాల కాలంలో మహబూబాబాద్ జిల్లా లోని ప్రజల శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపి ప్రజా రక్ష నే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన జిల్లా పోలీస్ బాస్ నంద్యాల కోటి రెడ్డి.  క్షేత్రస్థాయిలో ఎన్నో ప్రకృతిపరమైన ఆటంకాలు ఎదురైనా ప్రజల కోసం పోలీస్ బందోబస్తులు నిర్వహించి ప్రజల రక్షణే ధ్యేయంగా పని చేశారు అలాగే యాక్సిడెంట్ వల్ల కానీ సస్ట్ర  చికిత్సల వల్ల కాని తీవ్ర  రక్తస్రావం జరిగి రక్త దాతల కోసం ఎదురు చూసె వారికి నేనున్నానంటూరక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రాణధాత గా నిలిచిన సేవాతత్పరుడు అలాగే, పేద విద్యార్థులకోసం ఉచిత  కోచింగ్ క్యాంపులు నిర్వహించి యువతకు మార్గదర్శకంగా నిలిచారు. పోలీస్ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని జిల్లాలో  అమలుపరిచి  పోలీస్ సేవలు ప్రజలకు చేరువ అయ్యేలా చేసి, ప్రజల మన్ననలు చూరగొన్న వ్యక్తి. పోలీస్ కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి,కారోన కాలంలో  నిత్యావసర సరుకులు అందించి,కారోన సోకిన పోలీస్ కుటుంబాలకు గుండెల్లో మనోధైర్యాన్ని నింపి అండగా  ఉండి,ఎలాంటి వారినైనా చిరునవ్వుతో పలకరించి,మహబూబాబాద్ జిల్లాను  రామరాజ్యం గా మార్చాడు. మహబూబాబాద్ జిల్లా ఎస్పి నంద్యాల కోటిరెడ్డి మహుబూబాబాద్ జిల్లా ప్రజలకు తన వంతు సేవ అందించడం నాకు  అదృష్టం.ఈ నాలుగు సంవత్సరాలు నాతో ఉండి అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకున్న జిల్లా ప్రజలకు ,ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తు, ప్రజల ఆరోగ్యాలను చిన్నాభిన్నం చేస్తున్న తరుణంలో ప్రజలందరూ మాస్కు ధరించి, రాత్రివేళ కర్ఫ్యూ సమ యం లో మహబూబాద్ జిల్లా ప్రజలందరూ పోలీసువారికి సహకరించగలరు. 

బాలుడి వైద్య ఖర్చులు భరిస్తా - మైనంపల్లి రోహిత్

 బాలుడి వైద్య ఖర్చులు భరిస్తా - మైనంపల్లి రోహిత్

రామసాయి నైనిశ్ కు అండగా ఉంటా

మెరుగైన వైద్య సేవలు అందించాలి - రోహిత్

పెన్ పవర్, మల్కాజిగిరి

బాలుడు రామసాయి నైనిశ్(5) వైద్య ఖర్చులు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రస్టు భరిస్తుందని ట్రస్టు చైర్మన్ మైనంపల్లి రోహిత్ తెలిపారు. శనివారం మౌలాలి ఎంజేకాలనీలో నివాసం ఉండే దనుంజయ్ శర్మ సాయి సిందూజ కొడుకు నైనిశ్ విద్యుత్ షాక్ కు గురైయి ఏఎస్ రావునగర్ అంకూర్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతు నైనిశ్ ను మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రస్టు చైర్మన్ మైనంపల్లి రోహిత్ పరమార్శించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి బాలుడి చికిత్స కోసం ఆయ్యే వైద్య ఖర్చులను భరిస్తామని తెలిపారు. అసుపత్రిలో వైద్య ఖర్చులు మీరూ చెల్లించాల్సిన పనిలేదని అన్నారు. అసుపత్రి యజమాన్యంతో మాట్లాడి వైద్య ఖర్చులు మైనంపల్లి ట్రస్టు భరిస్తుందని తెలిపారు. బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందించి ఇంటికి వచ్చే వరకు తన బాధ్యత అన్ని రోహిత్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్షి జీ.ఎన్.వి సతీష్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, ఎం.బాగ్యనందరావు, ఉపేందర్ రెడ్డి, సంతోష్ నాయుడు, మహేష్ గౌడ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మేడే వేడుకలు

ఘనంగా మేడే వేడుకలు

పెన్ పవర్, వలేటివారిపాలెం

వలేటివారిపాలెం  కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా  సిఐటియు జెండాను జిల్లా కౌన్సిల్ సభ్యులు సాధు చెన్నకేశవులు పంచాయతీ ఆఫీస్ వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1,086 లో చికాగో నగరంలో కార్మికులు పనిగంటలు తగ్గించాలని, వేతనం పెంచాలని ఉవ్వెత్తున పోరాడాలని, ఇది సహించలేని పెట్టుబడిదారీ వర్గం కార్మికుల పైన కాల్పులు జరిపి 32 మంది ప్రాణాలు బలి తీసుకుందని, కార్మికుల రక్తంతో తడిసిన గుడ్డను ఎర్రజెండా గా ఎగరవేసి కార్మిక శక్తిని చాటారని, అప్పటి నుండి ఎనిమిది గంటల పని దినం అమలు అవుతుందని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 8 గంటలు ,12 గంటలు మారుస్తూ చట్టం చేసిందని, ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  పోరాడటమే మేడే కర్తవ్యాన్ని మన ముందు ఉందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మాదాల రమణయ్య, సిఐటియు నాయకులు జీవిబి కుమార్,  మేస్త్రి రామాంజయ్య, నాగేంద్రం, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగాప్రపంచ కార్మిక దినోత్సవం....

 ఘనంగాప్రపంచ కార్మిక దినోత్సవం.... 

పెన్ పవర్, ఉలవపాడు 

మే 1. మేడే సందర్భంగా ఉలవపాడు మండలం లో కరేడు ర్యాంపు లోని పి టి పి కంపెనీ వద్ద పి టి పి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సిఐటియు జెండాను ఆ సంఘం అధ్యక్షులు సవరం శ్రీనివాసులు ఆవిష్కరణ చేశారు, మండల కేంద్రంలోని సింగరాయకొండ ఆటో స్టాండ్ లో ఉలవపాడు మండల ఆటో వర్కర్స్ యూనియన్  (సీఐటీయూ) ఆధ్వర్యంలో సీఐటీయూ జండా ను ఆ సంఘం మండల కార్యదర్శి జె. సురేష్ బాబు ఆవిష్కరించారు. సిపిఎం పార్టీ జండాను ఆ పార్టీ నాయకులు ఎస్.డి గౌస్ ఆవిష్కరించారు  అనంతరం ర్యాలీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద కు వెళ్లి విగ్రహానికి సంఘం అధ్యక్షులు sd. జహీర్  పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్ మాట్లాడుతూ 1886లో చికాగో నగరంలో పనిగంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని కార్మికవర్గం పోరాడుతుంటే, ఇది సహించలేని పెట్టుబడిదారీ వర్గం కార్మికుల పైన అమానుషంగా కాల్పులు జరిపిందని ఆ కాల్పుల్లో 32 మంది అమరుల అయ్యారని, వారి రక్తంలో తడిసిన గోడను ఎర్ర జెండా ఎగరేసి కార్మిక శక్తిని చాటారని, అప్పటి నుండి ఎనిమిది గంటల పనిదినం అమలవుతుందని తెలిపారు. అయితే నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూపనిని 8 గంటలనుండి 12 గంటలకు పెంచిందని, కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు కాల రాస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వ విధానాల తెచ్చుకోవటమే నేడు కార్మికవర్గం ముందున్న కర్తవ్యం అని పిలుపునిచ్చారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఎం నాయకులు  పొట్లూరు రవి కొమరగిరి వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు గంజి శ్రీనివాసులు చిమటా శ్రీనివాసులు, మండవ కోదండరామ్, జేమ్స్, పీ మస్తాన్ రావు  తదితరులు పాల్గొన్నారు

ప్రపంచ కార్మికులారా ఏకంకండి

ప్రపంచ కార్మికులారా ఏకంకండి

ఏలేశ్వరం, పెన్ పవర్

పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ ఛౌక్ సెంటర్లో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే  సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, ఏ ఐ సి సి టి యు, ప్రజా సంఘాల నాయకత్వంలో జెండా ఆవిష్కరణకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లిబరేషన్ కార్యదర్శి  కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని పిలుపునిచ్చారు. దేశంలో సెకండ్  వేవ్  కరోనా మరణాలకు బిజెపి ప్రధాని మోడీ నిర్లక్ష్యమే కారణం అన్నారు.భారతదేశం కరోనా యాక్షన్ లు గొప్ప విజయం సాధించిందని  గొప్పలు చెప్పిన ప్రధాని మోడీ భారత ప్రజలను కరోనా  మహమ్మారి కి బలి చేశాడు అని ఆరోపించారు.దేశంలో మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండ గట్టారు. రైతు వ్యతిరేక 3  వ్యవసాయ నల్ల చట్టాలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ  చేయడం,ఏపీకి  ప్రత్యేక హోదా ఇవ్వడంలో  అన్యాయం, యువతకు ఉద్యోగ ఉపాధి లేకపోవడం, నిత్యావసర ధరల పెరుగుదల, పెట్రోల్ డీజిల్ దేశంలోని ఎన్నడూ ఎరుగని రేట్లు, మహిళలపై దళితులపై అత్యాచారాలు దాడులు,ప్రజా వ్యతిరేక విధానాలతో హిందూ మతోన్మాద పాసిజం నడిపిస్తున్న మోడీ  ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలు  గమనిస్తున్నారని అన్నారు. కార్మిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ఈ తరుణంలో కార్మికులంతా ఏకమై ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం , యువజన సంఘం, విద్యార్థి సంఘం , కూలీలు, రైతులు, ప్రజా సంఘాలు సీపీఐఎంఎల్ లిబరేషన్ , ఏ ఐ సి సి టి యు ప్రజా సంఘాల కార్యకర్తలు , నాయకులు గండే టి నాగమణి, గుమ్మడి రమణ, కందుల ప్రసాద్, జీ సాయి, కందుల సతీష్ ,పిల్లా కాంతం, నాగులాపల్లి అర్జునుడు, బి రాఘవ,  గుర్రం గోవింద్, చందక లక్ష్మి,  కందుల వరలక్ష్మి ,గుమ్మడి పాదాలమ్మ , వరాలమ్మ ,వడ్డాది గంగాభవాని తదితరులు పాల్గొన్నారు .

ఘనంగా మేడే వేడుకలు

ఘనంగా మేడే వేడుకలు

ఎటపాక, పెన్ పవర్

ఘనంగా మేడే వేడుకలు గన్నవరం, క్రిష్ణవరం ,లక్ష్మీపురం ,తోటపల్లి, సీతాపురం ,రంగాపురం ,పట్టుచీర,కన్నాపురం ,భూపతిరావుపేట ,జిన్నగట్ట ,కాపుగొంపల్లి ,నందిగామ, మురుమూరు సీపీఐ అధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. మండలంలోని గన్నవరం లోని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అమరజీవి కామ్రేడ్ కందుకూరి మంగ రాజు గారి స్మారక స్థూపానికి సీపీఐ నాయకులు   జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా మంగ రాజు గారి సతీమణి ఉప సర్పంచ్ కందుకూరి స్వర్ణ  మాట్లాడుతూ కరోనా విపత్తు కార‌ణంగా కార్మిక వర్గానికి రక్షణ, భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఇప్పటికైనా కార్మిక వర్గానికి రక్షణ, భద్రత కల్పించాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి కార్మికునికి అందివ్వాలన్నారు. వలస కార్మికులకు కరోనా టెస్టులు జరిపి, వారి స్వస్థలాలకు వెంటనే పంపించాలన్నారు. యాజమాన్యాలు కార్మికులకు ఎలాంటి కోత విధించకుండా వేతనాలు ఇవ్వాలని.. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి అమలు చేయించాలన్నారు. కార్మికులు ఎన్నో పోరటాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలు 12 గంటలకు మార్చాలని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంద‌న్నారు.. ఈ కుట్రలను ఆపివేయాలని హెచ్చరించారు.. మోడీ ప్రభుత్వం కార్మికుల జీవితాలను గాలికి వదిలేసి కార్పొరేట్ కంపెనీలకు సేవలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను, దేశంలోని కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు నిరసించాలన్నారు. పోలవరం ముంపు కి గురవుతున్నా గ్రామాలు ,భూములు నోటిపి కేషన్ ఇస్తున్నా రే తప్ప పరిహారం ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం భద్రామ్మ, సీపీఐ మండల కార్యదర్శి ఎలిసాల నాగరాజు, కందుకూరి సుధీర్ చంద్ర, వాసం రాము, ఎంపిటిసి  ముత్తయ్య,  వరదా బ్రహ్మం, కంటె రాజు, ములిసెట్టి శ్రీను, సున్నం శ్రీను, పిడియాల దుర్గా ప్రసాద్, మైపా సాయి, కుమ్మర పల్లి శ్రీను, సాగర్, కంటె శివ, ఏడిద సుబ్బారావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

50 లీటర్ల నాటుసారా పట్టివేత

50 లీటర్ల నాటుసారా పట్టివేత

తాళ్లపూడి, పెన్ పవర్

ఎస్ఈబి ఏలూరు వారి అదేశాలమేరకు పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మరియు సిబ్బంది తనిఖీల్లో భాగంగా తాళ్లపూడి మండలం పెద్దేవం మరియు బల్లిపాడు గ్రామాల్లో శనివారం ఉదయం 50 లీటర్ల నాటుసారా పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు, రెండు మోటారు సైకిళ్లు పట్టుబడినట్లు, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరైనా అక్రమ మద్యం అమ్మినా, తయారు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...