Followers

గౌరవరంలో 2600 లీటర్ల బెల్లం పులుపు ద్వంసం

గౌరవరంలో 2600 లీటర్ల బెల్లం పులుపు ద్వంసం

వి.మాడుగుల, పెన్ పవర్

మండలం లోని గవరవరం పరిధిలో శనివారం స్పెషల్ ఎన్ పోర్స్ మెంట్ బ్యూరో దాడులు  నిర్వహించారు. మాడుగుల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  బత్తుల జగదీశ్వరరావు అందించిన సమాచారం మేరకు ఉదయం గవరవరం ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా నాటు సారా తయారు చేసినందుకు ఉపయోగించే బెల్లం పులుపుని ధ్వంసం చేశారు. రెండు వేల ఆరు వందలు లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం చేసి నాటు సారా బట్టీలు కొల్లగొట్టారు. సారా తయారీ దారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాటు సారా తయారీ అమ్మకాలు చేపడితే   కఠిన చర్యలు తీసుకుంటామని  జగదీశ్వరరావు హెచ్చరించారు.

కరోనతో వృద్దురాలు మృతి

 కరోనతో వృద్దురాలు మృతి

పెద్దగూడూరు,  పెన్ పవర్ 

మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లక్ష్మీపురం (గుండ్రపల్లి) గ్రామానికి చెందిన పులుసం గాదెమ్మ(70)సం"లు కరోనాతో మృతి చెందింది. పులుసం గాదెమ్మ గత నాలుగురోజుల నుండి తీవ్రమైన జ్వరం రావడంతో స్థానిక ఆశా వర్కర్ కొత్తగూడ మండల కేంద్రంలో పి హెచ్ సిలో పరిీక్షలు నిమిత్తం వారి కుటుంబాన్ని తీసుకొని ముగ్గురికి కరోన పాసిటివ్ నిర్దారణ అయ్యింది.వైద్యులుమందులు ఇచ్చి హోం క్వారంటైన్ కి పంపించగా మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు.

మౌలాలి లో విద్యుత్ షాక్ కి గురైన మరో బాలుడు

 మౌలాలి లో విద్యుత్ షాక్ కి గురైన మరో బాలుడు

ఈస్ట్ మారుతి నగర్ లోని ఘటన మరవక ముందే ఎం.జె కాలనిలో మరో ఘటన

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్న స్థానికులు

మరో 48 గంటలు గడిస్తేగాని చెప్పలేం అంటున్నా వైద్యులు



పెన్ పవర్, మల్కాజిగిరి

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఎం జె కాలనీ లో విద్యుత్ షాక్ కి గురైన నైనిష్ 5సం బాలుడు, ప్రక్కనే ఉన్న మరో అపార్టమెంట్ లో అడుకుంటున్నా సమయంలో అకస్మత్తుగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడంతో అక్కడే ఉన్న బాలుడుకి తీవ్ర గాయల పాలైయ్యారు. చికిత్స కోసం సైనిక్ పూరిలోని అంకురా హస్పిటల్ కు తరలించారు. నైనిష్ బాలుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని 48గంటలు సమయం గడిస్తేకానీ ఏవిషయం చెప్పలేం అన్ని వైద్యులు తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద సారియైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వ్యహిస్తున్నారని, ఈస్ట్ మారుతినగర్ లో ఘటన మరవక ముందే ఎం.జె.కాలనీ లో మరో ఘటన జరిగిన విద్యుత్ అధికారులు పై ఎటువంటి చర్యలు తీసుకొకపోవడంతో స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బాలుడు తండ్రి మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద సారియైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలంటు పల్లుమర్లు విద్యుత్ అధికారులకు పీర్యాదు చేసిన వారు స్పందించకుండా నిర్లక్ష్యం వ్యహించడంతో ఈ రోజు విద్యుత్ ప్రమాదంలో బాలుడుకి షాక్ కి గురై అసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో కొటుమిట్టాడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కరణంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్నమని దయచేసి మా బాలుడు నైనిష్ కు వైద్య కర్చులకు ఆర్ధిక సహయం చేయాలంటు వేడుకుంటున్నారు. దాతలు ముందుకు వచ్చి 9542974268 బాలుడు ప్రాణాలు కాపాడలని ఆ కుటుంబ సభ్యులు కొరుతున్నారు.

పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించిన గౌడవెల్లి మాజీ సర్పంచ్

 పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించిన గౌడవెల్లి మాజీ సర్పంచ్

పెన్ పవర్, మేడ్చల్

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ అప్పమ్మగారి జగన్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ పురోభివృద్ధి లో కార్మికులు, కర్షకులదే కీలకపాత్ర అన్నారు. కార్మికులు అంటూ లేకపోతే ప్రజా జీవనం స్తంభించి పోతుంది అని అన్నారు. కరోనా కాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెంటమ్మ, వార్డ్ సభ్యులు సుదర్శన్ రెడ్డి, సదానందం గౌడ్, ప్రభాకర్ ముదిరాజ్, ప్రాథమిక వ్యవసాయ  సహకార సంఘం డైరెక్టర్లు కృష్ణ యాదవ్, గోమారం శ్రీనివాస్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

మల్లాపూర్ డివిజన్ లో ఘనంగా మేడే వేడుకలు

 మల్లాపూర్ డివిజన్ లో ఘనంగా మేడే వేడుకలు 

తార్నాక,  పెన్ పవర్ 

తెరాస  కార్మిక విభాగం  కాప్రా సర్కిల్ అధ్యక్షులు కుర్మన్న ఆధ్వర్యంలో మల్లాపూర్ డివిజన్ లో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అతిధిగా స్థానిక కార్పొరేటర్  పన్నాల దేవేందర్ రెడ్డి హాజర్యయారు. ఈ సందర్బంగా  దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రామికులు,  కార్మికుల్లో  మేడే కొత్త స్ఫూర్తిని రగిలించాలని పన్నాల దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. కార్మికుల్లో చైతన్యం వెల్లివిరియాలన్నారు. శ్రమ దోపిడీని అరికట్టేందుకు ఉద్యమ స్పూర్తితో పోరాడాలన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవమన్నారు.  తెలంగాణ  ప్రభుత్వం అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. ప్రస్తుత కరోనా పరిస్తుతుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయక  విధులు నిర్వహిస్తున్న   మున్సిపల్, గ్రామ పంచాయతీ పారిశుద్ద కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.. ఈ సందర్భంగా కార్మిక, కర్షక, శ్రమజీవుల లోకానికి దేవేందర్ రెడ్డి  మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో డివిజన్ ప్రధాన కార్యదర్శి తాండ వాసుదేవ్ గౌడ్ , డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు సానాల రవి చారి , శ్రవణ్ , జిఎచ్ఎంసి  కార్మికులు గోవెర్దన్ రెడ్డి , మల్లేష్ , నరసింహ , తదితరులు పాల్గొన్నారు

నాచారం డివిజన్ లో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

 నాచారం డివిజన్ లో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి  

అధికారులు తీరు ఫై మండిపాటు స్పందించక పోతే ధర్నా 

కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ 

తార్నాక , పెన్ పవర్ 

కరోనా కేసులు పెరిగుతుండటంతో నాచారం డివిజన్ లో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. చాల రోజులుగా నాచారం డివిజన్ లో కోవిద్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలనీ అధికారులను కోరామని తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి లు ఆదేశాలు జారీ చేసిన డిఎంఎచ్ఓ కాలయాపన చేయడంపై కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ మండిపడ్డారు.  నాచారం ప్రజలు కోవిద్ పరీక్షలకు వెళ్ళాలి అంటే మల్లాపూర్ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళలిసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాచారం లో కోవిద్ పరీక్షా కేంద్రం తో పాటు, వాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నాచారం లో రైతు బజార్ బస్తి దవాఖాన తో పాటు కోవిద్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనీ అధికారులను కోరారు. అధికారులు స్పందించకపోతే  ఆందోళన చేస్తామని , డిఎంఎచ్ఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.

నేటి నుండీ కొత్తగూడ లో స్వచ్ఛంద లాక్​డౌన్

 నేటి నుండీ కొత్తగూడ లో స్వచ్ఛంద లాక్​డౌన్

పెద్దగూడూరు, పెన్ పవర్ 

మహబూబబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నేటి (ఆదివారం) నుంచి పరిమిత స్వచ్ఛంద లాక్​డౌన్ ను విధిస్తున్నట్లు గ్రామపంచాయతీ పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ రణధీర్  తెలిపాడు. స్థానికుల సౌకర్యార్థం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు తెరిచి ఉంటాయని సూచించారు. మండల కేంద్రంలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రం రూపం దాల్చుతున్న దృష్ట్యా... నేటి నుంచి  పరిమిత స్వచ్ఛంద లాక్​డౌన్​ విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం స్వచ్ఛంద లాక్​డౌన్​కు ముందుకొచ్చినట్లు, అందరు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనీ, లేనిచో రూ.5000/- జరిమాన విధించబడుతుందని సర్పంచ్ తెలిపాడు. కొత్తగూడ మండల కేంద్రానికీ పరిసర ప్రాంతాల్లో నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారని... ఇటువంటి సమయంలో కరోనా కేసులు ఎక్కువయ్యే అవకాశముందని తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా తమ వంతు చర్యగా పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని... మాస్కులు ధరించి... తమ కుటుంబాలని కాపాడుకోవాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరి జాగ్రత్తలో వారు ఉంటూ కేసులు పెరగకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని వ్యాపారస్థులు విజ్ఞప్తి చేశారు. స్థానికుల సౌకర్యార్థం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు తెరిచి ఉంటాయని సూచించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...