మాజీసర్పంచ్ చిన్నారావు సేవలు చిరస్మరణీయం
పెన్ పవర్, కరప:
వాకాడ గ్రామసర్పంచ్ గా మండల ఎస్సీ సెల్ నాయకుడుగా, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకునిగా మొసలి చిన్నారావు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన లేని లోటు భర్తీకానిదని పలువురు ఎస్సీనాయకులు పేర్కొన్నారు. స్థానిక ప్రాధమిక ఆరోగ్యం కేంద్రం ఎదురుగా అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం మండల అంబేడ్కర్ యువజన సేవాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాకాడ మాజీ సర్పంచ్ మొసలి చిన్నారావు సంతాప సమావేశం నిర్వహించారు. ముందుగా ఎస్సీనాయకులు భారతరాజ్యాంగకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ చిన్నారావు చిత్రపటానికి మండల అంబేడ్కర్ యువజన సేవాసంఘం అధ్యక్షుడు చిన్నం వెంకటేశ్వరరావు తదితర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు వక్తలు చిన్నరావుతో తమకున్న అనుబంధాన్ని చేసిన చేసిన సేవలను మననం చేసుకున్నారు. మండల ఎస్సీనాయకులు సవిలే రాజేష్, మారెళ్ల వెంకటరమణ, రొక్కాల నూకరాజు, బచ్చలి బులిఅప్పారావు, దాలివర్తి శ్రీనివాస్, వజ్రపు కామేశ్వరరావు, జిల్లా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.