Followers

ఆదివాసీల దాహార్తిని తీర్చిన తాండూర్ సీఐ బాబు రావు

 ఆదివాసీల దాహార్తిని తీర్చిన తాండూర్ సీఐ బాబు రావు


తాండూర్, పెన్ పవర్

ఆదివాసీలకు అండగా నిలిచి వారి తాగునీటి సమస్య పరిష్కరించి మానవత్వం చాటుకున్న తాండూర్ సి.ఐ బాబు రావు సొంత ఖర్చులతో నీటి సమస్య పరిష్కారానికి కృషి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది: తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాబు రావు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది మంచిర్యాల తాండూర్ పోలీస్ సర్కిల్ పరిధిలోని అబ్బాపూర్ గ్రామంలో తాగడానికి,ఇతర అవసరాలకు నీళ్లు లేకుండా,నీటి సమస్యతో బాధబపడుతూన్న విషయం ని ఆ గ్రామ ప్రజలందరు తాండూర్ సి.ఐ బాబు రావు దృష్టికి తీసుకెళ్లగా సి.ఐ  వెంటనే స్పందించి,నిన్న 30వ తేదీన, శుక్రవారం నాడు,అబ్బాపూర్ గ్రామాన్ని సందర్శించి,గ్రామ ప్రజలతో నీటి కొరత గురించి మాట్లాడి సమస్యను ఒక బాధ్యతగా తీసుకుని గ్రామానికి అర కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి లో పూడికను తీయించి సిఐ సొంత ఖర్చులతో మోటార్ కొనుగోలు చేసి ఆ బావి నుండి ఊరిలోకి పైప్ లైన్ వేయించి గ్రామ ప్రజల దాహన్ని తీర్చి సి.ఐ బాబు రావు  మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా సిఐ  మాట్లాడుతూ...పోలీసులు కేవలం కేసులను చేధించడమే పని కాకుండా,ప్రజల శ్రేయస్సు,వారి సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ తరుపున ఎల్లప్పుడూ కృషి చేస్తామని ప్రజల రక్షణ మరియు శాంతియుత జీవనం గడిపేలాగా ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది అని సిఐ  తెలిపారు. త్రాగటానికి మరియు ఇతర అవసరాల నిమిత్తం అడగగానే వెంటనే స్పందించి నీటి సమస్యలు తీర్చడానికి ఎనలేని కృషి చేసిన సీఐ కి గ్రామస్తులు కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేశారు.

ఇంటి వద్దే కోవిడ్ టెస్టులు నిర్వహించాలి

ఇంటి వద్దే కోవిడ్ టెస్టులు నిర్వహించాలి

అరకు, పెన్ పవర్

18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి  తెలిసిందే.అయితే, వ్యాక్సిన్‌ తీసుకునేవారు తప్పనిసరిగా కొవిన్‌ వెబ్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందేనని ఉన్నతాధికారులు తెలిపడం జరిగింది.అయితే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ‘వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఒక్కసారిగా డిమాండ్‌ పెరుగుతున్న సందర్భంలో వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద జనాభా తాకిడి ఎక్కువవుతుందని  నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ఆదివాసి గిరిజన మారుమూల గ్రామాల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా  ఉంటుందని వారికి ఫోను గాని సిగ్నల్ గాని అందుబాటులో ఉండదని 18 సంవత్సరాల వయసు దాటిన వారందరూ కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్యసేతు యాప్ ద్వారా నమోదు చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా అసౌకర్యంగా ఉంటుందని దీనికోసం బయటకు వెళ్ళినప్పుడు సామాన్యులు కూడా కోవిడ్ బారిన పడే అవకాశం ఉందని కావున విధంగా కాకుండా డైరెక్ట్ గా వారి గ్రామాలకు వెళ్లి వారి ఇళ్ల వద్దే అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని తక్షణమే వారికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇంటివద్దే ఇవ్వాలని ఏపీసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ మరియు అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు.‘కొవాగ్జిన్‌’ టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ.600లకు, ప్రైవేటు ఆస్పత్రులకు ఒక డోసు టీకా రూ.1200 ధరకు ఇస్తుందని. ఎగుమతి ధర 15 డాలర్ల నుంచి 20 డాలర్ల (దాదాపు రూ.1100-1500) వరకూ ఉంటుందని. ఇలా ప్రభుత్వాలు కమర్షియల్ గా ప్రజల ప్రాణాలతో వ్యాపారాలు చేసుకోవడం మూర్ఖత్వమని ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో సామాన్య గిరిజన ఆదివాసీ ప్రజలు తమ సొంత డబ్బులు పెట్టి వ్యాక్సిన్ వేయించుకోలేరని దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఆ డబ్బులు భరించి సామాన్య ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని కోవిడ్ టెస్టులు వ్యాక్సిన్ ఉచిత పంపిణీ కై తక్షణమే ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి తగు కార్యాచరణతో చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రిజిస్ట్రేషన్‌ కోసం https://selfregistration.cowin.gov.in/ ప్రజలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కోవిడ్ టెస్టులు చేయించుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె కోరారు.


పోలమాంబ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 135 వ మే డే దినోత్సవం

పోలమాంబ  వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 135 వ మే డే దినోత్సవం

మహారాణి పేట, పెన్ పవర్

శనివారం ఉదయం రెల్లి వీధి అంబేద్కర్ పోలమాంబ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ సొసైటీ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో 135 వ మేడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ఆటోరిక్షా కార్మిక సంఘం అధ్యక్షులు సీఎం రమణ ముఖ్య అతిథిగా పాల్గొని పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులను ఉద్దేశించి ప్రతి ఆటో డ్రైవర్ విధినిర్వహణలో ఖాకీ యూనిఫాం ధరించాలి అలాగే మన ఆటో యొక్క రికార్డులను డ్రైవింగ్ లైసెన్స్ సి బుక్ ఇన్సూరెన్స్ ఆటో ఉంచుకోవాలని ప్రతి ఆటో డ్రైవర్ మాస్కో  స్థానిక టీజర్ వాడాలని తెలియజేశారు గత 30 ఏళ్ళ నుండి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుంది కానీ నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కూడా చేయలేదు నేటి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ అండ్ ఓనర్ కు పదివేల రూపాయలు ఆశ చూపి ఒకవైపు ఇస్తూ మరొకవైపు ఆటో కార్మికుల పై పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా పెంచుతూ ఆటో కార్మికుల పై భారం మోపుతున్నారు 2019వ సంవత్సరం కరోనా టైం లో ఆటో డ్రైవర్లపై పెట్టిన కేసులను రద్దు చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ఆటో కార్మికులు అందరూ యూనియన్ పరంగా చేయుచున్న కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు ఇంటి అప్పలరాజు స్టాండ్ అధ్యక్షులు తుపాకుల  ఈశ్వరరావు, స్టాండ్ నాయకులు సత్తిబాబు కేరళ రమణ,ప్రసాదు,ఎల్లారావు,గణేష్,కొండ,గేజు బద్ద అప్పారావు,పోలరాజు,కరాటి మోహన్,శేషు ఎల్,కృష్ణ మరియు ఆటో డ్రైవర్లు అందరూ పాల్గొన్నారు.


వై,ఎస్, ఎస్, ఆర్, ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

 వై,ఎస్, ఎస్, ఆర్, ఆధ్వర్యంలో  మేడే ఉత్సవాలు

పెన్ పవర్ , మందమర్రి

ఈరోజు మందమర్రి మార్కెట్ లో గల వై ఎస్ ఎస్ ఆర్ ఆర్ ఆర్ యం లో ప్రపంచ కార్మికుల దినోత్సవమైన 135 వ మే డే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందుగా చికాగో కార్మికుల ఆత్మ తపనతో ఎరుపెక్కిన ఎర్రజెండా  వై.ఎస్, ఎస్ అర్, చెన్నూర్ నియోజకవర్గ నాయకులు ముల్కల రాజేంద్ర ప్రసాద్ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో చికాగో అమరవీరుల స్ఫూర్తిగా కార్మికుల హక్కుల పరిరక్షణకై ఐక్యపోరాటాలు చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చికాగో అమరవీరులకు జోహార్లు ప్రపంచ కార్మికులారా ఏకం కావాలని నినాదాలతో ఎర్ర జెండా సాక్షిగా జేజేలు పలికారు ఈ కార్యక్రమంలో గజ్జల వెంకటి లింగంపల్లి శ్రీధర్ మొగిలిచర్ల రాజేష్ మద్ది రాజమౌళి కే రాజు సంపత్ వెంకటేష్ పుల్లూరు రాజేశం సతీష్ గౌడ్,  కుమార్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పి.వి.జి.97వ జయంతి!!

ఘనంగా పి.వి.జి.97వ జయంతి!!

విజయనగరం, పెన్ పవర్

     ప్రపంచ రాజకీయ చరిత్రలో పట్టాభిషేకం జరిగిన మహారాజు సోషలిస్టు గా మారింది ఒక్క పి.వి.జి.రాజు ఒక్కరేనని డాక్టర్ పి.వి.జి.గొప్ప మానవతావాదాని డాక్టర్ పి.వి.జి.రాజు కళావేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు,శనివారం పివిజి 97 వ జయంతి కార్యక్రమాన్ని వేదిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా పివిజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భీశెట్టి మాట్లాడుతూ విజయనగరం మహారాజుల వంశ చిట్టచివరి పట్టాభిషిక్తుడు పివిజి ఒక్కేరేనని మహారాజుల వైభవాలను అవలీలగా వదిలేసి సౌమ్యవాదిగా సామాన్య ప్రజల సంక్షేమం కోసం రాజకీయ ప్రస్థానం చేసారని,సింహాచలం దేవస్థానం తో పాటుగా రాష్ట్రంలో ని 104 దేవాలయాలకు ధర్మకర్త గా వ్యవహరించారని రాజకీయాల్లో పివిజి కి గొప్ప చరిత్ర ఉందని 4 దఫాలుగా పార్లమెంట్ సభ్యుడు గా 5 దఫాలు గా ఎమ్మెల్యే గా గెలిచి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గా విద్యా శాఖ మంత్రి గా రాష్ట్రంలో అనేక సంస్కరణలు తెచ్చారని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ గా విశ్వవిద్యాలయం కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా విస్తరింప చేసారు.\

 రాజకీయాల మలిదశలో భారత సనాతన ధర్మంని, అధ్యాత్మికతను, ఆచరణలో చూపించిన కర్మ యోగి,రాజర్షి,మహర్షి, మన పివిజి కావడం మనకి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గా క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారని,సౌత్ ఇండియా గోల్ఫ్ చాంపియన్ గా పివిజి నిలిచారని 1958 లో మాన్సస్ సంస్థ స్థాపించి పేద ప్రజలకు విద్యను అందిస్తూనే కోటను వేల ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతా వాది స్వర్గీయ పివిజి రాజు మాత్రమే అని అన్నారు,ప్రతిసారి పివిజి జయంతి సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకి పివిజి పేరుతో పురస్కారాలు అందచేసేవారమని కరోనా కారణంగా గత ఏడాది, ఈ ఏడాది అందించలేకపోయామని ఆవేదన వ్యక్తంచేశారు, సాధారణంగా సామాన్య స్థాయి నుండి అసామాన్య స్థాయికి వ్యక్తులు ఎదిగారని మనం చరిత్రలో చదువుతుంటాము కానీ డాక్టర్ పివిజి రాజు అసామాన్య స్థాయి నుండి సామాన్య స్థాయికి దిగివచ్చి తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే పారిశుద్ధ్య కార్యక్రమాలు(ఒడిఎఫ్)ను నిర్వహించి దేశంలో ఎమ్మెల్యేలకి ఆదర్శంగా నిలిచారని భీశెట్టి అన్నారు ఈ కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు డాక్టర్ బాల భార్గవి,ఆశా, ఎర్నిబాబు తదితరులు పాల్గొన్నారు.


పేరుకే ఉపాధి మరి డబ్బులేవి..?

 పేరుకే ఉపాధి మరి డబ్బులేవి..?


రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్

పేరుకే ఉపాధి డబ్బులు ఏవి అంటూ కూలీల మనోవేదన చెందుతున్నారు పేద వర్గాల అభ్యున్నతికి వేసవికాలంలో పనిదినాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది పేద మధ్యతరగతి కుటుంబాలకు దీంతో జీవనాధారం కల్పిస్తున్న అధికారుల తీరుతో డబ్బులు రావడం లేదు డబ్బులు రాకపోవడంతో ఉపాధి పనులకు ఇటు పనులు లేక ఎలా జీవించాలంటు మండలం లోని గ్రామాల్లో ఉపాధి కూలీలు తమ ఆవేదననీ వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఆరు గ్రామాలు మినహా ప్రతి గ్రామ పంచాయతీల్లో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు హంగు ఆర్భాటాలతో ప్రారంభించారు. ఉపాధి పనులు మండలంలో సుమారు 1400 కూలీలు  పనిచేస్తున్నారు. ప్రారంభించడం వరకు బాగానే ఉన్నా ఉపాధి పనులు చేస్తున్న వారికి డబ్బులు వస్తున్నాయా లేవా అంటూ ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఉపాధిహామీ కూలీలు ఆరోపిస్తున్నారు. గతంలో వారం వారం డబ్బులు వస్తుండటంతో కుటుంబ భారం కాకుండా ఉండేది గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించి వారి స్థానంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడంతో వారికి ఉన్న పని భారానీకి తోడు ఉపాధి హామీ పథకంలో చేసిన పనులను గుర్తించి వారికి మాస్టర్లు తయారు చేయడానికి సమయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కూలీలు ముప్పై రోజుల నుంచి ఉపాధి పనులకు వెళ్తున్న డబ్బులు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వారం వారం డబ్బులు వస్తుండడంతో కుటుంబ పోషణ భారం కాకుండా ఉండేది గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండడం వల్ల పనులు చేసిన వెంటనే మాస్టర్లు తయారుచేసి అధికారులకు అప్పగించగా డబ్బులు వస్తూ ఉండేవి. ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్ ని తొలగించి వారి స్థానంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడంతో వారికి ఉన్న పని బారనికి తొడు ఉపాధి హామీ పథకంలో చేసిన పనులను గుర్తించి వారికి మాస్టర్ లు తయారు చేయడానికి సమయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు ముప్పై ఆరు రోజుల నుండి ఉపాధి పనులకు వెళ్తున్న డబ్బులు రాలేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల అధికారులు అలసత్వం తోనే ఉపాధి కూలీలకు డబ్బులు రావడం లేదని విమర్శిస్తున్నారు సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి కూలీలకు డబ్బులు కోరుతున్నారు.. సంబంధిత అధికారులు మాత్రం వారం వారం పని వివరాలు, కూలీల వివరాలు పంపిస్తూనే ఉన్నాం కానీ  పై నుండి డబ్బులు రావట్లేదని చెబుతున్నారు.

పరీక్షలు వాయిదా వేయండి...

 పరీక్షలు వాయిదా వేయండి... 


విజయనగరం, పెన్ పవర్

కోవిడ్ కారణంగా 30 మంది ఉండే కేబినెట్ మీటింగ్‌ నే వాయిదా వేసిన వారు 30 లక్షల మంది విద్యార్థులు జీవితాలకు రక్షణ ఎలా కల్పిస్తారు?

ఇంటి నుంచి సెక్ర‌టేరియ‌ట్‌కి అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌, ఆరోగ్య‌ర‌క్ష‌ణ ఏర్పాట్ల మ‌ధ్య వెళ్లి 30 మంది మంత్రుల‌తో దూరంగా ఉండి పాల్గొనే కేబినెట్ మీటింగ్ వ‌ల్లే క‌రోనా సోకుతుంద‌ని జగన్ భ‌య‌ప‌డి వాయిదా వేయించారని , అలాంటిది 15 ల‌క్ష‌ల మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ప‌రీక్ష‌ల నిర్వాహ‌కులు, ఇత‌ర‌త్రా అంతా క‌లిసి 50 ల‌క్ష‌ల‌మందికి పైగా ప‌రీక్ష‌ల కోసం రోజూ రోడ్ల‌మీద‌కు రావాల్సి వుంటుందని, వారికి క‌రోనా సోక‌దా అని మాజీ శాసనసభ్యులు డా.కొండపల్లి అప్పలనాయుడు గారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన పంతం నెగ్గించుకోవడానికి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులతో కలుపుకుని సుమారు 50 లక్షల మందికి పైగా కరోనా బారినపడే అవకాశం ఉందని, కాబట్టి పరీక్ష‌లు వాయిదా వేయాలని డిమాండ్ చేసారు. స్వల్పకాలిక లక్షణాలు ఉన్న విద్యార్థులను ఐసోలేషన్  లో పెట్టి పరీక్షలు రాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం అనాలోచిత చర్యగా కనిపిస్తుందని, వైరస్ సోకిన వారు ఐసోలేషన్ వరకు ఎలా వస్తారని,  వ్యాధి సోకిన వారిని ఇంకెవరైనా పరీక్ష కేంద్రానికి తీసుకుని రావాలని , వారు కూడా కరోనా భారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక కళ్ళముందే అయినవారిని పోగొట్టుకుంటున్నారని, సకాలంలో బెడ్లు దొరక్క రోడ్ల ప్రక్కన, ఆస్పత్రి ఆవరణలో ప్రాణాలు పోతున్న ఘటనలు చూస్తుంటే బాధాకరమని  అన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...