Followers

నేడే వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

నేడే వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం 

పార్వతీపురం,  పెన్ పవర్

 పార్వతీపురం డివిజన్ పరిధిలో రోజు రోజుకు వందల సంఖ్యలో పెరిగిపోతున్న కరోనా కేసుల మూలంగా ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు గాను పార్వతీపురం డివిజన్లో "కోవిడ్ కేర్ సెంటర్" ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకున్న సందర్భంగాను ఈరోజు ఉదయం శాసన సభ్యులు అలజంగి జోగారావు, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అర్ కూర్మనాధం, ఎంపీడీవో, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి పార్వతీపురం మండలం నర్సిపురం  గ్రామం రెవెన్యూ పరిధిలో గల జనహిత డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన "వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్" ను పరిశీలన చేయటం జరిగినది. కేర్ సెంటర్లో సమకూర్చిన మౌలిక సదుపాయాలు పరిశీలనలో భాగంగా వారితో కలసి శాసన సభ్యులు కేంద్రంలో పడకలను, మంచి నీటి సరఫరా, విద్యుత్ వంటి సదుపాయాలను పరిశీలన చేసి అందరికీ మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయా తదితర అంశాల పై అరా తీశారు, అలానే కేంద్రంలో  24 గంటలూ నీరు, విద్యుత్ అందుబాటులో ఉండేటట్లు చూడాలి అని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు మాట్లాడుతూ క్వారైంటిన్ కేంద్రం తక్షణమే ప్రారంభించేందుకు చర్యలు తీసుకొవాలని ఇంకా అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన ఏర్పాటు చేయవలసిందిగా రెవెన్యూ అధికారులకు శాసన సభ్యులు సూచించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందిస్తూ ఆదివారం ఉదయానికి ఈ సెంటర్ కోవిడ్ సేవలకు అందుబాటులోకి రానుందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ వంద పడకలను ఏర్పాటు చేయడం జరిగినది అని తెలియపరిచారు. ఈ పర్యటనలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, రెవెన్యూ అధికారులు, ఎంపీడీవో, పోలీస్ అధికారులు, సిబ్బంది, డైట్ కళాశాల కరస్పాండెంట్ పల్లి భాను ప్రకాష్, వైసిపి సీనియర్ నాయకులు ఎక్స్ వైస్ చైర్మన్ బి జయబాబు, నాయకులు ఆర్ వి ఎస్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.


చందనోత్సవానికి సన్నద్ధత

చందనోత్సవానికి సన్నద్ధత 

సింహాచలం, పెన్ పవర్

             కోవిడ్ -19 దృశ్యా ముందు జాగ్రత్తల్లో భాగంగా ఆదివారం (02-05-21) నుంచి సింహాచలం ఆలయంలో భక్తులకు మధ్యాహ్నం 2:30 గంటల వరకే దర్శనాలు  కల్పించాలని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవో ఎం.వీ సూర్యకళ ,  ఇతర అధికారులు నిర్ణయించారు.  ఉదయం 6:30  గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే భక్తులను ఆలయంలోపలికి అనుమతిస్తారు. అయితే స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ యథాతథంగా రాత్రి 9:00 గంటలకు అంటే పవళింపు సేవ వరకు జరుగుతాయి. వాటిలో ఎలాంటి మార్పు ఉండబోదు.  మొత్తం 22 మంది ఆలయ అర్చకుల్లో 14 మంది అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నారు. కరోనా పాజిటివ్  కాకపోయినా ఏమాత్రం ఒంట్లో బాగలేకపోయినా, లక్షణాలు కనిపించినా ఆలయ ఈవో సూర్యకళ గారి ఆదేశాల మేరకు సెలవు ఇవ్వడం జరిగింది. వారందరికీ టెస్టులు చేశారు - ఫలితాలు రావాల్సి ఉంది.  అర్చకులతోపాటు ఆలయ ఉద్యోగులందర్నీ  రాబోయే చందనాత్సవానికి సన్నద్ధం చేయాలంటే ఈ కరోనా కష్టకాలంలో కొంత విశ్రాంతి అవసరమని భావించడమైనది. అందుకే భక్తులకు దర్శనాలను మధ్యాహ్నం 2:30 గంటల వరకే పరిమితం చేయడమైనది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల్లో ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నారని గమనించగలరు. భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామివారిని ఉదయంపూట దర్శించుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.


కరోనా బాధితులకు పింఛన్ పంపిణీ...

 కరోనా బాధితులకు పింఛన్ పంపిణీ...

మహారాణి పేట, పెన్ పవర్

జీవీఎంసీ 4వ  జోన్ పరిధి,33 వార్డ్ ,30 వార్డ్ ల లో  గౌరి స్ట్రీట్,అల్లిపురం సచివాలయం  పరిధిలో కరోనా పాజిటివ్  పెన్షనర్ కు వాలంటీర్ చిల్లా చైతన్య ,వార్డ్  సెక్రటరీ లు, పి.వి.కిరణ్ కుమార్, జి. శ్యామల రావు, జాన్ బాబు వృద్ధాప్య పెన్షన్ ను, హోమ్ ఐసొలేషన్ కిట్ లను  అందచేశారు. ఎల్ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సచువాలయా వ్యవస్థ ద్వారా అనేక పథకాలు ప్రజలకు అందుబాటులో వచ్చాయన్నారు.

కరోన విషయంలో ప్రజలు మెలకువగా ఉండి నిత్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. అలానే నేడు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మా క్లస్టర్ లో కోవిడ్ బాధితులకు పంపిణీ చేయడం ఓ రకంగా రిస్క్ అయినప్పటికీ మా బాధ్యత మాకు ముఖ్యం అనిపించింది ఆ విధంగా లబ్దిదారులకు పంపిణీ చేసాము అని వివరించారు హోమ్ ఐసొలేషన్  కిట్ లు  అందచేసిన వారిలో  ఏ.ఎన్.ఎం లు  త్రివేణి,అరుణ, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ  అమృత దీప్తి ,వాలంటీర్  భాగ్య లక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మే డే...

ఘనంగా మే డే...

పెన్ పవర్, యదమరి

యాదమరి మండలం లో పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్స్ అసోసియేషన్  నాయకులు ఆధ్వర్యంలో  మే డే ను  ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల కేంద్రం లొ కోవిడ్ నిబంధనల తో ర్యాలీ నిర్వహించారు  అనంతరం  ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ పరిధిలోని ఏర్పాటు చేసిన  కార్మికుల జెండాను యూనియన్ లీడర్ ఆన్సర్ బాషా ఎగరవేశారు, ఈ సందర్భంగా యాదమరి ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్స్ అసోసియేషన్ యూనియన్ లీడర్ ఆన్సర్ బాషా కార్యదర్శి యోగానంద రెడ్డి  మాట్లాడుతూ దేశంలో కార్మికులు లేనిదే ఏ పని జరగదని గుర్తుచేశారు. కార్మికులను ఆదుకుంటానని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ప్రధాన మంత్రి. మోడీ  కార్మికులను  విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కార్మికులను విస్మరించిన ఏ ప్రభుత్వం నిలవలేదని హెచ్చరించారు. కరోనా కాలంలో పనులు లేక కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు నిత్యవసర వస్తువులు ధరలను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్  జిఎస్టి లో కలపాలని తెలిపారు. కార్మికుల దినోత్సవాన్ని సంఘీభావంగాపెట్రోల్ ట్యాంకర్   డ్రైవర్స్ అసోసియేషన్ యూనియన్ లిడర్ ఆన్సర్ బాషా, కార్యదర్శి యోగానంద రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కుప్పయ్య, కమిటీ మెంబెర్స్ భాస్కర్, రఫీ, జగ్గా, భీమా తదితరులు పాల్గొన్నారు.

లారీ ద్విచక్ర వాహనం ఢీ ఇద్దరు మృతి

 లారీ ద్విచక్ర వాహనం ఢీ ఇద్దరు మృతి

 బంగారుపాళ్యం,  పెన్ పవర్ :

చిత్తూరు - బెంగళూరు రహదారి లో గల మహాసముద్రం విలేజ్ నందు మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద లారీ బైక్ ఢీ కొట్టడంతో బైక్ పై వెళ్తున్నా ఇద్దరు మరణించారు..,మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద  ముతరపల్లి గ్రామంలో నుండి ఓ పెద్ద లారీ టర్న్ తీసుకునేటప్పుడు బైక్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది..,మృతులు సావిత్రమ్మ 45 సం" మరియు వారి తనయుడు సెట్టేరి గ్రామం గా తెలిసింది. సంఘటనా స్థలం లో వివరాలు సేకరించిన బంగారుపాళ్యం పోలీసులు హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్  మరియు కోదండ.  కేసు నమోదు చేసి  ఫిర్యాదు చేస్తున్న పోలీసులు.

వీరేపల్లి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన పి.డి బి.బాబురావు.....

వీరేపల్లి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన పి.డి బి.బాబురావు..... 

పెన్ పవర్, ఉలవపాడు 

వీరేపల్లి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పి.డి .బి.బాబు రావు పరిశీలించారు, ఆయన రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రం లో 18 వందల 70 టన్నులధాన్యం నిల్వ ఉండగా ప్రభుత్వం కొనుగోలు చేసినది 264 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగినది. మిగిలిన ధాన్యము 16 వందల పైచిలుకు ధాన్యము నిల్వ ఉండిపోయిందని రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు, వర్షాలు  ఎప్పుడు వస్తాయా తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు , అని తెలుసుకుని వెంటనే జెసి గారితో మాట్లాడి గోనె సంచులు ఏర్పాటు చేస్తానని  మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రైతులు ఎటువంటి భయానికి గురి కావద్దని వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని రైతులకు భరోసా కల్పించారు. అలాగే నూతనంగా ప్రారంభించిన బద్దిపూడి, భీమవరం ,ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం చాగొల్లు, వీరేపల్లి, గిరిజన సంఘాల లో పింఛన్లు పంపిణీ పరిశీలించి, మహిళలు గ్రూపులో చేరని వారు ఉంటే కొత్తగా గ్రూపులు ఏర్పాటు చేయాలని అని కమ్యూనిటీ కోఆర్డినేటర్ కి ప్రతి ఒక్కరూ కోవిడ్ పై జాగ్రత్తలు పాటించాలని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో  ఎం పి డి ఓ టి. రవికుమార్, కార్యదర్శి  భాస్కర్ రావు,సీసీ మాధవరావు, విరేపల్లి సర్పంచ్ వెంకట సుధారాణి, కారసాల శ్రీనివాసులు, నన్నం పోతురాజు, రైతులు పాల్గొన్నారు. 

135 వ మేడే సందర్భంగా చిత్తూరు నగరంలో ఎర్రజండా రెపరెపలు

135 వ మేడే సందర్భంగా చిత్తూరు నగరంలో ఎర్రజండా  రెపరెపలు

చిత్తూరు,   పెన్ పవర్

కార్మికుల హక్కులను, చట్టాలను, కాలరాస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం. ఏఐటీయూసీ  గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు పిలుపు 135 వ మేడే సందర్భంగా  చిత్తూర్ నగరంలో ఆర్టీసీ  1 డిపో ,2 డిపో, ఏ పీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్,  చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్,  భవన నిర్మాణ కార్మిక సంఘం మార్కెట్ చౌక్, సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్, ఐ ఎం ఎఫ్ ఎల్ హమాలి వర్కర్స్ యూనియన్,  ఫీడ్ హమాలి వర్కర్స్ యూనియన్, వామన , న్యూట్రిన్, సుందరయ్య, సువేరా, ఎంజీఆర్, ఆటో డ్రైవర్స్ యూనియన్, సిమెంట్ స్టీల్ హమాలి వర్కర్స్ యూనియన్, వివిధ రంగాలకు సంబంధించిన ఏఐటీయూసీ అనుబంధ సంఘాల  ఎర్ర జెండాలతో పాటు పాత  ప్రశాంత్ నగర్ కాలనీలో ఎర్ర జెండాలను  ఏఐటీయూసీ నాయకులు ఎస్. నాగరాజు, గంటా మోహన్, కె. వెంకటేష్, సీ కే జయచంద్ర, కే .మణి, బి. ఆర్ముగం రెడ్డి,ఏ. సత్యమూర్తి,పి.యస్. నాగరాజు నాయుడు,  దాసరి చంద్ర,గిడ్డుబాయ్, యస్ .జయలక్ష్మి,కె. విజయ్ గౌరీ, యస్ . పుష్పలత, కె.రమాదేవి, పి. గజేంద్ర బాబు,పి. రఘు, పెనుమూరు బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడే చరిత్రను  కార్మికులు సాధించుకున్న చట్టాలను హక్కుల గురించి కార్మికవర్గానికి తెలియజేశారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఎర్ర జెండా ఆవిష్కరణ జరిగింది.  ఈ కార్యక్రమంలో జాన కారపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ లక్ష్మణమూర్తి ,అనుబంధ సంఘాల నాయకులు రాధాకృష్ణ ,మనీ, గజేంద్ర రెడ్డి, దామోదర్ రెడ్డి, మునిరత్నం, విక్టోరియా, కృష్ణ, దాసు, కమల్ ,నాగరాజ్, ప్రేమ్ రాజ్, రమేష్ , సురేష్ శరవణ, పయని, మురుగేష్, బాబు నాయుడు, వెంకటేష్, గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో  మేడే జెండాను ఆవిష్కరించారు,  కృష్ణమూర్తి , జయరామ్, రవి, పొన్ను రంగం తదితరులు పాల్గొన్నారు. 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...