ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పరిశ్రమలను ఆదరించిన నాడే నిజమైన మేడే
--సీపీఐ నాయకులు వి శ్యామ్, కె రామకృష్ణ.
--ఘనంగా ఆలమూరులో 135వ మేడే వేడుకలు.
ఆలమూరు, పెన్ పవర్ :
ప్రపంచ కార్మిక 135 వ దినోత్సవం "మేడే" సందర్భంగా మండల కేంద్రమైన ఆలమూరు బస్టాండ్ సెంటర్ వద్ద గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద అరుణ పతాకం సీపీఐ, ఏఐటీయూసీ, ఎస్టీయూ, యూటిఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు శ్యామ్ రామకృష్ణ, సీపీఐ నాయకులు వి శ్యామ్, కె రామకృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు చల్లా ప్రభాకర్రావు మాట్లాడుతూ 1886 ముందు ప్రపంచంలో ఎక్కడా పనిగంటలు నియమ నిబంధనలు అమలులో లేవని కార్మిక హక్కులు, చట్టాలు లేవని అటువంటి పరిస్థితిలో కార్మికులకు 8 గంటలు పని ఉండాలని వారానికి ఒకరోజు శెలవు కావాలని, భోజన విరామం కావాలని సంఘం పెట్టుకొనే హక్కు, కార్మిక చట్టాలను అమలు చేయాలని 1886 మే1 నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేయగా.. పోలీసులకు కార్మికులకు మధ్య జరిగిన గొడవల్లో ఎందరో కార్మికులు అసువులుబాశారని ఆ కార్మికుల రక్తంతో తడిచిన చేతి రుమాలు నేడు కోట్లాదిమంది కార్మికులకు అండగా ఎర్ర జెండాగా మారిందని అంతటి చరిత్ర కలిగిన మేడే ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పండుగగా జరుపుకొంటున్నారని అన్నారు. కె రామకృష్ణ మాట్లాడుతూ మేడల మీద మేడలు పెరుగుతున్నాయి కానీ పేదవాడి కష్టాలు తీరటంలేదని ఎన్ని "మేడే"లు వచ్చినా రామరాజ్యం కలల రాజ్యంగానే మిగిలిపోతోందని నేను వ్వవసాయం చేస్తున్నాను హాయిగా ఉన్నాననే రైతులు కనపడటం లేదని, వ్వవసాయ కూలీల డొక్కలు చిక్కి పోతున్నాయని, ఇకా కార్మికులైతే చెప్పనఖ్ఖరలేదని చీకటిలో జీవితనావను లాగలేక లాగుతున్నారని, కరోనాలో దినసరి కూలీలు పిల్లలనెత్తుకొని కాలినడకన ,కూటికోసం పరుగులు పెడుతుంటే కన్నీరు ఆగటం లేదని వ్వవసాయాన్నీ పరిశ్రమలను ప్రభుత్వం ఆదరించి స్యయం ఉపాధి పధకాలను ప్రోత్సాహించాలని, అప్పుడే కర్షక,కార్మిక జనావళి జీవితాల్లో మే డే కన్పిస్తుందని నిఖిలలోకం హర్షిస్తుందని అన్నారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర సేవాదళ్ కన్వీనర్ చల్లా ప్రభాకర్రావు సమకూర్చిన నూతన వస్త్రాలను కార్మిక కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు చక్రవర్తి, కె రాజగోపాల్, ఉడతా వెంకటేశ్వర్రావు, నాయకులు దడాల చంద్రరావు, గండి రవికుమార్, లంకె యాకోబు, పారిశుధ్య కార్మికులు, రిక్షా కార్మికులు, ఎలక్ట్రికల్, అటో వర్కర్లు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.