కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
స్వచ్ఛత ఆటోలను ప్రారంభించిన ప్రభుత్వ విప్
పట్టణ కొత్తశోభ సంతరించుకుంటుంది.
పెన్ పవర్ , మందమర్రికరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా 1.18.8000 రూపాయలతో కొనుగోలు చేసిన24 స్వచ్చ ఆటోలను, 10.00.000 రూపాయల తో కొనుగోలు చేసిన ట్రాక్టర్ ట్రాలీ, వాటర్ ట్యాoకర్ లను అయన ప్రారంభించారు. మున్సిపాలిటీ లో విధులు నిర్వహిస్తున్న 63 మంది మున్సిపల్ వర్కర్లకు యూనిఫామ్స్, సోప్స్, సానిటైజర్, గ్లౌసెస్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వేవ్ రెండవ దశ అత్యంత ప్రమాదకరంగా మారిందని కరోనా కట్టడికి స్వీయనియంత్రణ మేలని ఆయన చెప్పారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని 24 వార్డులల్లో ఎక్కడ చెత్త కనపడ కూడదని ఆయన ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నేతృత్వంలో మునిసిపల్ మంత్రి కే.టి.ఆర్ మార్గదర్శకత్వం లో మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం అధిక నిధులు కేటాయించారని త్వరలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని అన్ని పనులు పూర్తి అయితే పట్టణం క్రొత్త శోభ సంతరించు కుంటదని దని ఆయన పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గద్దె రాజు, ఏ.సి.పి. రహమాన్ , సి.ఐ. ప్రమోద్ , ఎస్.ఐ. లింగంపల్లి భూమేష్ ఏ. అచ్యుత్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, డీ. సౌమ్య టెక్నికల్ ఆఫీసర్, యం. శంకర్ ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్, టి.ఆర్.ఎస్ నాయకులు జె. రవీందర్, కొంగల తిరుపతి రెడ్డి, మెడిపెల్లి మల్లేష్, బొరిగం వెంకటేష్, బట్టు రాజ్ కుమార్, తోట సురేందర్, రాం వేణు, బడికెల సంపత్ స్థానిక ప్రజా ప్రథినిధులు కార్యకర్తలు మున్సిపల్ కార్యలయం సిబ్బంది పాల్గొన్నారు.