Followers

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం

 రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం


 రైతుల కోసం గుజ్జు పరిశ్రమల యజమానులు అంగీకరించారు
 రోజుకు 500 మెట్రిక్ టన్నుల టమోటోలు కొనుగోలు కు సిద్ధం
 టమోటాల సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకి 
చిత్తూరు,  పెన్  పవర్

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు మరోసారి  గుజ్జు పరిశ్రమ యజమానులతో ఉద్యానవన శాఖ మార్కెటింగ్ శాఖల అధికారులు నేడు జరిపిన చర్చల్లో రోజుకు ఐదు వందలు మెట్రిక్ టన్నుల టమోటాలను కొనుగోలు చేసేందుకు అంగీకరించారని ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాసులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు పరిశ్రమ యజమానులతో కలెక్టరేట్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో లో రైతుల వద్ద నుంచి నేరుగా ఫ్యాక్టరీలు టమోటాలను కొనుగోలు చేస్తాయని అదేవిధంగా కొనుగోలు చేసిన టమోటా లకు సంబంధించిన సొమ్మును రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుందని ఇందుకు సంబంధించి ఏపీ మహిళా సంఘాల సమాఖ్య వారు కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహిస్తారు అని ఆయన అన్నారు. అదేవిధంగా మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు సుధాకర్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసి ఫ్యాక్టరీలకు టమోటాలను పంపడం జరుగుతుందని అలా పంపిన టమోటాలను గుజ్జు చేసి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు వివిధ మార్కెట్లలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించినట్లు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాల తరపున గోవర్ధన్ బాబీ మాట్లాడుతూ ప్రస్తుతం మామిడిపండ్ల సీజన్ మొదలు అయినా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు అందరూ సహకరించడం ఆనందమని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ గుజ్జు పరిశ్రమల యజమానులతో టేలికాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు  సుధాకర్, ఏ డి ఇందుమతి,ఉద్యాన వనశాఖ డి డి శ్రీనివాసులు, ఏ పి మాస్ వినాయక రెడ్డి, గుజ్జు పరిశ్రమ యజమానులు పాల్గొన్నారు.

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం

 కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం

 ఐరాల,  పెన్  పవర్

మేడే సందర్భంగా  మండల కేంద్రమైన ఐరాల లో ఈరోజు సిఐటియు జనరల్ సెక్రటరీ రాజశేఖర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు,  భవన నిర్మాణ కార్మికులు,  సంఘమిత్ర రాలు,  ఆశాలు వర్కర్లు,   అంగన్వాడీ వర్కర్లు,  అన్ని కార్మిక సంఘాలనాయకులతో కలసి మేడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.

 కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.

పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

స్వచ్ఛత ఆటోలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ 

పట్టణ కొత్తశోభ సంతరించుకుంటుంది.

పెన్ పవర్ , మందమర్రి

కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా 1.18.8000 రూపాయలతో కొనుగోలు చేసిన24 స్వచ్చ ఆటోలను, 10.00.000 రూపాయల తో కొనుగోలు చేసిన ట్రాక్టర్ ట్రాలీ, వాటర్ ట్యాoకర్ లను అయన ప్రారంభించారు. మున్సిపాలిటీ లో విధులు నిర్వహిస్తున్న 63 మంది మున్సిపల్ వర్కర్లకు యూనిఫామ్స్, సోప్స్, సానిటైజర్, గ్లౌసెస్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో కరోనా వేవ్ రెండవ దశ అత్యంత ప్రమాదకరంగా మారిందని కరోనా కట్టడికి స్వీయనియంత్రణ మేలని ఆయన చెప్పారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని 24 వార్డులల్లో ఎక్కడ చెత్త కనపడ కూడదని ఆయన ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నేతృత్వంలో మునిసిపల్ మంత్రి కే.టి.ఆర్ మార్గదర్శకత్వం లో మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం అధిక నిధులు కేటాయించారని త్వరలోనే  ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం ఏర్పాటు చేస్తామని  ఆయన తెలిపారు.అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని అన్ని పనులు పూర్తి అయితే పట్టణం క్రొత్త శోభ సంతరించు కుంటదని దని ఆయన పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్  గద్దె రాజు,  ఏ.సి.పి. రహమాన్ , సి.ఐ. ప్రమోద్ , ఎస్.ఐ. లింగంపల్లి  భూమేష్  ఏ. అచ్యుత్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, డీ. సౌమ్య టెక్నికల్ ఆఫీసర్, యం. శంకర్ ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్, టి.ఆర్.ఎస్ నాయకులు జె. రవీందర్, కొంగల తిరుపతి రెడ్డి, మెడిపెల్లి మల్లేష్, బొరిగం వెంకటేష్, బట్టు రాజ్ కుమార్, తోట సురేందర్, రాం వేణు, బడికెల సంపత్ స్థానిక ప్రజా ప్రథినిధులు  కార్యకర్తలు  మున్సిపల్ కార్యలయం సిబ్బంది పాల్గొన్నారు.

నగర సహాయ కమిషనర్ గా మహేష్

నగర సహాయ కమిషనర్ గా మహేష్ 

చిత్తూరు,  పెన్ పవర్

 చిత్తూరు నగరపాలక సహాయ కమిషనర్ గా జి. మహేష్ ను నియమిస్తూ నగర కమిషనర్ పి.విశ్వనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. నగర సహాయ కమిషనర్ గా ఉన్న శ్రీలక్ష్మి మెడికల్ సెలవుపై వెళ్లారు. దీంతో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా నగరపాలక డీఈఈ గా విధులు నిర్వహిస్తున్న జి.మహేష్ కు నగర సహాయ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మున్సిపల్ ఆఫీసు ఆవరణలో మే డే సంబరాలు

 మున్సిపల్ ఆఫీసు ఆవరణలో మే డే  సంబరాలు

మంచిర్యాల, మే 1, పెన్ పవర్

మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సుద్ధమల్ల హరికృష్ణ మున్సిపల్ ఆఫీసు ఆవరణలో మేడే సంబరాలు నిర్వహించామని పత్రికా ప్రకటనలో తెలిపారు.  ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ 135 వ మే డే  సంబరాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య పాల్గొన్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఆశయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏం తిరుపతి, సుధాకర్, సత్తయ్య, నవీన్, నరసయ్య కుమార్  మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఫీజు వసూలుకు 5న వేలం పాట

ఫీజు వసూలుకు 5న వేలం పాట 

 చిత్తూరు, పెన్ పవర్

 చిత్తూరు  నగరపాలక సంస్థకు చెందిన కూరగాయల మార్కెట్, స్లాటర్ హౌస్(జంతు వధశాల), కాసు బ్రహ్మానంద రెడ్డి బస్టాండ్, చేపల చెరువులు సంబంధించి 2021- 22 వ సంవత్సరానికి గాను ఫీజు వసూలు చేసుకొనుటకు ఈ నెల 5వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ పి.విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు  వేలం పాట జరుగుతుందని తెలిపారు. నగరపాలక సంస్థకు చెందిన వివిధ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో ఖాళీగా ఉన్న షాపుల రుసుమును నిర్ణయించిన నెలసరి అద్దె పై వాపసు చేయని గుడ్విల్ పద్ధతి పైన ఈ నెల 5వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటకు సంబంధించిన పూర్తి వివరాలకు కార్యాలయ పని వేళల్లో రెవెన్యూ విభాగం నందు సంప్రదించవచ్చని తెలిపారు.

సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవు

సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవు         


 ఐరాల,  పెన్ పవర్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారి ప్రైవేటీకరణ విధానాలు అరికట్టాలంటే కార్మిక ఉద్యోగ సంఘాలు ఏకమై పోరాటాలు చేయాలని లేదంటే కార్మిక చట్టాలు హక్కులు ఉండవని ఆటో వర్కర్స్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం విజయ్ కుమార్ కార్మికులకు హెచ్చరించారు. నేడు మేడేను పురస్కరించుకొని  మండల కేంద్రమైన ఐరాల లో  నందు  ఇండియన్ ఆటో వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ చందర్ మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్  మాట్లాడుతూ  దేశంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయని పార్లమెంటులో 300కు పైగా ఎంపీలు పెట్టుబడిదారులే ఉన్నారని కార్మిక వర్గానికి పార్లమెంటులో ఇలాంటి చట్టాలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. కార్మికులందరూ ఏకమై పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉందని ఐక్య పోరాటాలు అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు కార్మికులు మేడం జరుపుకుంటున్నారని,   ఎనిమిది గంటల పని కోసం పోరాటం చేసి పెట్టుబడిదారుల దాడులతో కార్మికులు చనిపోయారని అలాగే మే 1న ఎనిమిది గంటల పని సాధించుకున్న రోజు కనుక నేడు  మే డే ని  జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి ఎం సురేంద్ర నాథ్, ఆటో వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి శివకుమార్, ఐరాల మండల ఉపాధ్యక్షులు రాజా,  ప్రధాన కార్యదర్శి  మోహన్ రెడ్డి,  కోశాధికారి  హుమయున్ భాష,  వేణు, షబ్బీర్,  గ్రీన్ అంబాసిడర్ యూనియన్ నాయకులు రాజా,  సీఐటీయూ జనరల్ సెక్రెటరీ రాజశేఖర్  తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...