Followers

నగర సహాయ కమిషనర్ గా మహేష్

నగర సహాయ కమిషనర్ గా మహేష్ 

చిత్తూరు,  పెన్ పవర్

 చిత్తూరు నగరపాలక సహాయ కమిషనర్ గా జి. మహేష్ ను నియమిస్తూ నగర కమిషనర్ పి.విశ్వనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. నగర సహాయ కమిషనర్ గా ఉన్న శ్రీలక్ష్మి మెడికల్ సెలవుపై వెళ్లారు. దీంతో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా నగరపాలక డీఈఈ గా విధులు నిర్వహిస్తున్న జి.మహేష్ కు నగర సహాయ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మున్సిపల్ ఆఫీసు ఆవరణలో మే డే సంబరాలు

 మున్సిపల్ ఆఫీసు ఆవరణలో మే డే  సంబరాలు

మంచిర్యాల, మే 1, పెన్ పవర్

మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సుద్ధమల్ల హరికృష్ణ మున్సిపల్ ఆఫీసు ఆవరణలో మేడే సంబరాలు నిర్వహించామని పత్రికా ప్రకటనలో తెలిపారు.  ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ 135 వ మే డే  సంబరాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య పాల్గొన్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఆశయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏం తిరుపతి, సుధాకర్, సత్తయ్య, నవీన్, నరసయ్య కుమార్  మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఫీజు వసూలుకు 5న వేలం పాట

ఫీజు వసూలుకు 5న వేలం పాట 

 చిత్తూరు, పెన్ పవర్

 చిత్తూరు  నగరపాలక సంస్థకు చెందిన కూరగాయల మార్కెట్, స్లాటర్ హౌస్(జంతు వధశాల), కాసు బ్రహ్మానంద రెడ్డి బస్టాండ్, చేపల చెరువులు సంబంధించి 2021- 22 వ సంవత్సరానికి గాను ఫీజు వసూలు చేసుకొనుటకు ఈ నెల 5వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ పి.విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు  వేలం పాట జరుగుతుందని తెలిపారు. నగరపాలక సంస్థకు చెందిన వివిధ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో ఖాళీగా ఉన్న షాపుల రుసుమును నిర్ణయించిన నెలసరి అద్దె పై వాపసు చేయని గుడ్విల్ పద్ధతి పైన ఈ నెల 5వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటకు సంబంధించిన పూర్తి వివరాలకు కార్యాలయ పని వేళల్లో రెవెన్యూ విభాగం నందు సంప్రదించవచ్చని తెలిపారు.

సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవు

సమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవు         


 ఐరాల,  పెన్ పవర్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారి ప్రైవేటీకరణ విధానాలు అరికట్టాలంటే కార్మిక ఉద్యోగ సంఘాలు ఏకమై పోరాటాలు చేయాలని లేదంటే కార్మిక చట్టాలు హక్కులు ఉండవని ఆటో వర్కర్స్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం విజయ్ కుమార్ కార్మికులకు హెచ్చరించారు. నేడు మేడేను పురస్కరించుకొని  మండల కేంద్రమైన ఐరాల లో  నందు  ఇండియన్ ఆటో వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ చందర్ మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్  మాట్లాడుతూ  దేశంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయని పార్లమెంటులో 300కు పైగా ఎంపీలు పెట్టుబడిదారులే ఉన్నారని కార్మిక వర్గానికి పార్లమెంటులో ఇలాంటి చట్టాలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. కార్మికులందరూ ఏకమై పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉందని ఐక్య పోరాటాలు అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు కార్మికులు మేడం జరుపుకుంటున్నారని,   ఎనిమిది గంటల పని కోసం పోరాటం చేసి పెట్టుబడిదారుల దాడులతో కార్మికులు చనిపోయారని అలాగే మే 1న ఎనిమిది గంటల పని సాధించుకున్న రోజు కనుక నేడు  మే డే ని  జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి ఎం సురేంద్ర నాథ్, ఆటో వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి శివకుమార్, ఐరాల మండల ఉపాధ్యక్షులు రాజా,  ప్రధాన కార్యదర్శి  మోహన్ రెడ్డి,  కోశాధికారి  హుమయున్ భాష,  వేణు, షబ్బీర్,  గ్రీన్ అంబాసిడర్ యూనియన్ నాయకులు రాజా,  సీఐటీయూ జనరల్ సెక్రెటరీ రాజశేఖర్  తదితరులు పాల్గొన్నారు.

కుక్కల వేటలో జింక మృతి

కుక్కల వేటలో జింక మృతి

 పూతలపట్టు,  పెన్ పవర్

పూతలపట్టు నియోజకవర్గం, పూతలపట్టు మండలం, అమ్మేపల్లి గ్రామ పంటపొలాల్లో జింక మృతి. గ్రామస్తుల కథనం మేరకు పక్కనే అడవి ఉంది అక్కడనుండి జింకను కుక్కలు తరుముకొచ్చాయి.  గ్రామ సమీపంలో సుమారు 5 గంటల ప్రాంతంలో కుక్కల తరుముకొని వచ్చిన జింక పంట పొలాల్లో వేసిన కంచికి తగులుకోవడంతో కుక్కలు దాడి  చేసి  దానిని చంపేసాయి. ఇది గమనించిన గ్రామస్తులు అరవడంతో కుక్కలు పారిపోయాయి. జింక అప్పటికే మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. దీనిపై అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు.

మున్సిపాలిటీ నూతన వాహనాలను ప్రారంభించిన-ఎమ్మెల్యే బాల్క సుమన్

 మున్సిపాలిటీ నూతన వాహనాలను ప్రారంభించిన-ఎమ్మెల్యే  బాల్క సుమన్

పెన్ పవర్ , మందమర్రి 

 క్యాత న్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ నూతన వాహనాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రగతి నిధుల నుండి 18లక్షల తో 2 ట్రాక్టర్ లను,డి.ఎం.ఎఫ్.టి నిధుల నుండి 1,05,60,000 రూపాయలతో వ్యయం తో  16 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. త్వరలో పట్టణంలో 10 కోట్లరూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మాణం  పనులకు టెండర్ ప్రక్రియ మొదలవుతుందని,కోటి రూపాయలతో శ్మశానవాటికకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు.3 లక్షల రూపాయల సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.పట్టణంలో ని నిరుపేద ముస్లిం మైనార్టీ ప్రజలకు రంజాన్ పండుగకు  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కానుకలను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల కు  సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని,షాదీ ముబారక్, ఇమామ్,మౌజామ్ లకు గౌరవ వేతనం,పేద ముస్లిం విద్యార్థులకు 20లక్షల వరకు ఓవర్సిస్ స్కాలర్షిప్, మక్కా యాత్రికులకు ఆర్ధిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు యాకూబ్ అలి ,కౌన్సిల్ సభ్యులు, అనిల్ రావు  సత్యం మశేష్ శివ కిరణ్ పార్వతి విజయ తిరుపతి పారుపల్లి అబ్దుల్ అజీజ్ నరసింహారావు పూల మల్లయ్య కమిషనర్ వెంకట నారాయణ, మేనేజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మాజీసర్పంచ్ చిన్నారావు సేవలు చిరస్మరణీయం

మాజీసర్పంచ్ చిన్నారావు సేవలు చిరస్మరణీయం         


పెన్ పవర్, కరప: 

వాకాడ గ్రామసర్పంచ్ గా మండల ఎస్సీ సెల్ నాయకుడుగా, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకునిగా మొసలి చిన్నారావు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన లేని లోటు భర్తీకానిదని పలువురు ఎస్సీనాయకులు పేర్కొన్నారు. స్థానిక ప్రాధమిక ఆరోగ్యం కేంద్రం ఎదురుగా అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం మండల అంబేడ్కర్ యువజన సేవాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాకాడ మాజీ సర్పంచ్ మొసలి చిన్నారావు సంతాప సమావేశం నిర్వహించారు. ముందుగా ఎస్సీనాయకులు భారతరాజ్యాంగకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ చిన్నారావు చిత్రపటానికి మండల అంబేడ్కర్ యువజన సేవాసంఘం అధ్యక్షుడు చిన్నం వెంకటేశ్వరరావు తదితర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు వక్తలు చిన్నరావుతో తమకున్న అనుబంధాన్ని చేసిన చేసిన సేవలను మననం చేసుకున్నారు. మండల ఎస్సీనాయకులు సవిలే రాజేష్, మారెళ్ల వెంకటరమణ, రొక్కాల నూకరాజు, బచ్చలి బులిఅప్పారావు, దాలివర్తి శ్రీనివాస్, వజ్రపు కామేశ్వరరావు, జిల్లా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...