కరప మండలంలో 87 శాతం పింఛన్ల పంపిణీ
పెన్ పవర్,కరప:
మండల పరిధిలోని 23 గ్రామాల్లో 10,737 మందికి వివిధ రకాల పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా మొదటిరోజు శనివారం 9,437 మందికి (87.89 శాతం) పంపిణీ చేయడం జరిగిందని ఎంపీడీఓ కర్రె స్వప్న తెలిపారు. అన్నిరకాల పింఛన్లసొమ్ము రూ 2,52,41,500 లు లబ్దిదారులకు బట్వాడా చేయాల్సి ఉండగా రూ.2,19,25,750 లు ఇవ్వడం జరిగిందన్నారు. పింఛన్ల పంపిణీలో ఉప్పలంక సచివాలయం 94.29 శాతం, పెనుగుదురు 93.42 శాతం, గొర్రిపూడి 92,67 శాతంతో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నాయన్నారు. కొంతమంది గ్రామంలో లేక, అనారోగ్య కారణాలు, ఇతరత్రా లబ్దిదారులు ఇంటివద్ద అందుబాటులో లేక, సిగ్నల్స్ లేకపోవడం వల్ల నూరుశాతం పంపిణీ జరగలేదని ఎంపీడీఓ తెలిపారు. ఈఓపీఆర్డీ సీహెచ్ బాలాజీవెంకటరమణ పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు. ఒకపక్క కరోనా సెకండ్ వేవ్, మరోపక్క వేసవి ఎండలు ఉదృతంగా ఉన్నా కూడా అధికారులు, గ్రామవలంటీర్లు లబ్దిదారులకు పింఛన్లు పంపిణీచేయడంపై లబ్దిదారులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. అనారోగ్య కారణాలతో కాకినాడ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చినకొత్తూరు గ్రామానికి చెందిన చింతా వీర్రాజుకు గ్రామవలంటీర్ ఎర్రంశెట్టి ఫణికేసరి ఆసుపత్రికెళ్లి ఫించనాసొమ్మును అందజేశారు. గతంలో పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయం వద్ద పడిగాపులు కాచేవారని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని ఆసుపత్రికి వచ్చి పింఛన్ ఇచ్చారని లబ్దిదారుడు వీర్రాజు సంతోషం వ్యక్తంచేశాడు.