Followers

మాజీసర్పంచ్ చిన్నారావు సేవలు చిరస్మరణీయం

మాజీసర్పంచ్ చిన్నారావు సేవలు చిరస్మరణీయం         


పెన్ పవర్, కరప: 

వాకాడ గ్రామసర్పంచ్ గా మండల ఎస్సీ సెల్ నాయకుడుగా, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకునిగా మొసలి చిన్నారావు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన లేని లోటు భర్తీకానిదని పలువురు ఎస్సీనాయకులు పేర్కొన్నారు. స్థానిక ప్రాధమిక ఆరోగ్యం కేంద్రం ఎదురుగా అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం మండల అంబేడ్కర్ యువజన సేవాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాకాడ మాజీ సర్పంచ్ మొసలి చిన్నారావు సంతాప సమావేశం నిర్వహించారు. ముందుగా ఎస్సీనాయకులు భారతరాజ్యాంగకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ చిన్నారావు చిత్రపటానికి మండల అంబేడ్కర్ యువజన సేవాసంఘం అధ్యక్షుడు చిన్నం వెంకటేశ్వరరావు తదితర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు వక్తలు చిన్నరావుతో తమకున్న అనుబంధాన్ని చేసిన చేసిన సేవలను మననం చేసుకున్నారు. మండల ఎస్సీనాయకులు సవిలే రాజేష్, మారెళ్ల వెంకటరమణ, రొక్కాల నూకరాజు, బచ్చలి బులిఅప్పారావు, దాలివర్తి శ్రీనివాస్, వజ్రపు కామేశ్వరరావు, జిల్లా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మేడే స్ఫూర్తితో పాలకుల తప్పుడు విధానాలపై పోరాడదాం, సిపిఎం

 మేడే స్ఫూర్తితో పాలకుల తప్పుడు విధానాలపై పోరాడదాం, సిపిఎం

పెన్ పవర్,  మందమర్రి 

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సోమగూడెం ట్యాంక్ బస్తీలో సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా సంకె రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి సాపాటు శంకర్ గ్రామ సర్పంచ్ హాజరై జెండా ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ ప్రజల కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వం రద్దు చేస్తూ 12 గంటల పని విధానాన్ని అమలు జరుపుటకు నిర్వహించడం జరిగింది పోరాట ఫలితంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది కరోనా కూరల్లో చిక్కుకొని ప్రజలు కార్మికులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్న కేంద్ర ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు దీని ఫలితంగా ప్రజలు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి మేడే స్ఫూర్తితో ప్రజలు కార్మికులు తప్పుడు విధానాలు అమలు జరుపుకున్న పాలకులపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంకె, భానుచందర్, జనసేన నాయకులు గ్రామస్తులు రమేష్ శ్రీనివాస్ ఎస్ రవి కోటేష్ శేఖర్ రాజన్ పోచం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

కరప మండలంలో 87 శాతం పింఛన్ల పంపిణీ

 కరప మండలంలో 87 శాతం పింఛన్ల పంపిణీ

 పెన్ పవర్,కరప: 

మండల పరిధిలోని 23 గ్రామాల్లో 10,737 మందికి వివిధ రకాల పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా మొదటిరోజు శనివారం 9,437 మందికి (87.89 శాతం) పంపిణీ చేయడం జరిగిందని ఎంపీడీఓ కర్రె స్వప్న తెలిపారు. అన్నిరకాల పింఛన్లసొమ్ము రూ 2,52,41,500 లు లబ్దిదారులకు బట్వాడా చేయాల్సి ఉండగా రూ.2,19,25,750 లు ఇవ్వడం జరిగిందన్నారు. పింఛన్ల పంపిణీలో ఉప్పలంక సచివాలయం 94.29 శాతం, పెనుగుదురు 93.42 శాతం, గొర్రిపూడి 92,67 శాతంతో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నాయన్నారు. కొంతమంది గ్రామంలో లేక, అనారోగ్య కారణాలు, ఇతరత్రా లబ్దిదారులు ఇంటివద్ద అందుబాటులో లేక, సిగ్నల్స్ లేకపోవడం వల్ల నూరుశాతం పంపిణీ జరగలేదని ఎంపీడీఓ తెలిపారు. ఈఓపీఆర్డీ సీహెచ్ బాలాజీవెంకటరమణ పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు. ఒకపక్క కరోనా సెకండ్ వేవ్, మరోపక్క వేసవి ఎండలు ఉదృతంగా ఉన్నా కూడా అధికారులు, గ్రామవలంటీర్లు లబ్దిదారులకు పింఛన్లు పంపిణీచేయడంపై లబ్దిదారులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. అనారోగ్య కారణాలతో కాకినాడ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చినకొత్తూరు గ్రామానికి చెందిన చింతా వీర్రాజుకు గ్రామవలంటీర్ ఎర్రంశెట్టి ఫణికేసరి ఆసుపత్రికెళ్లి ఫించనాసొమ్మును అందజేశారు. గతంలో పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయం వద్ద పడిగాపులు కాచేవారని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని ఆసుపత్రికి వచ్చి పింఛన్ ఇచ్చారని లబ్దిదారుడు వీర్రాజు సంతోషం వ్యక్తంచేశాడు.

పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి

 పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి

పెన్ పవర్, రావులపాలెం

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే కరోన వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ సభ్యులు డిమాండ్ చేసారు. ఎస్ఎఫ్ఐ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కె.దుర్గాప్రసాద్, కేతా ప్రేమ్ కుమార్ ల ఆధ్వర్యంలో శనివారం శనివారం పరీక్షల రద్దు కోరుతూ రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసిల్దార్  యూసఫ్ జిలానికి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ   రాష్ట్రంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తుందని, ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు గతం కన్నా ఎక్కువ మంది వ్యాపిస్తుందన్నారు.

 రాష్ట్రంలో పదో తరగతి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారని, ఈ నిర్ణయం సరియైనది కాదని అన్నారు. ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసిందని, దాదాపు తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేసాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో పరీక్షలు జరుగుతాయో లేదో అనే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారని, రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉందని అన్నారు.  వీరికి గనక పరీక్షలు నిర్వహిస్తే కరోన వ్యాధి వారికి, వారి కుటుంబాలకు గ్రామాల్లో సైతం వ్యాపించే ప్రమాదం పొంచి ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పరిస్థితుల్లో పదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు వాయిదా వేయాలని  డిమాండ్ చేసారు.  అధికారులకు నాయకులకు కరోన వస్తే పక్క రాష్ట్రాలకు పరుగులు తీసి వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో విద్యార్ధులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్షిజన్ లు లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని పరీక్షలు నిర్వహిస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కావున పరీక్షలు వాయిదా వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్. సత్యనారాయణ, ఎస్. సందీప్ కుమార్, ప్రసన్న కుమార్, విశ్వతేజ, శ్రీనివాసు, విద్యార్ధులు పాల్గొన్నారు.

జయహో.. జర్నలిస్టులారా.!

 జయహో.. జర్నలిస్టులారా.!

 కలం కార్మికుడు..  గీత కార్మికుడు.! ప్రభుత్వానికి విజ్ఞప్తి

పర్కాల లక్ష్మీనారాయణ గౌడ్ (జర్నలిస్ట్)

పెద్దపల్లి రామగుండం ,  పెన్ పవర్ 

మే-1 అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఒక కలం కార్మికుడిలా.. ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. కలం కార్మికునిలా పని చేస్తే నెలకు వచ్చే జీతం బత్యాలు లేక భార్య పిల్లలను ఆకలితో అలమటిస్తానేమోనని కుటుంబం కోసం గీత కార్మికునిలా పని చేస్తూనే సమాజం శ్రేయస్సు కోసం పాటుపడాలని నా వంతుగా ఏదోలా కృషి చేయాలని తాపత్ర్యంతో వార్తలను అందిస్తూ.. ఈత చెట్లను గీసుకుని బ్రతుకు జట్కా బండిని ఎళ్ళదీస్తున్నానని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయని ఉపాధ్యాయులు విధ్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తే.. వారిని గుర్తించిన ఇదే ప్రభుత్వం  దేశ రాష్ట్రల భవిష్యత్ నిర్ణయించే కలం కార్మికులు (జర్నలిస్టులు) సమాజం కోసం ఆహర్నిశలు పరితపిస్తూ.. శ్రమిస్తూ.. దేశంలోని రాష్ట్రంలోని జిల్లాల మండలలలో జరిగే అనేక సంఘటనలను గూర్చి ప్రతి ఒక విషయాన్ని సమాచార రూపంలో తీర్చిదిద్ది వార్త రూపంలో పత్రికలలో ప్రచురిస్తూ ప్రభుత్వానికి  ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తూ సమాజానికి సమాచారాన్ని చేరవేస్తున్న జర్నలిస్టులను కూడ కరోనా వారియర్స్ గా గుర్తించి కరోనా వైరస్ సోకిన జర్నలిస్టులకు ప్రమాధ భీమా ప్రకటించి వారి వైధ్య పరంగా ఆదుకునేలా చర్యలు చేపట్టాలని ఎలాగైతే ప్రయివేటు టీచర్లకు 2 వేల రూపాయలు 25 కిలోల బియ్యం ఇస్తున్నారో.. అదే విధంగా జర్నలిస్టులకు అందజేయాలని అలాగే కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్-గ్రేషియా ప్రకటించి వెంటనే అమలు చేసి అందజేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన తెరాస రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేస్తున్నాము. అమరులైన జర్నలిస్టులకు నా శోకతప్త మా హృదయంతో ఆశ్రునివాళులు అర్పిస్తూ.. అమర్ రహే జర్నలిస్టులా.! జర్నలిస్టు అమర వీరులకు జోహార్లు.! వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి.! జయహో జర్నలిస్టులా.! జై హింద్.!



భౌతిక దూరం పాటిస్తూ మేడే దినోత్సవ వేడుకలు

భౌతిక దూరం పాటిస్తూ  మేడే దినోత్సవ వేడుకలు

పెన్ పవర్, కరప:

మండలంలోని పలు గ్రామాల్లో కనివారం కోవిడ్ నిబంధనల మేరకు మేడే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరప, కొరుపల్లి, వాకాడ, పెనుగుదురు, నడకుదురు, గొర్రిపూడి తదితర గ్రామాల్లో సీఐటీయు ఆధ్వర్యంలో భవననిర్మాణ కార్మికులు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, మిడ్డే మీల్ వర్కర్లు, వీఏఓలు, కార్మిక, ఐక్య ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా భౌతిక దూరం పాటిస్తూ ఈవేడుకలు నిర్వహించారు. సీఐటీయు జెండా ఆవిష్కరించి, కార్మికహక్కులు, కరోనాపై సమైక్యంగా పోరాటం చేద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా సీఐటీయు జిల్లా అధ్యక్షురాలు ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ కార్మికులు, శ్రమజీవులందరికీ ఉచితంగా కరోనా టీకా, మందులు ఇవ్వాలన్నారు. కార్మికవర్గాన్ని, ప్రజలను విభజించే ప్రయత్నాలను ఐక్యంగా పోరాడి ఓడించాలన్నారు. సీఐటీయు ప్రతినిధులు బుడ్డాల రాంప్రసాద్, సత్యవతి. భవాని తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్టియు ఆధ్వర్యంలో కరప, వేళంగి గ్రామాల్లో ఐఎఫ్ఎయు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ వర్కర్స్ మేడే దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఐఎల్బీయు జిల్లా సహాకార్యదర్శి గుబ్బల ఆదినారాయణ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రాగుల రాఘవ, జి.నూకరాజు, ఐఎల్టీయు జిల్లా కమిటీ నాయకుడు గణేసులు శ్రీనివాస్, దళితసంఘం నాయకులు వి.శ్రీనివాస్, టి.దేవి, జి. ఏను. బంగారు రాజు ఎస్. సత్యవతి వై.శ్రీను పాల్గొన్నారు..

వి.ఆర్.పురం మండలంలో ఘనంగా 135వ "మేడే" వేడుకలు.

  వి.ఆర్.పురం మండలంలో ఘనంగా 135 వ "మేడే" వేడుకలు

వి.ఆర్.పురం, పెన్ పవర్ 

 వి.ఆర్.పురం మండలంలో రేఖపల్లి,  వి.ఆర్.పురం, వడ్డిగూడెం గ్రామాల్లో సిపిఐ మండల కార్యదర్శి కర్నాటి యేసు (రాంబాబు)ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కర్నాటి యేసు మాట్లాడుతూ 1886 ముందు ప్రపంచంలో ఎక్కడా పనిగంటలు నియమ నిబంధనలు అమలులో లేవని కార్మిక హక్కులు, చట్టాలు లేవని అటువంటి పరిస్థితిలో కార్మికులకు 8 గంటలు పని ఉండాలని వారానికి ఒకరోజు శెలవు కావాలని, భోజన విరామం కావాలని సంఘం పెట్టుకొనే హక్కు, కార్మిక చట్టాలను అమలు చేయాలని 1886 మే1 నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేయగా.. పోలీసులకు కార్మికులకు మధ్య జరిగిన గొడవల్లో ఎందరో కార్మికులు అసువులుబాశారని ఆ కార్మికుల రక్తంతో తడిచిన చేతి రుమాలు నేడు కోట్లాదిమంది కార్మికులకు అండగా ఎర్ర జెండాగా మారిందని అంతటి చరిత్ర కలిగిన మేడే ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పండుగగా జరుపుకొంటున్నారని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో శివగిరి కామేశ్వరరావు ముత్యాల దయాకర్  బాగుల దుర్గాప్రసాద్ అల్లుడు శేఖర్  బోర్ర సాయిబాబు శివగిరి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...