Followers

వి.ఆర్.పురం మండలంలో ఘనంగా 135వ "మేడే" వేడుకలు.

  వి.ఆర్.పురం మండలంలో ఘనంగా 135 వ "మేడే" వేడుకలు

వి.ఆర్.పురం, పెన్ పవర్ 

 వి.ఆర్.పురం మండలంలో రేఖపల్లి,  వి.ఆర్.పురం, వడ్డిగూడెం గ్రామాల్లో సిపిఐ మండల కార్యదర్శి కర్నాటి యేసు (రాంబాబు)ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కర్నాటి యేసు మాట్లాడుతూ 1886 ముందు ప్రపంచంలో ఎక్కడా పనిగంటలు నియమ నిబంధనలు అమలులో లేవని కార్మిక హక్కులు, చట్టాలు లేవని అటువంటి పరిస్థితిలో కార్మికులకు 8 గంటలు పని ఉండాలని వారానికి ఒకరోజు శెలవు కావాలని, భోజన విరామం కావాలని సంఘం పెట్టుకొనే హక్కు, కార్మిక చట్టాలను అమలు చేయాలని 1886 మే1 నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేయగా.. పోలీసులకు కార్మికులకు మధ్య జరిగిన గొడవల్లో ఎందరో కార్మికులు అసువులుబాశారని ఆ కార్మికుల రక్తంతో తడిచిన చేతి రుమాలు నేడు కోట్లాదిమంది కార్మికులకు అండగా ఎర్ర జెండాగా మారిందని అంతటి చరిత్ర కలిగిన మేడే ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పండుగగా జరుపుకొంటున్నారని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో శివగిరి కామేశ్వరరావు ముత్యాల దయాకర్  బాగుల దుర్గాప్రసాద్ అల్లుడు శేఖర్  బోర్ర సాయిబాబు శివగిరి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు ఆపన్న హస్తం అందించేందుకు బి ఎల్ ఆర్ ట్రస్ట్ సిద్ధం

 పేదలకు ఆపన్న హస్తం అందించేందుకు బి ఎల్ ఆర్ ట్రస్ట్ సిద్ధం... లక్ష్మారెడ్డి

పెన్ పవర్, కాప్రా 

కరోనా విజృంభిస్తున్న  సమయంలో పేద ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు బి ఎల్ ఆర్ ట్రస్ట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి లక్ష్మా రెడ్డి స్పష్టం చేశారు.  కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ గృహ కల్ప కాలనీ లో శనివారం బి ఎల్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తి నిరోధక సోడియం హైపోక్లోరైడ్ రసాయన ద్రావణం పిచికారి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంగా కోవిడ్ ప్రభావిత పేదలు నివాసముంటున్న కాలనీలు బస్తీల్లో నిత్యవసరాలను అందించి వారి కష్టాలు తీర్చుతూ పీ పీఈ కిట్లు , మాస్కులు, శానిటైజర్ లు,  గ్లౌజులు అందజేసినట్లు లక్ష్మారెడ్డి గుర్తుచేశారు. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పేదలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ఆస్పత్రులలో బెడ్లు దొరకక పేదలైన కరోనా వ్యాధి గ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ చావు అంచులలోకి వెళ్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  కరోనా రక్కసి నుంచి మనకు మనము మన కుటుంబాలను రక్షించ కునేందుకు గాను మాస్క్ లు ధరిస్తూ పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత దూరం పాటించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో బి ఎల్ ఆర్ ట్రస్ట్ ప్రతినిధి నేమూరి మహేష్ గౌడ్, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి, ఇందిరమ్మ గృహకల్ప కాలనీ అధ్యక్ష కార్యదర్శులు రాచకొండ రోశయ్యగౌడ్, బత్తిని భాస్కర్ గౌడ్, ఎస్ సాగర్ గౌడ్, కే లక్ష్మణ్, సిహెచ్ పద్మ, సుబ్బయ్య, రంజిత్, వెంకటేష్, వినయ్, యూసుఫ్, సాయి కిరణ్, కాలనీవాసులు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏఎస్ఐ వీరభద్రరావు సేవలు మరువలేనివి

 ఏఎస్ఐ వీరభద్రరావు సేవలు మరువలేనివి

 పెన్ పవర్,కరప:

విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసి, అందించిన సేవలు మరువలేనివని కాకినాడరూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఏఎస్ఐ పబ్బినీడి చినవీరభద్రరావు పదవీవిరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగస్తులకు పదవీవిరమణ తప్పదని, అయితే పదవీకాలంలో చేసిన సేవలే ప్రజల్లో గుర్తుండిపోతాయన్నారు. కరప ఎస్ఐ డి. రామారావు మాట్లాడుతూ కానిస్టేబుల్, హెచ్సీగా, ఏఎస్ఐగా అందించిన సేవలు అందరికీ ఆదర్శమన్నారు. ఈసందర్భంగా కరప పోలీసు స్టేషన్ సిబ్బంది తరపున ఏఎస్ఐ చినవీరభద్రరావు, శివకుమారి దంపతులను సీఐటీ మురళీకృష్ణ ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు గొల్లపల్లి ప్రసాదరావు, సవిలే రాజేష్, వజ్రపు కామేశ్వరరావు, ఏఎస్ఐ జి. ప్రసన్నకుమార్, హెచ్సీ పి. రాజారావు, కె. చిట్టిబాబు, శ్రీనివాస్, హరిబాబు, శివ తదితరులు పాల్గొన్నారు.

నిజమైన ప్రజాసేవకులు ఈ పారిశుధ్య కార్మికులే

 నిజమైన ప్రజాసేవకులు  ఈ పారిశుధ్య కార్మికులే              

పెన్ పవర్, ఆలమూరు 

ఆలమూరు మండలం  సంధిపూడి పంచాయితీలో  పారిశుధ్య కార్మికుల గా పనిచేస్తున్న ఇరువురికి  కార్మిక దినోత్సవం సందర్భంగా  సర్పంచ్  తోట భవాని   నూతన వస్త్రాలను ఇచ్చి గౌరవించడం జరిగింది.   ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ ఈ కరోనా ప్రారంభం నుండి  తమ ప్రాణాలను  సైతం లెక్కచేయకుండా  పారిశుధ్య పనులను చేస్తూ  ప్రజల ఆరోగ్యం కాపాడటంలో  ప్రముఖ పాత్ర పోషిస్తున్న  వీరి సేవలకు వెలకట్టలేమన్నారు.   అలాగే ప్రజలు కూడా  పరిసరాలను అపరిశుభ్రత గా  ఉంచుకోకుండా జాగ్రత్తగా  ఉండటం వలన మాత్రమే  ఎటువంటి  అనారోగ్యం బారినపడకుండా ఉండి  ఈ కరోనా ను  దైర్యంగ ఎదుర్కోవడానికి అవకాశం  ఉంటుందన్నారు. దయచేసి  ప్రతీ ఒక్కరూ  నిర్లక్ష్యంగా ఉండకుండా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  సూచనలు పాటిస్తూ  ప్రంట్ లైన్ వారియర్స్ కి  సహకరిస్తూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ  బాధ్యతగా  నడుచుకోవాలని  ఆమె కోరారు.  ఈ కార్యక్రమంలో  ఆమెతో పాటు వార్డు సభ్యులు,  సచివాలయ సిబ్బంది, తదితరులు   పాల్గొన్నారు.

మంత్రి వనిత కు 2 వ విడత కోవిడ్ వ్యాక్సిన్

 మంత్రి వనిత కు  2 వ విడత కోవిడ్ వ్యాక్సిన్

తాడేపల్లిగూడెం, పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత శనివారం  తాడేపల్లిగూడెంలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ లో భర్త డాక్టర్ తానేటి శ్రీనివాస్ తో 2 వ విడత కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. మంత్రి వనిత మాట్లాడుతూ కరోన సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. ప్రతీ ఒక్కరు కరోన నియంత్రణ నిబంధనలు పాటిస్తూ, అవసరమైతే తప్ప మిగిలిన సమయాల్లో బయటకు రాకూడదని తెలిపారు. బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి, మనల్ని, మనకుటుంబాన్ని, మనసమాజాన్ని కరోన నుండి కాపాడుకోవాలని తెలియజేశారు.

చల్లా ప్రభాకర్రావు ఆధ్వర్యంలో ఘనంగా "మే""డే" వేడుకలు...

 చల్లా ప్రభాకర్రావు ఆధ్వర్యంలో ఘనంగా "మే""డే" వేడుకలు...

పెన్ పవర్, ఆలమూరు 

కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన ఆలమూరు వైసిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి, సీనియర్ నాయకులు చల్లా ప్రభాకర్రావు ఆధ్వర్యంలో మేడే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలమూరు బస్టాండ్ సెంటర్లో గల అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఎర్ర జెండాను ఎగరవేశారు. ముందుగా మహాత్మ గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం రిక్షా, పంచాయతీ కార్మికులకు నూతన వస్త్రాలు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8గంటల పని దినాన్ని చేపట్టాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపడుతుండగా చికాగో నగరంలో  ప్రభుత్వం కార్మికులపై కాల్పులు చేపట్టినట్టు తెలిపారు. దీంతో అనేక మంది కార్మికులు మృతి చెందారని వారి ప్రాణాల త్యాగ ఫలితమే మనం జరుపుకునే మేడే వేడుకలన్నారు. దానికి ప్రతీకగా మేడేను ప్రపంచ కార్మికుల దినంగా గుర్తించినట్టు ఆయన తెలిపారు. ప్రపంచ కార్మికులంతా ఐక్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు సర్పంచ్ నాతి లావణ్య కుమార్ రాజా, ఉప సర్పంచ్ చల్లా సీతామాలక్ష్మి భూషణం, సిపిఐ నేత కొండేటి రామకృష్ణ, గొల్లపల్లి కిరణ్, నాతి కిరణ్, అశోక్, కోలా నాని, డి.పి.రావు, ఉమా తదితరులు పాల్గొన్నారు..

రాబోయే వర్షా కాలంలో ఇసుక నిల్వలు ఉంచాలి...

రాబోయే వర్షా కాలంలో ఇసుక నిల్వలు ఉంచాలి...

కొవ్వూరు, పెన్ పవర్

జిల్లాలో రాబోయే వర్షా కాలంలో జూన్ 15 వ తేదీ నాటికి సుమారు 5 లక్షల టన్నుల ఇసుకను నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్  రెవెన్యూ కె.వెంకట రమణా రెడ్డి అన్నారు. కొవ్వూరు  ఆర్డీవో కార్యాలయంలో శనివారం ఏ.పి.యం.డి.సి. అధికారులతో, ఇసుక ర్యాంపుల్లో ఉన్న ఇసుక సొసైటీ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఇసుక ఉత్పత్తి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుక పట్టా ర్యాంపులు, ఓపెన్ ర్యాంపులు, డీసిల్టేశన్ ర్యాంపులు, ఇసుక డిపోలు మొదలగునవి త్వరిత గతిన ప్రారంభించే విధంగా చర్యలు తీసు కోవాలని అన్నారు. 28 డీసిల్టేశన్ ర్యాంపు ల్లో సుమారు 18 మాత్రమే పనిచేస్తున్నాయని, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు వెళ్లి పోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని, వాళ్ళని వెనక్కి పిలిచి అన్ని ర్యాంపులు పనిచేసే విధంగా చర్యలు తీసు కోవడం జరుగుతుంది అని అన్నారు.  10 పట్టా ర్యాంపులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అని అన్నారు.  22 ఓపెన్ ర్యాంపుల్లో 7 నుండి 8 మాత్రమే పని చేయడం జరుగుతోంది అని అన్నారు. ఇసుక ఉత్పత్తి ని పెంచేందుకు అన్ని ర్యాంపులు తెరిపించాలని  ఏ.పి.యం.డి.సి. అధికారులను ఆదేశించారు. 

కరోనా వైరస్ భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి అని, 4 రకాల పోస్టర్స్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ  కె. వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ టీకాలు తప్పనిసరిగా  వేయించుకోవాలి అని అన్నారు. కరోనా వైరస్ కి సంభందించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా 104 కి కాల్ చెయ్యాలి అని అన్నారు. ప్రజ లందరూ అప్రమత్తంగా ఉండి, వైరస్ వ్యాప్తిని నియంత్రించి, మనమందరం ప్రాణాలను కాపా డుకుందామని అని అన్నారు. మాస్క్ లు ధరించి, సానిటైజర్ లు వాడుతూ, భౌతిక దూరం ప్రజలు తప్పనిసరిగా పాటించాలి అని అన్నారు. వాలంటీర్ ల ద్వారా జ్వరం ఎవ్వరికీ వచ్చింది అనే దాని గురించి సర్వే నివహిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ టెస్టులు చాలా వరకు పెంచడం జరిగింది అని, చేసిన 24 గంటల్లో రిపోర్ట్ లు వస్తున్నాయి అని అన్నారు.   ప్రస్తుతం 3 వేల 600 బెడ్ లు ఉన్నాయని, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సుమారు 5 వేల బెడ్ ల వరకు పెంచడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో  కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి, డి.ఎస్.పి. బి.శ్రీనాథ్, సి.ఐ సురేష్, ఏ పి.యం.డి.సి. అధికారి, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...