Followers

అర్హులైన వారికి పింఛనులు మంజూరు

 అర్హులైన వారికి పింఛనులు మంజూరు

పెన్ పవర్, ఆలమూరు 

నూతనంగా మంజూరైన ఇరవై మంది లబ్ధిదారులకు పెన్షన్లు శనివారం గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనువాస్ అందజేశారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పించన్లు మంజూరు చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ సిపి ప్రభుత్వం పని చేస్తుందని సోంత ప్రయోజనాలు చూసుకోకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పేద,బడుగు బలహీన వర్గాల వారికి  మా వైఎస్సార్  పార్టీ  అండగా ఉంటుంది అని తెలియజేసారు అలాగే కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు  ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సత్యనారాయణ, వైసిపి సీనియర్ నాయకుడు అడబాల వీర్రాజు, తమ్మన గోపి,మాజీ సర్పంచ్ వీరవెంకట్రావు, సూరిబాబు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మైగాపుల ఆంజనేయులు ఆధ్వర్యంలో మేడే వేడుకలు

 మైగాపుల ఆంజనేయులు ఆధ్వర్యంలో మేడే వేడుకలు

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడిలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద సిఐటియు తాళ్లపూడి మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మైగాపుల ఆంజనేయులు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా  జెండా ఎగురవేయడం జరిగింది. మైగాపుల ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం  ఇంచుమించు 200 వందలమందితో జరిగే ఈ కార్మికుల దినోత్సవాన్ని, కోవిడ్ నియంత్రణ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని, అతి తక్కువ మందితో జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  సిఐటియు జిల్లా నాయకులు వల్లేపల్లి నరసింహమూర్తి, తాళ్లపూడి మండల రైస్ మిల్లర్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సుంకర వెంకటేశ్వరరావు, కార్మికులు పాల్గొన్నారు.

బీసీ బిడ్డ ఈటల రాజేందర్ పై కుట్రలు చేస్తే సహించేది లేదు:. జాజుల లింగంగౌడ్

 బీసీ బిడ్డ ఈటల రాజేందర్ పై కుట్రలు చేస్తే సహించేది లేదు:. జాజుల లింగంగౌడ్ 

తార్నాక ,  పెన్ పవర్

బడుగు బలహీన వర్గాల గొంతుక,ప్రతి పక్షంలో ఉన్న,స్వపక్షంలో ఉన్న ఎల్లప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసే గొప్ప నాయకునిపై ఒక ప్లాను ప్రకారమే కుట్రలో భాగంగానే ఇరికించారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.హైదరాబాద్ లోని ఈటెల రాజేందర్ ని ఆయన నివాసంలో కలిసి బీసీ సంఘాల తరుపున ఆయనకు పూర్తి మద్దతుగా నిలబడుతున్నట్లు లింగంగౌడ్ తెలిపారు.బీసీల అస్తిత్వం, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల మన్ననలు పొంది  సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో చదివి,ఐదుసార్లు శాసనసభ్యునిగా తిరుగులేని ప్రజా నేతను ముఖాముఖిగా ఎదుర్కొనే దమ్ము లేక కుట్రలు చేస్తున్నారని అన్నారు. నాడు దళిత ఉపముఖ్యమంత్రి రాజయ్యను,నేడు(బీసీ) బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈటెల ను తప్పుడు ఆరోపణలతో, తప్పుడు కథనాలు పదే పదే ప్రసారం చేస్తూ,వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చిన కేసీఆర్ అధికారిక ఛానల్ టీ న్యూస్,నమస్తే తెలంగాణ పత్రిక చెరువు భూమిని కబ్జా చేసిన MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి , పేదల భూముల్ని గుంజు కుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్న మంత్రి మల్లారెడ్డి, మంత్రి పువ్వాడ ఇంకా ఎంతో మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్ళందరి అక్రమాలు మన దొర కేసీఆర్ కు కనపడటం లేదా?ఎంతో మంది ఎమ్మెల్యేల భూకబ్జా ఆరోపణలు వస్తున్న కనీసం మీ అధికారిక ఛానల్ టీ న్యూస్ లో ఒక్కరోజైనా న్యూస్ ప్రసారం చేశార ఆరోపణలపై మంత్రి వివరణ తీసుకోకుండా పనిగట్టుకొని ఈటల రాజేందర్ మీద కుట్ర పన్నారని అన్నారు.టిఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుండి ఫౌండర్ గా మొదటి నుంచి వెన్నంటి ఉండి, తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుసలో నిలుచున్న తెలంగాణ రాష్ట్ర సాధన లో ముఖ్య భూమిక పోషించిన  ఈటల రాజేందర్ ను ఇబ్బంది పెట్టి పొమ్మన లేక పొగ పెట్టడమేనని అన్నారు.ఏ రకమైన విచారణ లేకుండా దళిత,బలహీన వర్గాల పట్ల వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్ మీకు చిత్తశుద్ధి ఉంటే మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ,మంత్రుల ఆస్తులపై విచారణ చేపట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేనిచో దళిత, బలహీన వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

 రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు 

 పెన్  పవర్, ఆత్రేయపురం 

 ఆత్రేయపురం   ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శుక్రవారం 19 మందికి ట్రూ నాట్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో ఈరోజు వచ్చిన రిపోర్టులో 19  గాను తొమ్మిది మంది పాజిటివ్ గా నిర్ధారణ అయినది.  ఈరోజు నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ కిడ్ పరీక్షల్లో పదిమందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినది.  మొత్తం 19 మందికి గాను పాజిటివ్గా ఆధారమైనది వీటిలో ఆత్రేయపురం 8 వాడపల్లి 3 పేరవరం 2 పులిదిండి 1 బొబ్బర్లంక 1 రాజవరం 1 వసంతవాడ 1 అంకంపాలెం 1 గా   నిర్ధారణ అయినవి.

వనపర్తి పోలీస్ నూతన సి.ఐ. ప్రవీణ్ కుమార్

 వనపర్తి  పోలీస్ నూతన సి.ఐ. ప్రవీణ్ కుమార్ 

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి సి.ఐ. సూర్యనాయక్ గద్వాలకు బదిలీ అయ్యారు.నల్గొండ నుండి ప్రవీణ్ కుమార్ వనపర్తికి వచ్చారు.శనివారం ప్రవీణ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ప్రవీణ్ కుమార్ ఉమ్మడి మహబూబూనగర్ జిల్లాలో ఏసీబీలో,  వనపర్తి  పోలీస్ నూతన సి.ఐ. ప్రవీణ్ కుమార్ మల్కాజిగిరి ట్రాఫిక్ లో పని చేశారు.

తాడిపూడిలో పంటకోత ప్రయోగం

తాడిపూడిలో పంటకోత ప్రయోగం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో శనివారం వరి పంటకోత ప్రయోగం జరిగిందని మండల వ్యవసాయ అధికారిణి జి.రుచిత తెలిపారు. పంటకోత దిగుబడిపై రైతు గుర్రాల వెంకన్న పొలంలో వరిపంటపై కోత ప్రయోగం నిర్వహించగా సరాసరి ఎకరానికి పంట దిగుబడి సుమారు 48 నుండి 50 బస్తాలు వరకు దిగుబడి వచ్చిందని తెలిపారు. జి.రుచిత మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో  రైతులు ధాన్యం నిలువలు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలకు తరలించవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో విఆర్వో ఎం.ప్రకాష్, విఏఏ లు ఈశ్వర్, భార్గవ్, రైతు గుర్రాల వెంకన్న పాల్గొన్నారు.

ఆదివాసీల దాహార్తిని తీర్చిన తాండూర్ సీఐ బాబు రావు

 ఆదివాసీల దాహార్తిని తీర్చిన తాండూర్ సీఐ బాబు రావు


తాండూర్, పెన్ పవర్

ఆదివాసీలకు అండగా నిలిచి వారి తాగునీటి సమస్య పరిష్కరించి మానవత్వం చాటుకున్న తాండూర్ సి.ఐ బాబు రావు సొంత ఖర్చులతో నీటి సమస్య పరిష్కారానికి కృషి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది: తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాబు రావు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది మంచిర్యాల తాండూర్ పోలీస్ సర్కిల్ పరిధిలోని అబ్బాపూర్ గ్రామంలో తాగడానికి,ఇతర అవసరాలకు నీళ్లు లేకుండా,నీటి సమస్యతో బాధబపడుతూన్న విషయం ని ఆ గ్రామ ప్రజలందరు తాండూర్ సి.ఐ బాబు రావు దృష్టికి తీసుకెళ్లగా సి.ఐ  వెంటనే స్పందించి,నిన్న 30వ తేదీన, శుక్రవారం నాడు,అబ్బాపూర్ గ్రామాన్ని సందర్శించి,గ్రామ ప్రజలతో నీటి కొరత గురించి మాట్లాడి సమస్యను ఒక బాధ్యతగా తీసుకుని గ్రామానికి అర కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి లో పూడికను తీయించి సిఐ సొంత ఖర్చులతో మోటార్ కొనుగోలు చేసి ఆ బావి నుండి ఊరిలోకి పైప్ లైన్ వేయించి గ్రామ ప్రజల దాహన్ని తీర్చి సి.ఐ బాబు రావు  మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా సిఐ  మాట్లాడుతూ...పోలీసులు కేవలం కేసులను చేధించడమే పని కాకుండా,ప్రజల శ్రేయస్సు,వారి సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ తరుపున ఎల్లప్పుడూ కృషి చేస్తామని ప్రజల రక్షణ మరియు శాంతియుత జీవనం గడిపేలాగా ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది అని సిఐ  తెలిపారు. త్రాగటానికి మరియు ఇతర అవసరాల నిమిత్తం అడగగానే వెంటనే స్పందించి నీటి సమస్యలు తీర్చడానికి ఎనలేని కృషి చేసిన సీఐ కి గ్రామస్తులు కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...