Followers

టిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు వీరు నాయక్ ఆధ్వర్యంలో సూర్య చంద్ర జన్మదిన వేడుకలు

 టిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు వీరు నాయక్ ఆధ్వర్యంలో సూర్య చంద్ర జన్మదిన వేడుకలు

కేసముద్రం , పెన్ పవర్ 

టిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు గుగులోత్ వీరు నాయక్  ఆధ్వర్యంలో   ఎమ్మెల్యే శంకర్ నాయక్  కుమారుడు  సూర్య చంద్ర జన్మదిన వేడుకలను కేసముద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శనివారం ఘనంగా జరిగినాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ ఓలం చంద్రమోహన్  పార్టీ మండల అధ్యక్షులు నజీర్ అహ్మద్ లు మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సేవా తత్వం గా మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారని మృదుస్వభావి అని ఆయన నిండు నూరేళ్లు జీవించాలని వారు  అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ముత్యాల శివకుమార్ రఫీ  భూమాటి పురుషోత్తం నల్ల కిరణ్ వార్డ్ నెంబర్లు టిఆర్ఎస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు,,

కార్మిక హక్కుల రక్షణకై మరో చికాగో పోరాటానికి సిద్ధం కావాలి

 కార్మిక హక్కుల రక్షణకై మరో చికాగో పోరాటానికి సిద్ధం కావాలి

విజయనగరం, పెన్ పవర్

       సిపిఐ, ఏఐటీయూసీ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మరియు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో స్థానిక మర్క్స్ నగర్ ( బుచ్చెన్న కోనేరు ) శాఖలో 3 చోట్ల, బలిజివీధి శాఖలో 2 చోట్ల, శాంతినగర్ శాఖలో 1 చోట, విజయనగరం పి.డబ్ల్యూ మార్కెట్ ఎంప్లాయిస్ అండ్ ముఠా వర్కర్స్ యూనియన్ శాఖలో 4 చోట్ల, సిపిఐ జిల్లా కార్యాలయం మీద సిపిఐ, ఏఐటీయూసీ 2 జెండాలు మొత్తం 11 చోట్ల జరిగిన 135 వ మేడే దినోత్సవ వేడుకలు రెండవ వేవ్ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎర్రజెండాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. 135 వ మేడే వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, కార్మికులను యజమానులు దగ్గర బానిసలుగా చేయడానికి మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కొడ్లను రద్దు చేయాలని, అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను, పరిశ్రమలను ప్రైవేటీకరణ ఆపాలని, ప్రజలందరికీ కరోనా టీకాని ఉచితంగా అందించాలని నినాదాలు చేశారు. అనంతరం బుగత అశోక్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా మహమ్మారి 2 వ వేవ్ లో ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అతిప్రమాధకరంగా విజృంభించడంతో దేశంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడం వలన ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా అలాంటి భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజా వ్యవస్థ పరిరక్షణ కోసం, దేశ సంపదను మరింతగా పెంచేందుకు, ప్రజలకి ఆహారాన్ని అందించడానికి చమటోడ్చి కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు, కర్షకులకి 135 వ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవంగా మేడే ను 135 ఏళ్ళుగా శ్రామికజన సంఘీభావ చిహ్నాంగా, కార్మిక పర్వదినంగా మేడేను జరుపుకుంటున్నామని అన్నారు. అమెరికా, యూరప్‌ దేశాలలో 19వ శ‌తాబ్దంలో పారిశ్రామిక విప్లవం కారణంగా స్థాపించబడిన భారీపరిశ్రమల్లో పనిచేయుట‌కు కార్మికుల అవసరం ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి ఉత్పత్తిరంగంలోని పెట్టుబడిదారులు, కార్మికులు రెండు వర్గాలు పుట్టాయన్నారు. పెట్టుబడిదారులు అధిక లాభాల కోసం కార్మికుల శ్ర‌మ‌ను దోచుకోవ‌డం మొద‌లు పెట్టారన్నారు. 

శ్రామికులచే బానిసల్లా ప‌నిచేయించేవారు. పిల్లలు మ‌హిళ‌లు అనే విచక్షణ లేకుండా కర్మాగారాలలో, గనులలో గొడ్డు చాకిరీ చేయించేవారని అశోక్ తెలియచేశారు. కనీస వసతులైన తిండి, బట్ట, గూడు వంటి ఉండేవి కాదని తెలిపారు. రోజుకు 16 నుంచి 20 గంటలు కార్మికుల చేత గొడ్డు చాకిరీ చేయించేవారని తెలిపారు. ఈ దారుణ చర్యల నేపధ్యంలో కార్మికులలో క్రమక్రమంగా తిరుగుబాటు మొదలైందన్నారు. గొడ్డు చాకిరీ చేయించుకుంటున్న పెట్టుబ‌డిదారీ వర్గం పై ఉధ్య‌మాల‌కు కార్మికులు సంఘటితమయ్యారు. ఆనాటి నుండి కార్మిక సంఘాల నిర్మాణం ప్రారంభించారన్నారు. 1764-1800 మధ్య బ్రిటన్‌లోనూ, ఆ తరువాత యూరప్‌లోనూ, ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణం జరిగిందన్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో కార్మికులు చైతన్యవంతులై 1806లో మెకానిక్స్‌ యూనియన్‌ పేరిట తొలి కార్మిక సంఘాన్ని స్థాపించుకొన్నారని తెలిపారు. పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని, కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, కోరుతూ కార్మిక వర్గం విప్లవ శంఖం పూరించిందన్నారు. ఆ పోరాట జ్వాలలు బ్రిటన్‌, ఫ్రాన్సు, జర్మనీ దేశాలకు, అమెరికాలోని మిగతా ప్రాంతాలకు వ్యాపించాయని అశోక్ తెలిపారు. ఫిలడెల్ఫియాలో మెకానిక్స్‌ యూనియన్ 1827లో త‌మ‌కు 8 గంటల పనిదినం కోసం పోరాటం ప్రారంభించిందన్నారు. ఆ కార్మికోద్యమం దావాలంగా వ్యాపించి ఉధృతం కావడంతో. ప్రభుత్వం దిగివచ్చి 1837లో 10 గంటల పనిదినంను చట్టబద్ధం చేసిందన్నారు. 1881లో చికాగో నగరంలో వివిధ కార్మిక సంఘాలు సంఘటితంగా అమెరికా ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ పేరిట ఒక సమాఖ్యను కొత్తగా ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఆ సమాఖ్య 1884 అక్టోబరు 7న ఎనిమిది గంటల పనిదినంను చారిత్రాత్మక తీర్మానం చేసిందన్నారు. 1886 మే మొదటి తేదీన కార్మిక వర్గం సమ్మె పోరాటం జరపాలని నిర్ణయించిందన్నారు. 1885-86లో మేడే సన్నద్ధతకు జరిగిన సమ్మెపోరాటాల్లో లక్షలాది కార్మికులు పాల్గొన్నారన్నారు. 1886లో జెనీవాలో జరిగిన మొదటి ఇంటర్‌నేషనల్‌ మహాసభ కూడా రోజుకు 8 గంటలు పనిని చట్టబద్ధం చేయాలని కోరిందన్నారు. 1886 మే 1 వ తేదీన చికాగోలో 8 గంటల పనిదినం సమ్మె జరిగిందన్నారు. ఆ సమ్మెలో మూడున్నర లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని అన్నారు. దీంతో కార్మికులపై మే 3న ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు. ఆ కాల్పుల్లో ఆరుగురు కార్మికులు అమరులయ్యారన్నారు. కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహించిన కార్మిక నాయకులను ప‌ట్టుకొని ఉరి తీశారని తెలిపారు. మే1న ప్రారంభమైన మహోద్యమం బాల్టిమెన్‌, న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌, పిట్సు, డెట్రాన్‌ వంటి పెద్ద నగరాలకు దావానలంలా వ్యాపించింది. కార్మికుల హక్కుల కోసం వీరోచితంగా పోరాటాలు, త్యాగాలు చేశారన్నారు. 1889 లో సోషలిస్టు అంతర్జాతీయ మహాసభ రెండవ ఇంటర్‌నేషనల్‌ లో మే 1వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఆ రోజున అన్ని దేశాలలోని కార్మికులు ఏకకాలంలో తమ కోర్కెలను ప్రకటించాలని ఆదేశించింది. 1890 మే 1వ తేదీన ఐరోపా దేశాలలో తొలిసారిగా మేడే జరపడం జరిగిందన్నారు. మనదేశంలో కార్మికుల జీవితాలకు సవాలుగా నిలిచిన మతతత్వం, నూతన ఆర్థిక సంస్కరణల ఫలితంగా బహుళజాతి సంస్థల శ్రమ దోపిడీ నుంచి కాపాడుకునేందుకు దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను, కార్మిక హాక్కులను రక్షించుకునేందుకు చికాగో నగర పోరాటాన్ని స్మరించుకుంటూ నేడు బీజేపీ అవలంభిస్తున్న ఆర్ధిక, సామాజిక దోపిడీ విధానాల పై పోరాటాలు కొన‌సాగించాలని బుగత అశోక్ పిలుపునిచ్చారు.   మేడే కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు టి.జీవన్, పార్టీ శాఖా కార్యదర్సులు, యూనియన్ నాయకులు కెల్ల సూర్యనారాయణ,  నడిపేన పాపునాయుడు, పతివాడ శ్రీను, చిన్న, అప్పరుబోతు జగన్నాధం, చిల్లా చిట్టిబాబు, పొందూరు అప్పలరాజు, పొందూరు రాంబాబు, ఎస్.సునీల్, బూర వాసు, పి.గౌరీశంకర్, ఎమ్.రాజేష్, కొండలరావు, తదితరులు పాల్గున్నారు.


ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ జెడిగా డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌

 ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ జెడిగా డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌

విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్ 

ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ సంయుక్త సంచాల‌కులుగా ఆ శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ శ‌నివారం అద‌న‌పు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ శాఖ జెడిగా పనిచేసిన డాక్ట‌ర్ ఎంవిఏ న‌ర్సింహులు ఏప్రెల్ 30న ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. దీంతో అదేశాఖ‌లో డిప్యుటీ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న వైవి ర‌మ‌ణ‌, జెడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.


రవాణా శాఖ కార్యాలయ పనులు నిలుపుదల

 రవాణా శాఖ కార్యాలయ పనులు నిలుపుదల 

విజయనగరం, పెన్ పవర్

రవాణా శాఖ కార్యాలయంలో, లెర్నర్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన సంబంధిత ఫిట్నెస్ మరియు ఇతర పనులు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు రవాణా శాఖ ఉప కమిషనర్ శ్రీమతి సి.హెచ్. శ్రీదేవి తెలిపారు. కరోనా రెండో విడత విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా కమిషనరు గారు రవాణాశాఖ కార్యాలయాల్లో పనులను నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సోమవారం అనగా 3.5.2021 నుండి 31.5.2021 వరకు రవాణా శాఖ కార్యాలయంలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఉన్నత అధికారుల నుండి వచ్చే తదుపరి ఆదేశాల మేరకు కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆమె వివరించారు. ప్రజలకు అవసరమైన సమాచారం కొరకు ఆదినారాయణ ఆర్టీవో  9154294202,  కృష్ణమోహన్ ఏవో 9848528305, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ జె.రాంకుమార్ 9154294411 మరియు ఎం.బుచ్చిరాజు 9154294412 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.


మే డే కార్మికుల దినోత్సవ సందర్భంగా మాస్కులు, సీతలపానియాలు పంపిణీ

 మే డే కార్మికుల దినోత్సవ సందర్భంగా మాస్కులు, సీతలపానియాలు పంపిణీ

మహారాణి పేట, పెన్ పవర్

అఖిలభారత మానవ హక్కుల పరిరక్షణ సమితి  మే డే కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని  గౌరవ చైర్మన్ షేక్ సిరజుద్దిన్  ఆదేశాలు మేరకు సీతమ్మధార ఆఫీస్ సమీపంలో మస్కులు మరియు శీతల పానీయాలు మరియు బిస్కెట్స్ సిహెచ్ ఆదిలక్ష్మి రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు పంచడం జరిగింది.రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు పిల్ల.సత్యవతి, ఆధ్వర్యంలో లో  మాస్క్ ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ జిల్లా సెక్రెటరీ బి.కేశవ.రావు, రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్ మైనార్టీ విభాగం అధ్యక్షురాలు షేక్ మున్నీ,రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు,స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిలక్ష్మీ,డైరక్టర్ లలితా జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలత,తదితరులు పాల్గొన్నారు.


ఉద్యానవన కళాశాలలో క్వారైంటిన్ కేంద్రం ఏర్పాట్లు పరిశీలన

 ఉద్యానవన కళాశాలలో క్వారైంటిన్ కేంద్రం ఏర్పాట్లు పరిశీలన

మన ఇంటి నుండే మొదలవ్వాలి
మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆన్ని ఏర్పాట్లు
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి
ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్

గరుగుబిల్లి, పెన్ పవర్

కరోనా వైరస్ రాకముందుతో పోలిస్తే మన దైనందిన కార్యక్రమాలలో ఊహించని మార్పులు వచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టెందుకు మనలో మనం ఎన్నో మార్పులు చేసుకున్నాం ఇవి రాబోయే రోజుల్లోనూ కొనసాగించాలి అందుకు ముఖ్యంగా మన ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి అని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్   పేర్కొన్నారు.   శనివారం ఐ.టి.డి.ఎ  ప్రాజెక్ట్ అధికారి గరుగుబిల్లి  మండలం ఉల్లిభద్ర ఉద్యానవన కళాశాలలో 350 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కోవిడ్ క్వారైంటిన్ సెంటర్లో నిర్వహిస్తున్న పనులు పరిశీలించారు. కేంద్రంలో చేపడుతున్న పనుల పై అరా తీశారు. 

ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ కరోనా సోకినా ఆందోళన చెందొద్దని ధైర్యంగా ఉంటే కరోనా జయించడం సాధ్యం అన్నారు.  ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరుగ కుండా  ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా చూడాలని అన్నారు. 24 గంటలు  త్రాగునీరు, విద్యుత్ కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అన్నారు. కేంద్రంలో, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే కేంద్రం నిర్వహణకు సంబంధించి వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చికిత్స తీసుకుంటున్న వారికి సకాలంలో వైద్యం, నిర్దేశిత మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.   ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి మండల తహశీల్దార్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఉద్యానవన కళాశాల ప్రిన్సిపాల్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేడే వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

నేడే వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం 

పార్వతీపురం,  పెన్ పవర్

 పార్వతీపురం డివిజన్ పరిధిలో రోజు రోజుకు వందల సంఖ్యలో పెరిగిపోతున్న కరోనా కేసుల మూలంగా ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు గాను పార్వతీపురం డివిజన్లో "కోవిడ్ కేర్ సెంటర్" ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకున్న సందర్భంగాను ఈరోజు ఉదయం శాసన సభ్యులు అలజంగి జోగారావు, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అర్ కూర్మనాధం, ఎంపీడీవో, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి పార్వతీపురం మండలం నర్సిపురం  గ్రామం రెవెన్యూ పరిధిలో గల జనహిత డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన "వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్" ను పరిశీలన చేయటం జరిగినది. కేర్ సెంటర్లో సమకూర్చిన మౌలిక సదుపాయాలు పరిశీలనలో భాగంగా వారితో కలసి శాసన సభ్యులు కేంద్రంలో పడకలను, మంచి నీటి సరఫరా, విద్యుత్ వంటి సదుపాయాలను పరిశీలన చేసి అందరికీ మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయా తదితర అంశాల పై అరా తీశారు, అలానే కేంద్రంలో  24 గంటలూ నీరు, విద్యుత్ అందుబాటులో ఉండేటట్లు చూడాలి అని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు మాట్లాడుతూ క్వారైంటిన్ కేంద్రం తక్షణమే ప్రారంభించేందుకు చర్యలు తీసుకొవాలని ఇంకా అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన ఏర్పాటు చేయవలసిందిగా రెవెన్యూ అధికారులకు శాసన సభ్యులు సూచించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందిస్తూ ఆదివారం ఉదయానికి ఈ సెంటర్ కోవిడ్ సేవలకు అందుబాటులోకి రానుందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ వంద పడకలను ఏర్పాటు చేయడం జరిగినది అని తెలియపరిచారు. ఈ పర్యటనలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, రెవెన్యూ అధికారులు, ఎంపీడీవో, పోలీస్ అధికారులు, సిబ్బంది, డైట్ కళాశాల కరస్పాండెంట్ పల్లి భాను ప్రకాష్, వైసిపి సీనియర్ నాయకులు ఎక్స్ వైస్ చైర్మన్ బి జయబాబు, నాయకులు ఆర్ వి ఎస్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...