హుకుంపేట మండలంలో ఘనంగా మేడే ఉత్సవాలు
హుకుంపేట, పెన్ పవర్:
హుకుంపేట మండలం బాకూరు భీమవరం కేంద్రాల్లో శనివారం ప్రపంచ కార్మిక దినోత్సవం(మేడే) వేడుక లు ఘనంగా జరిగాయి. సీఐటీయూ హుకుంపేట మండల కమిటీ నాయకులు కామ్రేడ్ సుడిపల్లి కొండలరావు లక్ష్మణ రావు ల ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం నిర్వహించారు.మేడే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బాకూరు సర్పంచ్ బాకూరు వెంకట రమణ రాజు హాజరయ్యారు.మేడే కార్మిక జెండా ను ఆవిష్కరించి కార్యక్రమంలో నాయకులు కామ్రేడ్ సుడిపల్లి కొండలరావు మాట్లాడుతూ దేశ సంపదకు మూలమైన కార్మికుల కు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,కరోనా కష్టకాలంలో ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ,కష్టాలు పాలుచేస్తున్నా రని అన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడం తో లక్షలాదిమంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోతున్నారన్నారు. బి ఎస్ ఎన్ ఎల్. పోర్ట్ డాక్ యార్డ్, షిప్ యార్డ్, బీమాసంస్థలుతో పాటు రైల్వేలు,విమానయాన సంస్థ ఎయిరిండియా వంటి ప్రభుత్వ రంగ కంపెనీల ను కారుచౌకగా తనకు కావాల్సిన అంబానీ, ఆధాని వంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఉన్నా ఉద్యోగలు పోగొట్టుకునే ల చేసి మోడీ,బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడుతోందని ఆరోపించారు.రాష్ట్ర వైసీపీ జగన్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల రేట్లు 100 రేట్లు పెంచి నూనె లీటర్ 185 /-లు,పంచదార 55 రూపాయలు ఇలా అన్నింటిలో నచ్చినట్లు రేట్లు పెంచి ,ఇస్తున్న సంక్షేమ పథకాలు సొమ్ము నెలకు కూడా సరిపోని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉందని,భవిష్యత్ లో తీవ్ర అవస్థలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని,కనీస వేతనo రూ 21 వేలు ఉద్యోగులు/కార్మికుల ఇవ్వాల్సి ఉన్న అరకొరగా జీతాలు ఇస్తున్నారని, రైతులు పండించే కాపీ, మిరియాలు,రాజ్ మా కందులు,అల్లం,పసుపు, పిప్పల మోడీ వంటి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ,కరోనా నేపథ్యంలో ప్రతీ కుటుంబానికి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సీపీఎం ప్రభుత్వం ఇచ్చే విధంగా ప్రతీ కుటుంబానికి నెలకు 50 కేజీల బియ్యం,నూనె 5 కేజీల,కారం 5 కేజీల,మసాలా 5 కేజిలు, ఉల్లిపాయలు వంటి 14 రకాల సామాన్ల తో పాటు కుటుంబానికి నెలకు రూ.7 వేల 5 వందలు ఇవ్వాలని,కరోనా వ్యాక్సిన్ అందరికి ఉచితంగా ,సాధ్యమైనంత వరకు త్వరగానే ఇవ్వాలని,అంగన్ వాడి సెంటర్లు కు సెలవులు ప్రకటించి ఇంటింటికీ డ్రై పొడి సరుకులు అందేలా చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు/ కార్మికులు. చంద్రకళ, సింహాద్రి, చిలకమ్మ, నాగమణి, కామేష్,, కొండలరావు, కమలమ్మ, కృష్ణవేణి , గోపాలమ్మ, అంగన్ వాడీ, ఆశావర్కర్లు,మిడ్ డే మిల్స్ వర్కర్స్ ,బాకూరు పంచాయితీ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మేరకచింత పంచాయితీ లోని రంగసింగ పాడు, గన్నేరుపుట్టు పంచాయితి డొంకి నవలస లో కూడా మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమ్మలు చిట్టమ్మ, గణేష్, సింహాచలం, రాంబాబు, మత్స్యరాజు, కొండబాబు, అప్పలనాయుడు, గంగన్న,వై చిట్టిబాబు, చంటిబాబు, సింహాచలం, లచ్చన్న, ఎం పండన్న, వీ పండన్న సన్యాసమ్మ, అచ్చులమ్మ, చిలకమ్మ, కాసులమ్మ,ఎర్రమ్మ ,లలిత , పండన్న తమ్మయ్య, గోపాలకృష్ణ, ఎం రామన్న, జన్ని చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.