రాష్ట్రంలో 6 సం॥లుగా 80 వేల మంది రజక లబ్దిదారుల ఎదురు చూపులు
రామగుండం కార్పొరేషన్ రజక సంఘం అధ్యక్షులు శంకర్ రజక
రామగుండం, పెన్ పవర్తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మన రాష్ట్రంలో చాలా మంది రజక సోదరులకు ప్రభుత్వం తప్పక అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తుందనే ఆశతో దీనిలో భాగంగానే 2015 నుండి 2021 7సం॥లలో కొన్ని అంతకు ముందు తెలంగాణలో గల 33 జిల్లాల నుండి రజక సోదరులు, కులవృత్తి దారులు రైతులు చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకున్న వారు నిరుద్యోగులు, మహిళలు మరియు రజక ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ద్వారా సోసైటీ గ్రూప్ లను ఏర్పాటు చేసుకున్న సంఘాల సభ్యులు రజక లబ్దిదారులు 50 వేల నుండి 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ రుణాలకై ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గత ఏడాది కిందట కొన్ని జిల్లాల్లో 2 వేల మందికి పైగా రజకులకు మాత్రమే కేవలం 50 వేల రూపాయల చొప్పున సబ్సిడీ రుణాలు మంజూరు చేశారు. ఇంకా నేటికీ 68 వేల మందికి పైగా రజకులు ఎదురు చూస్తునే ఉన్నారని ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీలోనే చాలా మంది రజక సోదరులు పని చేస్తున్నారని మంత్రులను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లను తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కమిటీ కలిసి విన్నవిస్తున్న లాభం లేకపోయిందని కానీ ఈ రుణాల కోసం ఏ ఒక్క పార్టీ నాయకులు మద్దతు రజకులకు అందించడం లేదని మరింత ముందుకు వెళ్ళేందుకు సంబంధిత బీసీ మంత్రి, ఆర్థికశాఖ మంత్రి దృష్టికి అధికార పార్టీ నాయకులు ఎవరు తీసుకెళ్లడం లేదని రజకులు బాధపడుతున్నారని ఇకనైనా ఈ అంశం పై ప్రయత్నాలు చేయాలని రామగుండం కార్పొరేషన్ రజక సంఘం అధ్యక్షులు శంకర్ రజక ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.