Followers

దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేయాలి

 దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేయాలి 

ఓయూలో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం ప్రారంభించాలి

ఏ ఐ ఎస్ ఫ్  డిమాండ్ 

తార్నాక,  పెన్ పవర్

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ గా ఇవ్వాలని ఏ ఐ ఎస్ ఫ్ జాతీయ కౌన్సిల్ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యం లో  ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఐ ఎస్ ఫ్ కౌన్సిల్ ఆర్ట్స్ కళాశాల ముందు ఆందోళన నిర్వహించింది దేశంలోని ప్రజలందరికీ ఫ్రీ గా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన *రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ ఆర్. ఎన్ శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షు లు పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ  ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వంకి డిమాండ్ చేశారు.  గతంలో  దేశంలో సంభవించిన అనేక వ్యాధులకు ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్,టీకాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. మోడీకి దేశ ప్రజలపై ప్రేమ లేదని విమర్శించారు. ప్రజలందరికీ ఫ్రీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేదాకా పోరాడుతామని ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఐ ఎస్ ఫ్ కార్యదర్శి క్రాంతి రాజ్ మాట్లాడుతూ ఓయూ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు కరోనా మహమ్మారి కి బలి కావడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ల,ఉద్యోగుల ఆరోగ్యం పరిరక్షణకు యూనివర్సిటీ అధికారులు  ఓయూ లోనే కరోనా వ్యాక్సిన్ పంపిణి సెంటర్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఓయూ హెల్త్ సెంటర్ నీ మౌలిక సదుపాయాలు కల్పించి కరోనా ఐసొలేషన్   కేంద్రంగా  మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లో ఏ ఐ ఎస్ ఫ్ ఓయూ నేతలు రహమాన్, రాజు, పవన్, లింగస్వమి, నిఖిల్, అన్వర్, హరీష్, చిన్న, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఏరియా జనరల్ మేనేజర్ మేనేజర్ లతో కూర్చొని, కొవిడ్,పై సమీక్ష సమావేశం

 ఏరియా జనరల్ మేనేజర్ మేనేజర్ లతో కూర్చొని, కొవిడ్,పై సమీక్ష సమావేశం


పెన్ పవర్,  మందమర్రి 

కరోనా కోవిడ్ పై ప్రస్తుత పరిస్థితులను అన్ని పెరియాల జనరల్ మేనేజర్ లను అడిగి తెలుసుకున్నారు కరొన వచ్చిన ఉద్యోగులకు, ఆక్సిజన్ మెడిసిన్ విషయాలలో రాజీపడకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు, కో వీడ్ సేవల కోసం 20 మంది డాక్టర్ల నియామకం అవసరమైన సిబ్బందిని ఎక్కడికక్కడ  నియమించు కోవాలని సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా ఆస్పత్రిలో కోవిడ్ వైద్య సేవల కోసం ముందస్తుగా అవసరమైన మందులు ఆక్సిజన్ సిలిండర్లు సమకూరుస్తున్న మని ఏరియాలలో ప్రస్తుత బెడ్ లతొ, మరో 500 బెడ్లతో, ప్రత్యేక అవార్డులు ఏర్పాటు చేసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ లను, కోరారు మే నెలలో కేసులు వృద్ధికి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటి నుండే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కోవడానికి అన్ని ఏరియా హాస్పిటల్ సిద్ధ పరచాలని కోరారు, ఆక్సిజన్ కొరతతో ఏర్పడకుండా ఉండేలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిశ్రమలతో సంప్రదింపులు జరుపుతున్నామని సింగరేణికి ప్రత్యేకించి ఆక్సిజన్ సిలిండర్లు పోతున్నామని తెలిపారు ఈ లోపుగా స్థానికంగా ఆక్సిజన్ కొనుగోలు చేయాలని కోరారు రాపిడ్, పరీక్షలు నిర్వహించడం కోసం, 25, వేల కిట్లను ప్రభుత్వం నుండి  సేకరించామని వీటిని ఏరియాలకు పంపి స్తున్నట్లు తెలిపారు, అసౌకర్యాలు స్థానిక భవనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు చైర్మన్ అనుమతితో 20 మంది వైద్య నిపుణులను, నియమించుకోవడం జరిగిందని ఇంకా అవసరమైతే వాడు వాయిస్ నర్సులు సిబ్బందిని స్థానికంగా నిర్మించుకోవాలని జనరల్ మేనేజర్ లను ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో మందమర్రి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ ఎస్, ఓ, చోటు, జిఎం గోపాల్ సింగ్, డీ వై సి ఎం   ఓ శ్రీమతి ఉష కే కే ఆర్ సి పి పి ఓ రమేష్ కేకే ఏజెంట్ రామ్ చందర్ పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ హెల్త్ ఆఫీసర్ లోకనాథ్ రెడ్డి  ఐ టి ప్రోగ్రామర్ రవి తదితరులు పాల్గొన్నారు

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు మాస్కులు

 ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు మాస్కులు  

  వి.ఆర్.పురం, పెన్ పవర్  

 వి.ఆర్.పురం మండలం వి ఆర్ పురం గ్రామం లో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ  విగ్రహాలకు వడ్డిగూడెం పంచాయతీ సంబంధించిన సెక్రెటరీ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహాలకు మాస్కులు  కట్టడం జరిగింది. ఈ సందర్భంగా వడ్డిగూడెం పంచాయతీ సంబంధించిన సెక్రటరీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ  మండలంలోని గ్రామాల ప్రజలు చాలామంది   మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. ఆ ప్రజలు విగ్రహాలను చూసి ఇకనైనా మాస్కులు దరి ఇస్తారని అతని అభిప్రాయం. కోవిడ్ విజృంభిస్తున్న  నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వారి వారి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. మనిషి మనిషికి దూరం పాటించాలి. డెటాల్ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పని ఉంటేనే ఇంటి నుండి బయటికి రావాలి. ఈ కార్యక్రమంలో వాలంటరీ వీర్ల శివ భేతి సాయి పంచాయతీ వాలంటరీ లు తదితరులు పాల్గొన్నారు.

కౌన్సిల్లో సమస్యలపై ఏకరువు...!

 కౌన్సిల్లో సమస్యలపై ఏకరువు...!

సామర్లకోట, పెన్ పవర్ 

సామర్లకోట మున్సిపాలిటీలో శుక్రవారం జరిగిన కౌన్సి లమ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉభా జాన మోజెస్ తో సహా ఆధికార పక్ష కౌన్సిలర్లు పలువురు వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఏకరువు పెట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ సాధారణ సమావేశం సుమారు మూడు గంటల పాటు సదీర్ఘంగా సాగింది. మొత్తం జీరో అవర్‌గానే సమావేశం కొనసాగగా పట్టణంలోని సమస్యల పై సభ్యులు అధికారులను ప్రశ్నలతో నిలదీయగా కౌన్సిల్ హాలు హోరెత్తింది. సమావేశంలో తొలుత కౌన్సిలర్లు జీరో అవర్‌ను కోరగా చైర్ పర్శన్ దానికి అనుమతినిచ్చారన్నారు. దానితో వైస్ చైర్మన్ జాన మోజెస్ మాట్లాడుతూ పిఠాపురం రోడ్డులో ఏర్పాటు చేస్తున్న లే అవుట్ల యజమానులు ఇరిగేషన్ కు సంబందించిన కాలువలు మూసివేస్తూ లే అవుట్లు చేపడుతున్నట్టు చెబుతూ ఆ లే-అవుట్లకు అలాంటి అనుమతులున్నాయని అధికారులను ప్రశ్నించారు. దానికి కమీషనరు బీఆర్ ఎస్ శేషాద్రి వివరణిస్తూ లే-అవుట్లకు అనుమతులు గుడా ఆద్వర్యంలో జరుగుతున్నట్టు చెప్పారు. అంతా ఆన్ లైనులోనే జరుగుతున్నందున అది మన పరిదిలో లేనందున దాని పూర్తి వివరాలు తమ వద్ద లేవన్నారు. కాగా అయితే లే-అవుట్ల పైన వివరాలు సేకరించి పనులు నిలిపి వేయనున్నట్టు చెప్పారు. అయితే పట్టణంలో ఎన్ని ప్రభుత్వ స్థలాలున్నాయో వివరాలు తెలపాలని వైస్ చైర్మన్ కోరారు. దానికి డిఇ సిమెచ్ రామారావు వివరణిస్తూ వచ్చే సమావేశం నాటికి వివరాలు అందించనున్నట్టు చెప్పారు.  

కాగా సమావేశంలో కౌన్సిలరు నేతల హరిడబాబు మాట్లాడుతూ పట్టా ఇళ్ళకు పన్నులు విధించమని ప్రజలు కోరుతున్నా మున్సిపల్ అదికారులు పన్నులు వేయడం లేదని, దానికి ప్లాన్ అప్రోవల్ కావాలని అడుగుతున్నారని పట్టా గృహాలకు, హౌసింగు పధకంలో నిర్మించుకున్న గృహాలకు ప్లాన్ అప్రోవల్ ఎలా ఉంటాయని ఆయన అధికారులను ప్రశ్నించారు. దానిపై కమీషనరు మాట్లాడుతూ ప్కగా ఇళ్ళకు సంబందించి డాక్యుమెంట్లు ఉంటేనే పన్నులు విధిస్తామన్నారు. కాగా మున్సిపాలిటీలో ఏఏ విభాగాల్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారో వివరాలు తెలపాలని వైస్ చైర్మన్ మోజెస్ కోరారు. దానికి కమీషనరు సిబ్బంది వివరాలను సమావేశంలో తెలిపారు. అలాగే కౌన్సిలరు పితాని కృష్ణ మాట్లాడుతూ వర్షం వస్తే తమ వార్డు మొత్తం మునిగిపోతున్నందున డ్రెయిన్ల ఆధునీకరణ, వంతెన నిర్మాణ పనులను చేపట్టాలని డిమాండ్ చేసారు. దానికి డిఇ రామారావు వివరణిస్తూ 14వ ఆర్థిక నిదులు విడుదల అయ్యాయని త్వరలోనే నూతన డ్రైన్ల నిర్మాణం, వంతెన నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కాగా సమావేశంలోని జీరో ఆవర్ లో కౌన్సిలర్లు యార్లగడ్డ జగదీష్, పాగా సురేష్, చల్లపల్లి శ్రీను, పాగా సురేష్, పాలిక కుసుమచంటిబాబు, పెండ్యాల వెంకటలక్ష్మి, చిట్టిమాని రాఘవ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ వారి వార్డులో ఉన్న సమస్యల పరిష్కారంపై అదికారులకు విన్నవించి వాటిని పరిష్కరించాలని కోరారు. సుమారు మూడు గంటల పాటు కొనసాగిన సమావేశం అనంతరం అజెండా అంశాలపై చర్చ ప్రారంభం కాగా వాటిలో 13 అంశాలను సభ్యులు ఆమోదించగా వారపు సంత రోడ్డు మార్గంలో ఆశీల వసూళ్ళ అంశాన్ని సమావేశం వాయిదా వేసింది. ఈ సమావేశంలో ఇంకా మున్సిపల్ ఎఇ రాజశేఖర్, శానిటరీ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్, అన్ని శాఖల అధికారులు, అందరు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

సింహాచల కొండపై అన్ని సేవలూ ఒకే చోట ఈ.ఓ, సూర్యకళ

 సింహాచల కొండపై అన్ని సేవలూ ఒకే చోట ఈ.ఓ, సూర్యకళ

సింహాచలం, పెన్ పవర్

సింహాచలం దేవస్థానం ఈ.ఓ గా బాధ్యతలు చేపట్టాక సంస్కరణలు, అవసరమైన మార్పులకు ఎంవీ.సూర్యకళ శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా భక్తులకు సేవలను అందించే విషయంలో ఆమె ఏమాత్రం రాజీ పడటం లేదు. ఇందులో భాగంగానే కంప్లైంట్ సెల్ ఏర్పాటుచేశారు.భక్తులకు ఏమాత్రంఅసౌకర్యంకలిగినా దేవస్థానం భూముల విషయంలో ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చంటూ రెండు ఫోన్ నంబర్లు (0891-2764949, 9398523937),కంప్లైంట్లు స్వీకరణ బాధ్యత సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఇవ్వడం జరిగింది. కొండపై టికెట్లు ఇచ్చే చోటు ఒక దగ్గర, విరాళాలు స్వీకరించే ప్రాంతం మరోదగ్గర, ప్రొటోకాల్ -కొండపై రూంలు బుకింగ్ కౌంటర్ ఇంకో చోట ఉండటంతో భక్తులు, దాతలు గందరగోళానికి గురయ్యేవారు.

ఇప్పుడు దానికి చెక్ పెడుతూ...  విరాళాలు, టికెట్ల కౌంటర్లను పి.ఆర్.ఓ, ఆఫీసులో పెట్టడం జరిగింది. దీంతో భక్తులు ఎలాంటి సేవలు కావాలన్నా... గాలిగోపురం ఎదురుగా ఉండే పీఆర్వో ఆఫీసులో పొందవచ్చు. కొండ కింద టికెట్ తీసుకోనివారు నేరుగా ఇక్కడే  వచ్చి ఆ సేవలను పొందవచ్చు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆపీసును తీర్చి దిద్దడం జరిగింది. అంతేకాదు కోవిడ్ నిబంధనల దృశ్యా  స్వామివారి దర్శనం దగ్గర క్యూలైన్లు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దర్శనాలకోసం మూడు ప్రత్యేక ర్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవడం సులభమవుతోంది. ఈ సౌకర్యాలను శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి భక్తులు ఉపయోగించుకోవచ్చు.

మల్లేపల్లి పంచాయతీ కార్యదర్శి విధుల్లో కరోనాతో మృతి...

మల్లేపల్లి పంచాయతీ కార్యదర్శి విధుల్లో కరోనాతో మృతి...

గండేపల్లి, పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మలేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆదిత్య శంకర్ (50)కరోనాతో వీధుల్లో ఉండగా మృతి చెందారు. మృతదేహానికి పరీక్ష రాపిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ తేలింది. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు, ఈయనది కొంతమూరు  గ్రామం అని సమాచారం.

కోవిడ్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కోవిడ్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

పెన్ పవర్, ఉలవపాడు 

మండల కేంద్రమైన ఉలవపాడు లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు టాస్క్ ఫోర్స్ నెంబర్స్ తాసిల్దార్ కె .సంజీవ్ రావు ,ఎంపీడీవో టి.రవికూమర్,ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని వీఆర్వోలు,పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తో తాసిల్దార్ మాట్లాడుతూ కోవిడ్ పై క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలని కోవిడ్ సెకండ్ వేలో ఉలవపాడు మండలంలోని పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని  కనుక ప్రజా ప్రతినిధులతో కలిసి వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటిని సర్వే చేసి కరోనా పై అవగాహన కల్పించి అనుమానంగా ఉన్నవారిని ప్రజా వైద్యశాల కి తరలించే విధంగా చూడాలి, ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి మండలంలోని ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పనిచేయాలని వైయస్సార్ బీమా యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు అర్హులైన వారిని నమోదు చేయాలని అని వీడు నిబంధనలు పాటిస్తూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి, మౌత్ దూరం పాటిస్తూ, శానిటైజర్, వాడుతూ అదేవిధంగా ప్రజలకు జాగ్రత్తలు పాటించే విధంగా అవగాహన కల్పించాలి.

 కందుకూరు డిఎస్పి కండే శ్రీనివాసరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ప్రతి మండలంలో క్షేత్రస్థాయిలో అహర్నిశలు కష్ట పడుతున్నారు అని ప్రతి పంచాయతీలోనూ కరోనా పై అవసరమైన పరికరాలను వెంటనే అందించే విధంగా చూస్తున్నారని,కోవిడ్ సెకండరీ తీవ్రత ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని పాజిటివ్ వచ్చినవారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తీవ్రంగా ఉందని మరణాలు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయని అందరూ జాగ్రత్తలు పాటించాలని కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాలని అనిమండల స్థాయి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ పి విశ్వనాధ రెడ్డి, డాక్టర్ కే శ్రీనివాసరావు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...