హెచ్ఆర్పీసీఐ నియోజకవర్గ చైర్మన్ గా హరిప్రసాద్ నియామకం
తొర్రూరు, పెన్ పవర్హెచ్ఆర్పిసిఐ పాలకుర్తి నియోజకవర్గ చైర్మన్ గా మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన కందుకూరి హరిప్రసాద్ నియమితులయ్యారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఆర్పిసిఐ నియోజకవర్గ చైర్మన్ గా నియమితులైన హరిప్రసాద్ కు జిల్లా చైర్మన్ పాలిశెట్టి శ్రీనివాసరావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా జిల్లా చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ...రాజ్యాంగ బద్దంగా వస్తున్న హక్కులను కాలరాసే వారిపై న్యాయస్థానాల్లో చర్యలు తీసుకునే హక్కు ఉందన్నారు. చట్టాలపై అవగాహన లేకపోవడంతో ప్రజలు మోసపోతున్నారన్నారు. ఎవరైనా హక్కులను హరిస్తే హెచ్ఆర్పిసిఐ తరపున చర్యలు తీసుకుంటామన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా చైర్మన్ శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సంజీవ లకు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి జాలిగామ సత్తయ్య, జిల్లా మహిళా చైర్మన్ నల్లకుంట ఉమాదేవి, ప్రతినిధులు తోట నగేష్, అల్లం శ్రీను, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.