Followers

కరోనా కట్టడికి మే 8 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

 కరోనా కట్టడికి మే 8 వరకు  రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

మందమర్రి ఎస్.ఐ లింగంపల్లి భూమేష్

పెన్ పవర్,  మందమర్రి 

రాష్ట్రంలో సెకండ్ వేవ్ లో   రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నందున, ప్రజలను ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ మే 8 వరకు పొడగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పట్టణ ఎస్.ఐ లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు. అన్నారు. ప్రజలు తమ పనులను రాత్రి 9 గంటల లోపు ముగించుకొని ఎవ్వరి ఇండ్లలో వారు ఉండాలని మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని కిరణా దుకాణాలు,వైన్స్ షాపులు,హోటళ్లు వ్యాపార సముదాయాలను (అత్యవసర సేవలు మినహా) ప్రతి రోజు రాత్రి 8 గంటల లోపే  మూసి వెయ్యాలని ఆయన తెలిపారు.అతి వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మరిని కట్టడి చెయ్యడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై కరోనా బారిన పడకుండా మనల్ని మన కుటుంబ సభ్యులను కాపాడుకోవాలన్నారు.పై నిబంధనలు దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంగిస్తే మరింత కఠిన ఆంక్షలను విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కరోన నిభందనలపై నిర్లక్ష్యం వ్యహిస్తే కఠిన చర్యలు

 కరోన నిభందనలపై నిర్లక్ష్యం వ్యహిస్తే కఠిన చర్యలు - సిఐ నర్సింహ్మ స్వామి

మాస్కు, బౌతిక దూరం తప్పనిసరి

కర్ప్యూ  నిబంధనలు మరింత కఠినం బయటకు వస్తే కేసులు


పెన్ పవర్, మల్కాజిగిరి 

కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ, మాస్కులు, బౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని నేరెడ్ మెట్ సిఐ నరసింహ స్వామి అన్నారు. కరోనా నిబంధనలు నిర్లక్ష్యం వ్యహిస్తే వారిపై నేరేడ్మెట్ పోలీసులు కొరడా చూపిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశానుసారం ప్రతిరోజు ప్రధాన చౌరస్తాలో, కాలనీలలో తనిఖీలు చేస్తూ మాస్కులు, కర్ఫ్యూ నిబంధనలను పాటించని వారికి అవగాహన కల్పిస్తూ పెట్టి కేసు నమోదు చేస్తున్నామని సిఐ నరసింహ స్వామి తెలిపారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై 68, బౌతిక దూరం పాటించని వారిపై 15, గుంపులు గుంపులుగా తిరుగు తున్న వారిపై 9, కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై2, ప్రధాన రహదారిపై పాన్ గుట్కా వేసుకొని ఉమ్మేసిన వ్యక్తిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సింగరేణి లో రక్షణ చర్యలు తీసుకోవాలి

 సింగరేణి లో రక్షణ చర్యలు తీసుకోవాలి

టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో వినతి

బెల్లంపల్లి , పెన్  పవర్

 సింగరేణి వణికిస్తున్న తరుణంలో ఎండలు పెరుగుతున్న కారణంగా కరోనా కూడా విజృంభిస్తు కావున సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఇతర డిపార్ట్మెంట్లలో పని చేస్తున్నా కార్మికులకు వైరస్ సోకకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి ఆసుపత్రి పర్యవేక్షణా ధికారికి వినతిపత్రం అందజేశారు, అనంతరం ఉపాధ్యక్షులు మనిరామ్ సింగ్ మాట్లాడుతూ  శానిటైజర్లు మాస్కులు ఉచితంగా కార్మికులకు అందించాలని,కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా వైరస్ కార్మికులకు వ్యాధి వ్యాపించి నట్లయితే జాతీయ విపత్తు చట్టం 1897 ప్రకారంగా సింగరేణిలో కార్మికులకు వేతనాలు కట్టి ఇవ్వాలని అన్నారు కార్మికులు కరోనా బారినపడి చనిపోయినట్లు అయితే గని ప్రమాదంగా గుర్తించాలని, కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.అంతరం ఆసుపత్రి సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు అమానుల్లాఖాన్ ,దుర్గం రాజయ్య, బొల్లు మల్లయ్య, రియాజ్, తలారి రాజు, సుధాకర్, అశోక్, భూపతి, తదితరులు పాల్గొన్నారు

డ్యూటీ నర్సులకు ఎన్ని తిప్పలో..?

 డ్యూటీ నర్సులకు ఎన్ని తిప్పలో..?

అకామిడేషన్ పేరుతో శ్రమను దోచుకుంటున్న ఆసుపత్రి బాసులు..??

దాదాపు రోజుకు 12గంటల పనివేళ్లలు..ఇలా చేస్తే..ఆరోగ్య పరిస్థితి ఏమిటీ???

కొన్ని వైద్యశాలలో నర్సులకు అసలుఆరోగ్య రక్షిత కిట్లు ఇస్తున్నారా..???

12గంటలు డ్యూటీ చేసి..కంటిన్యూగా రాత్రిలో డ్యూటీనా..???

రాత్రి సమయంలో ఎటువంటి భద్రత లేకుండా నర్సును ఒంటరిగా కోవిడ్ డ్యూటీ రప్పించడం భావ్యమా..???

వైద్యశాలలు నిర్వహిస్తున్న డాక్టర్లకు విశ్రాంతి అవసరం..??అకామిడేషన్ పేరుతో ఇలా నర్సులతో కంటిన్యూగా డ్యూటీ చేప్పించడం ఎంత వరకు సబబు???                               ఆప్స్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాజా రెడ్డి ప్రశ్న

పెన్ పవర్, హైదరాబాద్

 నేడు తెలుగు రాష్ట్రాలలో, జిల్లాలో ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్ లపై కోవీడ్ మహమ్మారి సందర్బంగా జరిగే అవినీతి పై విజిలెన్స్ దాడి చేస్తుడడం  సంతోషం.. అలాగే వాటిల్లో పని చేసే డ్యూటీ నర్స్ ల సమస్యలను చూడాలని ఆప్స్ రాష్ట్ర అధ్యక్షులు "ఎన్.రాజా రెడ్డి" కోరారు. నేటి ప్రస్తుత సమాజంలో పుట్టగొడుగుల్లా ఆసుపత్రిలు వీధి ఒక్కటి చొప్పున కొలువై.. ప్రస్తుత తరుణంలో వారి వారి ప్రత్యేకతలతో ప్రత్యేక చికిత్సలతో ఓ హోదా తెచ్చుకుంటున్నారు అసలు విషయానికి వస్తే ఆసుపత్రిలో అన్ని వసతులు ఇస్తామని చెప్పి..రోజుకు 8గంటలు మాత్రమే పనిచేయు వేళలని యువతులకు చెప్పి చేర్చుకుంటుండడం..వీరి మాటలను నమ్మి అకామిడేషన్ మరియు పని చేయు సమయ వేళలు 8గంటలని చేరిన రోజు నుంచి నర్సులకు ఎన్ని బాధలో.. వీరి బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియదు..సార్ కు చెబితే ఏమంటావో.. ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు.. దిక్కుతోచని స్థితిలో ఎందరో..మరెందరో నర్సులు  మదనపడి పోతున్నారు. యాజమాన్యాలు ఒక్కసారి వారి కష్టాలను తెలుసుకుంటే నియమ నిబంధనలను గుణంగా పనిచేయు సమయం 8గంటలు కానీ పలు కార్పోరేట్ ఆసుపత్రిలో.. సాధారణ హాస్పిటల్స్ లో నర్సులతో అదనపు సమయంలో విధులు చేప్పించు కుంటూ..జోబులు నింపుకుంటున్న కొన్ని సాధారణ ఆసుపత్రులు..కొన్ని ఆసుపత్రుల్లో మరొక్క ముఖ్య విషయం ఏమనగా కొన్ని ఆసుపత్రుల్లో రోజుకు 50మంది కరోనా పేషంట్లు వస్తున్న నేపథ్యంలో   ఒక్క సెక్యూరిటీ ఉండరు..ఒక్క అటెండర్ ఉండరు.. ఒక్క స్వీపర్ ఉండరు..ముగ్గురు చేసే పనిని ఒక్కరితోనే పనిని చేప్పించుకుంటూ ..నర్సులకు పనివత్తిడి పెంచుతూ..తీవ్ర ఆరోగ్య పరిస్థితికి కారణం అవ్వుతున్నారని వారి తల్లిదండ్రుల వాదన. ఇక్కడ ఈ చిన్న వైద్యశాలల్లో నగర వాసులకు ఏదేని ఆరోగ్య సమస్యలు వచ్చినను ఇక్కడకు వస్తే తప్పకుండా నయం చేసి పంపిస్తారనే  వైద్యులుగా పేరుపొందిన వీరు.. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లేడీ నర్సును ఒంటరిగా కోవిడ్ పేషెంట్స్ లకు దెగ్గర డ్యూటీ నిర్వహిస్తున్నారో అంతుబట్టని విషయం.. అంతేకాకుండా లేడీ నర్సులకు ఆత్మరక్షణ కిట్లు ఉండవు..టైమ్ కు తిండి ఉండవు.. నిద్ర ఉండవు.. స్వంత పనులకు సమయం దొరకదు..ఇంత కఠినాటికఠినంగా ఎలా వీరి శ్రమను దోచుకుంటున్నారు. వైద్య శాలల్లో ఒక్కసారి విచారణ చేప్పట్టితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది..వైద్యశాలలు నిర్వహిస్తున్న వైద్యులు ఇంకనైన చొరవ తీసుకుని.. సంపాదనే ధ్యేయంగా కాకుండా..పనిచేస్తున్న లేడీ నర్సులపై పని భారాన్ని తగ్గించి..ఎంతవరకు అవసరమో అంతవరకు నర్సులను.. అటెండర్లను..సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి..విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కోవిడ్ ఆత్మరక్షణ పరికరాలను ఇచ్చి..నియమ నిబంధనలనుగుణంగా పని చేయు సమయంలో విధులు నిర్వహించేలా చొరవ తీసుకుని వారికి వేతనాలను ఇవ్వాలని వైద్యశాలను నిర్వహిస్తున్న వైద్యులు ఇంకనైన మేల్కొనకపోతే అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని ఆప్స్ రాష్ట్ర అధ్యక్షుడు రాజా రెడ్డి కోరారు.

విద్య రంగంలో ఎంఈఓ రాజయ్య సేవలు మరువలేనివి

 విద్య  రంగంలో ఎంఈఓ రాజయ్య సేవలు మరువలేనివి

సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి

ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

విద్యారంగంలో ఎంఈఓ మంకు రాజయ్య సేవలు మరువలేనివని రాచర్ల బొప్పాపూర్ సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి అన్నారు.  ఎల్లారెడ్డిపేట మండలం లోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గల జ్ఞానదీప్ హైస్కూల్లో మండల విద్యాధికారి మంకు రాజయ్య మరియు వెంకటాపురం ఉపాధ్యాయుడు ఓలాద్రి యాదగిరిరెడ్డి లకు ఉపాధ్యాయ బృందం నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ టిఆర్ఎస్ మండల  అధ్యక్షుడు వరుస  కృష్ణ హరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ లు  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.   కరోనాతో మరణించిన ఎంఈఓ మంకు రాజయ్య మరియు ఉపాధ్యాయుడు ఓలాద్రి యాదగిరిరెడ్డి  లకు  జ్ఞానదీప్ హై  స్కూల్ ఉపాధ్యాయ బృందం మేనేజ్మెంట్,  ప్రభుత్వ ఉపాధ్యాయులు నివాళులు అర్పించి వాళ్ళు చేసిన సేవలను కొనియాడారు.  ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంఈఓ మంకు రాజయ్య ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో అహర్నిశలు కృషి చేశాడని ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ఘనత  మంకు రాజయ్య కు దక్కుతుందని అన్నారు.  అనంతరం సర్పంచ్ కొండపురం బాల్ రెడ్డి  మాట్లాడుతూ  మంకు రాజయ్య కరోనాతో చనిపోవడం వలన మన రాష్ట్రము మంచి విద్యావేత్త ను కోల్పోయిందని అన్నారు.  విద్యా రంగంలో అహర్నిశలు కృషి చేసి విద్యావ్యవస్థను మార్పు తెచ్చింది  ఎంఈఓ మంకు రాజయ్య అని అన్నారు.  అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న పాఠశాలలు అన్నీ ఒక మంచి స్థాయిలో ఉన్నాయి అంటే దానికి కారణం మంకు రాజయ్య అని అన్నారు.  ప్రభుత్వ పాఠశాలను ఒక కార్పొరేట్ పాఠశాలలు గా మార్చిండని  రమేష్ గౌడ్ అన్నారు.  రాజయ్య మరణము విద్యా రంగానికి తీరని లోటు అని అన్నారు.  రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం మండల వనరుల కేంద్రం ను మంకు రాజయ్య కేంద్రాలుగా  మార్చాలని ప్రభుత్వాన్ని కొండ రమేష్ గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో జ్ఞానదీప్ స్కూల్ కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ,  ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్. సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి,  మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వర్ష కృష్ణహరి, ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి.  ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయులు బాలయ్య మారుపాక రాజు డాక్టర్ భాను ప్రేమ్ సాగర్ రవీందర్,  తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు

ముస్లిం సోదరులకు రంజాన్ కానుక..శిరీష రెడ్డి

 ముస్లిం సోదరులకు రంజాన్ కానుక..శిరీష రెడ్డి 


పెన్ పవర్,  కాప్రా

ఎ.ఎస్.రావు నగర్ డివిజన్ లోని మహమ్మదీయ మసీదులో రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ తోఫా లను డాక్టర్ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శిరీష మాట్లాడుతూ కరోన వైరస్ రెండవ దశ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటిస్తూ స్వీయనియంత్రణ స్వీయ పరిశుభ్రత పాటించాలని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కోవిడ్  నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలని  కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, నాను లలిత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

చిల్కానగర్ డివిజన్ లో రంజాన్ తోఫా పంపిణీ

 చిల్కానగర్ డివిజన్ లో రంజాన్ తోఫా పంపిణీ 

తార్నాక,  పెన్ పవర్ 

 చిల్కానగర్ డివిజన్ లో చిల్కానగర్ పెద్ద మసీదు (మజీద్ ఈ అక్స ) లో  రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రంజాన్ తోఫాలను చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో  250 రంజాన్ తోఫా లను ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా. కార్పొరేటర్ మాట్లాడుతూ  కష్టకాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయమని, ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఖచ్చితంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశించడం నిజంగా కూడా అటువంటి గొప్ప సీఎం తెలంగాణ ప్రజలకు దొరకడం చాలా అదృష్టం అని అన్నారు. డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం సోదరులను అదేవిధంగా అన్ని వర్గాలను అక్కున చేర్చుకొని ఇట్లాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా  రంజాన్ పండుగను   దృష్టిలో పెట్టుకొని వారికి దుస్తులు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో  మస్జీద్ ఏ అక్సా అధ్యక్షులు ఎండీ యూసుఫ్, వైస్ ప్రెసిడెంట్ ఖాజా పాషా, జనరల్ సెక్రటరీ మహమ్మద్ హనీఫ్, జాయింట్ సెక్రటరీ నజీర్ అలీ ఖాన్, ట్రెజరర్ మహమ్మద్ గౌస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ రహీం, మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, ఏదుల కొండల్ రెడ్డి, రామ్ రెడ్డి, కొంపల్లి రాజ్ కుమార్, ఆబ్బు భాయ్, కుమార్,పరమేష్,పుష్ప రాజ్,బింగి శ్రీనివాస్, ముద్దం శ్రీనివాస్, మహమూద్, ఫారుక్,  సాయినాజ్ బేగం,సంతోష్ నాయక్,బాలు సుందర్, కుమార్, శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...