Followers

హెచ్ఆర్పీసీఐ నియోజకవర్గ చైర్మన్ గా హరిప్రసాద్ నియామకం

 హెచ్ఆర్పీసీఐ నియోజకవర్గ చైర్మన్ గా హరిప్రసాద్ నియామకం

తొర్రూరు, పెన్ పవర్

హెచ్ఆర్పిసిఐ పాలకుర్తి నియోజకవర్గ చైర్మన్ గా మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన కందుకూరి హరిప్రసాద్ నియమితులయ్యారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఆర్పిసిఐ నియోజకవర్గ చైర్మన్ గా నియమితులైన హరిప్రసాద్ కు జిల్లా చైర్మన్  పాలిశెట్టి శ్రీనివాసరావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా జిల్లా చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ...రాజ్యాంగ బద్దంగా వస్తున్న హక్కులను కాలరాసే వారిపై న్యాయస్థానాల్లో చర్యలు తీసుకునే హక్కు ఉందన్నారు. చట్టాలపై అవగాహన లేకపోవడంతో ప్రజలు మోసపోతున్నారన్నారు. ఎవరైనా హక్కులను హరిస్తే హెచ్ఆర్పిసిఐ తరపున చర్యలు తీసుకుంటామన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా చైర్మన్ శ్రీనివాసరావు,  జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సంజీవ లకు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి జాలిగామ సత్తయ్య, జిల్లా మహిళా చైర్మన్ నల్లకుంట ఉమాదేవి, ప్రతినిధులు తోట నగేష్, అల్లం శ్రీను, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంఘసేవకురాలు విమల సహకారం అభినందనీయం

 ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంఘసేవకురాలు విమల సహకారం అభినందనీయం

-జిల్లా కలెక్టర్ విపి గౌతమ్

తొర్రూరు,  పెన్ పవర్

కరోనా విపత్కర వేళ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంఘసేవకురాలు విమల సహకారం అందించడం అభినందనీయమని,జిల్లా కలెక్టర్ విపి గౌతమ్  పేర్కొన్నారు. కరోనా విస్తృతి వేళ పరీక్షలకు వినియోగించే సర్జికల్ టేబుళ్లను ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ధరావత్ విమల ప్రభుత్వ ఆసుపత్రికి విరాళంగా అందించారు. విమల కోడలు డాక్టర్ మౌనిక జన్మదినాన్ని పురస్కరించుకొని, శుక్రవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు పరికరాలను జిల్లా కలెక్టర్ పివి గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గుండాల మురళీధర్ కు అందజేశారు. విమల సేవా నిరతిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. లాక్ డౌన్ సమయంలోనూ విమల పేదలకు నిత్యావసర సరుకులు  అందించి, దాతృత్వం చాటుకుందని, కలెక్టర్ గుర్తుచేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల సంఖ్య పెంచేందుకు, వ్యాక్సినేషన్ కు అందరినీ సమాయత్తం చేసేందుకు వైద్య,ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని, కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి ఓపీ నిమిత్తం వచ్చేవారికి భోజనం అందించేందుకు సైతం చొరవ చూపాలని, కలెక్టర్ విమలకు సూచించారు. ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్లు విమల అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో  డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీ రామ్, తొర్రూరు జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో భారతి, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, ధర్మ శ్రీ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు, ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ప్రమీల,అధ్యక్షుడు ధరావత్ విశ్వనాధ్, హోమేష్, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పేదకుటుంబానికి కరోనా పారితోషకం చెల్లించాలి

ప్రతి పేదకుటుంబానికి కరోనా పారితోషకం చెల్లించాలి

 పెన్ పవర్, ఉలవపాడు 

మండల కేంద్రమైన ఉలవపాడు లోని ఉపాధి కూలీలకు రూ.300 కూలీ,200రోజులు పని కల్పించాలని, ప్రతి పేదకుటుంబానికి కరోనా పారితోషకం 10వేలు చెల్లించాలని,50కేజీల బియ్యం, నిత్యావసర సరుకులన్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మికసంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఉలవపాడులో శుక్రవారం  ఎంపీడీఓ టి. రవి కుమార్ గారికి వినతి పత్రం అందజేస్తున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్,సిపిఎం నాయకులు . గౌస్,సీఐటీయూ ఉలవపాడు మండల నాయకులు గంజి. శ్రీను, జహీర్,M. కోదండం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రూ10 లక్షలవిరాళం ప్రకటించిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్

 రూ10 లక్షలవిరాళం  ప్రకటించిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్ 
పెన్ పవర్, కందుకూరు

 కందుకూరు టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు నాక్ ఏ గ్రేడ్ సాధన కొరకు కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు కాకినాడ కు చెందిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిట్ వారి  కరేడు కు దగ్గర అలగాయపాలెం వద్ద ఉన్న హ్యాచరి మేనేజంగ్ డైరక్టర్   కార్తూరి సత్యన్నారాయణ మూర్తి ఆదేశాల మేరకు సేల్స్ మేనేజర్ సురేంద్ర కుమార్, హ్యాచరి మేనేజర్ ఎ. నాగేశ్వరావు లు శాసన సభ్యులు మహీధర్ రెడ్డి సమక్షంలో పదిలక్షల రూపాయలు కళాశాల అభివృద్ధి కోసం విరాళం ప్రకటించారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు మహీధర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు, నాక్ ఎ గ్రేడ్ సాధించేందుకు  దాతల సహాయ సహకారం తో కళాశాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 

మన ప్రాంతం కానివారప్పటికి మన కళాశాల అభివృద్ధి కి,  పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకరిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేశారు.నాక్  సాధన సమితి సభ్యులు శీలం సుధీర్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకోని వారు, ఈ ప్రాంతం వారు కాని వారు స్పందిస్తున్న తీరు చాలా సంతోషమని, అదేవిధంగాఈ కళాశాలలో చదువుకున్న వారు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అయితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు.అనంతరం దాతల తరుపున వచ్చినవారికి శాసనసభ్యులు మహీధర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం రవి కుమార్, నాక్ సాధన కమిటీ సభ్యులు శీలం సుధీర్, మంచిరాజు మురళి పాల్గొన్నారు.

మాస్క్ లు ధరిస్తూ కరోనా రక్కసిని అడ్డుకుందాం

మాస్క్ లు  ధరిస్తూ కరోనా రక్కసిని అడ్డుకుందాం 


పెన్ పవర్, రెబ్బెన 

కొమరంభీమ్ జిల్లా రెబ్బెన మండలము లోని రాజారాం గ్రామ పంచాయతి లో ప్రజలు అందరూ అప్రమత్తం గా ఉండాలి. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరిస్తూ భేతిక దూరం పాటించాలి. ఈ మహమ్మారి అడ్డుకుందం అందరూ తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అవసరానికి మించి బయటకు రావద్దని ప్రజలు అందరూ హోమ్ లోనే ఉండాలి. మన గ్రామ పంచాయతి లోని వాడ  వాడలా కు హైపో  క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కరోనా -19 వ్యాక్సిన్ తీసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజారాం సర్పంచ్ ఒరగంటి మల్లేష్  సందీప్ అజయ్ రాజేందర్ నరేష్  పాల్గొన్నారు. 

మేడే ను జయప్రదం చేయండి..

 మేడే  ను జయప్రదం చేయండి..

 చిత్తూరు, పెన్ పవర్

చిత్తూరు నగరంలోని ఏఐటీయూసీ అనుబంధ సంఘాల కార్మిక వర్గానికి  ఏఐటీయూసీ  గౌరవ అధ్యక్షులు  ఎస్. నాగరాజు పిలుపు మే 1న  ప్రపంచ కార్మికుల దినోత్సవం  మేడే సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధ సంఘాల  నాయకులు,  కార్యకర్తలు, ప్రస్తుతం కరోన  వైరస్ విపరీతంగా ప్రబలుతున్న దృష్ట్యా వారి వారి సంఘాల ఆధ్వర్యంలో  ఎర్రజెండాను ఆవిష్కరించాలి. ఊరేగింపులు, సమావేశాలు రద్దు చేసుకోని  ఎర్రజెండాలు మాత్రం ఆవిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మే 1వ తేదీన ఉదయం 6.00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 లోపు  జెండా ఆవిష్కరించే కార్యక్రమాలు ను పూర్తి చేయాలి. చిత్తూరు నగరంలో కరోనా వైరస్  నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలు జరుపుకోవాలని  పిలుపునిచ్చారు.

రెండు కోటాల ఉచిత బియ్యం పంపిణీ

రెండు కోటాల ఉచిత బియ్యం పంపిణీ

తవణంపల్లి, పెన్ పవర్

తవణంపల్లె  మండల   కేంద్రం తాసిల్దార్ కార్యాలయం నందు వీఆర్వోలు సమావేశం జరిగింది ఈ సందర్భంగా శుక్రవారం తాసిల్దార్ హనుమంతు మాట్లాడుతూ నేడు 2 కోటాలు 10 కేజీలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని చక్కెర కందిపప్పు కు ఖరీదు చెల్లించాలని తెలియజేశారు వీఆర్వో లు దగ్గరుండి ఉదయం 6 గంటలకు డీలర్ల వద్ద నుండి బియ్యం ట్రక్కుల ద్వారా ఇంటింటికి బియ్యం పంపిణీ చేయాలని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ పద్ధతులు పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వెంకటరమణ . విఆర్వో లు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...