పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే..
శివారు ప్రాంతాల అభివృద్ధికి 3వేల కోట్లు కేసిఆర్ ప్రకటన..ఎమ్మెల్యే..
భవిష్యత్‌లో ఎలాంటి వరద విపత్తులు తలెత్తకుండా పనులు చేపట్టేందుకు..
ప్రగతినగర్ కమాన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ వార్డులో రూ.1.57 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి, కమిషనర్ గోపి ఐఎఎస్, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా ప్రగతి నగర్ కమాన్ వద్ద .40 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రగతి నగర్ నుండి బాచుపల్లి వెళ్లే మెయిన్ రోడ్డులో రూ.48 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. అనంతరం ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీలో రూ.23.28 లక్షలతో బీటీ రోడ్డు, రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసి రోడ్లను ప్రారంభించారు. తదనంతరం అపురూప -2 కాలనీలో .20 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన పంచతత్వ పార్క్ ను ప్రారంభించారు. అనంతరం చందు లే-అవుట్ లో చలి వేంద్రం మరియు ఎన్ఆర్ఐ కాలనీలో స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. చివరగా 11వ వార్డు వీకర్ సెక్షన్ లో రూ.13 లక్షలతో నూతనంగా చేపడుతున్న మంజీర నీటి పైపు లైన్ పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ముందుచూపు బ్రహ్మండమైనదని కొనియాడారు.. శివారు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటైన కాలనీలతో పాటు నలువైపులా మిగిలి ఉన్న కాలనీలకు మంచినీరు, సివరేజీ పైపులైన్ వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరమని అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలకు అన్ని ప్రాంతాలు జలమయమై ఇబ్బందులు కలిగిన దృష్ట్యా భవిష్యత్‌లో ఎలాంటి వరద విపత్తు రాకుండా పనులు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ నిధుల ద్వారా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంచినీరు, సివరేజీ పైపులైన్ వంటి అభివృద్ధి పనులు పూర్తికానున్నట్లు పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వివిధ కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.