నెల్లికుదురు మండలగౌడ సంఘం అధ్యక్షుడిగాసతీష్ గౌడ్
గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులుగా మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన బోల్లేపెల్లి సతీష్ గౌడ్ ను,గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు,నియమిస్తూ,నియమకపత్రాన్ని శుక్రవారం మండల కేంద్రములో గౌడ సంక్షేమ సంఘం మహబూబాద్ జిల్లా కన్వీనర్ బూరుగు శ్రీకాంత్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గౌడ కులస్తుల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తున్న అతని సేవలను గుర్తించి,ఈ పదవి అప్పగించినట్లు తెలిపారు.అనంతరం సతీష్ గౌడ్ మాట్లాడుతూ...నాకు సహకరించి, నాపై నమ్మకంతో ఈ పదవి అప్పగించిన గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర,జిల్లా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ, గౌడ సంక్షేమ సంఘం బలోపేతం కోసం, సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళల కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమములో తూళ్ళ ప్రణయ్, నందా, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.