Followers

వేములవాడ లో విజృంభిస్తున్న కరోనా

 వేములవాడ లో  విజృంభిస్తున్న కరోనా...

 ఒక్కరోజు  32 కేసులు నమోదు...

వేములవాడ, పెన్ పవర్

వేములవాడలో రోజు రోజుకు  కరోనా విజృంభిస్తుంది. కరోనా సెకండ్ వెవ్  వేగంగా వ్యాప్తి చెందుతోంది. వేములవాడ ప్రాథమిక అరోగ్య కేంద్రం పరిధిలో శుక్రవారం 203 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 32 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని  మండల వైద్యాధికారి మహేష్ రావు తెలిపారు. వేములవాడ మండల పరిధిలోని మల్లారం గ్రామంలోనే 21 మందికి కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఒక్కసారిగా గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకు  పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పట్టణంతో పాటు చుట్టూ గ్రామాల  ప్రజల భయబ్రాంతులకు లోనవుతున్నారు. తాజాగా  మల్లారం గ్రామంలో 21, జయరమ్ గ్రామంలో రెండు, మర్రిపల్లి గ్రామంలో ఒకటి, పట్టణంలోని సుబ్రహ్మణ్య నగర్ ఒకటి,  గుర్రంవానిపల్లి మూడు,  పార్వతీపురం లో ఒకటి, సుబ్రహ్మణ్యంనగర్ లో ఒకటి, గాంధీ నగర్ లో ఒకటి,  మార్కెట్ ఏరియా లో ఒకటి , రామ్ మందిర్ వీధిలో ఒకటిగా  కేసులు నమోదైనట్టు స్పష్టం చేశారు. రోజురోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భౌతిక దూరం పాటించాలని, మాస్కూలు ధరించాలని  వైద్యాధికారులు, పోలీస్ అధికారులు ప్రతి రోజు హెచ్చరిస్తున్నా కూడా ప్రజలు నిబందలు పాటించకపోవడం వల్లనే కేసుల సంఖ్య అధిమవుతోంది. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండి వైరస్ ప్రబలకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

కిటకిటలాడిన రాజన్న ఆలయం

 కిటకిటలాడిన రాజన్న ఆలయం..



వేములవాడ, పెన్ పవర్

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం శివ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా కిటకిటలాడింది. హరిహరి నామ స్మరణతో మార్మోగింది. శుక్రవారం తెల్లవారుజాము  నుంచి ఆలయంలో భక్తుల  సందడి కనిపించింది.రాజన్నకు కోడే  మొక్కు చెల్లించుకున్న భక్తులు ...అంతర ఆలయంలోని స్వామి వార్లను,అమ్మవారిని దర్శించుకుని తరించారు. రాజన్నను దర్శించుకున్న డిఎస్పి దేవారెడ్డి దంపతులు. వేములవాడ శ్రీ  పార్వతి రాజరాజేశ్వర స్వామిని శుక్రవారం డిఎస్పి దేవారెడ్డి దంపతులు దర్శించుకున్నారు.అంతర ఆలయంలోని స్వామివార్లకు, అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసుకొని సేవించారు. నాగిరెడ్డి మండపంలో దేవారెడ్డి దంపతులను అర్చక స్వాములు  ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

 ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు

లక్షెట్టిపెట్, పెన్ పవర్

ప్రజా సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం హజీపూర్ మండలంలోనీ టికన్నపల్లి గ్రామం నుండీ పెద్దంపేట్ గ్రామం వరకు ఆర్ అండ్ బీ నిధులు నుండీ కోటి 23లక్షల రూపాయల వ్యయంతో రోడ్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్వర్యంలో గ్రామల అభివృద్ధికీ ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్దపీట వేస్తూ అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తుందన్నారు.గ్రామ స్వరాజ్యం కొరకు గాంధీజి కన్న కలలను ముఖ్యమంత్రి కేసిఆర్ నిజం చేస్తున్నారనీ గుర్తుచేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చెందాలన్నా ఉద్ద్యేశాంతో గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్, ట్రాలీ, అలాగే పల్లే ప్రకృతి వనలు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠ దామలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దేనాని కొనియాడారు. గత ఫిబ్రవరి ఈ నెలలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు భట్టి విక్రమార్క తమ పర్యటనలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతుందని అబద్ధపు మాటలు మాట్లాడారన్నారు. దిగువలో ఉన్న మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి నీరు వచ్చి చేరుతుంటే  అబద్ధాల మాటలు చెబుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, బాధతో ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడడం జరిగిందన్నారు. అనంతరం హాజీపూర్ పల్లె పకృతి వనంను,నర్సరీని పరిశీలించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45సంవత్సరాలు నిండిన వారికి  కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్,వైస్ ఎంపీపీ బెతూ రమాదేవి రవి, తెరాస పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, సర్పంచ్ మల్లేశ్వరి దుర్గయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పూస్కూరి శ్రీనివాస్ రావు, పీఏసీఏస్ చైర్మన్ లు ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పానీపూరి అమ్మే వ్యక్తిపై ఆర్ఎంపీ డాక్టర్ దాడి

 పానీపూరి అమ్మే వ్యక్తిపై ఆర్ఎంపీ డాక్టర్ దాడి...


నార్నూర్, పెన్ పవర్

 పానీ పూరి అమ్మే వ్యక్తిపై ఓ ఆర్ఎంపీ డాక్టర్ దాడి   చేసి గాయపర్చిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి (కె) లో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా గ్రామంలో అద్దెకు నివసిస్తున్నామని అయితే తాము ఉంటున్న ఇంటిని ఖాళీ చేసేలా ఇంటి యజమాని పై ఆర్ఎంపీ డాక్టర్ ఇమ్రాన్ ఒత్తిడి తీసుకురాగా ఇలా ఎందుకు చేస్తున్నారని ఇమ్రాన్ ను అడగడానికి వెళ్లగా తమ దంపతులు ఇరువురుని కట్టెతో, చెప్పులతో దాడి చేసాడని వారు వాపోయారు. చిరు వ్యాపారం చేసుకునే మాపై కక్ష కట్టి దాడి చేసిన ఆర్ఎంపీ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.

శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

 శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం...


ఇంద్రవెల్లి, పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనగ కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ ప్రారంభించారు.ముందుగా కంటాకు మండల ప్రజాప్రతినిధులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం శనగ కొనుగోళ్ళను ప్రారంభించారు. తోలుత మొదటి రైతును శాలువాతో సత్కరించారు. అనంతరం ఇంద్రవెల్లి మరియు సిరికొండ మండలాలలోని 30 మంది అర్హులైన లబ్బిదారులకు మంజురైన కళ్యాణ లక్ష్మి చెక్కులను వారికి అందజేశారు.ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ మాట్లాడుతు తెలంగాణ ముఖ్యమంత్రి రైతులకు అండగా ఉంటు రైతు బందు రైతు భీమాతో పాటు నేడు రైతులు పండించిన పంటలను సైతం కొనుగోలు చేస్తు అదుకుంటున్నారని, నేడు ఇంద్రవెల్లిలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మండల రైతుల శనగలను కొనుగోలు చేయడం జరుగుతుందని, ఇక మరోపక్కా నేడు ఇంద్రవెల్లి మండలానికి చెందిన 27 మందికి, సిరికొండ మండలానికి చెందిన (3) ముగ్గురికి మొత్తం 30 మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించడం జరిగిందని, పుట్టిన ఆడబిడ్డ నుండి వారి పెళ్ళిళ్ళ వరకు తెలంగాణ ప్రభుత్వం,  రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని, కేసిఆర్ కిట్ తో పాటు కళ్యాణ లక్ష్మి,  షాది ముబారక్ పథకాలను ఆడపడుచులకు అందిస్తు ఆదుకుంటున్నారని,  ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలందరికి అందిస్తు ముఖ్యమంత్రి కేసిఆర్ అందరి బాందవుడిగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి సర్పంచ్ కొరెంగ గాంధారీ, జడ్పిటిసి అర్క పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్మెన్ రాథోడ్ మోహన్, ఇంద్రవెల్లి-ఉట్నూర్ పిఎసిఎస్ చైర్మెన్లు మారుతి డోంగ్రే,  ఎస్పి రెడ్డి, జడ్పి కో ఆప్షన్ సభ్యుడు అంజద్, ఇంద్రవెల్లి-ఉట్నూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పెందూర్ హరిదాస్, అజిమొద్దీన్, ఎంపిటిసిలు స్వర్ణలత మహెష్ కదం, అశాబాయి, పిఎసిఎస్ డైరెక్టర్ దిలిప్ మోరే, ఉప సర్పంచ్ టెహెరె గణేష్,మార్క్ ఫేడ్ డిఎం పుల్లయ్య, ఏఓ రాథోడ్ గణేష్, పిఎసిఏస్ సిఈఓ ధరమ్ సింగ్, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక రైతులు పాల్గొన్నారు.

కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

 కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ...

బోథ్, పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల  కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు 34  కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న గొప్ప కానుక కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకమని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ మెంబర్ తాహెర్ బిన్  సలాం, ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్, సర్పంచ్ సురేందర్ యాదవ్, వెంకట రమణ గౌడ్ ,ఉమేష్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

ప్రయాణ ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం

 ప్రయాణ ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం...

బోథ్, పెన్ పవర్

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను శుక్రవారం బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావ్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాసం అనిల్ తన తల్లి జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అని సమాజ సేవలో యువత ఎప్పుడూ ముందంజలో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాసం నారాయణ, మాసం అనిల్, సర్పంచ్ సురేందర్ యాదవ్, జడ్పి కోఆప్షన్ మెంబర్ తాహెర్ బిన్ సలాం, సిఐ నైలు, ఎస్ఐ పి. రాజు,గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్, ఎలక రాజు, వెంకటరమణ గౌడ్, ఆర్టీసీ కంట్రోలర్ సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...