వైఎస్ షర్మిల కు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గుప్తా
పెన్ పవర్, మల్కాజిగిరిస్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమర్తె వైఎస్ షర్మిల కు వై.ఎస్.ఆర్.సీపి రాష్ట్ర కార్యదర్శి తడక జగదీశ్వర్ గుప్తా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం లోటస్ పాండ్ లోని కార్యాలయంలో వైఎస్ షర్మిలను కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గుప్తా మాట్లాడుతూ క్రీస్తు చూపిన విధంగా సర్వ మానవ సౌబ్రాతృత్వము, సాటి మానవుల పట్ల ప్రేమ, దయ కలిగిన మహోన్నత వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి తనయగా షర్మిల సైతం అంతే ప్రేమ, దయ కలిగి ఉన్నారని అన్నారు. యేసు క్రీస్తు అనుగ్రహముతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ప్రజల కష్టాలను తొలగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.