Followers

మహనీయుల విగ్రహాల ఏర్పాటును అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

 మహనీయుల విగ్రహాల ఏర్పాటును అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి 

తార్నాక, పెన్ పవర్ 

హైదరాబాద్ నాచారం డివిజన్ ఎర్రగుంట లో డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాల ఏర్పాటుకు దిమ్మలు నిర్మిస్తుండగా వాటిని అర్ధరాత్రి జిహెచ్ఎంసి అధికారులు కూల్చి వేయడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ నాచారం ఎర్రగుంట దగ్గర గతంలో అంబేద్కర్ విగ్రహం ఉందని, అదే స్థలంలో  విగ్రహం పునర్నిర్మాణం కోసం ఏర్పాట్లు చేసుకుంటే  కొందరు వ్యక్తులు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి అర్ధరాత్రి దిమ్మలను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాన్ని  కూల్చే వేయడంపై దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. దిమ్మలు కూల్చివేసిన వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ రావు, నరేందర్ ,నల్ల బాబు ,విశ్వనాథ్, తిరుపతి, అశోక్ ,మహేష్, బిక్షపతి ,వాసు, ఆశన్న శంకర్ ,పి శంకర్ ,దానం ,వినయ్ ,రాజు ,మహేందర్, ప్రభాకర్, క్రాంతి ,శివ, మల్లేష్, మరియు దళిత నాయకులు పాల్గొన్నారు.

ఓయూ లో బొడ దేవీలాల్ జన్మదిన వేడుకలు

 ఓయూ లో బొడ దేవీలాల్ జన్మదిన వేడుకలు

తార్నాక, పెన్ పవర్

గిరిజన శక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ నాయక్   ఆధ్వర్యంలో నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ బొడ దేవీలాల్ (ఐఈఎస్)  జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ లో ఘనంగా నిర్వహించారు. గిరిజన పేద కుటుంబంలో జన్మించి  ఇంత పెద్ద స్థాయికి రావడం ఈ రోజుల్లో చాలా మంది పేద గిరిజన యువకులకు దేవీలాల్ ఆదర్శవంతం అని శరత్ నాయక్  అన్నారు. ఆయన జీవితం చిన్న వయసునుండి ఎంతో కష్టపడి  నమ్ముకొని ఈ స్థాయికి వచ్చి ఎంతో మంది పేద విద్యార్థులకు సహాయం చేస్తూన్న వ్యక్తి అని కొనియాడారు.  చదువు యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ తనలాగే గొప్ప అధికారులుగా  ఎదగాలని విద్యార్థులకు దేవిలాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్, ఈఈ హరీష్, బంజారా గీత రచయిత యాకూబ్ నాయక్, యువ పారిశ్రామికవేత్త పవన్ రాథోడ్, గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి భూక్య నరేష్ నాయక్, జహెద సుల్తానా, కేసికే నాయక్, ఏపీ స్టేట్ ఎండీ డాక్టర్, జయభరతి, ఝాన్సీ రాణి, తులసిరామ్, సునీత, ధనాసింగ్, శ్రీవాణి,తదితరులు పాల్గొన్నారు.

పోలీసు అధికారుల రిక్రియేషన్ హల్ ను ప్రారంభోత్సవం చేసిన ... విశాఖ జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు

 పోలీసు అధికారుల రిక్రియేషన్ హల్ ను ప్రారంభోత్సవం చేసిన ... విశాఖ జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు

విశాఖ తూర్పు, పెన్ పవర్

విశాఖపట్నం జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఐపిఎస్ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు కొరకు ఆర్ముడు రిజర్వ్ కైలాసగిరి పోలీసు మైదానం దరి షాపింగ్ కాంప్లెక్స్ పైన నూతనంగా నిర్మించిన “రిటైర్డ్ పోలీసు అధికారుల రిక్రియేషన్ హల్” ను ప్రారంభోత్సవం చేశారు. 1983 సం లో సిటీ, రూరల్ గా పోలీసులు విడిపోయిన తర్వాత రూరల్ జిల్లాలో పదవీ విరమణ పొందిన పోలీసులకు రిక్రియేషన్ హల్ లేకపోవడంతో వారి అభ్యర్థన మేరకు జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని, 30 నుంచి 40 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకొని సాటి పోలీసులు కలిసి మెలిసి ఉండుటము వలన కుటుంబ సభ్యులుతో కన్నా తోటి ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల వారిలో ఎంతో ఆత్మీయ బంధం పెనవేసుకుంటుందన్నారు.

 అటువంటి వారికి  ఈ రిక్రియేషన్ హల్ స్వాంతన చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నూతనంగా నిర్మించిన రిక్రియేషన్ హాల్ లో కేరంస్, చేస్, న్యూస్ పేపర్లు మొదలైనవి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీరంతా పోలీస్ కుటుంబ సభ్యులేనని మీకు ఎటువంటి అవసరం వచ్చినా నేరుగా నన్ను కలవాలని అవసరమైతే మీ సేవలు కూడా పోలీస్ శాఖ ఉపయోగించుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే అర్మేడ్ రిజర్వ్ డి.ఎస్.పి., ఆర్.పి.ఎల్. శాంతికుమార్ వ్యక్తిగత శ్రద్ద కనబరిచి ఈ హాల్ ను నిర్మించడం అభినందనీయమని జిల్లా ఎస్.పి., అన్నారు.పదవి విరమణ పొందిన మొత్తం 50 మంది పోలీసు అధికారులు, తాము కొన్ని సంవత్సరాలుగా తమ కోర్కెను, తెలియజేస్తున్నామని, 

కానీ ప్రస్తుత జిల్లా ఎస్పీ దృష్టికి ఈ విషయం తీసుకు వచ్చిన వెంటనే స్పందించి తక్కువ సమయంలో మేము కోరుకున్న రిక్రియేషన్ హాల్ ను నిర్మించి మాకు అందించడం చాలా ఆనందంగా ఉందని చెబుతూ జిల్లా ఎస్.పి. కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ అదనపు ఎస్పీ ఎస్.ఈ.బి ఆర్.పి.ఎల్. శాంతికుమార్ డిఎస్పి ఎఆర్., జీ.వి.రమణ ఇన్స్పెక్టర్ డిఎస్బి. రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, అరవింద్ కిషోర్, మురళీ మోహన్ రావు మరియు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

పరలోకానికి ఉచిత మార్గమే గుడ్ ఫ్రైడే

 పరలోకానికి ఉచిత మార్గమే గుడ్ ఫ్రైడే

యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి విడుదల కలుగును

కేసముద్రం, పెన్ పవర్

 పరలోకానికి మానవాళికి మార్గాన్ని చూపించి నడిపించేందుకు భూమిపైన ఏసుక్రీస్తు సిలువ బలి యజ్ఞం చేశారని  ఆయన భూమికి ఆకాశానికి మధ్య సిలువలో వ్రేలాడి అర్పించిన ప్రమాణమును బట్టి చిందించిన పరిశుద్ధ రక్తం ను బట్టి మానవాళికి -జన్మతహా కర్మ తహ పాపం నుంచి విడుదల చేసి నరకపు సంకెళ్ళను  తెంచి  క్రయధనముగా తన రక్తమును వెళ గా చెల్లించి సకల మానవాళిని ఉచితముగా పరలోకానికి ముక్తిని ఇచ్చేందుకు ఏసుక్రీస్తు భూమి పై బలి ( ప్రాణార్పణ) అయ్యారని పరిశుద్ధ గ్రంధం బైబిల్ తెలియజేస్తుంది, రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ దేశం లో ఇదే రోజు శుక్రవారం ఆయన సిలువలో బలిగా తన ప్రాణమును అర్పించాలని ఏసుక్రీస్తు మాట్లాడుతూ నా ద్వారానే తప్ప పరలోకం ఎవరూ రాలేరని నేను మానవాళి మనుషులను పరలోకం తీసుకువెళ్లేందుకు భూ లోకం లోకి వచ్చానని' నేనే మార్గము సత్యము జీవము ఐ ఉనాన్నని ఆయన తెలిపారు నాటి నుండి నేటి వరకు క్రైస్తవ సమాజం ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆనందంగా క్రైస్తవ పాటల తో పరిశుద్ధ గ్రంధం లోని వాక్యాలు పట్టణాలతో భక్తిశ్రద్ధలతో ప్రపంచ మానవాళి భక్తులు జరుపుకుంటున్నారు. ఆయన చూపించిన ప్రేమ దయ జాలి కరుణ కనికరము తగ్గింపు ప్రతి ఒక్కరూ ఇతరులకు చూపించాలని అగాపే గాస్పల్ ఫుల్ చర్చ్ పాస్టర్ పిల్లి కుమారస్వామి గారు ప్రజలకు తెలిపారు. 

సునీల్ నాయక్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

 సునీల్ నాయక్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : ఏబీవీపీ



కూకట్ పల్లి, పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ నిరుద్యోగులకు న్యాయం జరగలేదని, తన చావుతో అయినా నిరుద్యోగుల దుస్థితి ప్రభుత్వానికి తెలిసొస్తుందని భావిస్తూ పురుగుల మందు తాగి మరణించిన కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సునీల్ నాయక్ మృతికి ముమ్మాటికీ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు కూకట్ పల్లి లోని జె.ఎన్.టి.యూ ప్రధానద్వారం ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ వినోద్ హిందూస్థానీ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష తొంభై వేల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ తెరాస ప్రభుత్వం నిర్లక్ష ధోరణితో వాటిని భర్తీ చేయకుండా కాలం వెల్లదిస్తుందని, నిరుద్యోగుల చావుకు కారణమవుతున్న కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారాల్సిన యువత పీనుగలై పాడేక్కుతున్నారని ఆయన విమర్శించారు. సునీల్ నాయక్ కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష వైఖరే కారణమని, ఈఘటనపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. పరిపాలన చేతగాని అసమర్ధ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతికి, గవర్నర్ కు నివేదికలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా నిరసన నిర్వహించిన విద్యార్థులను కె.పి.హెచ్.బి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈకార్యక్రమంలో  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సనీల్, మురళీ, ఇతర నాయకులు రామకృష్ణ, సుధీర్, మనోజ్, గోపాల్, ప్రశాంత్, యశ్వంత్, మహేష్, జగన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఆళ్ళంపల్లి రాజబాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్,పి.ఏస్.ఎన్.రాజు

 ఆళ్ళంపల్లి రాజబాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్,పి.ఏస్.ఎన్.రాజు

మహారాణి పేట, పెన్ పవర్

వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆళ్ళంపల్లి రాజబాబు నీ శుక్రవారం పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్ మరియు మాజీ వుడా చైర్మన్ పి.ఏస్.ఎన్. రాజు(రవి) తదితరులు పోల్గొన్నారు.

నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన వంశి

 నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన వంశి    

విశాఖ తూర్పు, పెన్ పవర్

 శ్రీ శ్రీ శ్రీ సీతారామ సేవా సంఘం, పాత వెంకోజిపాలెం గ్రామ కమిటీ నూతన కార్యవర్గం వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ని శివాజిపాలెం నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చెమ్ అందజేశారు. గ్రామ అభివృద్ధి కి నిరంతరం కృషి చేయాలని, తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడు వుంటాయని అన్నారు.నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కర్రి శ్రీను ని కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, సెక్రెటరీ  ఆడారి శివ ప్రసాద్, కోశాధికారి వాసు, జాయింట్ సెక్రటరీ రమేష్, చంద్ర శేఖర్ తో పాటు వైసీపీ సీనియర్ నాయకులు పీలా వెంకట పరదేసి నాయుడు  పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...