Followers

వ్యాక్సిన్ వేయించుకోండి కరోనా వైరస్ ని అరికట్టండి

 వ్యాక్సిన్ వేయించుకోండి కరోనా వైరస్ ని అరికట్టండి

మహారాణి పేట, పెన్ పవర్

135 కోట్ల ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రధానమంత్రి మోడీ ధ్యేయం భారతావనిలో కరోనా వైరస్ రెండవ దశ తీవ్రంగా విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ  తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు . వ్యాక్సిన్ ప్రక్రియ నత్తనడకన నడుస్తున్నదని ఈ ప్రక్రియ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రధాని మోడీ ప్రజా ఆరోగ్య సంక్షేమం దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా నిరంతరము భారత శాస్త్ర వేత్తలతో సంప్రదిస్తూ,వారిని ఉత్సాహపరుస్తూ  వారు కోరిన విధముగా మౌలిక సదుపాయాలు చేకూర్చి అతి తక్కువ వ్యవధిలో ప్రజలకు అందుబాటులోకి వ్యాక్సిన్ వచ్చే విధముగా కృషి చేశారని,భారత్ లో తయారైన ఈ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలు గుర్తించాయని 70 దేశాలకు పైగా ఈ వ్యాక్సిన్ను సరఫరా చేస్తున్నారని అన్నారు.ప్రజల వ్యాక్సిన్ తీసుకొనుటకు  ముందుకు రావడం లేదని, వ్యాక్సిన్ తీసుకోవటం వలన ఎటువంటి దుష్ఫలితాలు రావాని ,45 సంవత్సరాలు పైబడిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకొనుటకు  అర్హులు అని అన్నారు. ప్రధాని మోడీ  వ్యాక్సిన్ను ప్రక్రియను  వేగవంతం చేయాలని అధికారులను  ఆదేశించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా నిరంతరము మాస్కులు ధరించాలని ,శానిటైజర్ ఉపయోగించుకోవాలని , భౌతిక దూరం పాటించాలని ,పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తరచుగా  గోరువెచ్చటి మంచినీరు అని వేడి పదార్థములనే భుజించాలని, ప్రతి ఇంట్లోనూ ఒక మెడికల్ కిట్ ను భద్రపరుచుకోవాలి అని ,రద్దీ ప్రాంతములలో  తిరగరాదని ,మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది అని అన్నారు.ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియ పట్ల సామాజిక ప్రచార సాధనముల ద్వారా, చరవాణి ,అన్ని రకాల టీవీ ఛానల్స్ ద్వారా,ప్రింట్ , ఎలక్ట్రానిక్   మీడియా ద్వారా,వ్యాక్సిన్ వేయించు కొనుట వలన వచ్చే  ఉపయోగములను ఈ ప్రచార సాధనముల ద్వారా  తెలియజేయాలని  అన్నారు.  ఈ ప్రక్రియ కోసము స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు  ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించి  ఈ కార్యక్రమమును విజయవంతం చేయడానికి కరోనాను కట్టడి చేయడానికి  చేయాలని పిలుపునిచ్చారు.

భగ్గుమంటున్న భానుడు....!

 భగ్గుమంటున్న భానుడు....!

గత రెండు రోజులుగా 40 డిగ్రీలు..మొదలైన వడగాల్పులు  

బయటకివెళ్లాలంటేనే జంకుతున్న జనం - నిర్మానుషంగా పట్టణ రహదారులు




లక్షెట్టిపెట్, పెన్ పవర్

భానుడి భగభగలకు మండల వ్యాప్తంగా ఎండలు దంచుతున్నాయి రెండు మూడు రోజులు గా  ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. ఈ క్రమంలో శుక్రవారం ఎక్కువగా 42 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మూడు నాలుగు రోజులగా పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా  నమోదువుతుండగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగాయి దీనికి తోడుగా రెండు రోజులుగా వడ గాడ్పులు కూడా మొదలు కావడంతో ఎండకు జనం  అల్లాడిపోతున్నారు.ఎండ తీవ్రతకు శుక్రవారం లక్షెట్టిపెట్ పట్టణ రహదారులు ఉత్కూర్ చౌరస్తా,గాంధీ చౌక్,పాత బస్టాండ్ ఏరియాలలో చాలా వరకు  జన సంచారం లేకుండా నిర్మానుష్యంగా మారాయి..

జోరుగా వేసవి వ్యాపారం

ఎండలు ముదరడంతో వేసవి సీజన్ వ్యాపారులతో జోరందుకుంది మండల కేంద్రంలో తదితర ప్రాంతాలల్లో ఎలక్ట్రిషన్ షాపుల వద్ద జనం బరులుదిరుతున్నారు ఎండ నుంచి ఉపశనం పొందేందుకు గాను ప్రజలు ఇప్పటికే తమ ఇంట్లో ఉన్నటువంటి కూలర్లు,ఏసీలను రిపేర్ చేయించడంతోపాటుగా కొత్తవి కొనుగోలు చేస్తున్నారు.అలాగే చల్లని మంచినీళ్ల కోసం కొత్త కుండలను, రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేస్తున్నారు..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

స్వచ్ఛ మల్లేపల్లి గ్రామం గా తీర్చిదిద్దేందుకు కృషి 

మల్లేపల్లి సర్పంచ్ బలిరెడ్డి వరలక్ష్మీ గంగరాజు, ఉపసర్పంచ్ దొమ్మా శ్రీను 

పెన్ పవర్,గండేపల్లి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని మల్లేపల్లి గ్రామాన్ని స్వచ్ఛ మల్లేపల్లి గ్రామం గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి కృషి చేద్దామని మల్లేపల్లి గ్రామ సర్పంచ్ బలిరెడ్డి వరలక్ష్మి గంగరాజు, ఉపసర్పంచ్  దొమ్మా శ్రీను లు పిలుపునిచ్చారు. శుక్రవారం మల్లేపల్లి లోని యువత, మహిళలు, ఆరోగ్యకార్యకర్తలు ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్నపురాజుపేట, పాతూరు, కొత్తూరు, నీలకుండీలపేట ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అప్పుడే గ్రామం అన్ని రంగాలలోను అభివృద్ధి చెందుతుందని సూచించారు. గ్రామాన్ని స్వచ్ఛ మల్లేపల్లి గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.గ్రామంలోని విద్యావంతులు, రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్లతో గ్రామ అభ్యుదయ సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా ప్రభుత్వం అనుసంధానంతో గ్రామంలోని వినూత్న కార్యక్రమాలు చేపట్టి గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామన్నారు. ఇందుకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. రానున్న రోజుల్లో దేశంలోనే మల్లేపల్లి గ్రామానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా చేయాలనేదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తాతాజీ మాష్టారు,ఆలేటి రవి, హై స్కూల్ చైర్మన్ బలిరెడ్డి శ్రీను, గొర్రెల శివ, బలిరెడ్డి శ్రీధర్, బత్తుల వీరబాబు, తెలగరెడ్డి భాస్కరరావు, చింతపల్లి సుబ్బారావు, పొంతపల్లి సత్తిబాబు, అధిక సంఖ్యలో మహిళలు, వాలంటీర్లు, విద్యార్థిని విద్యార్థులు, పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆదిత్య యూత్ రెడ్ క్రాస్ యూనిట్ చే అడాప్ట్ ఎబౌల్ ఈవెంట్

ఆదిత్య యూత్ రెడ్ క్రాస్ యూనిట్ చే అడాప్ట్ ఎబౌల్ ఈవెంట్

పెన్ పవర్,గండేపల్లి

గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్యా ఇంజనీరింగ్ క్యాంపస్ వేసవి లో పక్షులను పరిరక్షించేందుగుకు ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ యూత్ రెడ్ క్రాస్  యూనిట్ చే అడాప్ట్ ఏ బౌల్ ఈవెంట్ ను చేపట్టినట్టు ఆదిత్య రెడ్ క్రాస్ యూనిట్ సభ్యులు తెలిపారు.వేసవి లో పక్షుల దాహాన్ని తీర్చేందుకు  ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అడప్ట్ ఏ బౌల్ అన్నే ఈవెంట్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అందులో భాగంగా పక్షలకు క్యాంపస్ పరివాహక ప్రాంతం లో పర్యావరణానికి హానికరం కాని  మట్టి తో చేసిన పాత్రలలో  నీటిని  ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం గా విద్యార్థుల సహకారం తో ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మేడలు పై నా మట్టి పాత్రలు ఉంచి వేసవి అంతా నీటిని అందించేందుకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల  ప్రిన్సిపాల్ డా.ఎమ్. శ్రీనివాసరెడ్డి యూనిట్ సభ్యులను అభినందించారు.ఈకార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ ఎఫైర్స్.ప్రొ.జె.డి.వెంకటేష్, ఆదిత్య రెడ్ క్రాస్ యూనిట్ కో.ఆర్డినేటర్. ప్రొ.ఎస్.బి.జి.తిలక్ బాబు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

గుండెపోటుతో మరణించిన పి.ఈ .టి

 గుండెపోటుతో మరణించిన పి.ఈ .టి 

బెల్లంపల్లి ,  పెన్ పవర్ 

మంచిర్యాల జిల్లా. బెల్లంపల్లి మండలం లో విషాదం చోటు చేసుకుంది,తాండూర్ మండలంలో  తాసిల్దార్ గా పనిచేస్తున్న కవిత భర్త బెల్లంపల్లి సెంట్ మేరీస్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న  అనిల్ కుమార్ ఉదయం బ్యాట్మెంటన్  ఆడుతూ ఒక్కసారిగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న సెంట్ మేరీస్ పాఠశాల యాజమాన్యం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అనిల్ పీఈటి చనిపోవడం ఎంతో విషాదకరం అని అన్నారు, వివిధ పార్టీల నాయకులు , తాసిల్దార్ లు, రెవిన్యూ సిబ్బంది, పట్టణ ప్రజలు అనేక మంది అక్కడికి చేరుకొని నివాళులర్పించారు.

సింగరేణిలో యువకార్మికులు అందరు కలిసి పోరాడాలి

 సింగరేణిలో యువకార్మికులు  అందరు కలిసి పోరాడాలి


మందమర్రి,  పెన్ పవర్

సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లు,జనరల్ మజ్దూర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి,సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువ కార్మికులందరూ కలిసి పోరాడాలని తెలంగాణ బదిలీ వర్కర్స్, మజ్దూర్స్ ఫోరం అధ్యక్షులు కొప్పుల శ్రీనాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మందమర్రి పట్టణంలోని ఇందూ గార్డెన్ లో ఫోరం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి వ్యాప్తంగా సుమారు 150 మంది సభ్యులు పాల్గొని, ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం నూతన అధ్యక్షుడిగా కొప్పుల శ్రీనాథ్, ప్రధాన కార్యదర్శిగా బొగ్గుల సాయి కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా హర్షవర్ధన్ లను ఎన్నుకున్నారు. అదేవిధంగా  సింగరేణి వ్యాప్తంగా 11ఏరియాలకు ఏరియా ఉపాధ్యక్షులను నియమించారు. అనంతరం అధ్యక్షులు కొప్పుల శ్రీనాథ్ మాట్లాడుతూ, త్వరలోనే సింగరేణి వ్యాప్తంగా బాయి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం 2014 డిపెండెంట్ ఉద్యోగాల కోసం కృషిచేసిన కొప్పుల శ్రీనాథ్, చెల్పూరి సతీష్, సాదుల సంతోష్ లను సభ్యులు సన్మానించారు. అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ కోసం పోరాడి, ఇటీవల అకాల మరణం చెందిన ఆర్కే 7 ఉద్యోగి సుగుణకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఫోరం నాయకులు సారంగపాణి, సంతోష్ పాండే, పెండం సాయికృష్ణ, సంతోష్, రవి యాదవ్, కాదశి రమేష్, అవినాష్, సూర్యనారాయణ సూర్య నాయక్, సంతోష్ రెడ్డి, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

యేసుక్రీస్తు సర్వమానవ పాపలకై మరణించారు

 యేసుక్రీస్తు సర్వమానవ పాపలకై మరణించారు: పాస్టర్ డేవిడ్ కులేరి

మండలంలో వైభవంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లోని ఐపీసి హోలి చర్చి ఆద్వర్యంలో  శుభ శుక్రవారం ఆరాధన  అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎల్లారెడ్డిపేట ప్రార్థన దేవాలయాల్లో యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించి, ప్రత్యేక ప్రార్థనలు చేసారు. పాస్టర్ డేవిడ్ కులేరి యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు ధ్యాన సందేశం అందించారు. దేశం కోసం, ప్రజా ప్రతినిధి ప్రతినిధులకై, కరోనా నివారణ కోసం, ప్రజా శ్రేయస్సుకై  ప్రార్థించారు. దైవజనురాలు సమాధానం, సంఘ పెద్దలు అమృతరావు, సముయేలు, దానియేలు,  శుభ శుక్రవార ఆరాధన కార్యక్రమం నడిపించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...