Followers

నెల్లిపాక లో చలివేంద్రం ప్రారంభించిన యువకులు

 నెల్లిపాక లో చలివేంద్రం ప్రారంభించిన యువకులు 

ఎటపాక,పెన్ పవర్ 

 చలివేంద్రం ప్రారంభించిన నెల్లిపాక  దళిత యూత్ సభ్యులు వివరాల్లోకి వెళితే  మండల పరిధిలోని నెల్లిపాక గ్రామంలో  గత ఐదు రోజుల క్రితం  నెల్లిపాక దళిత యూత్ యువకులు నెల్లిపాక కూనవరం రోడ్డు  హెచ్పీ పెట్రోల్ పంప్  ఎదురుగా  చలివేంద్రాన్ని  ప్రారంభించారు. వారు మాట్లాడుతూ చలివేంద్రం ప్రారంభించడం  సంతోషకరమని అన్నారు  ఆ రోజు నుంచి నేటి వరకు   బాటసారుల మిర్చి  కోతలకు వచ్చే కూలీలు ఇక్కడ ఆగి వారి దాహార్తి తీర్చుకుంటున్నారని యువకులు అంటున్నారు.ఇక్కడ చలివేంద్రం పెట్టి అందరికీ నీళ్లు ఇస్తున్నందుకు అందరూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు, అని వారు అంటున్నారు.

ఇద్దరికి కరోనా పాజిటివ్

 ఇద్దరికి కరోనా పాజిటివ్

మండల వైద్యాదికారి డాక్టర్ మానస వెల్లడి

పెన్ పవర్, ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 87  మందికి కరోనా నిర్ధారణ కోసం పరీక్షలు చేయగా ఇద్దరి కి  కరోనా పాజిటివ్  రాగా 85 మందికి నెగిటివ్ వచ్చినట్టు మండల వైద్యాదికారి డాక్టర్ మానస తెలిపారు. రాజన్నపేట గ్రామనికి ఇద్దరికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు  నిర్దారణ అయ్యిందన్నారు. కరోనా నిర్దారణ అయిన వ్యక్తులు  కంట్రోల్ అయ్యేంతవరకు  కుటుంబ సభ్యులకు దూరంగా మాస్కులు దరించి ఉండాలని . ప్రతి రోజు గోరువెచ్చని నీటినే తాగాలనీ ఆయన పిలుపునిచ్చారు. కరోనా సోకినట్టు అనుమానం ఉన్న వ్యక్తులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ధర్మానాయక్ కోరారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో కోవీడ్ వాక్సినేషన్  కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో భాగంగా 45 సంవత్సరాల వయస్సు పై బడిన ప్రతి ఒక్కరికీ ( దీర్ఘకాలిక వ్యాదులతో సంబంధంలేకుండా ) వాక్సిన్  ఇవ్వబడుతుందన్నారు. లబ్దిదారులు అందరు కూడా ఆధార్ కార్డ్ తో రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా సద్వినియోగ పర్చుకోవాలనీ  డాక్టర్ మానస తెలిపారు.

పంచతత్వ పార్కు..మంచి నీటి పైపులైను ఏర్పాటుకు వినతి

 పంచతత్వ పార్కు..మంచి నీటి పైపులైను ఏర్పాటుకు వినతి.. 



కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలోని వైష్ణవి నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను తన నివాసం వద్ద, స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో పంచతత్వ పార్క్ ఏర్పాటు చేయాలని మరియు త్రాగునీటి సమస్య పరిష్కారానికి అదనంగా 150 మీటర్ల మంచి నీటి పైపు లైను ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే వివేకా నందకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. కాలనీలో అదనంగా మంచి నీటి పైపు లైను నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పంచతత్వ పార్క్ ను కూడా ఏర్పాటు చేస్తామని కాలనీవాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ యాదిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్య, జనరల్ సెక్రటరీ నాగభూషణం మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

బస్ షెల్టర్ కు, 5 రూ. భోజనం సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

 బస్ షెల్టర్ కు, 5 రూ. భోజనం సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి.. 

కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ లోని లాస్ట్ బస్టాప్ వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని, 5 రూపాయల భోజనం సౌకర్యం కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే వివేకానందకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.. ప్రజల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే త్వరలోనే రూ.5 భోజనం సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడప శేషు, పద్మజ రెడ్డి, శ్రీకాంత్, నాగిరెడ్డి, పద్మలత రెడ్డి, నాని, అడప శేఖర్, బద్రి, సురేష్ తదితరులు పాల్గొన్నారు..

టైర్ పంచర్ బోల్తాపడ్డ ట్రాలీ

టైర్ పంచర్  బోల్తాపడ్డ ట్రాలీ

ఎటపాక,పెన్ పవర్ 

మండల పరిధిలోని రాయనపేట గ్రామ జాతీయ రహదారిపై టైర్ పంచర్ ట్రాలీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళ్తే భద్రాచలం వైపు నుంచి కుంట  మట్టి పెంకులు లోడుతో వెళుతున్న ట్రాలీ పంచర్ అయ్యి  రాయన పేట గ్రామం వద్ద బోల్తా పడిన ఘటనలో  ట్రాలీ లో ప్రయాణిస్తున్న కొందరికి స్వల్ప గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రచారంలో దూసుకుపోతున్న అందుగుల పాప

 ప్రచారంలో దూసుకుపోతున్న అందుగుల పాప

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో వైసిపి ఎంపిటిసి అభ్యర్థిని అందుగుల పాప శుక్రవారం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి, అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ఏఎంసి ఛైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాసరావు, అభ్యర్థిని  భర్త అందుగుల రవి, వైసిపి నాయకులు వల్లభశెట్టి చిన్ని, కోనాల వీర్రాజు, భరత్, సువర్ణరాజు, మరపట్ల శ్రీను, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో పలువురు వైసిపి లో చేరికలు

 నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో పలువురు వైసిపి లో చేరికలు

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం ప్రక్కిలంక రావిపాటి కళ్యాణ మండపంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత గురువారం జెడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులకు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా తాళ్లపూడి వైసిపి బిసి సీనియర్ నాయకులు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో తాళ్లపూడి నుండి తెలుగుదేశం సీనియర్ బిసి నాయకులు మరియు ప్రముఖ వస్త్ర వ్యాపారి వుడతా రామకృష్ణ, తెలుగుదేశం బిసి యువజన నాయకులు వుడతా వీరేంద్ర కుమార్, తాళ్లపూడి కాపు సంఘం అధ్యక్షులు వనిమిరెడ్డి శ్రీను, మరియు 20 మంది సభ్యులు వైసిపి లో జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరికి మంత్రి వనిత పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి మండల వైసిపి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...