Followers

వైఎస్ షర్మిల కు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గుప్తా

 వైఎస్ షర్మిల కు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గుప్తా

పెన్ పవర్,  మల్కాజిగిరి 

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమర్తె వైఎస్ షర్మిల కు వై.ఎస్.ఆర్.సీపి రాష్ట్ర కార్యదర్శి తడక జగదీశ్వర్ గుప్తా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం లోటస్ పాండ్ లోని కార్యాలయంలో వైఎస్ షర్మిలను కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గుప్తా మాట్లాడుతూ క్రీస్తు చూపిన విధంగా సర్వ మానవ సౌబ్రాతృత్వము, సాటి మానవుల పట్ల ప్రేమ, దయ కలిగిన మహోన్నత వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి తనయగా షర్మిల సైతం అంతే ప్రేమ, దయ కలిగి ఉన్నారని అన్నారు. యేసు క్రీస్తు అనుగ్రహముతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ప్రజల కష్టాలను తొలగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

కెసిఆర్ పాలనలోనే తెలంగాణ బీడు భూములు అన్ని సస్య శ్యామలం

 కెసిఆర్ పాలనలోనే తెలంగాణ బీడు భూములు అన్ని సస్య శ్యామలం

ఎమ్మెల్యే రెడ్యా నాయక్

చిన్నగూడూరు,  పెన్ పవర్

చిన్న గూడూరు .మండల కేంద్రంలో శుక్రవారం నాడు దశాబ్దాలుగా ఎదురుచూసిన కాళేశ్వరం ప్రాజెక్ట్  ఆవిష్కృతమై తెలంగాణలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం అయ్యాయని డోర్నకల్ శాసన సభ్యులు రెడ్యా నాయక్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి సాగు, తాగు నీటితో తెలంగాణ సస్యశ్యామలం అయ్యేలా సంకల్పిస్తూ జాతికి అంకితం చేశారని కొనియాడారు.శుక్రవారం నాడు ఉగ్గం పల్లి గ్రామం పరిధిలోని వివిధ కాలువలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెర్రెలు బారిన తెలంగాణా బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక యజ్ఞంలా నిర్మించడం జరిగిందని అన్నారు. ఇది ప్రపంచం లొనే అతి పెద్ద సాగు,త్రాగు నీటి ప్రాజెక్టు అని అన్నారు. రైతుల గోసలు తెరిచేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టి స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది అని ఇది ప్రాణహిత,గోదావరి, నదుల సంగమం వద్ద కలిసే ఇంద్రవతి నాధుల్స్ సంగమాం వద్ద నిర్మితమైనది ఈ ప్రాజెక్గ్ అన్నారు. ఏర్పాటు చేశారని ఈ నదుల జలాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 195 టీఎంసీ ల్. నీటిని వెనుక బడిన ప్రాంతాలకు తరలించారని అన్నారు.అంతే కాకుండా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే స్వయంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నదని అన్నారు. రైతులు పండించిన పంట దళారుల పాలు కాకుండా ప్రతి గింజను కొనుగోలు చేసిన ఘనత తెరాస ప్రభుత్వ గొప్పతనమని కొనియాడారు.ఇవే కాకుండా సబ్బండ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని కొనియాడారు. వృద్దులకు వికలాంగులకు. ఒంటరి మహిళలకు ఆసరా పథకం ద్వారా నెల నెలా పెన్షన్ అందిస్తూ వారిని కన్న కొడుకు లా సీఎం కేసీఆర్ ఆదరిస్తున్నారని అన్నారు. కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకాలతో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు మేనమామ లాగా పెళ్లి కనుక గా లక్ష రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మరిపెడ మండల మాజీ కో అప్షన్ సభ్యులు ఆయుబ్ పాషా,చిన్న గూడూరు మండల తెరాస యూత్ మండల అధ్యక్షులు దుండి మురళి, వివిధ గ్రామాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ పోలీసుల విస్తృత తనిఖీలు

 ట్రాఫిక్ పోలీసుల విస్తృత తనిఖీలు

నిబంధనలు ఉల్లంఘించిన వారికి చర్యలు తప్పవు

ట్రాఫిక్ ఎస్ఐ నవత

పెన్ పవర్, జగిత్యాల 

జిల్లా కేంద్రంలోని ప్రధాన వ్యాపార కూడలివద్ద ఎస్ పి సింధుశర్మ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ ఐ.నవత ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘింపుపై తనిఖీ లు చేపట్టారు. నెంబర్ ప్లేట్స్ లేనివారికి నెంబర్ పెట్టించారు. మూడు చలాన్లకు మించి పెండింగ్ లో ఉన్నవాటిని చెల్లించిన తర్వాతనే ట్రాఫిక్ ఎస్.ఐ నవత సంబంధిత వాహనాలను వదిలిపెట్టారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లు.

 అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లు.

రెండు పీకాక్ వాహనాల పట్టివేత

డిప్యూటీ తహశీల్దార్ జయంత్


ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

 ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఇసుక రీచ్ నుంచి ఏలాంటి అనుమతులు లేకుండా ఆక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను. రెండు ఫీకాక్ వాహానాలను ఎల్లారెడ్డిపేట వెంకటాపూర్ .గ్రామాల మధ్య శుక్రవారం తెల్లవారుజామున 3-00 గంటల ప్రాంతంలో రాజకీయ పట్టుకొని సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయానికి తరలించినట్టు ఎల్లారెడ్డిపేట మండల డిప్యూటీ తహశీల్దార్ జయంత్ తెలిపారు.  వెంకటాపూర్ ఇసుక రీచ్ నుంచి రాత్రి-పగలు అనే తేడాలేకుండా ఇసుక మాఫియా ఆక్రమంగా ఇసుకను తరలించుక పోతున్నారనీ వెంకటాపూర్ గ్రామస్థులు సిరిసిల్ల ఆర్డీవో కు పోన్ల ద్వారా,. వాట్సాప్ ద్వారా గురువారం రాత్రి పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఆర్డీవో ఎల్లారెడ్డిపేట. ముస్తాబాద్. రెవెన్యూ అదికారులను ఆక్రమంగా ఇసుక ను తరలించే వాహానాలను పట్టుకోవాలనీ ఆదేశించగా ఎల్లారెడ్డిపేట. ముస్తాబాద్ రెవెన్యూ సిబ్బంది  శుక్రవారం తెల్లవారుజాము వరకు కాపు కాసి ఆక్రమంగా  ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను. రెండు ఫీకాక్ వాహనాలను పట్టుకొని అట్టి వాహనాలను ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ కార్యాలయం తరలించారు. ఆర్డీవో ఆదేశాల మేరకు అట్టి వాహనాలను శుక్రవారం ఉదయం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంకు తరలించారు.

నాచారం డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలనీ వినతి

 నాచారం డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలనీ వినతి 

తార్నాక, పెన్ పవర్  

నాచారం డివిజన్ లోని పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ని నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్  కలిసి చర్చించారు. ప్రధానంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా మంజూరైన పనులు ప్రారంభం అయ్యే విధంగా చూడాలని కోరారు. డివిజన్ అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని వినతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తిలో శర్మిల పోస్టర్లు ఆవిష్కరణ

 వనపర్తిలో శర్మిల పోస్టర్లు ఆవిష్కరణ

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో ఖమ్మంలో జరిగే షర్మిలమ్మ ఆత్మీయ సభ పోస్టర్లను వనపర్తి జిల్లా ఇంచార్జ్  లింగా రెడ్డి జశ్వంత్ రెడ్డి, వెంకటేష్ అవిష్కరించారు. ఈ సందర్భంగా జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ శర్మిలమ్మ సభకు వనపర్తి నియోజకవర్గం నుండి అధిక మొత్తంలో వైఎస్సార్ అభిమానులు జిల్లా నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై.వెంకటేష్, మధులత, రమేష్ యాదవ్, ఆంజనేయులు రాము, భాస్కర్, రాజశేఖర్, అవినాష్, పెద్ద కోటయ్య, 98 జీవో వెంకటేష్, మహేష్ , ప్రసాద్ పాల్గొన్నారు.

అత్యాధునిక హంగులతో మల్లాపూర్ వైకుంఠధామం

 అత్యాధునిక హంగులతో మల్లాపూర్ వైకుంఠధామం - కార్పొరేటర్ పన్నాల

తార్నాక ,  పెన్ పవర్

అన్ని హంగులతో మల్లాపూర్ వైకుంఠధామం ప్రజలకు అందుబాటులోకి  రాబోతుందని స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు. స్వాగత తోరణాలు. షెడ్లు, వాహనాల పార్కింగ్, దహనవాటికలు, స్నాన గదులు, పచ్చదనం,  మౌలిక సదుపాయాలతో రూపురేఖలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని అన్నారు. మంత్రి కేటీఆర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గార్ల చొరవతో వైకుంఠధామం హంగులతో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అనంతరం శివుని విగ్రహానికి పూజలు చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైకుంఠధామానికి  సహకరించి తోడ్పడిన జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి, జిఎచ్ఎంసి అధికారులు, కాంట్రాక్టర్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఈ ఈ కోటేశ్వర్ రావు, ఏ ఈ వేణు, వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి స్థానిక నాయకులు హమాలీ శ్రీనివాస్, పీఆర్ ప్రవీణ్,  నెమలి రవి, నెమలి అనిల్, సూర్నమ్ శివ, శ్రవణ్, బ్యాగారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...