దారి దోపిడీ కేసుకు పోలీసులకు ప్రశంసా పత్రాలు
మోతుగూడెం,పెన్ పవర్
మోతుగూడెం పోలిస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం నవంబరు నెల అరో తేదిన చింతూరు నుండి మారేడుమిల్లి వెల్లే ఘాట్ రోడ్డులో జరిగిన దారి దోపిడీ కేసును చాలా వేగంగా ఛేదించడం జరిగింది, అందుకు గాను చింతూరు సబ్ డివిజన్ పోలీసులకు ప్రశంసా పత్రాలు వచ్చాయి, ఈ దారి దోపిడీ జరిగిన అనంతరం రెండు రోజుల్లో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఎనిమిది మందిలో ఏడుగురు గురు ముద్దాయిలను చింతూరు డీఎస్పీ ఖాదర్ భాషా నేతృత్వంలో చింతూరు సీఐ యువ కుమార్ తనదైన శైలిలో కేసును ఛేదించడంతో పాటు ఏడుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించినందుకు గాను చింతూరు డీఎస్పీతో పాటు చింతూరు సీఐ యువయువకూమర్, చింతూరు ఎస్సై సురేష్ బాబు గతంలో మోతుగూడెం ఎస్సైగా పనిచేసిన సుబ్బారావులకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ వీరందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు.