Followers

అనకాపల్లి రైల్వేస్టేషన్ ను మోడల్ స్టేషన్ గా మార్చండి

 అనకాపల్లి రైల్వేస్టేషన్ ను మోడల్ స్టేషన్ గా మార్చండి

నర్సిపట్నం స్టేషన్ లో రత్నాచల్ కు హల్ట్ ఇవ్వండి

విశాఖ ద్వారాకనగర్,పెన్ పవర్ 

రైల్వే బోర్డ్ మెంబర్ బొడ్డు శ్రీరామ్మూర్తి  గురువారం  అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బీశెట్టి సత్యవతిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా బొడ్డు  శ్రీరామ్మూర్తి  అనకాపల్లి  రైల్వేస్టేషన్  ను మోడల్ స్టేషన్ గా తీర్చి దిద్దాలని , అదనంగా మరి కొన్ని ప్లాట్ ఫారాలను నిర్మించాలని , ప్రయాణికులను అనుకూలంగా  ఎస్కేలేటర్ లను నిర్మించాలని , లక్ష్మీ దేవి పేట వద్ద అసంపూర్ణంగా ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ను పూర్తిచేయాలని , రత్నాచల్  సూపర్ ఫాస్ట్  ట్రైన్  కు  యలమంచిలి  స్టేషన్  లో హల్ట్ ఇవ్వాలని , ఈ విషయంలో ఆనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు  డాక్టర్  బీశెట్టి  వెంకట  సత్యవతమ్మ  సెంట్రల్ రైల్వే మంత్రి  పియూష్  గోయల్  కు  అభ్యర్ధన  పత్రాన్ని సమర్పించారని ,ముఖ్యంగా ఈ  వేసవిలో స్టేషన్ లో మంచినీటి సమస్య రాకుండా చూడాలని ,  ప్రయాణికులకు ఏ లోటూ రాకుండా అన్నివిధాల సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి  చేసారు. అంతేకాకుండా రైల్వే బోర్డ్ సమావేశం గురించి చర్చించారు. అందుకు ఆమె రైల్వే బోర్డు సమావేశం ఈ నెల మొదటి వారంలో ఉంటుందని బోర్డ్ మెంబర్లతో కూలంకషంగా సమస్యల పై  చర్చిస్తానని తెలియజేసారు. ఈ సమావేశంలో ఓరుగంటి నెహ్రూ బాబు,జ్యోతుల రమేశ్,బొడ్డు సునీల్ పొల్గొన్నారు.

భజన మందిరం ప్రారంబించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి

 భజన మందిరం ప్రారంబించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి

సీనియర్ సిటిజన్స్ సేవలో ముందు నడుస్తున్న కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్.



పెన్ పవర్,  మల్కాజిగిరి 

కుషాయిగూడలోని బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి చర్లపల్లి, ఏఎస్ రావు నగర్ డివిజన్  కార్పొరేటర్ లు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ సీనియర్ సిటిజన్స్ కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాలలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుంటుందని చర్లపల్లి, ఏఎస్ రావు నగర్ డివిజన్ ల కార్పొరేటర్ లు బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి లు పేర్కొన్నారు. కుషాయిగూడలో బుధవారం రాత్రి భజన మందిర్ ఆవరణలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్ భవనాలను మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి,వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిలతో కలిసి కార్పొరేటర్లు శ్రీదేవి, శిరీష లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలు సర్వతోముఖాభివృద్ధి సాధించడంలో సంక్షేమ సంఘాల పాత్ర క్రియాశీలక మయిందన్నారు. డివిజన్ పరిధిలోని కాలనీల అభివృద్ధిలో భాగంగా కుషాయిగూడ కు మరింత ప్రాధాన్యతను కల్పిస్తూ అభివృద్ధి ఫలాలు అందజేస్తామన్నారు. కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ వారు వయోవృద్ధుల కోసం చేపడుతున్న అనేక కార్యక్రమాలు వారిలో మనోధైర్యాన్ని నింపేలా ఉన్నాయని కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి,సింగిరెడ్డి శిరీష రెడ్డి లు ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ సేవలను కొనియాడారు. మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి మాట్లాడుతూ కుషాయిగూడ గ్రామంలో శిధిలావస్థకు చేరుకున్న భజన మందిర్ స్థానంలో తన హయాంలో అవసరమైన నిధులను విడుదల చేయించి కొత్త భవనం నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. తన ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భజన మందిరం కుషాయిగూడ గ్రామ వాసులకు వయోవృద్ధులకు ఉపయోగపడడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కుషాయిగూడ గ్రామానికి చెందిన అనేక మంది యువత ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువత కోసం దాదాపు 35 లక్షల రూపాయల వ్యయంతో అధునాతన జిమ్ వ్యాయామ శాలను ఏర్పాటు చేయనున్నట్లు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ముందుగా కుషాయిగూడ గ్రామానికి చెందిన పలువురు వయోవృద్ధుల ను కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష లు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు చక్రపాణి గౌడ్ పబ్బ చంద్రశేఖర్, చిత్తుల విష్ణు గౌడ్, రాగుల వాసుదేవ ముదిరాజ్,  పంజాల బాబు గౌడ్, చెన్నోజు వరప్రసాద్, చిత్తుల కిషోర్ గౌడ్, బాల్ నరసింహ, బ్రహ్మచారి, శ్రీకాంత్ యాదవ్, నర్సింగ్ రావు, నర్సింగ్ గౌడ్, శంకర్ గౌడ్, దినేష్, సన్నీ, నందు, చల్ల సురేష్, వీరబ్రహ్మం, సాయి కిరణ్, మణికిరణ్, నాయకులు గణేష్ ముదిరాజ్, కాసుల సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కోవిడ్ 19 సహాయ కేంద్రం ఏర్పాటు

 భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో  కోవిడ్ 19 సహాయ కేంద్రం ఏర్పాటు

తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో యువ మోర్చా మండల అధ్యక్షులు చజనాల రాహుల్ ఆధ్వర్యంలో  కోవిడ్ 19 వాక్సిన్ సహాయక కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపెల్లి భాస్కర్ గౌడ్, జిల్లా కార్యదర్శి ఏముర్ల ప్రదీప్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణి చేస్తున్న కరోనా టీకా గురించి ప్రజలకు అవగాహన కల్పించి, కరోనా టీకా తీసుకోవడం కోసం ఆరోగ్య సేతు అప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించడం జరిగిందని అన్నారు.ప్రజలు ఎలాంటి అపోహ పడకుండా కోవిడ్ 19 వాక్సిన్ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో  యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి వినోద్,బీజేపీ మండల అధ్యక్షులు రామగోని మహీదర్ గౌడ్, మండల ఇంచార్జి రెవెల్లి రాయలింగు,అసెంబ్లీ నాయకులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, మండల్ ప్రధాన కార్యదర్శి విష్ణు, భరత్,జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్, మండల ఉపాధ్యక్షులు పుట్ట కుమార్,సీనియర్ నాయకులు తుకారాం,మహిళా మోర్చా అధ్యక్షురాలు సీతాలు యువ మోర్చా నాయకులు గాయత్రి, పులి సాయి రాజు తదితరులు పాల్గొన్నారు.

అభినవ స్వచ్చంద సేవ సంస్థ ప్రయాణికుల కోసం ప్రయాణ ప్రాంగణం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు

 అభినవ స్వచ్చంద సేవ సంస్థ ప్రయాణికుల కోసం ప్రయాణ ప్రాంగణం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు

తాండూర్, పెన్ పవర్

అభినవ స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో సేవాసంస్థ వ్యవస్థాపక చైర్మన్ కాసనగొట్టు (కేశెట్టి)సుగుణకర్ జన్మదినం సందర్భంగా సేవాసంస్థ అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రయాణికులకోసం ప్రయాణ ప్రాంగణం(బస్ షేడ్) మరియు చలివేంద్రాన్ని తాండూరు సి ఐ కోట బాపురావ్ , తహసీల్దార్ కవిత , జెడ్పీ టిసి బాణయ్య , ఏంపిడిఓ శేషికల తాండూరు ఎస్ ఐ శేఖర్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఏం పి టి సి మాసడి శ్రీదేవి శ్రీరాములు ,తాండూరు సర్పంచ్ నవీన్,వార్డ్ మెంబెర్ కేశెట్టి తిరుపతి, సేవాసంస్థ సభ్యులు తోగారి  శ్రీ శ్రీనివాస్

పోట్లపల్లి  రాజ్ కిరణ్, తోగారి కుమార్ ,ఉటూరి నరేష్ , ఎముర్ల ప్రదీప్, గాదె కుమార్ ,ఏకారి సత్యనారాయణ, కేశెట్టి సతీష్ కుమార్, అక్షయ , కాసం ఆకాష్,,బోగే శ్రీకాంత్,  నాయకులు తిరుపతి,  జాడి పొశం , బోనగిరి చంద్రశేఖర్ , కాసనగొట్టు బాపూజి , బోనగిరి విగ్నేశ్ , వెంకట రమణ , తుకరం  తదితరులు పాల్గొన్నారు.

పింఛను ఇప్పించండి సారూ...

 పింఛను ఇప్పించండి సారూ...

కన్నెపల్లి ,  పెన్ పవర్ 

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లోని తాళ్ల రెబ్బన కు చెందిన వృద్ధులు, వికలాంగులకు ఆసరా పింఛన్ కు నోచుకోని పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ కిందిస్థాయి అధికారుల వల్ల నీరుగారి పోతుందని వృద్ధులు వికలాంగులు వాపోయారు. దీనికి నిదర్శనమే ఈ మూగ వికలాంగులు కుమ్మరి సాయమ్మ  మూగ వికలాంగురాలు కి కొద్దికాలంగా తెలంగాణ గవర్నమెంట్ పెన్షన్ వచ్చిందని ఇప్పుడు రావట్లేదు అని ఆమె బంధువులు వివరించారు. దుర్గం జంపన్న మూగ వికలాంగుడికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెన్షన్ వచ్చిందని ఈ ప్రభుత్వం  వచ్చిన తర్వాత వికలాంగుల పెన్షన్ రావట్లేదని వికలాంగుడి తల్లి వాపోయింది .దయచేసి అధికారులు, నాయకులు పట్టించుకొని పెన్షన్ ఇప్పించగలరని వారు కోరారు.

జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం

 జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునికి  ఆత్మీయ సన్మానం

రాజన్న సిరిసిల్ల ,  పెన్ పవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షునిగా ఎన్నికయ్యాక తొలిసారిగా ఎల్లారెడ్డిపేట విశ్వ బ్రాహ్మణులను ఆత్మీయంగా పలకరించడానికి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘ అధ్యక్షుడు చందనగిరి గోపాల స్వామి. ఎల్లారెడ్డిపేట మండలం లోని పలు గ్రామాల అధ్యక్షులు రాచర్ల బొప్పాపూర్ లో గల బ్రహ్మంగారి దేవాలయంలో సభను ఏర్పాటు చేయగా సభకు విచ్చేసిన చందనగిరి గోపాలస్వామి ని శాలువా కప్పి పలు గ్రామాల అధ్యక్షులు మండల అధ్యక్షుడు చెలిమెలి అంజనేయులు చారి జిల్లా కోశాధికారి  దుమాల శంకర్ చారి మండల ప్రధాన కార్యదర్శి వంగాల వసంత్ చారి కోశాధికారి కాంబోజి దేవరాజు చారి ప్రచార కార్యదర్శి శ్రీరాముజు దేవరాజు చారి రాజు చారి శ్రీధర్ ఆచారి వంగాల నాగభూషణం చారి మండో జు రాజయ్య చారి వంగాల శ్రీనివాస చారి మరియు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు సభ్యులు శాలువా కప్పి సన్మానించడం గా చందనగిరి గోపాల స్వామి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నా భుజస్కంధాలపై బాధ్యతను ఉంచిన మీ బాధ్యతలను ఎల్లవేళలా విశ్వబ్రాహ్మణుల కై పోరాడుతానని విశ్వబ్రాహ్మణులు నిరుపేదలు ఉన్నారని రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు ఉన్నాయని విశ్వ బ్రాహ్మణులందరికీ వృత్తి లేబర్ కార్డు ఇప్పిస్తాననిమన జిల్లాలో ఉన్న ప్రతి విశ్వబ్రాహ్మణుని కి ఐడెంటి కార్డు చేయించి ఇస్తానని విశ్వబ్రాహ్మణులకు అన్ని వేళలా ఆపదలో నైనా స్పందిస్తానని మనమందరం ఐక్యమత్యంగా ఉంటేనే మన మన విలువలు ప్రభుత్వానికి తెలుస్తాయని ప్రభుత్వం దగ్గర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడే వరకు పోరాడుతానని ఆయన అన్నారు.

అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తే లేదు.

 అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తే లేదు..

మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు

లక్షెట్టిపెట్, పెన్ పవర్

అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు స్పష్టం చేశారు.మండలంలోని గుళ్లకోట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ఆయన గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్టం ఏర్పాటు తర్వాత గ్రామం అద్దంలా అభివృద్ధి చేయడంమే లక్ష్యంగా పెట్టుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు.గతంలో ఏ ప్రభుత్వలు కూడా మన ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు ముందుకు రాలేదన్నారు.ఇప్పుడు ఏమారు మూల గ్రామం వెళ్లిన సీసీ రోడ్డులు, డ్రైనేజీలు 80శాతం పూర్తి అయ్యాయన్నారు.ఇక్కడ కూడా సుమారు 9లక్షల రూపాయల నిధులతో జాతీయ రహదారి నుండి గ్రామం లోపలి వరకు రోడ్డును నిర్మించడం జరిగిందన్నారు.ఇలాంటి మంచి కార్యక్రమలు చేస్తే గిట్టని పార్టీలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని వాళ్లకి ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోళ్ళ రవీందర్,డీసీఎంఎస్ చెర్మాన్ తిప్పని లింగయ్య,వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,మున్సిపల్ వైస్ ఛైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్,పిఎసీఎస్ చెర్మాన్ ప్రబాకర్ రావు,పార్టీ మండల అధ్యక్షుడు చిన్నయ్య,ఉపాధ్యక్షుడు రమేష్ నాయకులు అసాది పురుషోత్తం,కిషన్,చతరాజు రాజన్న,తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...