Followers

రేషన్ షాప్ ప్రారంబించిన ఎమ్మెల్యే మైనంపల్లి, సివిల్ సప్లే చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

 రేషన్ షాప్ ప్రారంబించిన ఎమ్మెల్యే మైనంపల్లి, సివిల్ సప్లే చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పెదలకు చేరాలి - ఎమ్మెల్యే


పెన్ పవర్,  మల్కాజిగిరి 

గౌతంనగర్ డివిజన్ జెఎల్ఎస్ నగర్ లోని నూతనంగా రేషన్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సివిల్ సప్లే మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నర్సింహ్మ రెడ్డి కలిసి రేషన్ షాప్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జెఎల్ఎస్ నగర్ లో గతంలో రేషన్ షాప్ లేక ఇబ్బందులు ఎదురుకుంటున్నామని స్దానిక కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకరవడంతో వేంటనే స్పందించి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రేషన్ షాప్ నూతనంగా ఏర్పాటు చేయాలన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ నర్సింహ్మ రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పందించి రేషన్ షాప్ ఏర్పాట్ల పై పూర్తి సహకరం అందించి కాలనీలో ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించారని, వారికి ఆభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,రాముయదవ్, జిఎన్.వి. సతీష్ కుమార్, సత్యనారాయణ, ఉపేందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

దిశ టిఎస్ అధ్యక్ష పదవి నుండి సుమతి మెుహన్ ను తొలగింపు

 దిశ టిఎస్ అధ్యక్ష పదవి నుండి సుమతి మెుహన్ ను తొలగింపు

పెన్ పవర్,  మల్కాజిగిరి

దిశ ప్రొటెక్షన్ వెల్పైర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ మార్పులు చేస్తున్నట్టు జాతీయ దిశ ప్రొటెక్షన్ వెల్పైర్ ప్రొటెక్షన్ వ్యవస్థాపక చైర్మన్ వెంకటేశ్వరరాజు  పత్రిక  ప్రకటనలో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దిశ ప్రొటెక్షన్ వెల్పైర్ ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో జిల్లా మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు, ప్రతి గ్రామ స్థాయి మండల స్థాయి వార్డ్ స్థాయిలో సమావేశాలు పెడుతూ మహిళ హక్కులు, మహిళ చట్టాలు పోక్సో, మరియు సీనియర్ సిటిజన్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ నేపధ్యంలో అనేక సేవా కార్యక్రమాలు కూడ సమాజంలో విస్తృత సేవలు చేసిన చదువురాని మహిళలను కూడ కమిటీలో తీసుకుని వారిని ఇంకా చైతన్య పరిచడమే ధ్యేయంగా పెట్టుకుని సంస్థ పని చేస్తుంది. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా దిశ ప్రొటెక్షన్ వెల్పైర్ ఫౌండేషన్ సభ్యుల సభ్యత్వం పెరిగి రికార్డ్ పనులు అధికమైనందుకు తెలంగాణ రాష్ట్ర దిష ప్రొటేక్షన్ వెల్పైర్ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా ఉన్న శ్రీమతి సుమతి మోహన్ వయసు రీత్యా అనారోగ్యం కారణంగా ఈ అధిక పని భారాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోవడంతో, ఆర్గనైజేషన్ మరియు దిశ కుటుంబ సభ్యులకు ఎవరికి సహకరించక పోవడంతో వారిని అధ్యక్ష పదవి నుండి తొలగిస్తూ ఉతర్వ్యూలు జారీ చేశారు. వారి స్ధానంలో త్వరలోనే నూతన అధ్యక్షురాలి నియామకాన్ని ప్రకటిస్తామని వెంకటేశ్వర్ రాజు తెలిపారు.

బండి సంజయ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమార్ శంకర్

 బండి సంజయ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమార్ శంకర్..


వేములవాడ, పెన్ పవర్

బిజెపి దళిత మోర్చా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియామకం అయిన కుమ్మరి శంకర్  గురువారం రాష్ట్ర బిజెపి కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష ను మర్యాద పూర్వకంగా కలిసి తనను దళిత మోర్చా రాష్ట్ర  కార్యదర్శిగా నియమించినందుకు  కృతజ్ఞతలు  తెలిపారు. ఈ సందర్భంగా కుమ్మరి శంకర్ ను బండి సంజయ్ కుమార్, కొప్పు భాష లు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. వీరి వెంట దళిత మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంటీ మహేష్ ఉన్నారు.

సిసి డ్రైనేజ్ కి భూమి పూజ

 సిసి డ్రైనేజ్ కి భూమి పూజ...

ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో అన్ని వార్డులను అభివృద్ధి చేస్తాం

మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు


వేములవాడ, పెన్ పవర్

14 వ ఆర్థిక సంఘం నిధుల నుండి మంజూరైన 2లక్షల రూపాయలతో 11వ వార్డులో గురువారం కౌన్సిలర్ యాచామనేని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో  సీసీ డ్రైనేజ్ కు మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి- రాజు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాధవి మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారం తో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతామని అన్నారు.అనంతరం కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాస రావు మాట్లాడుతూ 11 వ వార్డు శరవేగంగా విస్తరిస్తోందనీ , వార్డు లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు . బడ్జెట్ లో 11 వ వార్డుకు ఎక్కువ నిధులు కేటాయించాలని చైర్మన్ ను కోరారు. రానున్న రోజుల్లో 11 వ వార్డు గల్లీ గల్లీ కి సి.సి రోడ్డు, డ్రైనేజీ, త్రాగు నీరు సదుపాయం కల్పించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తామని కౌన్సిలర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్  శ్యామ్ సుందర్ రావు, ఏ ఈ నరసింహ స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్,14 వార్డ్ కౌన్సిలర్ బింగి మహేష్, నాయకులు పీర్ మహమ్మద్, కొండ కనకయ్య, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులు పరిశీలించిన కార్పొరేటర్ శాంతి

 సీసీ రోడ్డు పనులు పరిశీలించిన కార్పొరేటర్ శాంతి

తార్నాక , పెన్ పవర్

నాచారం డివిజన్ గొల్ల ముత్యాలు బాయి  కాలనిలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 16 లక్షల వ్యయం తో రోడ్డు పనులు చేపట్టామని  తెలిపారు. నాణ్యత లోపించకుండా రోడ్డు పనులు పూర్తి చేయాలనీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్,  మల్లేష్ యాదవ్, విట్టల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, వెంకటేష్, నరసింహ, ఇంజనీర్ రూప,  అసిస్టెంట్ ఇంజనీర్ రాకేష్, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గుంజపడుగు గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడిగా పోలావేణి పోచయ్య

 గుంజపడుగు గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడిగా పోలావేణి పోచయ్య 

గొల్లపల్లి, పెన్ పవర్

గుంజపడుగు గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడిగా పోలావేణి పోచయ్య ఉపాధ్యక్షుడిగా తమ్మన వేణి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

సర్వ సభ సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీపీ

 సర్వ సభ సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీపీ....

పెన్ పవర్, మేడ్చల్

మేడ్చల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  ఎంపీపీ అప్పమ్మాగారి పద్మజగన్ రెడ్డి అధ్యక్షతన సమావేశము జరిగినది. ఈ సమావేశంలో షెడ్యూల్ కులములకు చెందిన చిన్న మరియు సన్నకారు రైతులకు తీగ జాతి పంటలు వేయుటకు పందిర్లు నిర్మించుట కొరకు ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2018 - 19 నందు సబ్సిడీ పై ఋణములు పొందుటకు ప్రభుత్వ మార్గదర్శకాలను ఎంపిడివో శశిరేఖ వివరించారు. తీగ జాతి పంటలు వేసినచో అధిక లాభము పొందవచ్చునని ఆర్థికముగా స్వయము సమృద్ధి సాధించవచ్చునని తెలిపారు. ఈ అవకాశమును మేడ్చల్ మండలంలోని షెడ్యూల్ కులముల రైతులు వినియోగించుకోవాలని పద్మజగన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మేడ్చల్ మండలంలోని ప్యాక్స్ ఛైర్మన్ రందిప్ రెడ్డి, ఎంపిటిసిలు గోపని వెంకటేష్, మెట్టు అనుప, సలేంద్ర కుమార్, మాలోత్ అంకిత, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ అధికారులు హాజరైనారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...