Followers

సీసీ రోడ్డు పనులు పరిశీలించిన కార్పొరేటర్ శాంతి

 సీసీ రోడ్డు పనులు పరిశీలించిన కార్పొరేటర్ శాంతి

తార్నాక , పెన్ పవర్

నాచారం డివిజన్ గొల్ల ముత్యాలు బాయి  కాలనిలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 16 లక్షల వ్యయం తో రోడ్డు పనులు చేపట్టామని  తెలిపారు. నాణ్యత లోపించకుండా రోడ్డు పనులు పూర్తి చేయాలనీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్,  మల్లేష్ యాదవ్, విట్టల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, వెంకటేష్, నరసింహ, ఇంజనీర్ రూప,  అసిస్టెంట్ ఇంజనీర్ రాకేష్, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గుంజపడుగు గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడిగా పోలావేణి పోచయ్య

 గుంజపడుగు గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడిగా పోలావేణి పోచయ్య 

గొల్లపల్లి, పెన్ పవర్

గుంజపడుగు గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడిగా పోలావేణి పోచయ్య ఉపాధ్యక్షుడిగా తమ్మన వేణి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

సర్వ సభ సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీపీ

 సర్వ సభ సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీపీ....

పెన్ పవర్, మేడ్చల్

మేడ్చల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  ఎంపీపీ అప్పమ్మాగారి పద్మజగన్ రెడ్డి అధ్యక్షతన సమావేశము జరిగినది. ఈ సమావేశంలో షెడ్యూల్ కులములకు చెందిన చిన్న మరియు సన్నకారు రైతులకు తీగ జాతి పంటలు వేయుటకు పందిర్లు నిర్మించుట కొరకు ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2018 - 19 నందు సబ్సిడీ పై ఋణములు పొందుటకు ప్రభుత్వ మార్గదర్శకాలను ఎంపిడివో శశిరేఖ వివరించారు. తీగ జాతి పంటలు వేసినచో అధిక లాభము పొందవచ్చునని ఆర్థికముగా స్వయము సమృద్ధి సాధించవచ్చునని తెలిపారు. ఈ అవకాశమును మేడ్చల్ మండలంలోని షెడ్యూల్ కులముల రైతులు వినియోగించుకోవాలని పద్మజగన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మేడ్చల్ మండలంలోని ప్యాక్స్ ఛైర్మన్ రందిప్ రెడ్డి, ఎంపిటిసిలు గోపని వెంకటేష్, మెట్టు అనుప, సలేంద్ర కుమార్, మాలోత్ అంకిత, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ అధికారులు హాజరైనారు.

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు

విజయనగరం,పెన్ పవర్

ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు,ఔత్సాహికులు చొరవ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.విపత్తు నివారణ సంస్థ వెల్లడించిన విధంగా ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుందని కావున ప్రజలకు దాహార్తికి ఇబ్బంది లేకుండా రద్దీగా ఉన్న ప్రాంతాలలో నగరపాలక సంస్థ  చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఔత్సాహికులు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లయితే తమను సంప్రదించినచో అవసరమైన త్రాగు నీటిని ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా నిరాశ్రయులు ఎండవేడిమికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పట్టణ కేంద్రంలో ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు. బిచ్చగాళ్ళు, నిరాశ్రయులు, నిరాధారమైన వృద్దులను పట్టణ నిరాశ్రయుల కేంద్రానికి అప్పజెప్పాలని కోరారు. ఎండ తీవ్రత దృష్ట్యా  ఎండలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పనివేళల్లో మార్పు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 నుండి పనిచేసే కార్మికులకు మధ్యాహ్నం 3 నుండి  పనిచేసే విధంగా సమయాన్ని మార్పు చేశామని చెప్పారు. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్పా ఎండలో ఎక్కువగా తిరగవద్దని చెప్పారు ఒక వేళ ఎండలో వెళ్లాల్సి వస్తే తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా వడదెబ్బ నుండి రక్షించుకునే వారవుతారని తెలిపారు.

కె వి పి ఎస్ నెల్లికుదురు మండల కమిటీ ఎన్నిక

 కె వి పి ఎస్ నెల్లికుదురు మండల కమిటీ ఎన్నిక

నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి మండలనూతన  కమిటీని  ముఖ్య కార్యకర్తల సమావేశంలో బుధవారం ఎన్నుకున్నట్లు కె వి పి ఎస్  జిల్లా కార్యదర్శి కుర్రమహేష్ తెలిపారు. మండల అధ్యక్షులుగా హెచ్ అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఇస్సంపెల్లి సైదులు ను మండల కమిటీ సభ్యులుగా జెల్ల వీరెంకులు, గణపురం ఎల్లయ్య, ఎర్పుల ఉప్పలయ్య, బాణాల యాకయ్య, వెంకటలక్ష్మి, వెంకటయ్య, ప్రవీణ్ ను ఎన్నుకున్నట్లు ఆయన ప్రకటించారు..

సొంతింటి కల నెరవేరే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానం

 సొంతింటి కల నెరవేరే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానం

విజయనగరం,పెన్ పవర్

మధ్య తరగతి కుటుంబాలకు  సొంతింటి కల నెరవేరే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిందని స్థానిక శాసనసభ్యులు, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పట్టణ ప్రణాళిక అధికారులు, వార్డు ప్రణాళికా మరియు వెల్ఫేర్ కార్యదర్శులుతో సమావేశమయ్యారు. ప్రభుత్వం రూపొందించిన సరికొత్త విధానం ప్రకారం మూడు కేటగిరీల లో ఇళ్ల స్థలాలను లే అవుట్ల రూపంలో మధ్యతరగతి వారికి అందించేందుకు నిర్ణయించిందన్నారు. ఇందుకోసమై వార్డు ప్రణాళిక కార్యదర్శులు లబ్దిదారుల ప్రాధమిక సమాచారాన్ని సేకరించాలని సూచించారు.

లాభం లేకుండా, నష్టం కలగకుండా ప్రభుత్వమే లేఅవుట్ల రూపంలో మధ్యతరగతి వారికి స్థలాలను అందించే బృహత్తర కార్యక్రమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. లబ్ధిదారుల వార్షిక ఆదాయాన్ని బట్టి స్థల విస్తీర్ణం మంజూరు చేయబడుతుందని అన్నారు. 150, 200, 240 గజాల చొప్పున మూడు కేటగిరీలుగా యం.ఐ.జి. స్థలాలు పంపిణీ ఉంటుందన్నారు.3 లక్షల నుండి 18 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారు ఈ పథకం కింద లబ్ధిదారులుగా  గుర్తించనున్నారని తెలిపారు. ఇందుకోసమే  ప్రాథమిక సమాచార సేకరణకు ప్రతి ఇంటికి వచ్చే వార్డు కార్యదర్శులకు ప్రజలు సహకరించి ఖచ్చితమైన సమాచారాన్ని అందివ్వాలన్నారు.అన్ని వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ  ప్లానర్లు వెంకటేశ్వరరావు, మధుసూదన్ రావు, పట్టణ ప్రణాళిక అధికారులు కనకారావు,శ్రీలక్ష్మి ,టీపీఎస్ జనార్ధన్, సర్వేయర్ సింహాచలం, వార్డు ప్రణాళికా కార్యదర్శులు పాల్గొన్నారు.

కరాటే తో ఆత్మ స్థాయిర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి.

 కరాటే తో ఆత్మ స్థాయిర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి.

ప్రతి మహిళా తప్పనిసరిగా కరాటే నేర్చుకోవాలి..

మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ 



వేములవాడ, పెన్ పవర్

కరాటే తో ఆత్మ స్థాయిర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయిని ,ప్రతి మహిళా తప్పనిసరిగా కరాటే నేర్చుకోవాలని  వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్ర శర్మఆన్నారు.గురువారం బింగి మహేష్  గార్డెన్ లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్ లు మరియు  సర్టిఫికెట్ ల కార్యక్రమానికి ముఖ్యఅతిధి గామధు రాజేందర్ హజరై 50 మంది విద్యార్థిని, విద్యార్థులకు బెల్ట్ ల తోపాటు సర్టిఫికెట్లల ప్రధానం చేశారు. ఈ సందర్బంగా మధురాజేందర్  మాట్లాడుతూ కరాటే అనేది అతి ప్రాచీనమైన యుద్ధ కళ అని ఈ విద్య నేర్చుకోవటం ద్వారా శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢత్వం అలవడుతుందని, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఆగాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ముఖ్యంగా మహిళలు తప్పనిసరిగా  కరాటేనేర్చుకోవాలని అన్నారు.ఆనంతరం చీఫ్ ఎగ్జామినర్ ఎంఏ.మన్నాన్  మాట్లాడుతూ కరాటే అనేది మొన్నటి వరకు ఒక ఆత్మరక్షణ విద్య అని ఇప్పుడు కరాటే ని ప్రభుత్వం గుర్తింపు నిచ్చిందని ,తద్వారా కరాటే నేర్చుకొని పోటీల్లో పాల్గొన్నట్లయితే 2% రిజర్వేషన్ వర్తిస్తుందని దీనిద్వారా ఉన్నత విద్య , ఉద్యోగ అవకాశం ఉంటుందని అన్నారు. కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ బింగి మహేష్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్  మహమ్మద్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసిన శిక్షకులు .మన్నాన్ తో పాటు  కరాటే ఇన్‌క్టర్ల లను ప్రత్యేకంగా అభినందిచారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు  శ్రీకాంత్ గౌడ్, రియల్ ఎస్టేట్ బిల్డర్ మాడిశెట్టి   కృపాల్ ,లింగంపేట మహోదయ స్కూల్   కరస్పాండెంట్ కృష్ణ , కరాటే సీనియర్ శిక్షకులు కూరగాయల శ్రీనివాస్, దుండగుల దేవరాజ్  శివరాత్రి రాజు, ఎమ్ తిరుపతి, కనికరపు రాజశేఖర్ పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...