Followers

గ్రామ పంచాయతీ పాలక మండలి ప్రత్యేక సమావేశం

 గ్రామ పంచాయతీ పాలక మండలి ప్రత్యేక సమావేశం


చిన్నగూడూరు, పెన్ పవర్

చిన్నగూడూరు  మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనం లో గురువారం పాలక వర్గ సభ్యులతో సర్పంచ్ కొమ్ము మల్లయ్య అద్యక్షతన సమావేశం చేపట్టారు. ముఖ్యంగా తాగునీటి సమస్య  మిషన్ భగీరథ నీళ్ల గురించి సభ్యులు అంశాన్ని సర్పంచ్ దృష్టికి తెచ్చారు.సభలో పాల్గొన్న మిషన్ భగీరథ ఏఈ విష్ణువర్థన్ మాట్లాడుతూ మే చివరి నాటికి పైపులైన్లు బిగించి ప్రతి ఇంటింటికీ భగీరథ నీళ్లందిస్తామని పాలక వర్గ సభ్యులకు తెలిపారు.మండల కేంద్రంలో ఉన్న వర్తక, వ్యాపార సంబంధించిన పన్నుల వసూలుపై పాలక వర్గ సభ్యులతో సర్పంచ్ చర్చించారు.అదే విధంగా మినరల్ వాటర్ గ్రామ పంచాయతీ కీ అప్పచెప్పే విషయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించవలసిందే నని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సర్పంచ్ రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి ప్రత్యేక అతిథులుగా వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, మండల కో ఆప్షన్ సభ్యులు మీర్జా మోసిన్ బేగ్ పాల్గొనగా..ఈ కార్యక్రమంలోవార్డు ఉప  సర్పంచ్ దుండి ఉపేందర్, సెక్రటరీ అజీమ్, వార్డు సభ్యులు పసునాధి లావణ్యవిజయ్, కొత్త పుష్ప, చిత్తరి విరన్న, వీరాచారి, రవి, సుమన్ గ్రామ పంచాయితీ మల్టీవర్కర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ పిల్లలకు బుక్స్ పంపిణీ

 లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ పిల్లలకు  బుక్స్ పంపిణీ

సమాజానికి ఆదర్శం లైన్స్ క్లబ్ ,,,సర్పంచ్ గణపారపు సరిత

కేసముద్రం,  పెన్ పవర్

 మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సమాజానికి ఎంతో ఆదర్శమని ఇంటికన్నె సర్పంచ్ గణపారపు సరిత అన్నారు. కేసముద్రం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటికన్నె జడ్పీ హైస్కూల్ లో గురువారం 24 మంది పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. నిరుపేద విద్యార్థులకు పుస్తకాలను ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్, ఎస్ఎంసీ చైర్మన్ అంబాల సృజన, క్లబ్ కోశాధికారి చింతా కరుణాకర్, సభ్యులు బోగోజు నాగేశ్వరాచారి, హెచ్ఎం ఎల్.పద్మజ, ఉపాధ్యాయులు కె.నర్సింగరావు, పి.సతీష్ కుమార్, జయకృష్ణ, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టీకా ప్రారంభం

 ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టీకా ప్రారంభం

కేసముద్రం, పెన్ పవర్

 కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 సంవత్సరాలకు పైబడిన వారికి కోవిడ్ టీకాను డాక్టర్  అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ సరళిని ఎంపీడీవో రోజారాణి, సర్పంచ్ దార్ల రాంమూర్తి పర్యవేక్షించారు. ఇనుగుర్తి పీ హెచ్ సి పరిదిలో ఉన్న ప్రజలు గమనించి అర్హులైన వారు టీకా వేయించుకోవాలని సూచించారు. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించి, కనీస పరిశుభ్రతతో పాటు సామాజిక దూరం పాటించాలని, గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తు కొరకు వెంటనే పాఠశాలలను ప్రారంభించాలి,, ట్రస్మా

 విద్యార్థుల భవిష్యత్తు కొరకు వెంటనే పాఠశాలలను ప్రారంభించాలి,, ట్రస్మా

కేసముద్రం,  పెన్ పవర్ 

గురువారం ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) డివిజన్ అధ్యక్షులు యాకాంతం గౌడ్, కేసముద్రం మండల అధ్యక్షులు జోగు డాంగయ్య లు విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ట్రస్మా రాష్ట్ర, జిల్లా శాఖల ఆదేశానుసారం నిర్వహించే 12 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో మొదటిరోజు పొట్టి శ్రీరాములు సెంటర్లో ఉదయం కేసముద్రం మండల ట్రస్మా శాఖ ఆధ్వర్యంలో వాకర్లకు "బార్లలో లేని కరోన - బడులలో ఉందా", "విద్యార్థుల భవిష్యత్తు కై బడులను తెరవండి", "ప్రైవేటు ఉపాధ్యాయులను కాపాడండి" వంటి ప్లకార్డులను ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా యాకాంతం గౌడ్, డాంగయ్య లు మాట్లాడుతూ ప్రభుత్వం మరోసారి  పునరాలోచించి విద్యార్థుల విద్యా స్థాయి ప్రమాణాలు లోపించకుండా పాఠశాలలను పునః ప్రారంభించాలని అన్నారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న బార్లు, సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్, లాంటి  వాటికి అనుమతిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలను మూసివేయడం సరైంది కాదని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి కరోనాతో ప్రాణనష్టం జరగలేదని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాలలను వెంటనే తెరిపించాలని అన్నారు. పాఠశాలలు మూతపడటంవల్ల ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే భోధన, బోధనేతర సిబ్బంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం బాధ్యులు మోడెం రవీందర్ గౌడ్, సట్ల కర్ణాకర్, సమ్మయ్య, కేసముద్రం మండల ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు గాజుల రవి, ప్రధాన కార్యదర్శి కూన శ్రీను, నల్ల కిరణ్, ప్రైవేటు ఉపాధ్యాయులు శోభన్ బాబు, నరేష్, కేసముద్రం వాకర్స్  తదితరులు పాల్గొన్నారు.

పి హెచ్ సి కరోనా టీకా పంపిణీ

 పి హెచ్ సి కరోనా టీకా పంపిణీ

వైద్యాధికారి డాక్టర్ రవి

చిన్నగూడూరు,  పెన్ పవర్

స్థానిక మండల కేంద్రంలోని ఉగ్గంపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నాడు 45 సంవత్సరాలు పై బడిన వారికి కరోనా వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ విస్సంపల్లి గ్రామ సర్పంచ్ విద్యుల్లత వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందని ఉన్నారు. ఈరోజు 20 మందికి కరోనా వ్యాక్సిన్ వేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అని ఈ సందర్భంగా సూచించారు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తుల అయినవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్ లు ఉపయోగించుకోవాలి అని అన్నారు. ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని మరియు రోగ నిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జయశ్రీ, ఏఎన్ఎం నర్సు బాయ్, ఎస్తేరు రాణి, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, ధర్మేందర్, ఆశాజ్యోతి, సైదమ్మ, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ రూరల్ జిల్లా బిజెవైఎం కార్యదర్శిగా రాఘవరెడ్డి నియామకం

 మేడ్చల్ రూరల్ జిల్లా బిజెవైఎం కార్యదర్శిగా రాఘవరెడ్డి నియామకం...

పెన్ పవర్, మేడ్చల్

 మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్ కు చెందిన రాఘవరెడ్డి మేడ్చల్ రూరల్ జిల్లా బిజెవైఎం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సంధర్బంగా అతను మాట్లాడుతూ గతంలో ఆర్ఎస్ఎస్, ఎబీవిపీ లో పనిచేసి, గిర్మాపూర్ వివేకనంద యువజన సంఘం అధ్యక్షుడిగా, తరువాత బీజేపీలో రాజకీయ జీవితం ప్రారంభించి, గతంలో గిర్మాపూర్ గ్రామ బీజేవైఎం అధ్యక్షుడిగా, మేడ్చల్ మండల బిజెపి ఐటీ సెల్ అధ్యక్షుడిగా, వివిధ హోదాలలో బాధ్యత నిర్వర్తించాను అని పేర్కొన్నారు. ఈ రోజు మేడ్చల్ రూరల్ జిల్లా బిజెవైఎం కార్యదర్శిగా నియమితులైనందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. మేడ్చల్ రూరల్ జిల్లా బిజెవైఎం కార్యదర్శిగా నియమించిన మేడ్చల్ రూరల్ జిల్లా బిజెవైఎం అధ్యక్షులు పవన్ రెడ్డికి, నియమాకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కోంపల్లి మెాహన్ రెడ్డికి, మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు విక్రంరెడ్డికి, తపస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడప నవీన్ కి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్ కి, పాతూరి ప్రభాకర్ రెడ్డికి, మేడ్చల్ అసెంబ్లీ బిజెపి కన్వీనర్ అమరం మెాహన్ రెడ్డికి, మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు కోండం అంజనేయులు ముదిరాజ్ లకు కృతజ్ఞతలు తెలియజేశాడు...

భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన రాగం అర్జున్

 భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన రాగం అర్జున్..

పెన్ పవర్, మేడ్చల్

 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో అనేక సంవత్సరాలుగా సేవలందించి విద్యార్థుల సమస్యలకై ఉద్యమాలు చేసి, వేలాది మంది విద్యార్థులను జాతీయ వాదం వైపు నడిపించిన భారతీయ జనతా యువ మోర్చా మేడ్చల్ ఉపాధ్యక్షులుగా నియమితులైన రాగం అర్జున్. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ గతంలో జూనియర్ కాలేజ్ సెక్రెటరీగా, కొంపల్లి సాయి చైతన్య కాలేజ్ ప్రెసిడెంట్ గా, మేడ్చల్ సెక్రెటరీగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, మేడ్చల్ జోనల్ ఇంచార్జ్ వంటి బాధ్యతల్లో పని చేయడం జరిగింది, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంఘంలో పనిచేస్తూ ప్రథమ వర్ష శిక్ష పూర్తిచేసి గతం నుంచి సంఘ్ నేర్పించిన క్రమశిక్షణ ద్వారా ఇప్పటి వరకు కొనసాగుతున్నాను. అదేవిధంగా 2016 నుంచి 2021 వరకు భారతీయ యువ మోర్చా జిల్లా కార్యదర్శిగా పని చేయడం జరిగింది. ఇప్పుడు 2021 వ సంవత్సరంలో మేడ్చల్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు బీజేపీ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...