Followers

విద్యార్థుల భవిష్యత్తు కొరకు వెంటనే పాఠశాలలను ప్రారంభించాలి,, ట్రస్మా

 విద్యార్థుల భవిష్యత్తు కొరకు వెంటనే పాఠశాలలను ప్రారంభించాలి,, ట్రస్మా

కేసముద్రం,  పెన్ పవర్ 

గురువారం ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) డివిజన్ అధ్యక్షులు యాకాంతం గౌడ్, కేసముద్రం మండల అధ్యక్షులు జోగు డాంగయ్య లు విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ట్రస్మా రాష్ట్ర, జిల్లా శాఖల ఆదేశానుసారం నిర్వహించే 12 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో మొదటిరోజు పొట్టి శ్రీరాములు సెంటర్లో ఉదయం కేసముద్రం మండల ట్రస్మా శాఖ ఆధ్వర్యంలో వాకర్లకు "బార్లలో లేని కరోన - బడులలో ఉందా", "విద్యార్థుల భవిష్యత్తు కై బడులను తెరవండి", "ప్రైవేటు ఉపాధ్యాయులను కాపాడండి" వంటి ప్లకార్డులను ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా యాకాంతం గౌడ్, డాంగయ్య లు మాట్లాడుతూ ప్రభుత్వం మరోసారి  పునరాలోచించి విద్యార్థుల విద్యా స్థాయి ప్రమాణాలు లోపించకుండా పాఠశాలలను పునః ప్రారంభించాలని అన్నారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న బార్లు, సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్, లాంటి  వాటికి అనుమతిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలను మూసివేయడం సరైంది కాదని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి కరోనాతో ప్రాణనష్టం జరగలేదని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాలలను వెంటనే తెరిపించాలని అన్నారు. పాఠశాలలు మూతపడటంవల్ల ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే భోధన, బోధనేతర సిబ్బంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం బాధ్యులు మోడెం రవీందర్ గౌడ్, సట్ల కర్ణాకర్, సమ్మయ్య, కేసముద్రం మండల ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు గాజుల రవి, ప్రధాన కార్యదర్శి కూన శ్రీను, నల్ల కిరణ్, ప్రైవేటు ఉపాధ్యాయులు శోభన్ బాబు, నరేష్, కేసముద్రం వాకర్స్  తదితరులు పాల్గొన్నారు.

పి హెచ్ సి కరోనా టీకా పంపిణీ

 పి హెచ్ సి కరోనా టీకా పంపిణీ

వైద్యాధికారి డాక్టర్ రవి

చిన్నగూడూరు,  పెన్ పవర్

స్థానిక మండల కేంద్రంలోని ఉగ్గంపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నాడు 45 సంవత్సరాలు పై బడిన వారికి కరోనా వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ విస్సంపల్లి గ్రామ సర్పంచ్ విద్యుల్లత వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందని ఉన్నారు. ఈరోజు 20 మందికి కరోనా వ్యాక్సిన్ వేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అని ఈ సందర్భంగా సూచించారు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తుల అయినవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్ లు ఉపయోగించుకోవాలి అని అన్నారు. ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని మరియు రోగ నిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జయశ్రీ, ఏఎన్ఎం నర్సు బాయ్, ఎస్తేరు రాణి, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, ధర్మేందర్, ఆశాజ్యోతి, సైదమ్మ, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ రూరల్ జిల్లా బిజెవైఎం కార్యదర్శిగా రాఘవరెడ్డి నియామకం

 మేడ్చల్ రూరల్ జిల్లా బిజెవైఎం కార్యదర్శిగా రాఘవరెడ్డి నియామకం...

పెన్ పవర్, మేడ్చల్

 మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్ కు చెందిన రాఘవరెడ్డి మేడ్చల్ రూరల్ జిల్లా బిజెవైఎం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సంధర్బంగా అతను మాట్లాడుతూ గతంలో ఆర్ఎస్ఎస్, ఎబీవిపీ లో పనిచేసి, గిర్మాపూర్ వివేకనంద యువజన సంఘం అధ్యక్షుడిగా, తరువాత బీజేపీలో రాజకీయ జీవితం ప్రారంభించి, గతంలో గిర్మాపూర్ గ్రామ బీజేవైఎం అధ్యక్షుడిగా, మేడ్చల్ మండల బిజెపి ఐటీ సెల్ అధ్యక్షుడిగా, వివిధ హోదాలలో బాధ్యత నిర్వర్తించాను అని పేర్కొన్నారు. ఈ రోజు మేడ్చల్ రూరల్ జిల్లా బిజెవైఎం కార్యదర్శిగా నియమితులైనందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. మేడ్చల్ రూరల్ జిల్లా బిజెవైఎం కార్యదర్శిగా నియమించిన మేడ్చల్ రూరల్ జిల్లా బిజెవైఎం అధ్యక్షులు పవన్ రెడ్డికి, నియమాకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కోంపల్లి మెాహన్ రెడ్డికి, మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు విక్రంరెడ్డికి, తపస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడప నవీన్ కి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్ కి, పాతూరి ప్రభాకర్ రెడ్డికి, మేడ్చల్ అసెంబ్లీ బిజెపి కన్వీనర్ అమరం మెాహన్ రెడ్డికి, మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు కోండం అంజనేయులు ముదిరాజ్ లకు కృతజ్ఞతలు తెలియజేశాడు...

భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన రాగం అర్జున్

 భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన రాగం అర్జున్..

పెన్ పవర్, మేడ్చల్

 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో అనేక సంవత్సరాలుగా సేవలందించి విద్యార్థుల సమస్యలకై ఉద్యమాలు చేసి, వేలాది మంది విద్యార్థులను జాతీయ వాదం వైపు నడిపించిన భారతీయ జనతా యువ మోర్చా మేడ్చల్ ఉపాధ్యక్షులుగా నియమితులైన రాగం అర్జున్. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ గతంలో జూనియర్ కాలేజ్ సెక్రెటరీగా, కొంపల్లి సాయి చైతన్య కాలేజ్ ప్రెసిడెంట్ గా, మేడ్చల్ సెక్రెటరీగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, మేడ్చల్ జోనల్ ఇంచార్జ్ వంటి బాధ్యతల్లో పని చేయడం జరిగింది, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంఘంలో పనిచేస్తూ ప్రథమ వర్ష శిక్ష పూర్తిచేసి గతం నుంచి సంఘ్ నేర్పించిన క్రమశిక్షణ ద్వారా ఇప్పటి వరకు కొనసాగుతున్నాను. అదేవిధంగా 2016 నుంచి 2021 వరకు భారతీయ యువ మోర్చా జిల్లా కార్యదర్శిగా పని చేయడం జరిగింది. ఇప్పుడు 2021 వ సంవత్సరంలో మేడ్చల్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు బీజేపీ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

ముంచుకొస్తున్న కరోనా మహమ్మారి నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం

 ముంచుకొస్తున్న కరోనా మహమ్మారి నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం

ఆరిలోవ,పెన్ పవర్

తూర్పు తూర్పు నియోజకవర్గం 13వ వార్డు మూడవ సచివాలయం పరిధిలో45 సంవత్సరాలు నిండిన వారికి కో వ్యాక్సిన్  ను ప్రారంభించిన వార్డ్ కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణ ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి .శానిటైజర్ తో చేతులను శుభ్రపరచుకోవాలి అని, వ్యక్తిగత దూరం పాటించి ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలని తెలిపారు ఈ సందర్భంగా వార్డులో పలు ప్రాంతాల నుండి  45 సంవత్సరాలు నిండిన వారు అధిక సంఖ్యలో పాల్గొని కో వ్యాక్సిన్ వేయించుకున్నారు ఈ కార్యక్రమంలో లో వార్డు వైఎస్ఆర్సిపి వార్డు అధ్యక్షులు కెల్లా సత్యనారాయణ జి వి యం సి సిబ్బంది. ఆశావర్కర్లు. సచివాలయం సిబ్బంది వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పరిశోధించారు... పతకాన్ని సాధించారు

పరిశోధించారు... పతకాన్ని సాధించారు

విశాఖ ద్వారాకానగర్,పెన్ పవర్ 

ఆంధ్ర వైద్య కళాశాల పెథాలజి విభాగ జూనియర్ వైద్యులు  డాక్టర్ కిల్లాన సంతోష్ రూప అండాశయ  క్యాన్సర్ కు కారణాలపై పరిశోధన సాగించారు. ఇమ్మోనో  హిస్టో కెమిస్ట్రీ  ( ఐ. హెచ్.సి. ) ఆధారంగా సి.కె. 7 , సి.కె. 20 పద్దతిలో కొనసాగించామని , క్లినికల్ పరిశీలనలో పెద్ద ప్రేగు , పొట్ట భాగాల నుండి వచ్చే క్యాన్సర్ కారణాలవల్ల కూడా అండాశయా క్యాన్సర్ లు అధికంగా వస్తున్నట్టు తన పరిశోధనలో తేలిందని  ఆమె వివరించారు.  అంతేకాకుండా  ఆయా కారణాలను వ్యాధి ప్రారంభ దశలో గుర్తిస్తే వ్యాధి గ్రస్తులకు  కీమో  మరియు రేడియో తెరఫీ ల అవసరం లేకుండానే శస్త్ర చికిత్స ద్వారా క్యాన్సర్ ను నయం చేయవచ్చని సూచించారు. 60 మంది పేషెంట్ ల నుండి నమూనాలను  సేకరించి  వాటిని  పెథాలజి  ప్రొఫెసర్  డాక్టర్    ఎ. భాగ్యలక్ష్మి పర్యవేక్షణలో పరిశోధన చేసి పరిశోధన పత్రం రూపొందించారు. ఈ పత్రానికి బహుమతిగా  డాక్టర్ ఇ. పెద వీర్రాజు రజత పతకం లభించింది. పరిశోధన లో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చిన డాక్టర్ కిల్లాన సంతోష్ రూప ను అందరూ అభినందించారు.

నాసా ప్రాజెక్టులో రెండో బహుమతి పొందిన ఎన్ఏడి రవీంద్రభారతి విద్యార్థులు

నాసా ప్రాజెక్టులో రెండో బహుమతి పొందిన ఎన్ఏడి రవీంద్రభారతి విద్యార్థులు

మహారాణి పేట, పెన్ పవర్

ఐ సి డి సి వర్చ్యు వల్ కాన్ఫరెన్స్ 2021 సంవత్సరం లో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనం కు టెక్నిటిగీ ప్రాజెక్టుకు గ్రేడ్ 9 లో  ప్రపంచంలో ఇరవై రెండు దేశాల నుండి 6000 మంది విద్యార్థులు 1662 ప్రాజెక్టులు పాల్గొనగా రవీంద్ర భారతి తొమ్మిదో తరగతి విద్యార్థులు తయారు చేసిన మరో భూమి ప్రాజెక్టుకు రెండో బహుమతి లభించింది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం మనుషులు నివసిస్తున్న భూమి కి విపత్తు సంభవించినప్పుడు భూమి మీద ఉన్న మనుషులు మరో భూమి కి వెళ్లి ఇక్కడ ఎలాగైతే సకల సౌకర్యాలతో రవాణా పార్కులు ప్లేగ్రౌండ్ సినిమా థియేటర్స్ స్విమ్మింగ్ పూల్స్ తో అనుభవిస్తున్నారో అలాంటి సౌకర్యాలతో అనుభవించే విధంగా భూమి తయారు చేయవచ్చని రవీంద్ర భారతి విద్యార్థులు చిత్ర నందిని నాయకత్వంలో రోహిత్ సాయి ధర్మేంద్ర నాయుడు, గాయత్రి, సాయి, రిత్విక్ బృందం ప్రాజెక్ట్ తయారు చేశారు.

నాసా పోటీలలో గత 12 సంవత్సరాలుగా 2009 నుండి  రవీంద్రభారతి ఎన్ఏడి విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు ద్వితీయ బహుమతి పొందిన విద్యార్థులకు రవీంద్ర భారతి విద్యాసంస్థల చైర్మన్ ఎంఎస్ మనీ అభినందించారు.ఈ కార్యక్రమంలో  ఉత్తరాంధ్ర జోనల్ ఇంచార్జ్ వెంకటేష్, జనరల్ మేనేజర్ ఆర్ వసంత, కోఆర్డినేటర్ సుధా, లత డి.జి.ఎం, కే రమ్య ప్రిన్సిపాల్ ఆర్ రాజ్యలక్ష్మి  పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...